Guppedantha Manasu December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను ఫోన్ చేసిన వెంటనే రావాలి మేడం మీరు కూడా అంటూజగతికి స్పెషల్ గా చెప్తాడు రిషి. పెదనాన్న అందరిని తీసుకొని రావాలి అని ఆనందంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. మొత్తానికి రిషి గుడ్ న్యూస్ చెప్పాడు అంటాడు ఫణీంద్ర. అవును అన్నయ్య మనం వెళ్లేటప్పుడు ఏవేవో తీసుకెళ్లాలి కదా అంటాడు మహేంద్ర.
రాజీవ్ ని చూసి షాక్ అయిన రిషి..
ఆ పనులన్నీ మీరే చూసుకోండి అంటాడు ఫణీంద్ర. మరోవైపు వసు ఫోటో చూస్తూ ఆమె జ్ఞాపకాల్లో ఉంటాడు రిషి. వచ్చాక నా లైఫ్ ఏ మారిపోయింది. అయినా తను ఎందుకో డల్ గా ఉంది ఏమైనా దాస్తుందా అయినా నా దగ్గర తనకి ఏమి దాపరికాలు ఉంటాయి అనుకుంటాడు రిషి. అంతలోనే డోర్ సౌండ్ అవడంతో కాఫీ కావాలి అంటాడు. కానీ అక్కడ ఉన్న రాజీవ్ ఇంకేమైనా కావాలా రిషి సార్ అంటాడు. నువ్వేంటి ఇక్కడ అని సీరియస్ గా అడుగుతాడు రిషి.
ఇది మా మామగారి ఊరు, మీరు ఎక్కడికి వచ్చి నన్ను ఏంటి ఇక్కడ అని అడుగుతున్నారా అంటాడు రాజీవ్. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అంటాడు రాజీవ్. నీకు అనవసరం అంటాడు రిషి. లోక కళ్యాణం కోసం తెలుసుకోవాలి రిషి సార్ అంటాడు రాజీవ్. ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటాడు రిషి. ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు మీకు ఇంకా నామీద కోపం పోలేదు అంటాడు రాజీవ్.
రిషిని రెచ్చగొడుతున్న రాజీవ్..
నేను తక్కువ మాట్లాడతానని అందరూ అంటారు అయినా పర్వాలేదు ఇప్పుడు ఎక్కువే మాట్లాడతాను అంటాడు రాజీవ్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఏదో చెప్పబోతుంటే బయటికి పొమ్మంటాడు రిషి. శుభవార్త చెబుదామని వస్తే మీరు బయటకు పొమ్మంటారు ఏంటి అంటాడు రిషి. నాకు ఏ గుడ్ న్యూస్ వినే ఓపిక లేదు అంటాడు రిషి. మీ స్టూడెంట్ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను అంటాడు రాజీవ్.
దానికి నీకు సంబంధం లేదు నువ్వు బయటికి వెళ్ళు అంటాడు రిషి. పెళ్ళికొడుకుని నేనే నాకు సంబంధం లేకపోవడం ఏంటి అంటాడు రాజీవ్. నీకు తనకి పెళ్లెంటిరా అంటాడు రిషి. నిజాలు చెప్తే ఎవరూ నమ్మరు, బ్యాడ్ లోకం అంటాడు రాజీవ్. తను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా తను నా సొంతం తనకి నాతోనే పెళ్లి అంటాడు రిషి. మీరు నా మాట నమ్మడం లేదు కదా అంటాడు రాజీవ్. నువ్వు ముందు ఎక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే కొట్టినా కొడతాను అంటాడు రిషి.
రాజీవ్ ని బయటికి గెంటేసిన రిషి..
మొహం మీద కొట్టొద్దు పెళ్లి ఫోటోలు బాగా రావు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు రాజీవ్. రిషి కోపంతో తనని బయటికి గెంటేసి తలుపు వేసేస్తాడు. బయటికి వెళ్ళాక కూడా రాజీవ్ ఊరుకోడు నాకు కంగ్రాట్స్ చెప్పరా రిషి సార్ అంటాడు. పెళ్లికి మాత్రం తప్పకుండా రండి, మీకు కడుపు మంటగా ఉంటుందేమో అక్కడ కడుపునిండా మీకు బిర్యాని పెడతాను గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతాడు రాజీవ్. లోపల ఉన్న రిషి వాసు ఫోటో చూసి వాడు ఏమంటున్నాడో విన్నావా? రిషి వసుల పెళ్లయితే రిషిధార అవుతుంది అంతేగాని వాడితో నీ పెళ్లేంటి అనుకుంటాడు రిషి.
మరోవైపు వసు అన్నమాటలు తలుచుకొని సుమిత్ర కూతురి పెళ్లి విషయంలో నాకే అధికారం లేదా తనకి ఎవరు యోగ్యుడో నిర్ణయించుకునే హక్కు తండ్రికి ఉండదా అంటాడు చక్రపాణి. ఎప్పుడు కోపంగారిచే మీరు ఇంత శాంతంగా మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది సుమిత్ర. పులి ఎప్పుడు గర్జిస్తూనే ఉంటుందా, కానీ నాకు కూడా మనసు ఉంటుంది కదా అంటాడు చక్రపాణి. ఇదిగో నాన్న నీ అల్లుడు అంటే నేను అక్షింతలు వెయ్యాలా? ఊర్లో అందరూ ఏమనుకుంటారు.
పెళ్ళాం మీద విరుచుకుపడుతున్న చక్రపాణి..
