Guppedantha Manasu April 7Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మా మధ్య ఉన్న దూరానికి ముగింపు చెప్పాలి నేను వసుధారని భార్యగా అంగీకరిస్తున్నాను అనుకుంటాడు రిషి. మరోవైపు ఆలోచనలో ఉన్న వసు నేను తొందరపడి ఈ తాళి నా మెడలో వేసుకున్నానా, దీన్ని తీసేసి మళ్లీ పెళ్లి చేసుకోవాలా.. ఇది మీకు అడ్డం కాకూడదు, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని తాళిని చూస్తూ పడుకుంటుంది వసు.
వసు తాళి తెగిపోవాలంటున్న దేవయాని..
మరోవైపు వసుకి జరిగింది పెళ్లే కాదు అంటుంది దేవయాని. వసు మనస్ఫూర్తిగా రిషిని భర్తగా నమ్మి తాళి తన మెడలో వేసుకుంది అంటుంది జగతి. ఎవరు పడితే వాళ్ళు మనసులో ఏదో ఊహించుకొని తాళి వేసేసుకుంటే పెళ్లి అయిపోయినట్లేనా ఇక్కడ ఎవరూ కోడలిగా అంగీకరించరు అంటుంది దేవయాని. అంగీకరించవలసింది మీరు కాదు నేను అంటుంది జగతి.
అసలు నువ్వు తల్లివేనా కొడుక్కి శాస్త్రబద్ధంగా పెళ్లి చేయకుండా దారిని పోయేదాన్ని తీసుకొచ్చి అది వాడి భార్య అంటావా అంటూ నిలదీస్తుంది దేవయాని. మాకు మాకు లేని బాధ మీకు ఎందుకు అంటుంది జగతి. రిషి తనని భార్యగా ఒప్పుకోడు త్వరలోనే ఆ తాళి తెగే రోజు వస్తుంది అంటుంది దేవయాని. ఇదంతా నిద్రలో కలగన్న వసు నా తాళిని ఏం చేయొద్దు అంటూ కలవరిస్తుంటుంది.
అతితెలివి ప్రదర్శించిన దేవయాని..
మరోవైపు ఆ పెద్దమనిషి రిషి, వసుల పెళ్లి గురించి మాట్లాడారని తెలిసింది కానీ ఏం మాట్లాడారో తెలియదు. రిషి మనసు మార్చుకొని వసుని పెళ్లి చేసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ కంగారుపడుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుని వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వకుండా చేయాలి అనుకుంటూ వసు గదికి వెళ్తుంది దేవయాని. అక్కడ వసు లేకపోవడంతో వాష్ రూమ్ కి వెళ్ళిందేమో వచ్చేవరకు వెయిట్ చేద్దాం అనుకుంటుంది.
అంతలోనే ఆమెకి వసు మెడలో ఉన్న తాళి తెగి మంచం మీద ఉండడం గమనిస్తుంది. వీటిని చూసుకునే కదా అంత రెచ్చిపోయావు, వీటితోనే నీకు రిషికి ఉన్న ప్రేమని చెరిపేస్తాను నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తాను అనుకుంటూ ఆ తాళి తీసుకొని అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయి రిషి గదికి వెళ్లి ఆ నల్లపూసలని అతని గదిలో పెట్టేసి వెళ్ళిపోతుంది దేవయాని.
అందరి ముందు వసుని నానా మాటలు అంటున్న రిషి..
నల్లపూసలని చూసిన రిషి షాక్ అవుతాడు. వసుధారని గట్టిగా కేక వేసి పిలుస్తాడు. దాంతో వసుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. నీ నిర్ణయాన్ని గౌరవిద్దాం అనుకున్నాను కానీ నువ్వే దాన్ని తుడిచేసావు, మన మధ్యన ఉన్న దూరాన్ని తగ్గించాలి అనుకున్నాను కానీ నువ్వు ఆ దూరాన్ని పెంచావు అంటాడు రిషి. ఇప్పుడు నేనేం చేశాను అంటూ కంగారుగా అడుగుతుంది వసు.
ఇదేంటి అంటూ కోపంగా తాళిని చూపిస్తాడు రిషి. అప్పుడు తన మెడలో తాళి లేదన్న విషయాన్ని గ్రహిస్తుంది వసు. ఈ తాళిని ఎందుకు తెంచావు అంటూ నిలదీస్తాడు రిషి. నన్ను భర్తగా భావించినప్పుడు నేను బ్రతికి ఉండగానే ఈ తాళిని ఎందుకు తీసేసావు అంటూ నిలదీస్తాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి సర్ ఇది అని అడుగుతుంది వసు.
భార్యకి కోలుకోలేని షాకిచ్చిన ఫణీంద్ర..
ప్రేమ కోసం పెళ్లి కోసం ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసావని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మారిపోతావని ఊహించలేదు అంటాడు రిషి. మీరు చెప్పేంతవరకు నా మెడలో నల్లపూసలు లేవనే విషయం నాకు తెలియదు అంటుంది వసు. రాత్రి ఏదో పిడకల వచ్చింది పెనుగులాటలో తెగిపడిపోయినట్లుగా ఉంది అంటుంది.
తెగి పడిపోతే నీ గదిలో ఉండాలి కానీ నా గదిలోకి ఎందుకు వచ్చాయి అంటాడు రిషి. తెలియదు సార్ అని వసు అంటే అబద్ధం చెప్పకు అంటాడు రిషి. ఇదంతా వింటున్న ఫణీంద్ర, దేవయాని నువ్వు ఇందాక రిషి గదికి వెళ్లావు కదా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవయాని. గదిలోంచి బయటికి రావటం నేను చూశాను నల్లపూసలు అక్కడ పెట్టింది నువ్వే కదా అంటాడు ఫణీంద్ర.
Guppedantha Manasu April 7Today Episode ఒక్క నిమిషంలో ప్లేట్ ఫిరాయించిన దేవయాని..
పెద్దమ్మ ఎందుకలా చేస్తుంది అంటూ వెనకేసుకొస్తాడు రిషి. రిషిని ఆగమని నువ్వు చెప్పు అని దేనియానిని నిలదీస్తాడు ఫణీంద్ర. నేనే పెట్టాను అంటూ అందరికీ షాక్ ఇస్తుంది దేవయాని. ఎందుకు అని నిలదీస్తాడు ఫణింద్ర. నేను వసుధార గదిలోకి వెళ్లాను అక్కడ తెగిపడి ఉన్న నల్లపూసలని చూశాను రిషి ఎలాగూ తాళి కట్టలేదని బాధపడుతున్నాడు కదా అందుకే అతని చేతే ఆ నల్లపూసలు వసు మెడలో వేయిద్దామని రిషి గదిలో పెట్టాను.
ఈ విషయాన్ని రిషికి చెప్పే లోపల ఇదంతా జరిగిపోయింది అంటుంది దేవయాని. ఇంత చిన్న విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు అంటుంది వసు. ఇది అపార్థం కాదు నా బాధ నువ్వు ఎక్కడ దూరమవుతావో అన్న ఆవేదన అంటాడు రిషి. ఇప్పటివరకు జరిగింది చాలు ఒకరితో ఒకరు విభేదించుకోకండి అంటుంది జగతి. నల్లపూసలని ఇప్పుడే వసు మెడలో వెయ్యు అంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం