Guppedantha Manasu December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కొత్తగా భయపడుతున్నావు ఏంటి జగతి నువ్వు నువ్వేనా అంటాడు మహేంద్ర. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కలిసి పోయారు చివరికి పెళ్లి చేసుకుందాం అంటే దేవయాని అక్కయ్య ఏం చేస్తారో అని కంగారుగా ఉంది అంటుంది జగతి. ఇంకా భయం ఎందుకు, తను ఇంతకంటే ఏం చేస్తుంది అంటాడుమహేంద్ర.
తోటి కోడల్ని అనుమానిస్తున్న జగతి..
తను ఎందుకో చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది అంటుంది జగతి. తను ఏం చేసినా ఇంతకుముందు లాగా మనం ఊరుకోం కదా అంటాడు మహేంద్ర. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి రిషి దగ్గర నుంచి ఫోన్ రాగానే వెంటనే ఆ ఊరు వెళ్ళిపోదాం అంటుంది జగతి. అలాగే కానీ ముందు నువ్వు భయపడడం మానేయ్ అంటాడు మహేంద్ర. మరోవైపు దేవయాని, రాజీవ్ కి ఫోన్ చెప్పిన పని ఏం చేసావని అడుగుతుంది.
ప్రేమ పావురాల ప్రేమ ఓడిపోతుంది అంటాడు రాజీవ్. మాటల్లో కాదు చేతల్లో చూపించు అంటుంది దేవయాని. నాకు జిందాకే ప్రేమ పావురాలు కనిపించాయి వాళ్ళు కారులో షికారు చేస్తున్నారు అంటాడు రాజీవ్. మరి నువ్వేం చేస్తున్నావ్ అని కోపంగా అడుగుతుంది దేవయాని. చేయాల్సిందేదో చేస్తాను నేను అసలే దెబ్బతిన్న పులిని అంటాడు రాజీవ్.
గొప్పలు చెప్పొద్దంటున్న దేవయాని..
పులిని,సింహాన్ని అంటూ గొప్పలు చెప్పుకోవడం మానేసి చెప్పింది చెయ్ అంటుంది దేవయాని. వాళ్ళిద్దర్నీ విడగొట్టి నా మరదలు మెడలో తాళి కడతాను ఉంటాను మేడం అని ఫోన్ పెట్టేస్తాడు రాజీవ్. మీరు అనుకున్నది ఏదీ జరగనివ్వను అని జగతి దంపతులను చూసి అనుకుంటుంది దేవయాని. మరోవైపు వసుని ఇంటిదగ్గర డ్రాప్ చేసి ఈ దూరం ఇంకా కొన్ని గంటలే కదా అని ఆశగా అడుగుతాడు రిషి. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు.
అపురూపమైన క్షణాలు రావాలని నేను కూడా ఆశిస్తాను అంటుంది వసు. నువ్వు ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు నాకు అర్థం కావటం లేదు అంటాడు రిషి. జీవితం అంటేనే ఊహలకి అందవు సార్ అంటుంది వసు. సరే అని ఫోన్ కానీ చేతిలో పెట్టి ఎలాంటి కష్టంలోనైనా నీకు నేనున్నానని గుర్తుపెట్టుకో అంటాడు రిషి. వెళ్ళిపోతున్న వసూల్ ని చూస్తూ తను నా దగ్గర ఏమీ రాయడం లేదు కదా అని అనుమాన పడతాడు రిషి.
కూతురు కోసం గుమ్మంలోనే వెయిట్ చేస్తున్న చక్రపాణి..
మరోవైపు కూతురు కోసం గుమ్మంలోనే కూర్చొని కారాలు,మిరియాలు నూరుతుంటాడు చక్రపాణి. వాడెవడో పిలవడం ఏంటి ఇది వెళ్ళటం ఏంటి రాని చెప్తాను అని భార్యతో అంటాడు. వస్తున్న కూతురిని గుమ్మంలోనే ఆపి వాడు ఎవడు అని అడుగుతాడు. నాకు కాబోయే భర్త అంటుంది వసు. షాప్ అయినా చక్రపాణి తన భార్యని ఏం పెంపకం పెంచావే అంటూ భార్యని మందలిస్తాడు.
