Guppedantha Manasu December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బాధపడుతూ కూర్చున్న వసు దగ్గరికి వచ్చి ఆమె తల్లి బ్రతిమిలాడి అన్నం తినిపిస్తుంది. నేను ఏం తప్పు చేశానమ్మ నాన్నకి అంత కోపం అంటుంది వసు. పేదవాళ్ళకి పరువు మీద ధ్యాస ఉండదు డబ్బున్న వాడికి పరువు మీద ఆశ ఉండదు మధ్య తరగతి వాడే పరువు పరువు అని పాకులాడుతాడు.
కూతుర్ని ఓదార్చుతున్న సుమిత్ర..
కనిపించని ఆ పరువు బంధాల్ని ఇదిగో ఇలా చిందరవందర చేసేస్తోంది అంటే బాధపడుతుంది ఆమె తల్లి. ఎన్ని రోజులైంది నా చేత్తో అన్నం తినిపించి అంటూ ప్రేమగా అన్నం తినిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదా ఆ మాత్రం కోపం ఉంటుంది కదా మీ నాన్నకి అయినా చిన్నప్పుడు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ఆయనకి, తను ఎక్కడికి వెళ్లినా నిన్ను తీసుకొని వెళ్లేవారు పడుకునే వరకు నీ పక్కనే ఉండేవారు అంటుంది సుమిత్ర. ఇప్పుడు ఎందుకమ్మా ఇలా అరుస్తున్నారు? నేను తప్పనిసరి పరిస్థితుల్లోనే కదా వెళ్ళాను.
నేను పాస్ అయ్యాను అంటే ఆ విషయాన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళను అని మాత్రమే తిడుతున్నారు అంటూ బాధపడుతుంది వసు. అంతలోనే అక్కడికి వచ్చిన చక్రపాణి మొగుడి పరువు పోయిన పర్వాలేదని కూతురికి ముద్దలు తినిపిస్తున్నావా అంటూ చేతిలో కంచం లాగేసుకుంటాడు. ఏంటండీ పసిపిల్ల తింటుంటే లాగేసుకున్నారు అంటుంది సుమిత్ర. అది పసిబిడ్డ కాదు నా శత్రువు అంటాడు చక్రపాణి. మళ్లీ ఏదో బరువు తక్కువ పని చేసి వెళ్ళిపోతుంది కావాలంటే చూడు అంటాడు చక్రపాణి.
కోపంతో ఫోన్ పగలగొట్టిన చక్రపాణి..
నేను ఏం పరువు తక్కువ పని చేశానని అయినా నీ కూతురిని నువ్వే నమ్మకపోతే ఎలా అంటుంది వసు. అంతలోనే రిషి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇది ఏదో పని మీదే ఎక్కడికి వచ్చింది సుమిత్ర ఆ పని అయిపోగానే మళ్లీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ నీ కూతురు వచ్చిందంట మళ్ళీ వెళ్ళిపోయింది అంట అంటూ నా మొహం మీదే అంటారు. ఎక్కడుంటుందో తెలీదు ఎక్కడికి వెళ్తుందో తెలీదు మళ్ళీ తను వచ్చేసరికి మనం ఉంటాము కూడా తెలియదు అంటూ అరుస్తాడు.
ఫోన్ రింగ్ అవ్వటంతో చిరాకు పడిపోయిన చక్రపాణి ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయి ఎన్నాళ్ళలో ఎప్పుడైనా నీకు ఫోన్ చేసిందా అంటాడు చక్రపాణి. ఆ ఫోన్ ఇలా ఇవ్వు నాన్న అంటుంది వసు. ఏంటి వాళ్ళు అంత ఆత్మీయులా అంటూ ఆ ఫోన్ ని విసిరి కొట్టేస్తాడు చక్రపాణి. అదే సమయంలో జగతి వసు కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారుపడిన జగతి ఎందుకు స్విచాఫ్ వస్తుంది, అక్కడ ఏదైనా జరగడానికి ఏమైనా జరిగిందా అంటూ భయపడుతుంది.
