Guppedantha Manasu April 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి రూమ్ లోకి కాఫీ తీసుకొస్తుంది వసు. రిషి వెనకగా వెళ్లి తలుపు గడియ పెట్టేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిన వసు కాఫీ సార్ అంటూ వణుకుతూ చెప్తుంది. కాఫీ తీసుకొని పక్కన పెట్టేస్తాడు రిషి. కాఫీ చల్లారిపోతుంది సర్ అంటుంది వసు. చల్లారి పోతే మళ్ళీ వేడి చేసుకోవచ్చు కానీ ఇలాంటి క్షణాలు మళ్ళీ రావు కదా అంటాడు రిషి.
రిషి కి బాగా తెగింపు వచ్చిందంటున్న వసు..
ఈ శూన్యమాసం ఎప్పుడు అయిపోతుందో ఏంటో, మనసు దేనికోసమో పరితపిస్తుంది. ఇంతకీ ఈ శూన్యమాసం అంటే ఏంటి అని వసుని ని అడుగుతాడు రిషి. శూన్యమాసం అంటే ఏంటో విడమర్చి చెప్తుంది వసు ఇవన్నీ ఎవరు కనిపెట్టారు తెలియదు కానీ మన పెళ్లి మాత్రం వాయిదా పడింది అంటాడు. ఈ శూన్యమాసం ఎప్పుడు ఎండ్ అయిపోతుందో నీకు తెలుసా అని అడుగుతాడు రిషి.
తెలీదు క్యాలెండర్ లో చూడాలి అంటుంది వసు. తెలుసుకోవాలి కదా ఇది మనకి చాలా అవసరం అంటాడు రిషి. ఎవరో వస్తున్నారు అంటూ కంగారుగా అంటుంది వసు. వస్తే రానీ అంటూ ధైర్యంగా అంటాడు రిషి. మీలో చాలా తెగువ వచ్చేసింది అంటుంది వసు. తెగువ కాదు వసుధార మనిద్దరికీ ఎలాగూ పెళ్లి జరగబోతుంది కదా అంటాడు.
ఆనందంతో భర్త నోరు తీపి చేస్తున్న జగతి..
పెళ్లి జరగబోవడం వేరు జరిగిపోవటం వేరు పెళ్లి జరిగే వరకు కాస్త గ్యాప్ మెయింటైన్ చేయాలి అంటుంది వసు. ఎంత గ్యాప్ అంటాడు రిషి. అతివేగం ప్రమాదకరం అంటారు కానీ ఎంత వేగం ప్రమాదకరమో చెప్పరు అలాగే కొన్నిటికి లెక్కలు ఉండవు అంటూ కాఫీ ఇస్తుంది వసు. ఆ కాఫీ ని ఇద్దరూ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ టైం కాలం త్వరగా పరిగెడితే బాగున్ను అనిపిస్తుంది అంటాడు రిషి.
వెయిట్ ఫర్ ద లవ్ సర్ అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు. మరోవైపు రెడీ అవుతున్న భర్త దగ్గరికి వస్తుంది జగతి. ఏంటి ఫేస్ లో చాలా ఆనందం కనిపిస్తుంది ఏంటి సంగతి అంటాడు మహేంద్ర. అలాంటిదేమీ లేదు నోరు పెరుగు అని చెప్పి అతని నోట్లో చక్కెర పోస్తుంది జగతి. ఈ సంతోషమంతా రిషి వాళ్ళ పెళ్లి గురించే కదా అంటాడు మహేంద్ర.
రిషి ఆ అవకాశం ఇవ్వడంతో బాధపడుతున్న జగతి..
దేవయాని అక్కయ్య అడ్డుపుల్ల వేస్తే నా కొడుకు నోరెత్తకుండా చేశాడు. సమాధానం చెప్పాల్సిన రీతిలో చెప్పాడు ఇక దేవయాని అక్కయ్య పప్పులు ఏవి ఉడకవు అంటూ ఆనందంగా చెప్తుంది జగతి. రిషి పశువుల పెళ్లి అమ్మగా చూసే అవకాశం మాత్రమే ఉంటుందేమో దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం రాదేమో అంటాడు మహేంద్ర. వస్తే అంతకు మించిన అదృష్టం ఉండదు.
రిషి ఆ అవకాశం ఇవ్వడు ఆ అదృష్టవంతా దేవయాని అక్కయ్యదే అంటుంది జగతి. మరోవైపు కార్లో వెళ్తున్న రిషి మన జీవితంలో భయంకరమైన సంఘటనలు అన్ని మీ ఊర్లోనే జరిగాయి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకున్నాం కాబట్టి ఇలా పక్కపక్కన కూర్చుని మన ప్రేమని దక్కించుకోగలిగాము. ఒకవేళ ఆ సమస్యలలో కూరుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అంటాడు రిషి.