మధ్యలో అమ్మ ఏం చేసింది అంటుంది వసు. నేను రిషి కృతజ్ఞతలు ఇష్టపడ్డాం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అంటుంది వసు. అంతా నీ ఇష్టమేనా అని చక్రపాణి అంటే నా పెళ్లి నా ఇష్టం నాన్న అంటుంది వసు. వాడు ఎవడో తెలియదు అంటే నాకు తెలుసు నాన్న అయినా వజ్రం లాంటివారు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు అంటుంది వసు.
తండ్రి మీద తిరగబడ్డ వసుధార..
వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుందా నా ఇష్టం పని లేదా అంటాడు చక్రపాణి. నీ ఇష్టం ఏంటో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు అంటుంది వసు. పంచాంగం చూసి ఎప్పుడు మంచిదో చెప్తే వాళ్ళని రమ్మంటాను అని కాన్ఫిడెన్స్ గా చెప్తుంది వసు. నీకేమైనా పిచ్చి పట్టిందా నీ మటుకు నువ్వే మాట్లాడేసుకుంటున్నావు పెద్దవాళ్ళు చచ్చారు అనుకుంటున్నావా అంటాడు చక్రపాణి.
పెద్దరికం అంటే ఒక బాధ్యత నాన్న, తండ్రి అంటే కన్నీళ్లు వస్తే తొడగాలి కష్టం వస్తే ఓదార్చాలి అంతేగాని నేను చెప్పింది వినాలి అంటే దాన్ని పెద్దరికం అనరు. నీ మాట నెగ్గించుకోవడమే నీకు ముఖ్య నీ కూతుర్ల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు. ఇద్దరు అత్తయ్యని పెళ్లిళ్లు అలాగే చేసావు ఇప్పుడు ఏమైంది ఒక అక్క చచ్చి బ్రతికింది మరో అక్క చస్తూ బ్రతుకుతుంది. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా వినను నాన్న. పెళ్లి గురించి మాట్లాడుతూ నా హక్కు.
వసుని అనుమానిస్తున్న రిషి..
రిషి సార్ నా జీవితం అంటుంది వసు. నువ్వు సెల్ఫోన్ పగలగొట్టావ్ ఆయన కొనిచ్చారు. దేనినైనా పగలగొట్టడం గొప్ప కాదు నాన్న కలపడం గొప్ప. ఎదుటివాళ్ళి అభిప్రాయాల్ని గౌరవించడం గొప్ప అంటుంది వసు. అంటే మేము వద్దన్నా వాడినే పెళ్లి చేసుకుంటావా అంటాడు చక్రపాణి. నాన్న చెప్పింది విను అర్థం చేసుకో, పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాను నువ్వు ఒప్పుకుంటే వాళ్లు ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుతారు లేకపోతే నీ నీ పరువు కోసం రిషి సర్ ని వదులుకోలేను అంటుంది.
నేను చెడ్డ కూతురిని అని మీరు అనుకున్న పరవాలేదు కానీ వదులుకోను అంటే కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది వసు. మరోవైపు ఊర్లోకి వచ్చిన రిషి ఇదంతా వసుధార తిరిగిన ఊరు. తను నాతో శాశ్వతంగా ప్రయాణించడానికి రాబోతుంది అని అనుకుంటాడు రిషి. మళ్లీ అంతలోనే తను ఎందుకంత డల్ గా ఉంది నా దగ్గర ఏమైనా దాస్తుందా అని అనుమాన పడతాడు. అయినా తను నా దగ్గర ఏది దాయిదు కదా తను ఎప్పటికైనా నా సొంతం నేను ఎప్పటికైనా తన సొంతం అంటూ ఐ లవ్ యు వసుధార అంటూ గట్టిగా ఆనందంగా అరుస్తాడు రిషి.
వసుని మందలిస్తున్న సుమిత్ర..
