Guppedantha Manasu December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకోబోతుంది వసు. అతను కోపంగా వెనక్కి వెళ్ళిపోయి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారండి అంటూ భార్య అడ్డుకుంటుంది. అలా అడ్డుకున్న భార్య మీద కోప్పడతాడు చక్రపాణి.
తండ్రి కాళ్లు పట్టుకున్న వసు..
నాన్న అని వసు పిలిస్తే అలా పిలవడానికి సిగ్గు అనిపించడం లేదా అంటాడు. ఊర్లో నా పరువు నీ వల్లే పోయింది. చక్రపాణి చిన్న కూతురు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిందట అంటూ మొహం మీద పూసేస్తున్నారు. నువ్వు ఈ ఇంటిలోంచి వెళ్లిన రోజే చచ్చిపోయాను అంటాడు. ఆ మాటలకి బాధపడుతుంది సుమిత్ర. మన పరువు గంగలో కలిపి వెళ్ళిపోయిందని మళ్లీ ఎందుకు వచ్చావు అంటాడు చక్రపాణి. కోపంతో ఆమెని బయటికి పొమ్మంటాడు చక్రపాణి.
సుమిత్ర అడ్డుకుంటే, నువ్వు అడ్డుకోకు నాకు కోపం వస్తే మనిషిని కాదు అంటూ ఆమె మీద కూడా కేకలు వేస్తాడు. ఇప్పుడు ఊర్లో వాళ్ళకి మరో కొత్త టాపిక్కు దొరికింది చక్రపాణి చిన్న కూతురు వచ్చింది అంట ఇన్నాళ్లు ఎక్కడుందో ఏంటో అంటూ గుసగుసలాడుకుంటారు నేనేం సమాధానం చెప్పాలి. ఆడపిల్ల తండ్రిగా పుడితే నీకు ఆ బాధ తెలుస్తుంది అంటూ బాధపడతాడు. వసు తండ్రి కాళ్లు పట్టుకొని నేను తలవంతులు తెచ్చే పని చేయలేదు నాన్న యూనివర్సిటీ టాపర్ని అయ్యాను అంటుంది.
చక్రపాణి ప్రవర్తనకు ఏడుస్తున్న తల్లి కూతుర్లు..
ఆమెని పక్కకి నెట్టేసి చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు చక్రపాణి. అతని ప్రవర్తనకి తల్లి కూతుర్లు ఇద్దరు ఏడుస్తారు. మరోవైపు రిషి అదే ఊళ్లో లాడ్జి తీసుకొని ఉంటాడు. వాసు ఏం చేస్తుందో ఎలా ఉందో ఫోన్ చేద్దామంటే ఎవరు లిఫ్ట్ చేస్తారో ఏంటో మెసేజ్ పెడతాను అనుకుంటూ, వసు నీతో మాట్లాడాలి ఫోన్ చెయ్యు అని మెసేజ్ పెడతాడు. అదే సమయంలో తల్లి వొళ్ళో పడుకొని ఏడుస్తుంది వసు.
నాకు ప్రతిక్షణం మీరు గుర్తొచ్చేవారు అని వసు అంటే మరీ ఫోన్ చేయొచ్చు కదా అంటుంది సుమిత్ర. నీకు ఫోన్ చేస్తే నాన్న నిన్ను తిడతారేమో అని ఫోన్ చేయలేదు అంటుంది వసు. మీ నాన్నకి నీ మీద కోపం పెరిగిందే కానీ తగ్గలేదు అంటుంది సుమిత్ర. నేను చదువుకోసమే కదా వెళ్లాను ఆయనకు ఎందుకు అంత కోపం, ఎన్ని కష్టాలు పడ్డాను నాకే తెలుసు అంటూ ఏడుస్తుంది. నీ కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయిన గెలిచే ఇంటికి వచ్చింది అంటుంది వసు.
తన విజయాన్ని తల్లికి చూపిస్తున్న వసు..
తన కుటుంబ సభ్యులందరి గురించి అడుగుతుంది వసు. మన కుటుంబానికి ఏదో చేయడం పట్టినట్టుగా అయింది, చెట్టుకోకుండా పుట్టుకొకళ్ళు అన్నట్టు అయిపోయాం అంటూ ఒక్కొక్కరి గురించి చెప్తుంది సుమిత్ర. నేను వచ్చేసాను కదా అన్ని బాగుంటే పెద్దక్క కొడుకుని మనమే పెంచుకుందాం అంటుంది వసు. ముందు నీ సంగతి చూసుకో అంటుంది సుమిత్ర. నాకేంటి అమ్మ నువ్వు ఇచ్చిన ధైర్యం తోనే అడుగు బయటపెట్టి విజయాన్ని సాధించాను అంటూ తను గెలుచుకున్న కప్పుని చూపిస్తుంది వసు.
