Guppedantha Manasu December 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అసహ్యంగా మాట్లాడుతున్న చక్రపాణి ని మాటలు జాగ్రత్తగా రానివ్వమంటుంది జగతి. రిషి నా కొడుకు అని చెప్తుంది. అయితే అసలు పెళ్లి జరగదు. నీ ట్రైనింగ్ లోనే నా కూతురు పెళ్లి పీటలు మెంతులు ఇచ్చి పోయింది ఇప్పుడు నీ కోడలైతే నా కుటుంబం అంతా ఊరేసుకు చచ్చేలాగా చేస్తుంది. ఒకసారి నా మాట వినండి జగతి ఎంత చెప్పినా వినిపించుకోడు.
కూతుర్ని గదిలో బంధించిన చక్రపాణి..
నీ పాదాలకి నమస్కారం పెట్టుకుంటాను నన్ను నా కూతుర్ని, నా కుటుంబాన్ని వదిలిపెట్టు అంటూ ఫోన్ పెట్టేస్తాడు చక్రపాణి.తండ్రి దగ్గర ఫోన్ లాక్కుంటూ ఏంటి నీ ప్రాబ్లం నా పెళ్లి నా ఇష్టం అంటుంది వసు. నీ పెళ్లి నేను చేస్తాను అంటూ ఆమెని ఆ గదిలోనే వదిలేసి బయటికి వెళ్లి తలుపేసేస్తాడు చక్రపాణి. వసు ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోడు. బయటికి వచ్చిన చక్రపాణి ఆ తలుపు తీసినా,ఈ ఫోన్ ఆమెకి ఇచ్చినా నీ మెడలో తాళి తెగుతుంది సుమిత్ర.
నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అంటూ విషాన్ని చేత్తో పట్టుకొని భార్యని బెదిరిస్తాడు చక్రపాణి. భర్త ప్రవర్తనకి నెత్తి కొట్టుకుని ఏడుస్తుంది సుమిత్ర. మరోవైపు రాజీవ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు చక్రపాణి. మీరేం కంగారు పడకండి, మీకోసం ఈ రాజీవ్ ఉన్నాడు, నేను మీ అల్లుడినే కాదు మీ పరువు ని కాపాడే వాచ్మెన్ ని. పరువు మీది పోయిన నాది పోయినా ఒకటే మీలాంటి మావయ్య గారు నాకు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటాను మీరు ఏమి టెన్షన్ పడకండి అంటాడు రాజీవ్.
రాజీవ్ ని కలవాలనుకుంటున్న చక్రపాణి..
నీట ముంచినా,పాలమంచినా ముంచిన భారం మీదే, నా పరువు ని మీరే కాపాడాలి అయినా మీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకొనే టైం దగ్గరకొచ్చింది మనిద్దరం కలవాలి అంటాడు చక్రపాణి. మీ పాదాల దగ్గర కూర్చొని సేవ చేసుకోవడం నా భాగ్యం అనుకుంటాను అలాంటిది మీ పరువు పోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మనం తప్పకుండా కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాజీవ్.
మరోవైపు చక్రపాణి మాట్లాడిన మాటలన్నీ భర్తతో చెప్పి నాకు చాలా కంగారుగా ఉంది మహేంద్ర అంటుంది జగతి. ఈ విషయాన్ని మనం రిషికి చెబుదామా అంటాడు మహేంద్ర. అలా చెప్తే రిషి తొందరపడి ఒక మాట అంటే అది రిషి, వసుల బంధానికి ప్రమాదం అవుతుంది జగతి. రిషికి చెప్పకుండా మనం ఇక్కడే కూర్చుంటే సమస్య ఎలా తీరుతుంది అంటాడు మహేంద్ర. అందుకే మనం వెళ్దాం అంటుంది జగతి. మనం ఒక్కరిమే ఎలా వెళ్తాం అందరం కలిసి వెళ్దామని కదా అనుకున్నాం అంటాడు మహేంద్ర.
