Guppedantha Manasu December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పరువు పోయింది అని గోల పెడుతున్న తండ్రితో పరువు అంటే ఎవరు ఇచ్చేది కాదు అది మన వ్యక్తిత్వం అంటుంది వసు. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావ్ అమ్మ తండ్రికి నీతులు చెప్తున్నావ్, సుమిత్ర వింటున్నావా ఆలోచించడం అజ్ఞానివి అంటూ ధర్మశాస్త్రాలు వల్లిస్తుంది నీ కూతురు అంటాడు చక్రపాణి.
తండ్రి మీద తిరగబడ్డ వసుధార..
మీరు ఒక వైపే ఆలోచిస్తున్నారు అసలు నేనేం తప్పు చేశానని అంటుంది వసు. పెళ్లి పీటల మీద నుంచి పారిపోవటం తప్పు కదా నువ్వు లేచి పోయావు పారిపోయావు అని పదిమంది మాట్లాడుతుంటే నీపాటికి నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చావు మళ్లీ ఏం తప్పు చేశానా అని అడుగుతున్నావా అంటాడు చక్రపాణి. మీ బిడ్డ మీద మీకే నమ్మకం లేకపోతే ఎలాగ నాన్న అంటుంది వసు. ఇన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చింది కదా తనని ఏమీ అనొద్దు అంటుంది సుమిత్ర.
తల్లి కూతురు ఇద్దరు ఒకటి అయిపోయారా అంటాడు చక్రపాణి. నేను చేసిన పనిలో కాదు మీ ఆలోచనలో తేడా ఉంది అంటుంది వసు. దారిని పోయే ప్రతి వెధవ నీ గురించి అడిగితే సమాధానం చెప్పలేక చస్తున్నాను అంటారు చక్రపాణి. అల్లుడుగారు మంచివారు కాబట్టి నా సంసారం ఇంకా నడుస్తుంది. ఈ మాటలు వినలేకే మా అక్క తీర్థయాత్రలకు వెళ్లింది పోనీ చిన్న కూతురు ఇంట్లో ఉన్నావా అంటే అది లేదు అంటూ వసు మీద నిప్పులు కక్కుతాడు చక్రపాణి.
కూతుర్ని వెనకేసుకొస్తున్న సుమిత్ర..
చెవులతో విన్న తేదీ నిజం కాదు అని వసు అంటే నోరు ముయ్యి నా అల్లుళ్ళు బంగారం అంటాడు చక్రపాణి. అల్లులని వెనకేసుకొస్తున్నారు కూతుర్ని అసహ్యించుకుంటున్నారు అంటూ భర్తని మందలిస్తుంది సుమిత్ర. నోరు ముయ్యి కూతురు వచ్చేసరికి నీ గొంతుక కూడా లెగుస్తుంది అంటాడు చక్రపాణి. నా అల్లుళ్ళు బంగారాలు అని చక్రపాణి అంటే నీ అల్లుళ్లు ఎలాంటి వాళ్ళు చెప్తే నువ్వే వాళ్ళని చెప్పుతో కొడతావ్ అంటుంది వసు.
అంతలోనే ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడతాడు. రిషి సార్ వచ్చారు అని వసు అంటే ఎవడు వాడు అని అడుగుతాడు. వెళ్లబోతున్న వసుని ఆపి వాడి పిలడం ఏంటి నువ్వు వెళ్లడం ఏంటి అంటాడు చక్రపాణి. అన్ని అట్నుంచి వచ్చాక చెప్తాను అంటూ తండ్రిని విదిలించుకొని వెళ్ళిపోతుంది వసు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది సుమిత్ర వాడు పిలవడం ఏంటి ఇది వెళ్లిపోవడమేంటి నేను వెళ్లి ఆపుతాను అంటాడు చక్రపాణి.
కూతురి సంగతి తేలుస్తానన్న చక్రపాణి..
భర్తని వారించి చాలా రోజుల తర్వాత వచ్చింది వెళ్ళిపోతే మళ్ళీ రాదు అసలు విషయం నేను కనుక్కుంటాను అని భర్త కాళ్లు పట్టుకుంటుంది సుమిత్ర. ఛీ ఎలాంటి బిడ్డని కన్నా మే, తిరిగిరానీ దాని సంగతి చెప్తాను అని కోపంగా ఉంటాడు చక్రపాణి. మరోవైపు రిషి దగ్గరికి వచ్చిన వసు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని అడుగుతుంది. అదేం ప్రశ్న అని రిషి అడిగితే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంటూ రిషి ని కంగారు పెట్టి అక్కడినుంచి తీసుకెళ్ళి పోతుంది వసు.
ఏమైంది వసు ఎందుకు అలా ఉన్నావు అని రిషి అడిగితే ఏం లేదు సార్ అనేస్తుంది. ఊరి బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు రిషి. ఏమి జరగలేదు సార్ అని అంటే మరి ఎందుకు అదొక లాగా ఉన్నావు నిజం చెప్పు ఏం జరిగింది అని అంటాడు రిషి. నువ్వు ఎప్పుడు నా కళ్ళముందే ఉండాలి కానీ ఇలా మోడీగా కాదు మీ ఊర్లో అన్ని ప్రదేశాలు తిప్పి చూపిస్తారని అనుకున్నాను, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ని పరిచయం చేసి ఇతనే నా కాబోయే భర్త అని చెప్తావేమో అనుకున్నాను కానీ ఏం మాట్లాడవేం వసుధార అంటాడు రిషి.
