Ennenno Janmala Bandham: ఇద్దరి మనసులలోని ఆప్యాయతలు ఉన్నా తెలియని అడ్డుపోర కారణంగా దగ్గర కాలేకపోతున్న ఇద్దరి భార్యాభర్తల కథ ఈ ఎన్నెన్నో జన్మల బంధం.
అయినా నేను ఖుషి కోసమే ఇదంతా చేస్తున్నాను ఖుషికి తల్లినే కాని ఆయనకి భార్యను కాలేను. నా స్థానం ఇంతే ప్రతి ఒక్కరికి అన్ని జరగవు కదా అలాగని నాకు భర్త ప్రేమ దక్కలేదు అయితేనేమీ అమ్మ అని పిలిపిచ్చే ఖుషి ఉన్నది కదా దానితో సరిపెట్టుకుంటాను అని ఆ లెటర్ ని చింపేస్తాది వేద. అసలు విషయం తెలుసుకున్న రాజారాణిలు దేవుడు మనల్ని వాళ్ళిద్దర్నీ కలపడానికి మనల్ని ఇంకా ఉంచాడు మన మానవ ప్రయత్నంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి వాళ్ళని ఒక్కటి చేద్దాము.
అయినా మనం మనవరాలికే ఎందుకు అన్ని కష్టాలు వస్తున్నాయి ముందు ఎవరినో ప్రేమించింది వాడు మోసం చేశాడు, తల్లి కాలేదు అని నిజం తెలిసింది, ఇప్పుడు భర్త ప్రేమ కూడా పొందలేక పోతుంది అని బాధపడుతూ అలా గుండె నొప్పితో పడిపోతాడు రాజా. కంగారుగా రాణి యష్ ని, వేదాని పిలుస్తుంది. వేద వచ్చి మందులు ఇచ్చి కూర్చోబెడుతుంది. యష్ డాక్టర్ కి ఫోన్ చేయగా డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు.
సమయానికి టాబ్లెట్ ఇచ్చి మంచి పని చేశారు లేకపోతే ప్రాణానికి ప్రమాదం అయ్యేది అని వేదకు థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత పంతులుగారు వచ్చి ప్రతి సంవత్సరం అన్యోన్య పూజ మీరే చేస్తారు కదా ఈ సంవత్సరం కూడా చేయండి అని రాజారాణిలను అడగగా నాకు ఒంట్లో బాలేదు ఇప్పుడు చేయలేము కావాలంటే నా మనవడు మనవరాలు చేయగలరు అని అంటాడు రాజా. వేద యష్ లు కొంచెం సేపు ఆలోచించి ఒకలి నిర్ణయాలు ఒకరు తెలుసుకొని పూజ చేస్తాము అని అంటారు.
దేవుడే ఇలాగ చేస్తున్నాడు ఈ పూజ చేసిన ఎవరైనా ఏకం కావాల్సింది అని మనసులో అనుకుంటాడు రాజా. తర్వాత గుడికి తీసుకొని వెళ్లి గుడి ప్రాముఖ్యత చెప్పి అక్కడ పూజ చేయిస్తారు. ఏడడుగులు వేసి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి చివరిలో కొలనులో స్నానం చేయమని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ స్నానం చేస్తుండగా ఇది దాంపత్య వ్రతం కనుక ఇద్దరు కలిసి చేయాలి అని అంటాడు రాజా.
ఇలాగైనా వీళ్ళిద్దరూ కలుస్తారు ఏమో అని మనసులో అనుకుంటాడు. తర్వాత మనసులో, వేద ఖుషికి తల్లిగానే కాదు నాకు భార్యలా కూడా నా మనసు గెలుచుకుంది కానీ వేదకు నా మనసులో మాట ఎలా చెప్పాలి అని అనుకుంటాడు యష్. తర్వాత వేద దగ్గరకు వెళ్లి, మనది కేవలం ఒప్పందం మాత్రమే కాదు అంతకుమించి ఏదో ఉన్నది అని ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ బంధాలు, విలువ తెలిసిన తర్వాత తెలిసింది అని అనగా వేద, మనం ఇది కేవలం ఖుషి ఆనందం కోసమే చేస్తున్నాను కదా.
ఏమి చేసినా ఖుషీ కోసమే దాని కోసమే కదా ఇంతలా నటిస్తున్నాము అని అంటుంది. దానికి కన్ఫ్యుస్ అవుతాడు యష్. అప్పుడు వేద మనసులో మళ్ళీ నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారు ప్రతిసారి మీ మాటలు నమ్మడానికి నేను ఎర్రి దాన్ని కాదు అని అనుకుంటుంది. ఆరోజు రాత్రి రాణి ఇల్లంతా హడావిడి చేస్తూ పని మనుషులను మంచం సద్దమని, పువ్వులు సద్దమని చెప్తుంది. ఏమైంది అని వేద అడగగా వ్రతంలో భాగంగా ఈరోజు మీకు శోభనం జరగాలి అని వేదని తయారు చేయిస్తుంది రాణి.
అలాగే వేదకు కొన్ని సలహాలు చెప్తుంది అదేవిధంగా రాజా కూడా యష్ కి ఎన్నో సలహాలు చెప్పి గదిలోకి పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వేద కింద పడుకుంటుంది. యష్ లేపి ఈరోజుకు పైన పడుకో లేకపోతే వాళ్లు ఫీల్ అవుతారు అని అనగా ఇద్దరు వేరువేరు దిక్కుల్లో పడుకుంటారు. ఏంటి మన బతుకులు ఇలా ఉన్నాయి ఎప్పటికీ కలవలేమా ఈ ఒప్పందం మన మధ్య ఎప్పటికీ ఉంటుందా అని ఇద్దరు మనసులో బాధపడుతూ ఉంటారు.
11
Ennenno Janmala Bandham:
దాని తర్వాత రోజు ఉదయం మన ఈ ఒప్పందం పెద్దవాళ్ళకు తెలియకూడదు తెలిస్తే బాధపడతారు అని అనుకోని అద్దం దగ్గరికి వెళ్లి తన పువ్వులను నలిపేసి బొట్టు చెరిపేస్తుంది వేద. దాన్ని రాణి కిటికీలోనుంచి చూస్తుంది. బయటికి వచ్చి రాజా అని పలకరిస్తుంది వేద. హమ్మయ్య ఇప్పటికైనా వీళ్ళు కలిశారు అని రాజు అనుకుంటాడు లేదు వీళ్ళు కలవలేదు అని రాణి చెప్తుంది.
రొమాంటిక్ సీన్స్ ఎక్కువయ్యాయి అంటున్న ప్రేక్షకులు..
ఇక ఈవారం సీరియల్ ఇలా జరగగా నిజం తెలుసుకున్న రాణి ఏం చేయనున్నది? రాజా మాటిచ్చినట్టే వాళ్ళిద్దరినీ ఏకం చేసి ఊరు పంపించగలడా? చేసిన వ్రత ఫలం దక్కి వాళ్ళు ఒకటి ఇవ్వగలరా? అనేది తెలియాలంటే వచ్చేవారం వరకు ఎదురు చూడాల్సిందే.