జగతికి ధైర్యం చెబుతున్న మహేంద్ర..
అన్నిటికి ఎందుకు కంగారు పడతావు జగతి ఆ పిల్ల చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళింది అందుకే ఫోన్ పక్కన పెట్టేసి ఉంటుంది. నువ్వు కంగారు పడకు నాకు కంగారు పెట్టకు అంటాడు మహేంద్ర. నేను లెక్చరర్ తో పాటు తల్లిని కూడా ఆ మాత్రం కంగారు ఉండదా అంటుంది జగతి. పోనీ రిషి కి ఫోన్ చేద్దామా అంటే ఎందుకు జగతి వాడ్ని డిస్టర్బ్ చేయడం ఎప్పుడూ కాలేజీ కాలేజీ అని తిరుగుతాడు ఇప్పుడైనా వాడిని రిలాక్స్ అవని, ఒకరకంగా మనవాడు అత్తారింటికి వెళ్ళాడు ఎంజాయ్ చేయని అంటూ నవ్వుతాడు మహేంద్ర.
మరోవైపు వసు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఆమె ఆలోచనలోనే ఉంటాడు రిషి. తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది తను మాట్లాడేటప్పుడు బాగున్నానని చెప్పింది కానీ గొంతులో ఏదో తేడా కనిపిస్తుంది అని మొదట అనుమాన పడినా అలాంటిదేమీ అయి ఉండదిలే ఫోను చార్జింగ్ అయిపోయి ఉంటుంది అని తనని తానే సమాధానపరుచుకుంటాడు రిషి. అంతలోనే ఫోన్ రావడంతో బస్సు ఏమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వసు అంటాడు. కానీ అట్నుంచి దేవయాని మాట్లాడుతుంది నేను పెద్దమని మాట్లాడుతున్నాను.
రాజీవ్ ని రంగంలోకి దింపిన దేవయాని..
చెప్పండి పెద్దమ్మ అంటాడు రిషి. ఎలా ఉన్నావ్ ఏం చేస్తున్నావ్ భోజనం అయిందా అని అడుగుతుంది దేవయాని. లేదు పెద్దమ్మ అంటాడు రిషి. ఏం వసు ఇంట్లో ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అని అడుగుతుంది. నేను ఇంకా బస్సు వల్ల ఇంటికి వెళ్ళలేదు పెద్దమ్మ వెళ్ళని వెంటనే మీకు ఫోన్ చేస్తాను వద్దురుగాని రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. అంటే రిషి ఇంకా వసు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట అనుకుంటూ రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు రంగంలోకి దిగాల్సిన టైం ఆసన్నమైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పింది చెయ్ అంటుంది దేవయాని.
ఇక రాజీవ్ ఆన్ డ్యూటీ లో ఉంటాడు అని ఫోన్ పెట్టేస్తాడు రాజీవ్. నాకు ఇష్టం లేకుండా రిషి ని పెళ్లి చేసుకుంటావా? నేను ఉండగా అది ఎప్పటికీ జరగని పని అని కసిగా అనుకుంటుంది దేవయాని. మరోవైపు వసు కాలేజీకి వస్తాడు రిషి. అక్కడ వసు కాలేజీకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది రిషికి. తన ఎంటి ఇక్కడ ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో నాకు బ్రమ కలిగిందా అనుకుంటాడు. మొదటిసారి తను నేను ఇక్కడే కలుసుకున్న ఎంత మంచి జ్ఞాపకమో అనుకుంటాడు. తను నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలని ఇచ్చింది తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఎన్నో జ్ఞాపకాలని కోల్పోయేవాడినని అనుకుంటాడు రిషి.
భర్తకి నచ్చ చెప్తున్న సుమిత్ర..