ఏదో దాస్తున్నావ్ అంటున్న రిషి..
ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సార్ అంటుంది వసు. మనం ఈ ఊరికి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది ఇంత తక్కువ టైంలోనే ఈ మార్పు ఏంటి నీలో, అసలు నాతో వచ్చింది నువ్వేనా అని అనిపిస్తుంది అంటాడు రిషి. ఆ మాటలకి ఏడుస్తున్న వసుని ఏమైంది అని అడుగుతాడు. ఇది ఏడుపు కాదు సార్, మీ ప్రేమ పొందినందుకు వస్తున్న ఆనందభాష్పాలు అంటుంది వసు. నువ్వు ఏదో దాస్తున్నావు అని రిషి అంటే దాచటానికి ఏముంటుంది అంటుంది వసు.
నేను కొన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు ఏది నీ ఫోను ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావ్ అని అడుగుతాడు. పొరపాటున చేజారి పగిలిపోయింది అంటుంది వసు. చూసుకోవాలి కదా అంటాడు రిషి. చేజారే వరకు మనకి తెలీదు కదా సార్ అవి చేయి జారిపోతాయని అంటుంది వసు. సరేలే దాని గురించి మర్చిపో ఇంకొక ఫోన్ కొంటాను అని రిషి అంటే బి బి ఎస్ టి కాలేజీ కి ఏ ముహూర్తాన వచ్చానో కానీ ఎన్ని కష్టాలు పడ్డాను అన్ని విజయాలు సాధించాను ముఖ్యంగా మిమ్మల్ని అంటుంది వసు.
వసుని బయటికి తీసుకెళ్ళిన రిషి..
ఇప్పుడు ఏమైందని అవన్నీ తలుచుకుంటున్నావు నువ్వు ఫోన్ చేస్తావని నేను పెద్దమ్మ వాళ్ళని రమ్మందామని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫోన్ చేసి వాళ్లని రమ్మంటాను అని రిషి అంటే ఇప్పుడు వద్దు సార్ అంటుంది వసు. ఇప్పటికే ఆలస్యమైంది, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదా చాలా ఎమోషనల్ అయి ఉంటావు అంటాడు రిషి. వాళ్లు నన్ను వదిలేసి ఎప్పటిలాగే ఉన్నారు సార్ అంటుంది వసు. మనం ఫోన్లు చేసుకోకుండా మెసేజ్లు చేసుకోకుండా ఉన్నది ఇదే ఫస్ట్ టైం.
ఇంట్లో ఉన్నా కూడా మనం మెసేజ్లు చేసుకునే వాళ్ళం కదా అంటాడు రిషి. అవన్నీ గొప్ప జ్ఞాపకాలు అంటుంది వసు. జ్ఞాపకాలు అంటావేంటి మనం ఇంట్లో ఉన్నా కూడా మెసేజ్లు చేసుకోవాలి పద నీకు ఒక మంచి ఫోను కొనిస్తాను అంటూ వసుని తీసుకొని వెళ్తాడు రిషి. మరోవైపు అటువైపుగా వచ్చిన రాజీవ్ కారులోనే ఉన్న వసుని చూస్తాడు. అక్కడ మావయ్య గారేమో టెన్షన్ పడుతుంటే మరదలు పిల్ల ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటాడు. అంతలోనే ఫోన్ తీసుకొని వచ్చి కారు ఎక్కుతాడు రిషి.
Guppedantha Manasu December 28 Today Episode: కంగారు పడుతున్న జగతి దంపతులు..
రిషి ని చూసిన రాజీవ్ అక్కడ కాలేజీలు షికార్లు అయిపోయాయి ఇక్కడ అనంతగిరి కి వచ్చి ప్రేమ పావురాలు లాగా వివరిస్తుంటే ఎలా త్వరలో కాబోయే భార్యవి కదా ఇలా పరాయి మగ వాడితో తిరగడం ఏంటి అని అంటాడు. కాబోయే మొగుడుగా ఈ సారికి క్షమించేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎలాగు ఆ అవకాశం నేను మీకు ఇవ్వను అని అనుకుంటాడు రాజీవ్. మరోవైపు ఇంకా ఫోన్ రాలేదని కంగారు పడుతుంటారు జగతి, మహేంద్రలు. నువ్వు ఈ మధ్య కొత్తగా భయపడుతున్నావ్ ఏంటి జగతి నువ్వు నువ్వేనా అంటాడు మహేంద్ర.
వసు, రిషిలు ఏకమవ్వాలని మనం ఎంత ఆరాటపడ్డామో తెలుసా, వాళ్లు ఒకరికొకరు విడిచి ఉండలేనంతగా కలిసిపోయారు చివరికి పెళ్లి జరగబోతుంది అనుకుంటే దేవయాని అక్కయ్య ఏం చేస్తారో అని భయంగా ఉంది అని కంగారు పడుతుంది జగతి తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.