Guppedantha Manasu April 8 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఒకరితో ఒకరు విభేదించుకోకుండా మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి అంటుంది జగతి. మా భవిష్యత్తు రిషి సార్ చేతిలోనే ఉంది ఆయన మాటని నేను కాదనలేను అంటుంది వసు. వసు మెడలో ఇప్పుడే ఆ నల్లపూసలు వెయ్యు అంటాడు మహేంద్ర. ఆలోచించుకొని చెప్తాము కొంచెం టైం కావాలి అంటాడు రిషి.
దేవయానిని తిట్టుకుంటున్న జగతి దంపతులు..
మరోవైపు అక్కయ్య ఎంత పని చేసిందో చూశారా అంటూ భర్త దగ్గర బాధపడుతుంది జగతి. రిషి, వసుల మధ్య అపోహలు ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నాయి. పంతం వల్ల ఒకరు నిర్ణయాన్ని ఒకరు ఇన్ని రోజులు అంగీకరించలేకపోయారు. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు తగ్గారు. అంతా బాగుంటుంది అనుకునే టైంలో అక్కయ్య ఇలా చేశారు అంటుంది.
ఎవరైనా బాగుంటే వదిన గారు ఓర్చుకోలేరు వసుధార అంటే వదిన గారికి చిన్న చూపు అంటాడు మహేంద్ర. బావగారు చూశారు కాబట్టి నిజం బయటపడింది లేకపోతే ఇది ఎంతవరకు దారి తీసేదో అంటూ కంగారు పడుతుంది జగతి. వాళ్లది స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమే వాళ్ళని గెలిపిస్తుంది అంటాడు మహేంద్ర. ఈయన నన్ను చూడకపోతే బాగుండేది.
నీ పద్ధతి బాలేదంటూ భార్యకి చీవాట్లు పెట్టిన ఫణీంద్ర..
ఇప్పుడు రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో తన పంతాన్ని పక్కనపెట్టి ఇద్దరూ ఒకటే పోతారేమో అని కంగారుపడుతుంది దేవయాని. నువ్వు చేసింది ఏమి బాగోలేదు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నా కొన్ని విషయాల్లో పట్టింపులకు పోతున్నారు. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నారు ఇలాంటి సమయంలో నువ్వు ఇలాగ చేసి ఉండకూడదు. నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదు అంటూ భార్యని మందలిస్తాడు ఫణీంద్ర.
రిషి కోసమే చేశాను అతను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అంటుంది దేవయాని. వాళ్ళిద్దర్నీ కలుపుదామని ఆరాటపడుతున్నావ్ కానీ అది జరుగుతుందా అంటాడు ఫణీంద్ర. జరగాలని ఆశిద్దాం నేను దేవుని అదే కోరుకుంటాను అని భర్తతో చెప్పిన దేవయాని మనసులో మాత్రం వాళ్ళిద్దరూ కలవకూడదు విడిపోవాలి అని కోరుకుంటుంది.
ఉంగరం కోసం వెతుకుతున్న రిషి, వసు..
రిషి సార్ ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో అనుకుంటుంది వసు. మనం మనలాగే ఉందా మనం మన ప్రేమని గెలిపించుకుందాము అంటాడు రిషి. మన బంధం అనుకునే ఉంగరం ఎక్కడ పడిపోయిందో అంటాడు రిషి. నా గదిలోనే పడిపోయి ఉంటుంది అంటుంది వసు. పదా వెళ్లి వెతుకుదాము అంటాడు రిషి. ఎంత వెతికినప్పటికీ వాళ్లకి దొరకదు.
అది మా బంధానికి గుర్తు దొరికితే బాగుండు అని ఇద్దరు అనుకుంటారు. కాసేపటి తర్వాత ఉంగరం దొరుకుతుంది ఇది మన ప్రేమకి చిహ్నము ఎప్పుడూ పోగొట్టుకోకూడదు అంటుంది వసు. ఉంగరాన్ని మీరే నా చేతికి పెట్టండి అంటూ చేయందిస్తుంది. నాతో రా అంటూ తన రూమ్ కి తీసుకెళ్తాడు రిషి. తన బీరువాలో ఉన్న ఒక గిఫ్ట్ బయటకు తీసి వసుకి చూపిస్తాడు.
తన నిర్ణయాన్ని చెప్పి అందరికీ షాకిచ్చిన రిషి..
నల్లపూసలకి ఉంగరాన్ని ఎక్కించి ఒకసారి ఈ బంధం ఒంటరిగా ముడిపడింది ఈసారి ఈ బంధం ముడి పడాలంటే సరైన నిర్ణయం తీసుకుందాము అప్పటివరకు ఇది ఇక్కడే ఉండాలి అంటూ తను చూపించిన గిఫ్ట్ మీద వేస్తాడు రిషి. మన ప్రేమ ఎప్పుడూ చెదిరిపోకూడదు అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకువెళ్లి దేవయానిని పిలుస్తాడు రిషి. మహేంద్ర తోపాటు అందరిని రమ్మంటాడు.
నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దాన్ని మీ అందరికీ చెప్తాను. ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఉన్నాను అందర్నీ చాలా కష్టపెట్టాను. వసుధారని బాధపెట్టి నేను కూడా బాధపడ్డాను. ఇక అది రిపీట్ చేయదలుచుకోలేదు. ఇకమీదట మేము ఎవరిని బాధపెట్టే పని చేయదలచుకోలేదు అందుకే నేను వసుధారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు రిషి.
Guppedantha Manasu April 8 Today Episode బాగా ఎమోషనల్ అవుతున్న జగతి దంపతులు..
దేవయాని తప్ప అందరూ ఎంతో సంతోషిస్తారు. నువ్వు చెప్పేది నిజమే కదా అంటూ ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. నిజమే డాడ్ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటాడు రిషి. నీ నోటి నుంచి ఈ మాట వినాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను అంటూ జగతి కూడా ఎమోషనల్ అవుతుంది.
ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనుకోలేదు అనుకుంటుంది దేవయాని. దేవయానితో పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించమంటాడు రిషి. ఇది శూన్య మాసం కదా ముహూర్తాలు ఉండవు కొద్ది రోజులు ఆగాలి అంటుంది దేవయాని. సరే మీ ఇష్టం అన్న రిషి వసుని తీసుకొని బయటికి వెళ్దాం పద అంటాడు.
ఎక్కడికి అని మహేంద్ర అడిగితే తెలియదు కానీ అలాగా సరదాగా బయటికి వెళ్లాలని ఉంది అంటాడు రిషి. వెళ్లండి ఎంజాయ్ చేయండి అంటాడు మహేంద్ర. జగతితో పదా మనం కూడా బయటికి వెళ్దాము అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.