Guppedantha Manasu April 13 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నిన్ను దెబ్బతీయాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు ఈసారి తప్పించుకోవటం నీవల్ల కాదు అనుకుంటాడు సౌజన్య రావు. మరోవైపు తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న రిషి వాళ్లకి గ్రిల్స్ లేని ఒక విండో కనిపిస్తుంది. దాని ద్వారా బయటకి వచ్చిన రిషి వాళ్లకి ప్రెస్ వాళ్ళ వ్యాన్ కనిపిస్తుంది.
అపాయం నుంచి బయటపడిన రిషి, వసు..
అది గమనించిన రిషి వీళ్ళకి దొరికితే మరింత ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ మరింత జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ నుంచి బయటపడతారు. చాలా దూరం వచ్చిన తరువాత రిలాక్స్ అయిన రిషి మనల్ని ట్రాప్ చేసి ఇద్దరినీ ఒకే గదిలో ఉంచి తప్పు చేస్తున్నామని మీడియా వాళ్లకి నిరూపించాలనుకున్నారు అంటాడు. ఎవరు సార్ వాళ్ళు అయినా ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటే తనేంటి సార్ ఇలా చేసింది అంటుంది వసు.
ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాము తర్వాత జరగాల్సింది చూద్దాము అంటాడు రిషి. నడుస్తుంటే వసు కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంటుంది. నడవలేక ఇబ్బంది పడుతున్న వసు ని చూసి ఎమోషనల్ అవుతాడు రిషి. నా వల్లే నీకు ఇన్ని ఇబ్బందులు అంటాడు. అనుకోకుండా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారు అంటుంది వసు.
జగతి మీద నోరు పారేసుకుంటున్న దేవయాని..
ఆమె కాలికి కట్టు కట్టి ఎత్తుకొని నడుస్తుంటాడు. అంతలో అటువైపుగా ఆటో రావడంతో ఆటోలో వసుని కూర్చోబెట్టి డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అప్పుడు ఇంటికి బయలుదేరుతాడు రిషి. మరోవైపు కాసేపట్లో తెల్లారబోతుంది ఇంకా రిషి వాళ్ళు రాలేదు అంటూ కంగారుపడుతుంది దేవయాని. ఈ సమయంలో ఇంట్లో ఉండాలని తెలియదా అంటూ కోప్పడుతుంది.
పనిమీద వెళ్లాను అని చెప్పాడు కదా అక్కయ్య అంటుంది జగతి. ఏం పనులో ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటుంది దేవయాని. ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావు వాళ్లు ఏ పొజిషన్లో ఉన్నారో అర్థం చేసుకోవా అంటూ మందలిస్తాడు ఫణీంద్ర. మీకు నా మాటలే కనిపిస్తున్నాయి కానీ రిషి మీద ఉన్న నా ప్రేమ కనిపించడం లేదు అంటుంది దేవయాని.
భర్త ప్రవర్తనకి షాకైన దేవయాని..
అయినా వసుకైనా బుద్ధి ఉండాలి కదా, ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి ఇది ఏమీ తన పుట్టిల్లు కాదు. అయినా ఏం జరిగిందో అని నువ్వైనా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నావా అంటూ తోటి కోడల్ని మందలిస్తుంది. నేను ఫోన్ చేశాను ఇద్దరు ఫోన్లో స్విచాఫ్ వస్తున్నాయి అంటాడు మహేంద్ర. రిషి ఎప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు ఈ మధ్యనే తన పద్ధతులు మారుతున్నాయి.
దానికి కారణం మీరే అంటుంది దేవయాని. మాట తూలేముందు జాగ్రత్తగా మాట్లాడు నీకు గౌరవం ఇస్తున్నారు కదా అని హద్దు మీరి మాట్లాడొద్దు. ఇప్పటివరకు మాట్లాడింది చాలు ఇకమీదట వాళ్ళ మనసుల్ని గాయ పెట్టొద్దు అంటాడు ఫణీంద్ర. ఇంతలోనే రిషి వాళ్ళు వస్తారు. మీరు ఆటోలో రావటమేంటి ఇంతసేపు ఎక్కడున్నారు, కారు ఏమైంది అంటూ ప్రశ్నిస్తుంది దేవయాని.
పెద్దమ్మ పద్ధతి నచ్చలేదంటూ షాకిచ్చిన రిషి..
పెద్దమ్మ ఆగండి అంటూ వసు కాలికి దెబ్బ తగిలింది తనని గదిలోకి తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయండి అని జగతికి చెప్తాడు రిషి. వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవయానితో మేము కావాలని ఏమి ఇలాగ చేయలేదు దానికి కారణం ఉంది సొసైటీ గురించి ఆలోచించవా అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు మీరు అలాగా మాట్లాడటం నాకు నచ్చలేదు అంటాడు రిషి.
మీకు ఇదివరకే చెప్పాను మా హక్కులు మీ పద్ధతులు మాకు బాగా తెలుసు. దానిని మేము ఎప్పుడు దాటము. అయినా చాలా లేట్ అయింది మీరు వెళ్లి పడుకోండి నేను డాడ్ వాళ్ళ తో మాట్లాడాలి అంటాడు రిషి. నేను వినకూడదా అని దేవయాని అంటే ఇది కాలేజీ మేటర్ వింటే మీరు ఒత్తిడికి గురవుతారు అది నాకు ఇష్టం లేదు అంటాడు.
రిషి సమర్థుడు అంటున్న సౌజన్య రావు..
శాసనాలు చేయటం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎదురు తిరిగితే అనుకున్నది జరగదు అనుకుంటూ కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు నేను వేసిన ప్లాన్ నుంచి నువ్వు తప్పించుకున్నావంటే చాలా సమర్ధుడివి అనుకుంటాడు సౌజన్య రావు. ప్లాన్ ఫెయిల్ అయింది అని మెసేజ్ రావడంతో పరవాలేదు ప్లాన్ బి అమలు చేయండి అంటూ మెసేజ్ పెడతాడు.
Guppedantha Manasu April 13 Today Episode
మరోవైపు జగతి వసుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు జరిగిందంతా మహేంద్ర కి ఫణీంద్ర కి చెప్పిన రిషి ఇదంతా ఎవరు చేశారో తెలిసినా వారి పేర్లు బయటపెట్టి వాళ్లకి వాళ్ల కాలేజీకి చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. ఇలా అయితే వాళ్లకి బుద్ధి ఎలా వస్తుంది అంటాడు మహేంద్ర.
నువ్వు ఇలా సాఫ్ట్ గా బిహేవ్ చేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారు మొన్న స్పాట్ వాల్యుయేషన్ అప్పుడు అలాగే చేశారు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఎలా అంటాడు మహేంద్ర. వాళ్లను వదిలిపెట్టను కచ్చితంగా శిక్షిస్తాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పేపర్లో స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటూ మ్యాటర్ మొత్తం చెప్తాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.