Ennenno Janmala Bandham : తన భర్తని మాజీ భార్య పెడుతున్న టార్చర్ నుంచి రక్షించుకోవడానికి ఒక భార్య పడుతున్న తపన ఈ ఎన్నెన్నో జన్మల బంధం.
సులోచన వాళ్ళ అల్లుడిని, మాలిని వాళ్ళ కోడలిని తెగ మెచ్చుకుంటూ ఉంటారు.మా అమ్మ వాళ్లకి దిష్టి పెట్టకండి అంటూ ముసలి వాళ్ళని కాసురుకుంటుంది ఖుషి. రాజా తన వయసు చెప్పి యష్ కి చెమటలు పట్టిస్తాడు. అదే టైంలో ఖుషి ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమంటూ రాజా వాళ్ళకి చెప్తుంది. ఫోన్ చేసిన కూతురితో ఆనందంగా మాట్లాడుతుంది వేద.
మా మనవరాలు చాలా అదృష్టవంతురాలు అంటూ యష్ని పొగిడేస్తారు రాజా దంపతులు. నేనే అదృష్టవంతుడిని అంటూ తన గతం చెప్పి ఎమోషనల్ అవుతాడు యష్. ఇంటి సాంప్రదాయం ప్రకారం మొదటిసారి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి నలుగు పెట్టి స్నానం చేయించమంటాడు రాజా. ముందు మొహమాటపడినా తర్వాత ఆ ఆరు బయట స్నానాన్ని ఎంజాయ్ చేస్తారు వేద దంపతులు.
మరోవైపు వేదవాళ్లు అకేషన్ కి వెళ్ళారని మాళవిక కి చెప్తాడు కైలాష్. వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అనుకుంటూ యష్ కి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని లేదా లిఫ్ట్ చేసి మాళవికకి నానా చీవాట్లు పెడుతుంది. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఆయన మానానా ఆయనని వదిలేయ్ అంటుంది. నేను ఇక్కడ నరకం అనుభవిస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తారా కుదరదు నేను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అంటుంది మాళవిక.
ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు మా ఆయనతో షికారుకు వెళ్లాలి అని ఫోన్ కట్ చేసేస్తుంది వేద. ఎలా అయినా మాళవిక నుంచి నా భర్తని రక్షించుకోవాలి అని ఫిక్స్ అవుతుంది వేద. మరోవైపు ఊర్ని చూడటానికి వెళ్లిన వేద దంపతులకి చిత్ర ఫోన్ చేస్తుంది.ఇంట్లో అందరితో మాట్లాడిన తర్వాత ఖుషి కి ఫోన్లో ఊరంతా చూపిస్తుంది. సరే నాకు ట్యూషన్ కి టైం అవుతుంది మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఖుషి.
మరోవైపు పిల్లలు ఏం చేస్తున్నారో అంటూ సులోచన వాళ్ళు రాణి కిఫోన్ చేస్తారు. వాళ్లు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఎందుకు అస్తమానం ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా ఉన్నారు అదే విషయాన్ని ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అలాంటి వాళ్ళు అన్యోన్యంగా లేరని చెప్పటానికి నీకు నోరు ఎలా వచ్చింది అంటూ కూతుర్ని మందలిస్తుంది రాణి.
మరోవైపు తమ్ముడికి సంబంధాలు చూస్తుంది భ్రమరాంబిక. అది ఇష్టంలేని మాళవిక తన తెలివితేటల్ని ఉపయోగించి ఆ బ్రోకర్ని వెనక్కి పంపించేసి, వదిన గారిని బుట్టలో వేసుకుంటుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతారు అభి, కైలాష్ లు. మరోవైపు ఊరంతా చూస్తున్న వేద దంపతులు ఒక పుట్ట దగ్గర దండం పెట్టుకుంటుంది వేద. ఇలాంటివి నేను నమ్మను అంటాడు యష్.
పుట్టలో చేయి పెట్టి మరీ అతనికి నమ్మకాన్ని కలిగిస్తుంది వేద. ఆ తరువాత తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తనని ఉయ్యాల ఊపమంటుంది వేద. ఎస్ ఉయ్యాల ఊపుతుండగా కిందకి పడిపోతుంది. స్పృహ తప్పిన తనని నీళ్లు చిలకరించి సపర్యలు చేస్తాడు యష్. అయితే మెలకువ వచ్చిన వేద గతాన్ని మర్చిపోతుంది. తనకి గతం గుర్తుకు తేవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు యష్.అతన్ని చాలా సేపు ఏడిపించిన తర్వాత అది నటనని చెప్పి అతన్ని ఫూల్ చేస్తుంది వేద. తనకి గతం గుర్తుకు తెప్పించడానికి ఇష్టపడిన పాట్లు తలుచుకొని నవ్వుతుంది వేద.
Ennenno Janmala Bandham : యష్, వేదల అనురాగానికి ఫిదా అవుతున్న ప్రేక్షకులు..
ఆమెతో శృతి కలుపుతాడు యష్. ఇంటికి వెళ్ళాక మీ అమ్మమ్మ చేత దిష్టి చేయించుకో అంత ముద్దుగా ఉన్నావు అంటాడు యష్. వేద తన భర్తని మాళవిక నుంచి రక్షించుకోగలుగుతుందా? భ్రమరాంబిక మాళవికని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుందా? భార్యాభర్తలని కలపటానికి రాజా దంపతుల ప్రయత్నం ఫలించినట్లేనా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.