పెద్ద పిల్ల చనిపోయింది వసు, రాజీవ్ ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లాడికి తల్లిగా మారుతుందని అనుకున్నాను, వేరే పిల్లని రాజీవ్ చేసుకుంటే ఆ పిల్లాడికి తల్లిగా మారుతుందా అంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర అమ్మాయి ఇందాక అబ్బాయి ఫోటో చూపించిందండి చాలా బాగున్నాడు చూస్తే మీరు ఒప్పుకుంటారు అంటుంది సుమిత్ర. కాస్త శాంతంగా మాట్లాడినంత మాత్రాన నీకు కూడా చులకన అయిపోయినా నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకోరా? నేను అరిస్తేనే మీకు అర్థమవుతుందా? అంటూ కేకలు వేస్తాడు చక్రపాణి.
మరోవైపు గదిలో ఉన్న వసు తన బ్యాగ్ లో జగతి ఇచ్చిన గిఫ్ట్ ని చూస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అందులో నల్లపూసలు చూసి సంతోషంతో ఆశ్చర్య పోతుంది. వాటిని కళ్ళు కద్దుకొని మేడం ఇది మీ ఆశీర్వాదమే కాదు ఆ దేవుడు నిర్ణయం కూడా అనుకుంటుంది. తండ్రి కేకలు విని కంగారుగా తలగడ కింద పెట్టేస్తుంది. ఈలోపు చక్రపాణి తన సంగతి తేలుస్తాను అంటూ వసు రూమ్ కి వస్తాడు. ఏంటి పెళ్లి కోసం మీ అమ్మని రాయబారానికి పంపించావా అంటాడు చక్రపాణి.
వసు మీద కేకలు వేస్తున్న చక్రపాణి..
రాయబారాలు యుద్ధాల్లో చేస్తారు బంధాల్లో కాదు అంటుంది వసు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, నేను చెప్పినట్లే జరగాలి లేకపోతే దాన్ని చావమను అంటాడు చక్రపాణి. బంధాలు విలువ మీకు తెలిస్తే ఇలా మాట్లాడరు అంటుంది వసు. కూతురు మీద కేకలు వేస్తున్న భర్తని వారిస్తుంది సుమిత్ర. నన్ను ఆపుతావేమీ అది ఎలాగో మాట్లాడుతుందో చూసావా అంటాడు చక్రపాణి. అంతలోనే జగతి ఫోన్ చేస్తుంది. వసు చేతిలో ఆ ఫోన్ లాక్కొని ఈ మహాతల్లెనా నీకు ఫోన్ చేస్తుంది ఇంకా నిన్ను వదల్లేదా అంటూ కోపంగా అరుస్తాడు చక్రపాణి.
నీకు ఇంత సాయం చేసిన ఈ గొప్ప మనిషికి నేను థాంక్స్ చెప్పుకోవాలి అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చక్రపాణి. ఫోను లిఫ్ట్ చేసింది వసు అనుకొని అక్కడంతా ఓకేనా అని అడుగుతుంది జగతి. అమ్మ టీచర్ అమ్మ నేనే చక్రపాణిని, చేతకాని చక్రపాణిని అంటూ కోపంగా మాట్లాడుతాడు చక్రపాణి. తండ్రి దగ్గర నుంచి ఫోన్ లాక్కోబోతుంది వసు అయినా వినిపించుకోకుండా చక్రపాణి. మీ అమ్మాయి చాలా ఎత్తుకి ఎదిగింది అండి గొప్ప విజయాన్ని సాధించింది అంటుంది జగతి.
జగతి మీద విరుచుకుపడుతున్న చక్రపాణి..
అవును మహాబాగా విజయం సాధించింది అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటుంది అంటూ అరుస్తాడు చక్రపాణి. తను యూనివర్సిటీ టాపర్ అయిందండి అంటుంది జగతి. కానీ నా పరువు పోయిందండి మీరు తెచ్చి ఇస్తారా? చక్రపాణి శుద్ధ వెధవ అంటూ టాప్ లేచిపోయినట్లు ఊరంతా మొహం మీద పూసేస్తున్నారు. జరిగిన దాన్ని మర్చిపోండి అంటుంది జగతి. మరిచిపోయేంత చిన్నది కాదు మీరు చేసిన నిర్వాకం, ఎవరినో పెళ్లి చేసుకుంటానంటూ ఇది మళ్ళీ మా ముందుకు వచ్చింది.
Guppedantha Manasu December 30 Today Episode:
ఎవడో అడ్రస్ లేని వెధవని పెళ్లి చేసుకుంటుంది అంట అని చక్రపాణి అంటే వాడు అడ్రస్ లేని వాడు కాదు నా కొడుకు, డి బి ఎస్ టి కాలేజ్ ఎండి అంటుంది జగతి. ఆ మాటలకి షాక్ అవుతాడు చక్రపాణి. వాడు నీ కొడుకా ఏం స్కెచ్ చేసావు టీచరమ్మ, నీ మొగుడెవరో నీ సొంత ఊరు ఏదో నీ సంసారం ఏంటో తెలియదు. ఇప్పుడొచ్చి ఎవర్నో నీ కొడుకు అని చెప్తే నా కూతుర్ని ఇచ్చి వాడితో పెళ్లి చేయాలా,నా కూతురు గొంతు కోయాలి అని చూస్తున్నావా అంటూ అరుస్తాడు చక్రపాణి. మర్యాదగా మాట్లాడు నాన్న అంటుంది వసు.
నువ్వేంటే నాకు చెప్పేది అంటాడు చక్రపాణి. మాటలు మర్యాదగా రానివ్వండి చక్రపాణి గారు రిషి నా కన్న కొడుకు అంటుంది జగతి. అయితే అస్సలు ఒప్పుకోను అంటాడు చక్రపాణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.