రిషి మాట విననంటున్న వసు..
ఇంకెప్పుడూ నేను నిన్ను ఎక్కడికి పంపించను నువ్వు ఎప్పుడో ఇలా నా పక్కనే ఉండాలి అంటాడు. మీరు పొమ్మన్నా నేను పోను సార్ అంటుంది వసు. ఈ ఎండి చెప్పినా కూడా వినవా అంటాడు రిషి. కొన్ని కొన్ని సార్లు వింటాను, కొన్నిసార్లు వినండి సార్ మీరు తిట్టినా కూడా అందులో నాకు ప్రేమే కనిపిస్తుందిఅంటుంది వసు. కాలేజీకి వచ్చిన రిషి వాళ్లకి ఎదురైన ఒక వ్యక్తి మీ మీద నిన్న ఎవరో అటాక్ చేశారంట కదా సార్ అని అడుగుతాడు.
మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు రిషి. పేపర్లో వేశారు సార్ కావాలంటే చూడండి అని పేపర్ ని ఇస్తాడు ఆ వ్యక్తి. మరోవైపు మంచి పని చేశావు అంటూ తమ్ముణ్ణి మెచ్చుకుంటాడు ఫణీంద్ర. రిషి నాతో మాట్లాడిన వెంటనే నేను ఎడిటర్ తో మాట్లాడాను అందుకే ఇంత ఫాస్ట్ గా న్యూస్ లో వచ్చింది అంటాడు మహేంద్ర. కనీసం ఈ న్యూస్ చూసేకైనా వాళ్లలో మార్పు వస్తుందేమో చూద్దాం అంటాడు ఫణీంద్ర.
రిషి ద్వారా జరిగింది తెలుసుకున్న మినిస్టర్..
మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి రిషి వసు వాళ్లని జాగ్రత్తగా కాపాడుకోవాలి శత్రువులు ఏటి నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియటం లేదు అంటుంది జగతి. రిషి మీద ఈగవాలకుండా చూచేయటంతో సుకోవాలి అంటాడు మహేంద్ర. అంతలోనే వచ్చిన హర్షి వెరీ ఫాస్ట్ జాబ్ థాంక్యూ డాడ్ అంటాడు రిషి. ఈ న్యూస్ చూశాక అయినా వాళ్లలో మార్పు వస్తుందేమో చూడాలి అంటాడు రిషి.
ఇంతలో మినిస్టర్ ఫోన్ ఫోన్ చేసి ఈ వార్త ఏమిటి ఏం జరిగింది అని రిషి ని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు రిషి. వాళ్లు ఎవరో చెప్పు వెంటనే యాక్షన్ తీసుకుంటాను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అంటాడు మినిస్టర్.వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్ తాలూకా భవిష్యత్తు తారుమారు అవకాశం ఉంది.
Guppedantha Manasu జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన మినిస్టర్..
నాకు స్టూడెంట్స్ కెరియర్ ఇంపార్టెంట్ అంటాడు రిషి. నీ ఆలోచన నచ్చితే కానీ ఏ యాక్షన్ తీసుకోకపోతే మళ్లీ వాళ్లు ఇలాంటి ప్రయత్నమే చేస్తారు అప్పుడు ఎలా అంటాడు మినిస్టర్. మళ్లీ ఈ రిషి మీద అటాక్ చేయాలంటే భయపడేలాగా బదిలిస్తాను మీరేమీ టెన్షన్ పడొద్దు అంటాడు రిషి. ఈ విషయంలో నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను నా స్పందన కచ్చితంగా ఉంటుంది అంటాడు మహేంద్ర. పిల్లల జీవితాల కోసం ఆలోచిస్తున్నావు మీరు చాలా గొప్ప మనసు అంటాడు ఫణీంద్ర.
మరోవైపు డిబిఎస్టీ కాలేజీ మీద కుట్రలు జరుగుతున్నాయి ఈసారికి క్షమిస్తాను కానీ ఇదే రిపీట్ అయితే కనుక ఆ కాలేజీల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాను అంటూ టీవీలో ప్రకటిస్తాడు మినిస్టర్. మినిస్టర్ గారు హామీ ఇచ్చారు ఇంక మనకి ఏమీ పర్వాలేదు అంటారు ఫణీంద్ర, మహేంద్ర. నిజమే కానీ మనం అజాగ్రత్తగా ఉండకూడదు అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.