యూత్ ఐకాన్ ని అమ్మ వేలమందిలో గెలిచాను యూత్ ఐకాన్ అంటే మాటలు కాదు అంటుంది. ఆ కప్పు చూసి మురిసిపోతుంది సుమిత్ర. అంతలోనే అక్కడికి వచ్చిన చక్రపాణి ఆ కప్పుని నేలకేసి కొడతాడు. షాక్ అయిపోతారు తల్లి కూతుర్లు ఇద్దరు. ఏం సాధించావని అంత గర్వంగా చెప్తున్నావ్ బయటికి వెళ్తే అందరూ నా మొహం మీద పూసేస్తున్నారు, ఆడపిల్లకి పెళ్లి చేయడం చేతకాక నేనే పంపించానని నా మొహం మీదే అంటున్నారు.
వసుని చచ్చిపోమన్న చక్రపాణి..
నువ్వు గెలిచిన గెలుపు నా పరువుని తిరిగి తీసుకొస్తుందా అని కేకలు వేస్తాడు. అయిపోయిందాని గురించి అనవసరంగా బాధపడుతున్నావ్ నాన్న నేనేమీ తప్పు చేయలేదు అంటుంది వసు. కళ్ల బిడ్డ మీద మీకెందుకండీ అంత ద్వేషం అంటుంది సుమిత్ర. మధ్యలో మాట్లాడితే చంపేస్తాను అయినా ఇదంతా జరగటానికి నువ్వే కారణం అంటూ భార్య మీద కేకలు వేస్తాడు చక్రపాణి. నాన్న మధ్య అమ్మ ఏం చేసింది అని అంటే నన్ను నాన్న అని పిలవకు నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అంటాడు చక్రపాణి.
అంతలోనే రిషి ఫోన్ మీద ఫోన్లు చేస్తుంటాడు. ఈ గొడవలో ఉన్న వసు ఆ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏం మాట్లాడుతున్నారు అంటూ భర్త మీద కేకలు వేస్తుంది సుమిత్ర. అసలు ముందు నేను అనాలి నీ పెంపకం బాగుంటే అది ఇల్లు దాటేదా నా పరువు పోయేదా, బయటి వాళ్లు నన్ను నానా మాటలు అనుకుంటే నా బాధ నీకు ఎలా తెలుస్తుంది అంటాడు. పోయింది పోకుండా మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చింది. ఇన్ని తిడితే ఎవరైనా వెళ్లి విషం తాగి చస్తారు.
వసు కోసం కంగారు పడుతున్న రిషి..
ఆ మాత్రం ఇంకితం కూడా లేదు అంటూ కూతురు మీద రెచ్చిపోతాడు చక్రపాణి. తనని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు అని భార్యకి చెప్తాడు చక్రపాణి. ఈ దౌర్భాగ్యం నా కడుపున ఎందుకు పుట్టిందో ఏంటో, పుట్టినప్పుడే ఇది చచ్చి ఉంటే బాగుండేది అంటూ ఆవేశంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు చక్రపాణి. మరోవైపు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండదు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను బాధ పెడుతుంది అనుకుంటాడు రిషి.
అంతలోనే అక్కడికి వసు వచ్చినట్లు, నాకోసమే ఎదురు చూస్తున్నారా అని అడుగుతున్నట్లు ఊహించుకుంటాడు రిషి. అయితే అక్కడికి వచ్చింది హోటల్ అతను సార్ వచ్చింది నేను మీకు ఏం కావాలో అడుగుదామని వచ్చాను అంటాడు. అతనికి సారీ చెప్పి ఏమి వద్దు అని చెప్పేస్తాడు. ఈ వసుధర ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా అనుకుంటాడు రిషి. మళ్లీ ఆమెకి ఫోన్ చేస్తాడు రిషి. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వసు.
వసుని అనుమానిస్తున్న రిషి..
ఫోన్ చేస్తాను అన్నావు నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అక్కడ ఏమి ప్రాబ్లం లేదు కదా అంటాడు రిషి. నాకేం ప్రాబ్లం లేదు సార్ బానే ఉన్నాను అంటుంది వసు. వాయిస్ తేడాగా ఉంది అని అంటాడు రిషి. ఏమీ లేదు సార్ బానే ఉన్నాను ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అంటుంది వసు. నిజం చెప్పు వసుధార నా మనసు ఏదో లాగా ఉంది అంటాడు రిషి. అలా ఏమీ లేదు సర్ నేను బానే ఉన్నాను చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాను కదా చాలా సంతోషంగా ఉంది అంటుంది వసు.అయితే వీడియో కాల్ చేస్తాను అంటాడు రిషి.
Guppedantha Manasu December 26 Today Episode:
కంగారుపడిన వసు వద్దు నాన్న చూస్తే బాగోదు అంటుంది. ఇంతకీ మీ నాన్నగారు ఏమన్నారు అంటే చాలా అన్నారు, నా విజయాన్ని చూసి చాలా సంతోషించారు అంటుంది. అవునా మీ నాన్నకి కోపం ఎక్కువ అని నువ్వు చెప్పావు కదా అంటాడు రిషి. ఎంత కోపం అయినా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అంటుంది వసు. ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక అమ్మ పిలుస్తుందని చెప్పి ఫోన్ పెట్టేసి గట్టిగా ఏడ్చేస్తుంది వసు.
వసు నిజంగానే సంతోషంగా ఉందా అని అనుమానపడతాడు రిషి. మీకు అబద్ధం చెప్పినందుకు సారీ అని అనుకుంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.