Guppedantha Manasu April 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కారులో వెళ్తున్న రిషి వాళ్లకి వెనక పరిగెడుతూ ఒక అమ్మాయి కనిపిస్తుంది. రిషి కారు ఆపి ఏం జరిగింది అని అడుగుతాడు. ఇద్దరు రౌడీలు నన్ను తరుముతున్నారు దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటుంది. ఆమె పేరు త్రివేణి అని తెలుసుకున్న రిషి పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్లే చూసుకుంటారు అంటాడు.
ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించిన రిషి,వసు..
వద్దు సార్ ఫోన్ చేస్తే అమ్మానాన్న వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్లకి తెలిస్తే పరువు పోతుందని నన్ను జాబ్ మాన్పించేస్తారు అంటుంది త్రివేణి. తన భయం లో కూడా నిజం ఉంది చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా కూతురికి అన్యాయం జరిగినా కూడా పోలీస్ స్టేషన్ వెళ్లడానికి ఇష్టపడరు వాళ్ళని ఏమి చేయలేము అంటూ వసుకి చెప్తాడు రిషి.
నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి చాలు అంటుంది త్రివేణి. సరే అంటూ ఆమెని కార్ ఎక్కించుకొని బయలుదేరుతారు. మరోవైపు రిషి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు జగతి దంపతులు. వాసుకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కో అంటాడు మహేంద్ర. నేను ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయను అంటుంది జగతి. ఇంతలోనే బస్సు ఫోన్ చేసి మాకు చిన్న పని పడింది వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు భోజనం చేసేయండి అని చెప్తుంది.
జగతికి బాధ్యత లేదంటున్న దేవయాని..
సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది జగతి. అంతలోనే అక్కడికి వచ్చిన దేవయాని ఫోన్ ఎవరు అని అడగటంతో వసు అని చెప్తుంది జగతి. ఇంతవరకు ఎందుకు రాలేదు వాళ్లకి బుద్ధి చెప్పాలి కదా నీకు ఏమాత్రం బాధ్యత లేదు అంటూ తోటి కోడల్ని మందలిస్తుంది దేవయాని. పిల్లలని చెప్పాల్సిన విషయంలో పద్ధతి చెప్పాలి వదిలేయాల్సిన విషయంలో వదిలేసి స్వేచ్చని ఇవ్వాలి అంటుంది జగతి.
స్వేచ్ఛ దారి తప్పుతుందనే నా బాధ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు రిషి వాళ్ళు త్రివేణిని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే ఇంట్లోకి రండి కాఫీ తాగి వెళ్ళండి అని చెప్తుంది త్రివేణి. ఇప్పటికే చాలా లేట్ అయింది మేము వెళ్ళాలి అంటారు రిషి వాళ్ళు. నేను ఎవరో తెలియకపోయినా హెల్ప్ చేశారు మిమ్మల్ని అలా పంపించేస్తే నా మనసు ఒప్పుకోదు కనీసం మంచినీళ్లు తాగి వెళ్ళండి అని బ్రతిమాలుతుంది త్రివేణి.
ప్రమాదపు టంచుల్లో రిషి, వసు..
ఇక తప్పదు అన్నట్లుగా ఇంట్లోకి వెళ్తారు రిషి వాళ్ళు.వాళ్లకి మంచినీళ్లు ఇస్తుంది త్రివేణి. మీ అమ్మ నాన్న ఏరి అడిగితే పడుకొని ఉంటారు రండి పరిచయం చేస్తాను అంటూ లోపలికి తీసుకెళుతుంది. అక్కడ మంచం మీద ఉన్న రౌడీలని చూసి షాక్ అవుతాడు రిషి. తనమీద అటాక్ చేయబోయిన రౌడీలని ధైర్యంగా ఎదుర్కొంటాడు రిషి. కానీ త్రివేణి, వసు మెడ మీద కత్తి పెట్టడంతో వాళ్లకి లొంగిపోతాడు.
రౌడీలతో సహా బయటికి వెళ్ళిపోతుంది త్రివేణి. కంగారుపడిన రిషి నీ మెడ మీద కత్తి పెట్టేసరికి ప్రాణం పోయినట్లుగా అయిపోయింది అంటాడు రిషి. అసలు అమ్మాయి ఎవరు, ఎందుకు నాటకం ఆడి మరీ బంధించింది అంటుంది వసు. ఎవరైనా అయి ఉండవచ్చు కంటికి కనబడని ఆ శత్రువులు ఎవరో అని ఆలోచిస్తున్నాను అంటాడు రిషి. మనం ఎవరికి ఏ ప్రకారం చేయలేదు మనల్నించి ఏమీ ఆశించి ఇలాగా చేసి ఉంటారు అంటావు అంటాడు.
టైం చూసి చెక్ పెట్టిన సౌజన్య రావు..
ఎందుకు ఈ మధ్య నాకు శత్రువులు ఎక్కువయ్యారు అనిపిస్తుంది మొన్న స్పాట్ వాల్యుయేషన్ అప్పుడు కూడా అలాగే జరిగింది ఇది కూడా వాళ్ళ పని అయి ఉంటుంది అంటాడు రిషి. మనం అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సింది వదిలేసి తప్పు చేసాము అంటుంది వసు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ సాటి విద్యాసంస్థలని అవమానించకూడదని ఊరుకున్నాను కానీ ఆ కృతజ్ఞత లేకుండా వాళ్ళ వక్రబుద్ధి చూపిస్తున్నారు అంటాడు రిషి.ఇప్పుడు మనం ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు మన గురించి.
Guppedantha Manasu April 12 Today Episode
ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది కచ్చితంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటాడు రిషి. మరోవైపు నిన్ను ఎవరు బంధించారు అని డైలమాలో ఉన్నావు కదా ఆ పని చేసింది నేనే అధికారం కోసం ఈ పని చేశాను అనుకుంటాడు సౌజన్య రావు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తే ఈ రోజుకి అవకాశం దొరికింది.ఎవరైనా రాజు కి మాత్రమే చెక్మేట్ పెడతారు కానీ నేను రాజు రాణి ఇద్దరికీ చెక్మేట్ పెట్టాను అనుకుంటాడు.
ఇంతలోనే పని పూర్తయింది అంటూ మెసేజ్ వస్తుంది సౌజన్య రావు కి. గుడ్ జాబ్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే వదలొద్దు అంటూ మెసేజ్ పెడతాడు సౌజన్య రావు. తర్వాత వాళ్లకి ఫోన్ చేసి మీరు వాళ్ళని కొట్టకండి తిట్టకండి వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారని మీడియా వాళ్లకి న్యూస్ ఇవ్వండి చాలు తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటాడు సౌజన్య రావు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.