Guppedantha Manasu: తన ప్రేమని గెలిపించుకోవడానికి తండ్రితో పోరాటం చేస్తున్న ఒక స్త్రీ కథ గుప్పెడంత మనసు.
చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కూతుర్ని నానా మాటలు అని బయటికి వెళ్లిపోతాడు చక్రపాణి. తల్లి మాత్రం అక్కున చేర్చుకుంటుంది. తను సాధించిన విజయాలని తల్లితో చెప్తుంది. నేను సాధించిన విజయాలని పక్కన పెట్టేసి జరిగిపోయిన దానికోసం ఎందుకమ్మా తిడతాడు నాన్న అంటూ బాధపడుతుంది. మరోవైపు వసూల్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఆమె కాలేజీకి వెళ్లి గతాన్ని తలుచుకుంటాడు రిషి.
మరోవైపు రుషి,వసు వాళ్ళ ఇంటికి వెళ్లలేదని తెలుసుకొని రాజీవ్ని రంగంలోకి దింపుతుంది దేవయాని. చక్రపాణి కూతురుతో గొడవపడి ఆమె ఫోన్ ని నేలకేసి కొట్టేస్తాడు. రిషి ఎంత ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ రావటంతో ఏం జరిగిందో అని కంగారు పడతారు. జగతి కూడా వసు వాళ్ళింట్లో ఏమీ గొడవ జరగట్లేదు కదా అని భయపడతారు. ఆమెకి మహేంద్ర ధైర్యం చెప్తాడు. వసు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడతాడు రిషి.
వాడు ఎవడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు చక్రపాణి. నేను వెళ్లే తీరుతాను అని వసు,రిషి తో బయటికి వెళుతుంది. కానీ రిషికి నిజం చెప్పదు. ఏదో జరిగింది వసు నాకు నిజం చెప్పటం లేదు అనుకుంటాడు. కాసేపు బయట గడిపి ఒక ఫోన్ కొనిచ్చి ఆమెని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. మరోవైపు దేవయాని రిషికి ఫోన్ చేసి తను వసు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని తెలుసుకుంటుంది. అదే విషయాన్ని రాజీవ్ కి చెప్పి ఇక నీ ప్లాన్ అమలు చేయు అంటుంది.
వాళ్ళ ఊరికి బయలుదేరిన రాజీవ్ కి దారిలో రిషి వాళ్ళు కనిపిస్తారు. ఇంట్లోకి వస్తూనే కూతురు మీద ఎగిరి పడతాడు చక్రపాణి. పరువు తీసేస్తున్నావు పోయిందని పోవడం మానేసి మళ్ళి ఎందుకు వచ్చావు. ఊర్లో వాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి అంటాడు. రిషి సార్ మా లెక్చరర్ నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అంటూ కచ్చితంగా చెప్తుంది వసు. కనిపించని పరువు కోసం కనిపించే బంధాల్ని వదులుకోవద్దు అంటుంది వసు. ఎలాంటి కూతుర్ని కన్నాను అని వసుని అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు చక్రపాణి.
మరోవైపు రాజీవ్, రిషి రూమ్ కి వెళ్లి నాకు వసుకి పెళ్లి అంటూ రిషి ని రెచ్చగొడతాడు. ఆ మాటలకి చిరాకుడిన రిషి రాజీవ్ ని రూమ్ లోంచి బయటికి గెంటేస్తాడు. వసు దగ్గరనుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో జగతి కూడా కంగారుపడి వసుకి ఫోన్ చేస్తుంది. అప్పటికే కూతురు మీద కయ్యానికి కాలు దువ్వుతున్న చక్రపాణి ఆ ఫోన్ ని లిఫ్ట్ జగతిని నానా మాటలు అంటాడు. ఊరు పేరు లేని వాడికి ఇచ్చి నా కూతురు గొంతు కోయాలని చూస్తున్నావా అంటే రిషి నా కొడుకు అని చెప్తుంది జగతి.
అయితే అస్సలు నా కూతుర్నే నీ కొడుకు ఇవ్వను ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అంటాడు చక్రపాణి. జగతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆమె అవమానపడేలాగా మాట్లాడుతాడు. నువ్వు మేడం తో అంతా అసహ్యంగా మాట్లాడటం ఏంటి, అయినా నా పెళ్లి విషయంలో నీ పెత్తనం ఏంటి నా పెళ్లి నా ఇష్టం అంటుంది వసు. అయితే ఉండు నీ పెళ్లి నేను చేస్తాను అని ఆమెని గదిలో పెట్టి తలుపు వేసేస్తాడు చక్రపాణి.
తలుపు తీస్తే విషం తాగి చనిపోతాను అని భార్యని బెదిరిస్తాడు. ఆ బెదిరింపులకి భయపడిన సుమిత్ర కూతురు ఎంత బ్రతిమాలినా తలుపు తీయటానికి ఇష్టపడదు. మరోవైపు జరిగిందంతా మహేంద్ర కి చెప్తుంది జగతి. రిషికి చెబుదామా అంటాడు మహేంద్ర. రిషి డిస్టర్బ్ అవుతాడు వద్దు మనం వెళ్లి పరిస్థితిని చక్కబెడదాం అంటుంది జగతి. వదిన గారికి తెలిస్తే బాగోదు అంటాడు మహేంద్ర.
ఆవిడకి విషయం తెలిస్తే పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది జగతి. ఇదంతా పక్కనుంచి విన్న దేవయాని నేను ఇక్కడ ఉన్నా కూడా పరిస్థితి నా చేతిలోనే ఉంది అనుకుంటూ విషయాన్ని రాజీవ్ చెప్తుంది. ఈలోగా జరిగిందంతా రాజీవ్ కి చెప్పి నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం దగ్గరికి వచ్చింది మనం కలవాలి అంటాడు చక్రపాణి. దేవయానికి అబద్ధం చెప్పి వసు వాళ్ళ ఊరికి బయలుదేరుతారు జగతి దంపతులు.
దేవయానికి నిజం తెలిసినా బయటపడదు మరోవైపు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో రిషి, వసు కి ఫోన్ చేసిన రిషి అక్కడ ఏదో జరుగుతుంది మీ బావ నన్ను కలిశాడు నిన్ను కూడా ఇబ్బంది పెడతాడు నువ్వు ఏమీ భయపడకు నేను వస్తున్నాను అంటూ వసు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రిషి. మరోవైపు విషయం బాటిల్ పక్కన పెట్టుకొని భార్యని బెదిరిస్తూ పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు చక్రపాణి. పంతులు గారిని తీసుకొని రాజీవ్ అక్కడికి వస్తాడు.సుమిత్ర, కూతురికి అన్యాయం చెయ్యొద్దు అంటూ భర్తని బ్రతిమాలుతుంది.
Guppedantha Manasu: ఈవారం సీరియల్ అదిరిందంటున్న ప్రేక్షకులు..
ఇంట్లో ముగ్గురే ఉండడం చూసి పంతులుగారు ఆశ్చర్యపోతారు. అనుకోకుండా జరుగుతున్న పెళ్లి మీరు అవి ఏవి పట్టించుకోకండి. గంటలో ముహూర్తం ఉందన్నారు కదా ఆ ముహూర్తానికి నాకు, ఆ అమ్మాయికి పెళ్లి చేయండి అంటాడు రాజీవ్. మరి రాజీవ్ కి, వసుకి పెళ్లి జరుగుతుందా? రిషి ఈ పెళ్లిని అడ్డుకుంటాడా? సమయానికి జగతి దంపతులు ఆ ఊరు చేరుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.