మరోవైపు కొత్త ఫోను చూస్తూ ఉన్న వసు దగ్గరికి వాళ్ల అమ్మ వచ్చి మీ నాన్నతో అలా మాట్లాడొచ్చా అని అడుగుతుంది. నాన్నని నేను గౌరవిస్తాను కానీ అన్నింటిని గౌరవించలేను కదా, ఇది నా జీవితం అంటుంది వసు. కానీ మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరేమో అంటుంది సుమిత్ర. నాన్న పట్టుదల గురించి మనకి తెలిసిందే కదా నువ్వే ఎలాగైనా నాన్నని ఒప్పించాలి అంటుంది వసు. అమ్మో నేను అని భయపడుతుంది సుమిత్ర.
నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా, నేను ఇలా మొండికేయకపోతే నా బ్రతుకు కూడా అక్క వాళ్ళ బ్రతుకులాగే అయిపోతుంది ఒకసారి ఆలోచించు అని రిషి ఫోటో చూపిస్తుంది వసు. మహారాజు లాగా ఉన్నాడు అంటుంది సుమిత్ర. నా బంగారు తల్లికి మంచి వాడిని ఇచ్చాడా దేవుడు అంటుంది సుమిత్ర. చాలా మంచివారు అమ్మ నేను అంటే చాలా ఇష్టం ఉంటుంది వసు. నీ పెళ్లి ఎలా జరుగుతుందో ఎలాంటి సంబంధం వస్తుందని భయపడ్డాను మొత్తానికి మంచే జరిగింది అంటుంది సుమిత్ర.
నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటున్న వసు..
నాన్న మనం ఏం చెప్పినా వద్దనే అంటారు కదా అందుకని రిషి సార్ ని వదులుకోలేను, నేను తనని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అంటుంది వసు. నాన్న కోసం ఆలోచించి నా జీవితాన్ని నాశనం చేసుకోవాలి అంటుంది వసు. నేను తప్పుగా మాట్లాడుతున్నాను అమ్మ స్వార్థం గా మాట్లాడుతున్నాను అని వసూలు అడిగితే ప్రేమలో స్వార్థం లేకపోతే గెలిపించుకోలేము అమ్మ నేను మీ నాన్నతో మాట్లాడి చూస్తాను అంటుంది సుమిత్ర.
మరోవైపు దేవయానికి రిషి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ పెద్దమ్మ అని అడుగుతాడు. హాల్లో ఉన్నాను నాన్న అంటుంది దేవయాని. అందర్నీ ఒకసారి రమ్మను పెద్దమ్మ అందరితోని మాట్లాడుతాను అంటూ హుషారుగా మాట్లాడుతాడు రిషి. రిషి ఏంటి హెల్త్ ఉత్సాహంగా ఉన్నాడు ఆ రాజీవ్ ఏం చేస్తున్నట్టు అని మనసులోనే అనుకుంటుంది దేవయాని. ఏంటో చెప్పు నాన్న అని దేవయాని అంటే కాదు పెద్దమ్మ నేనే అందరికీ చెప్పాను ఒకసారి అందర్నీ పిలువు అంటాడు.
Guppedantha Manasu December 28 Today Episode: ఇంట్లో అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన రిషి..
దేవయాని, ధరణిని పిలిచి ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి పిలువు రిషి ఏదో చెప్తాడంట అంటుంది. ధరణి వెళ్లి ఇంట్లో వాళ్ళందరిని పిలుచుకు వస్తుంది. రిషి ఫోన్ చేశాడు లైన్ లో ఉన్నాడు అని స్పీకర్ ఆన్ చేస్తుంది దేవయాని. అందరూ వచ్చారా వదిన అని అడుగుతాడు రిషి. అందరివి ఇక్కడే ఉన్నాం ఏదైనా గుడ్ న్యూస్ అంటాడు ఫణీంద్ర. వసు ఏ క్షణంలోనైనా మనకి గుడ్ న్యూస్ చెప్పొచ్చు మీరు రావటానికి రెడీగా ఉండండి అంటాడు రిషి.
మేము మీ ఫోన్ కాల్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం అంటాడు మహేంద్ర. మేడం మీరు కూడా తప్పకుండా రావాలి అంటాడు రిషి. పెదనాన్న అందర్నీ తీసుకొని రండి అంటూ ఆనందంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.