Guppedantha Manasu April 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఓటింగ్ స్టార్ట్ చేయమంటాడు జయచంద్ర. ఇది జనరల్ ఎలక్షన్స్ కాకపోయినా మనకి చాలా ఇంపార్టెంట్ ఆలోచించి ఓటు వెయ్యు అని భర్తకి చెప్తుంది జగతి. వసుధార చేసింది తప్పు కాదు, ఏ దారి లేని పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటాడు రిషి. రిషి సర్ ప్లేస్ లో ఎవరు ఉన్నా అలాగే మాట్లాడే వారు ఆయన అన్న దాంట్లో తప్పేముంది.
రిషి, వసుల ఓట్లు చూసి ఆశ్చర్యపోయిన జయచంద్ర..
నా నిర్ణయమే ఆయన్ని ఇంత బాధ పెట్టింది అనుకుంటుంది వసు. ఓటింగ్ అంతా పూర్తయిన తరువాత రిషి, వసులని మాత్రం మీ ఓట్లు నాకు ఇవ్వండి ఎందుకంటే మీ అభిప్రాయాల కోసమే కదా ఓటింగ్ జరిగింది అంటాడు జయచంద్ర. ఓటింగ్ పూర్తయిన తర్వాత కౌంట్ చేస్తే ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయి. ఇద్దరికీ సమానంగా రావడం ఏంటి అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడుకుంటారు.
అప్పుడే ఓటింగ్ అయిపోలేదు ఇంకా నా చేతిలో రెండు ఓట్లు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు అభిప్రాయమే కరెక్ట్ అంటాడు జయచంద్ర. రిషి, వసుల ఓట్లు ఓపెన్ చేస్తాడు జయచంద్ర. రిషి, వసుకి వసు రిషికి ఓట్లు వేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తారు. సరి సమానంగా ఓట్లు రావడం ఆశ్చర్యం అయితే వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఓటు వేసుకోవడం ఇంకా ఆశ్చర్యకరం అంటాడు జయచంద్ర.
అలా చేయడం కరెక్ట్ కాదంటున్న జయచంద్ర..
మీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఎందుకు ఓటేశారో కారణం నన్ను చెప్పమంటారా అంటూ వీళ్ళిద్దరికీ ఒకరి అభిప్రాయాలంటే ఒకరికి గౌరవం. కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనే చిన్న చిన్నపాటి భేదం వల్ల ఎదుటివారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నారు అంతే. నేను చెప్పేది కూడా అదే జీవితంలో ఆవేశంగాను అనాలోచితంగానూ ఒక నిర్ణయానికి రాకూడదు అది సరైనది కాదు.
పరిస్థితిని ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు ఎవరి తప్పు ఉండదు, ఎవరి ఒప్పు ఉండదు అంటూ మీటింగ్ ముగిస్తాడు జయచంద్ర. ఇన్నాళ్లు ఎవరికి వాళ్లు గెలవాలి అనుకొని ఇప్పుడు ఒకరిని ఒకరు గెలిపించుకున్నారు చివరి నిమిషంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు అంటుంది జగతి. వాళ్ల మధ్య ఉన్న ప్రేమ వాళ్లతో ఇలా చేయించింది అంటాడు మహేంద్ర. అక్కడనుంచి అందరూ వెళ్ళిపోతారు ఒక్క రిషి, వసు తప్ప.
బాగా ఎమోషనల్ అవుతున్న జగతి దంపతులు..
ఇద్దరూ రియలైజ్ అయ్యి ఒకరిని ఒకరు హాగ్ చేసుకుంటారు. అక్కడ చప్పట్లు వినిపించడంతో తిరిగి చూసేసరికి జగతి దంపతులు, జయచంద్ర కనిపిస్తారు. మీ ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉందో చూశారా మీరిద్దరూ ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేరు. ఈ విషయం మీకు తెలుసు. దగ్గర కావాలనుకుని దూరంగా దూరంగా మసలే మీ వింత ప్రేమ కథకు మీరే ప్రత్యక్ష సాక్షులు. మీ స్వభావాలే మీ ప్రేమకు పునాది, అదే స్వభావం మీ దూరానికి కూడా కారణం.
మీ బంధాన్ని వదులుకోవద్దు ఓటింగ్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు కానీ జీవితంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. యద్భావం తద్భవతి అంటారు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరిద్దరూ కలిసి బ్రతకాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఇప్పుడు మీ మనసులో మీకు అర్థమయ్యేవి కాబట్టి మీ ప్రేమని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది అంటాడు జయచంద్ర. అది రిషి సార్ చేతిలో ఉంది.
Guppedantha Manasu April 6 Today Episode రిషి కి వ్యవధి ఇవ్వమంటున్న జయచంద్ర..
మనది వివాహ బంధం అని పూర్తిగా మీరు నమ్మితేనే ఈ తాళి నా మెడలో ఉంటుంది అంటుంది వసు. మీ అభిప్రాయం ఏంటి అని రిషి ని అడుగుతాడు మహేంద్ర. అతనికి కొంచెం వ్యవధి ఇవ్వండి అంటాడు జయచంద్ర. సరే రేపు పొద్దున్న వరకు ఆలోచించుకొని అందరికీ ఆనందాన్ని కలిగించే ఒక నిర్ణయాన్ని తీసుకో అంటాడు మహేంద్ర. మరోవైపు బయలుదేరి పోతున్న జయచంద్ర కి థాంక్స్ చెప్తారు జగతి దంపతులు.
మాకు మా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారు వివాహ వ్యవస్థ మీద స్టూడెంట్స్ అందరికీ అవగాహన కలిగేలాగా చేశారు అంటుంది జగతి. అంతా మీ మంచితనం, మీ ప్రోత్సాహం. ఇంత మంచి కాలేజీ ఇక్కడ దొరకడం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అదృష్టం. మీ కాలేజీ ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాను అంటూ రిషికి జాగ్రత్తలు చెప్పి మీ జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని దీవించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు జయచంద్ర.
మరోవైపు నేను తనకి ఓటేశాను అంటే తన నిర్ణయాన్ని అంగీకరించినట్లే కదా మరి ఎందుకు ఈ దూరం అంటూ ఆలోచనలో పడతాడు రిషి. ఇంకా ఈ దూరాన్ని కంటిన్యూ చేయకూడదు నేను బాధపడి తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఇక ఈ దూరానికి ముగింపు చెప్పాలి అనుకుంటాడు రిషి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.