Guppedantha Manasu April 5 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జరిగిందంతా జయచంద్ర గారికి చెప్పి వాళ్ళ జీవితాలని సరిదిద్ది వాళ్ళని సరి అయిన మార్గంలో పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జగతి. తప్పకుండా అమ్మ ఇద్దరూ ఎవరి దృష్టిలో వాళ్ళు కరెక్టు, ఇద్దరికీ ఒకరుంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంది. ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తాను అంటూ మాట ఇస్తాడు జయచంద్ర.
వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న జయచంద్ర..
సంతోషంగా థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి. మరోవైపు స్టేజి మీద తన స్పీచ్ స్టార్ట్ చేస్తారు జయచంద్ర. వివాహ వ్యవస్థని టాపిక్ గా చేసుకొని స్పీచ్ ని స్టార్ట్ చేస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన వివాహ వ్యవస్థ. ఇప్పుడిప్పుడే విదేశాల్లో కూడా మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటున్నారు.
మన దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడు ఆధునికత ఎక్కువైపోయి పెళ్లి విలువ బంధం విలువ తెలియక ప్రతి చిన్న విషయానికి విడాకులు అంటున్నారు. అసలు వివాహం అంటే ఏంటో తెలుసా మీకు, పెళ్లి అంటే తాళిబొట్టు తలంబ్రాలు కాదు రెండు మనసులు కలవడం, మనసా వాచా ఇద్దరూ ఒకటిగా బ్రతకడం. నేను 8 రకాల వివాహాలు గురించి విన్నాను వాటి గురించి చెప్తాడు జయచంద్ర.
వసుని ప్రశ్నించిన రిషి..
గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం. వధువుకి కానీ ఆమె బంధువులకి గాని ఇష్టం లేకుండా చేసుకునే వివాహం పైశాచిక వివాహం అంటూ ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తాడు. సార్ చెప్పిన ఏ పద్ధతిలో మన పెళ్లి జరిగింది వసుని అడుగుతాడు రిషి. వసు సమాధానం చెప్పకుండా ఈ ఎనిమిది రకాల వివాహాలే కాకుండా ఇంకొక రకం వివాహం కూడా ఉంది అదే ఆపత్కాల వివాహం.
ఇది తొమ్మిదో రకమైన వివాహం దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని తీరాలి అంటూ స్ట్రాంగ్ గా చెప్తుంది వసు. నువ్వు ఏం చెప్పదలుచుకున్న స్టేజ్ మీదకి వచ్చి చెప్పు అంటాడు జయచంద్ర. స్టేజ్ మీదకి వెళ్ళిన వసు ఒక ఆడపిల్ల తన ప్రేమని దక్కించుకోవడానికి ఏ దారి కనబడని పరిస్థితులలో తనంతట తానే మెడలో మాంగల్యాన్ని వేసుకోవడాన్ని ఆపత్కాల వివాహం అంటారు.
స్టేజ్ మీద వాదించుకుంటున్న రిషి, వసు..
ఆ పరిస్థితులు ఏవైనా కావచ్చు తను వారి ప్రాణవాళ్ళు కాపాడుకోవటానికో, మరింకేదైనా బలమైన కారణం అయి ఉండవచ్చు. అలాంటి సమయంలో తను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోయినా అతనిని తలుచుకొని మెడలో తాళి వేసుకుంటే అది వివాహం అవుతుందా కదా అంటూ నిలదీస్తుంది వసు. ఒక అమ్మాయి తన ప్రేమని రక్షించుకోవడం కోసం మెడలో తాళి వేసుకోవడం తప్పు కాదు కదా అది వివాహమే కదా అంటూ అక్కడ ఉన్న అందర్నీ ప్రశ్నిస్తుంది.
నాకు కూడా ఒక సందేహం ఉంది అంటాడు రిషి. నువ్వు కూడా స్టేజి మీదకి వచ్చి మాట్లాడు అంటాడు జయచంద్ర. మీరు చెప్పిన ఎనిమిది రకాల పెళ్లిళ్లలో స్త్రీ పురుషులు లేకుండా జరిగిన పెళ్లి ఏదైనా ఉందా, ఎంత ప్రేమ ఉన్నా ఎంత మనస్సాక్షి ఎక్కువ ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరు ఉండి పెళ్లి చేసుకుంటేనే అది పెళ్లి అవుతుంది. ఒక పురుషుడిని తలుచుకొని మెడలో తాళి వేసుకుంటే అది ఊహా అవుతుంది కానీ వివాహం కాదు అని కచ్చితంగా చెప్తాడు రిషి.
స్టేజ్ మీదే వసుని నిలదీసిన రిషి..
ఒకవేళ అది వివాహమని మనం అనుకున్న అంగీకరించడానికి ఎవరు ముందుకు రారు. పెళ్లి అంటే సాంప్రదాయ ప్రకారం జరిగేది. వసుధార చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే అది సాంప్రదాయం ఒప్పుకుంటుందా అంటూ అక్కడ ఉన్న అందర్నీ ప్రశ్నిస్తాడు రిషి. పెళ్లి అంటే రెండు మనసులు కలవడం ఇక్కడ రెండో మనిషి లేకుండా జరిగితే అది పెళ్లి ఎలా అవుతుంది అంటూ వసుని నిలదీస్తాడు.
ఇద్దరూ మీ, మీ ఆలోచనలను బట్టి చక్కని విశ్లేషణ ఇచ్చారు. ఒకరిది మనోధర్మం అయితే ఇంకొకరిది సాంప్రదాయ ధర్మం మీ ఇద్దరిలో ఎవరిది తప్పు కాదు. ఇంత చిన్న వయసులో ఇలా ఆలోచించడం చాలా గొప్ప విషయం. వసుధార అలా మాట్లాడటానికి ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఇది భర్త పట్ల తనకి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది ఇక ఇటువైపు రిషి ప్రశ్న పెడదారి పడుతున్న పిల్లల గురించి పెద్దలు పడుతున్న భయానికి ఇతను ఒక ఊరట.
Guppedantha Manasu April 5 Today Episode:ఓటింగ్ ఏర్పాటుచేసిన జయచంద్ర..
సాంప్రదాయాలు, సంస్కృతులు అంటూ ఏమీ లేవు అంటూ ఎన్నికలలో వేస్తూ మన విలువలు మర్చిపోతున్నారు ఇంత చదువుకొని ఒక కాలేజీని నిర్వహిస్తూ కూడా సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాడంటే నిజంగా ఆదర్శప్రాయుడు. వీరి ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నేను చెప్పడం కంటే ఎక్కడ ఉన్నా మీరందరూ చెప్పండి.
మీ ఆలోచన విధానం ఎలా ఉందో నేను తెలుసుకోవాలి. అందుకే మీ అందరికీ ఓటింగ్ పెడుతున్నాను. మీకు ఇచ్చిన పేపర్ స్లిప్స్ మీద వసుధారని సపోర్ట్ చేయాలనుకుంటే వి అని, రిషి ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ అని రాయండి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళ అభిప్రాయమే కరెక్టు అంటాడు జయచంద్ర. అటెండర్ అందరికీ పేపర్ స్లిప్స్ ఇస్తాడు.
నువ్వు ఎవరికి ఓటు వేస్తావు అని భార్యని అడుగుతాడు మహేంద్ర. అలా చెప్పకూడదు అని జగతి అంటే ఇవేమీ జనరల్ ఎలక్షన్స్ కాదు కదా అంటాడు మహేంద్ర. కానీ మనకి అంతకన్నా ఎక్కువ కాస్త ఆలోచించి ఓటు వెయ్యు అంటుంది జగతి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.