Guppedantha Manasu April 30 Episode: రిషికి థాంక్స్ చెప్పిన వసు.. సాక్షినే రిషి భార్య అంటూ దేవయాని ట్విస్ట్!

Akashavani

Guppedantha Manasu April 30 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి చూసి తట్టుకోలేక రిషి వసును ఆపి.. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అంతే కాకుండా బయట ఉండటం కష్టమవుతుంది అనటంతో.. అదేం కొత్త కాదు అన్నట్లుగా వసు మాట్లాడుతుంది. ఉండిపోవచ్చు కదా అనే రిషి ప్రేమతో అడగటంతో వసు ఉండే అర్హత లేదు అని బాధపడుతుంది.

దేవయాని ఇవ్వనున్న మరో ట్విస్ట్..

ఇక రిషి తన మనసులో మన మధ్య ఏదో బంధం ఉంది అంటూ.. పంపించడం ఇష్టం లేదని అనుకుంటాడు. ఇక వసు కూడా తమ మధ్య ఉన్నదేంటో అని అనుకుంటుంది. జగతి మహేంద్ర తో ఏదైనా చేయొచ్చు కదా అనడంతో.. ఈసారి నిర్ణయం వసుదే అని అంటాడు. పక్కనే ఉన్న దేవయాని వసు విషయంలో ఈ సారి బ్రహ్మాండమైన ట్విస్ట్ ఉందని అనుకుంటుంది.

వసు వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్న రిషి..

ఇక వసు ఇంట్లో నుంచి వెళ్తున్న సమయంలో గౌతమ్ వచ్చి ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ వసు ఏమి మాట్లాడక అక్కడి నుంచి బాధపడుతూ వెళుతుంది. రిషి కూడా తట్టుకోలేక వసును చూసి బాధ పడతాడు. అప్పుడే సాక్షి ఎంట్రీ ఇవ్వడంతో రిషి తనను చూసి షాక్ అవుతాడు. ఇక దేవయాని కరెక్ట్ టైంకి వచ్చావు అని మురిసిపోతుంది. సాక్షి కూడా గతంలో రిషి మాట్లాడిన మాటలు తలుచుకొని నీ కోసం వచ్చాను రిషి అని అనుకుంటుంది.

దేవయానికి మరో ఆయుధం..

దేవయాని మాత్రం సాక్షిని చూసి ఇదే ఆయుధం అనుకోని పొంగి పోతుంది. వసు రోడ్డు పై వెళ్తూ ఒక పని చేయాలి అని ఆగుతుంది. దేవయాని సాక్షి రావడంతో.. ధరణి తో మన ఇంటికి కాబోయే కోడలు అని హారతి ఇవ్వమని అంటుంది. రిషి దగ్గరికి రావడానికి ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది సాక్షి. మరోవైపు రిషి వసు మాటలు తలుచుకొని వసు ఎక్కడ ఉందో అని ఆలోచిస్తాడు.

Guppedantha Manasu April 30 Episode: రిషికి భార్య సాక్షి అంటూ దేవయాని ట్విస్ట్..

అప్పుడే వసు థాంక్యూ అని మెసేజ్ చేయడం తో ఈ మెసేజ్ వెటకారంగా పెట్టిందా అని అనుకుంటాడు. దేవయాని సాక్షితో నువ్వు రిషి భార్య వి అని అంటుంది. అప్పుడే మహేంద్ర దంపతులు అక్కడికి రావడంతో.. జగతి ఈ కొత్త అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. దేవయాని జగతి గురించి చెప్పడంతో సాక్షి వెళ్లి జగతి, మహేంద్రల ఆశీర్వాదాలు తీసుకుంటుంది.

ఇక ధరణి తో సాక్షికి రిషి రూమ్ చూపించమని పంపిస్తుంది. దేవయాని జగతితో సాక్షి గురించి చెబుతుంది. ఓ వైపు రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి సాక్షి రావడంతో రిషి ఎందుకు వచ్చావు అని నేరుగా అడుగుతాడు. నీ కోసం వచ్చాను అని సాక్షి అంటుంది. కానీ రిషి మాత్రం వచ్చిన దారి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అంటాడు.

- Advertisement -