మరోవైపు బయటకు వెళ్తున్న భర్తకి టీ ఇస్తుంది సుమిత్ర. తనతో మాట కలుపుతున్న భార్యని విషయం సూటిగా చెప్పు డొంక తిరుగుడు వద్దు అంటాడు చక్రపాణి. వసు మీద మీకు ఎందుకండి అంత కోపం తనని ఒకసారి దగ్గరికి తీసుకోండి తను చాలా బాధపడుతుంది అంటుంది సుమిత్ర. ఇన్నాళ్లు నేను పడిన బాధ ఎవరికి కనిపించలేదా అంటాడు చక్రపాణి. ఇన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చింది మంచోడు పలకరించాలి కదా అంటుంది సుమిత్ర. దాన్ని ఇంట్లో చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది అంటూ చిరాకు పడిపోతాడు చక్రపాణి.
ఆ మాటలు విని బయటికి వస్తుంది వసు. మరోవైపు రిషి వసుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమై ఉంటుంది అంటూ కంగారు పడిపోతాడు రిషి. మరోవైపు భర్తని, కూతుర్ని క్షమించమని బ్రతిమాలుతుంది. ఏంటి కూతురు తరపున వకాల్త పుచ్చుకున్నావా? వచ్చిన దగ్గరనుంచి ఒక్కసారి అయినా తప్పైపోయింది క్షమించు నాన్న అని అడిగిందా నీ కూతురు అంటాడు చక్రపాణి. అలా అడగడానికి నేనేమీ తప్పు చేయలేదు అంటుంది వసు.
ముదిరిపోయిన తండ్రి కూతుర్ల వాగ్వాదం..
చూసావా దానికి ఎంత అహంకారమో అంటాడు చక్రపాణి. ఇది అహంకారం కాదు నాన్న నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి గడప దాటాను అంటుంది వసు. నువ్వు గడప దాటావు నా పరువు పొలిమేర దాటింది అంటాడు చక్రపాణి. మీరు పరువు పరువు అంటున్నారు అంతా పరువు తక్కువ పని నేను ఏం చేశాను అని నిలదీస్తుంది వసు. చూసావా అది ఎలా ఎదురు చెబుతుందో అంటూ భార్యకి చెప్తాడు చక్రపాణి. సొంత కూతురు ఎదిగితే సంతోషపడాలి, కూతురి ఎదుగుదల కోసం జీవితాలు ఉద్యోగాలు త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటుంది వసు.
Guppedantha Manasu December 27 Today Episode:
అయితే చెప్పు నన్నేం త్యాగం చేయమంటావ్ అని వెటకారంగా అంటాడు చక్రపాణి. త్యాగం చేయక్కర్లేదు నా కూతురు బాగా చదువుతుందని గర్వపడండి, టాపర్ అని సంతోషంగా చెప్పుకోండి అంటుంది వసు. పరువు పోయిందని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఆడవాళ్లు చంద్రమండలానికి వెళ్తున్న ఈ రోజుల్లో కూడా మీరు పరువు కోసం ఆలోచిస్తున్నారు అంటుంది వసు. చూసావా సుమిత్ర నీ కూతురు ఇంట్లోంచి వెళ్లి చంద్రమండలం గురించి మాట్లాడేంత పెద్దదైంది అంటాడు చక్రపాణి.
మిమ్మల్ని నిలదీసే ఆ పెద్ద మనిషిని నాకు చూపించండి నేను మాట్లాడుతాను అంటుంది వసు. చక్రపాణి చేతకాని వాడు కూతురు చేత మా నోర్లు మూయిస్తున్నాడు అని నేను ఇంకా దిగజారి పోవాలా పండు కోపంగా మాట్లాడుతాడు చక్రపాణి. ఎందుకు అన్నిటికీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు మీకు ఏం తక్కువ అయిందని అంటుంది వసు. పరువు తక్కువైంది అంటాడు చక్రపాణి.