Guppedantha Manasu April 15 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మర్చిపోవాలి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటాడు రిషి. మరిచిపోవడానికి అదేమైనా చిన్న విషయమా అంటుంది వసు. వాళ్లని ఎలాగా డీల్ చేయాలో నేను డాడ్ తో మాట్లాడాను నువ్వు దీని గురించి ఆలోచించొద్దు ఈ ఆపిల్స్ తిను అంటాడు రిషి. మీరు తినలేదా నేను మీ కోసమే పంపించాను అంటుంది వసు.
రిషి, వసులని ఎలాగైనా విడదీయాలనుకుంటున్న దేవయాని..
నీకు మాత్రమే ప్రేమ ఉందా నాకు ఉంది అందుకే తీసుకొచ్చాను ఇద్దరం కలిసి తిందాం అంటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు రిషి, వసు. అది చూసిన దేవయాని కోపంతో రగిలిపోతుంది వీళ్ళని ఎలాగైనా విడదీయాలి అని మనసులో గట్టిగా డిసైడ్ అవుతుంది. మరోవైపు గది బయటికి వచ్చిన రిషి గుడ్ నైట్ చెప్తాడు. వసు కూడా గుడ్ నైట్ చెప్తుంది.
గదిలోపల నువ్వు గది బయట నేను గుడ్ నైట్ చెప్పుకోవడం ఏమీ బాగోలేదు పక్క పక్కనే ఉండి గుడ్ నైట్ చెప్పుకునే రోజు త్వరలోనే రావాలి అంటాడు రిషి.వసు పడుకోకుండా గుమ్మం దగ్గరే నించుంటుంది. గుడ్ నైట్ చెప్పాను కదా వెళ్లి పడుకో అంటాడు. ప్రాబ్లం నుంచి బయటపడిన రిలాక్సేషనో, మీ ధైర్యాన్ని చూసిన ఆనందమో తెలియదు కానీ ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు అంటుంది వసు.
మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన దేవయాని..
నాకు మాత్రం నిద్ర వస్తుంది ఒక ప్రాబ్లం నుంచి బయటపడిన ప్రశాంతత వల్ల రిలాక్స్డ్ గా ఉన్నాను నువ్వు కూడా మన ప్రేమని తలుచుకొని పడుకో నిద్ర పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు అంటూ వసు. మరోవైపు ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి రమ్మంటుంది దేవయాని. ఎందుకు రమ్మన్నారు అని మహేంద్ర అడిగితే వేరే విషయం ఏముంటుంది రిషి పెళ్లి గురించే మాట్లాడదామని పిలిపించాను.
మీరిద్దరూ మంచి రోజు చూసుకుని వసు వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో అన్ని మాట్లాడి రండి అని మహేంద్ర కి చెప్తుంది దేవయాని. ఆ మాటలకి కంగారు పడతారు జగతి, వసు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో అసలే చిన్న బావ వాళ్ళతో రిలేషన్స్ సరిగ్గా లేవు అంటూ జగతి చెవిలో చిన్నగా చెప్తుంది వసు. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు మాకు కూడా చెప్పండి మేము వింటాము అంటుంది దేవయాని.
పెద్దమ్మకి తల తిరిగిపోయేలా సమాధానం చెప్పిన రిషి..
వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి చెప్తుంది అంటుంది జగతి. సమస్యలు ఎవరింట్లో లేవు మన ఇంట్లో మాత్రం సమస్యలు లేవా అయినా పెళ్లి విషయం వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టేయాలి. వెళ్లి వాళ్ల తల్లిదండ్రులతో మంచి చెడు మాట్లాడి రండి అంటుంది దేవయాని. అవసరం లేదు వాళ్ల కుటుంబ పరిస్థితులు మనకి తెలిసినవే ఆయన ఎప్పుడో వాళ్ళ కుటుంబం గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంటాడు రిషి.
మీరు మంచి రోజు చూసుకొని డేట్ ఫిక్స్ చేస్తే ఆరోజు వసు వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడికి రమ్మందాము అప్పుడు మీరే వాళ్ళతో మాట్లాడొచ్చు అంటాడు. కానీ ఆడపిల్ల వాళ్ళ ఇంటికి మగ పిల్లవాళ్ళు వెళ్లడం సాంప్రదాయం అంటుంది దేవయాని. ఈ రోజుల్లో ఆడ మగ ఏంటి అయినా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించి మీరు ఇబ్బంది పడకండి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటాడు రిషి.
ధరణిని హత్తుకొని ఎమోషనల్ అవుతున్న వసు..
వసు,నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ కొన్ని కారణాలవల్ల దూరంగా ఉన్నాము. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. ఇక మా మధ్య మిగిలింది పెళ్లి మాత్రమే. సంప్రదాయాలు పద్ధతులు తర్వాత చూసుకోవచ్చు ఈ విషయంలో వాళ్ళని ఎక్కువగా ప్రెజర్ పెట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. కోపంతో రగిలిపోతుంది దేవయాని. మహేంద్ర వాళ్లు మాత్రం సంతోషిస్తారు.
మరోవైపు వంట గదిలోకి వచ్చి టీ పెడుతున్న వసుతో అప్పుడే హక్కులు వినియోగించుకుంటున్నావా అంటుంది ధరణి. ముందు ముందు తోటి కోడలుగా నాతో పోటీ పడతావేమో అంటూ నవ్వుతుంది. ఆమెని గట్టిగా హత్తుకుని హక్కులు బాధ్యతలు తర్వాత కానీ నాకు ఇప్పుడే మిమ్మల్ని అక్క అని పిలవాలని ఉంది అంటూ ఎమోషనల్ అవుతుంది.
Guppedantha Manasu April 15 Today Episodeరిషి, వసు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ధరణి..
పిలు ఎవరు కాదన్నారు అని ధరణి అంటే నాకు ఇంకా ఆ హక్కు రాలేదు అంటుంది వసు. మన మధ్య ఆత్మీయత అనుబంధం ఎప్పుడో వచ్చేసింది. ధైర్యం ఎక్కువ అందుకే నీ ప్రేమ కోసం ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నీ ప్రేమని గెలుచుకున్నావు. పెద్ద అత్తయ్య గారు నిన్ను ఇబ్బందులకి గురి చేస్తున్నారో నేను గమనిస్తున్నాను అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తున్నావు.
రిషి కూడా నీకు సపోర్టుగా ఉన్నాడు అందుకే పెద్ద అత్తయ్య మాటలకి ఎదురు సమాధానం చెప్తున్నాడు. నువ్వు రిషి ఎప్పుడు ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా చెప్తుంది ధరణి. ఆనందంగా టీ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు. మరోవైపు నా చేతులతోనే నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎలా అంటూ ఆలోచనలో పడుతుంది దేవయాని.
అంతలోనే టీ తీసుకువచ్చిన ధరణితో టీ లో పంచదార ఏది అని అడుగుతుంది. ఎక్కువ వేస్తే మంచిది కాదు అంటుంది ధరణి. నువ్వు నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్నావా నిజమేనా లేక నటిస్తున్నావా ఈ పెళ్లి సంబరాల్లో పడి రేపు నన్ను నిర్లక్ష్యం చేయొద్దు అదే జరిగితే జగతికి కోడలు వస్తుంది నా కోడలు మాత్రం అంటూ మధ్యలోనే ఆపేసి నా సంగతి తెలుసు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ హెచ్చరిస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.