దేవయానిని మోసం చేయాలనుకుంటున్న జగతి దంపతులు..
కరెక్టే కానీ ముందు మనం వెళ్లి అక్కడ అన్ని సర్దుబాటు చేద్దాం లేదంటే చక్రపాణి గారి కోపాన్ని అక్కయ్య గారు తనకి అనుకూలంగా మార్చుకుంటారు. వదిన గారికి తెలియకుండా ఎలా వెళ్దాం అంటాడు మహేంద్ర. ఏదో ఒకటి చెప్పి ఇంట్లోంచి బయటపడదాం, ఇది తప్ప మనకి వేరే దారి లేదు అంటుంది జగతి. వాళ్లని ఇక్కడే ఉండేలా చూడడం చాలా ముఖ్యం అంటుంది జగతి.
ఈ మాటలన్నీ విన్న వసుంధర ఎంత ప్లాన్ వేసావు, నేను ఇక్కడే ఉన్నా కూడా పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకోగలను అనుకుంటూ రాజీవ్ కి ఫోన్ చేస్తుంది దేవయాని. జగతి వాళ్లకి మీ మామగారు ఈ పెళ్లి చేయరని అనుమానం వచ్చినట్లు ఉంది, ఈ విషయం రిషికి చెప్తే రిషి డిస్టర్బ్ అవుతాడని రిషికి చెప్పకుండా అక్కడికి వస్తున్నారు అంటుంది దేవయాని. వచ్చి మాత్రం ఏం చేస్తారు అంటాడు రాజీవ్. రిషి డిస్టర్బ్ కాకుండా ఈ సంబంధం కలవాలని వీళ్ళ ప్లాన్ అంటుంది దేవయాని.
రాజీవ్ ని అలెర్ట్ చేసిన దేవయాని..
రిషి ని డిస్టర్బ్ చేయడం చాలా ఈజీ అంటాడు చక్రపాణి. సరే మాటలు తగ్గించి చెప్పిన పని చెయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది దేవయాని. అంతలో కామ్ గా బయటికి వెళ్ళబోతున్న మహేంద్ర దంపతుల్ని గుమ్మంలోని అడ్డగించి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దేవయాని. అలా బయటకు వెళ్తున్నాం అంటాడు మహేంద్ర. అదేంటి మనం పసివాళ్ళు ఊరు వెళ్ళాలి కదా అంటుంది దేవయాని. అక్కడికి వెళ్లడానికి సామాన్లు కోసమే వెళ్తున్నాం అంటాడు మహేంద్ర.
నన్ను కూడా రమ్మంటారా అంటుంది దేవయాని. ఆ మార్కెట్లో మీరు తిరగలేరు అంటాడు మహేంద్ర. వద్దులెండి మీరిద్దరూ సరదాగా వెళ్ళిరండి అంటూ ఇవ్వాలని పంపిస్తుంది దేవయాని. మరోవైపు తలుపు తీయమంటూ తల్లిని బ్రతిమిలాడుతుంది వసు. మీ నాన్న ఏమన్నారు విన్నావు కదా అంటూ ఏడుస్తూ చెప్తుంది సుమిత్ర. నాన్న బెదిరింపులకి భయపడుతున్నావా ఆయన అలా ఏమీ చేయరు అంటుంది వసు.
కూతురికి సాయం చేయలేనంటున్న సుమిత్ర..
నేను ఆయన మాటని జవదాటలేను అని తల్లి అంటే నన్ను ఇలా గదిలో పెట్టారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారమ్మా ఆలోచించు అంటుంది వసు. నేను తీయలేను పదేపదే నన్ను అడక్కు, నావల్ల కాదు అంటుంది సుమిత్ర. కనీసం ఆ ఫోన్ అయినా ఇవ్వు నాన్న వస్తే మళ్లీ నేను బయటికి వెళ్ళలేను అంటుంది వసు. కానీ ఫోన్ తీసి కూతురికి ఇచ్చే లోపుగా చక్రపాణి ఇంటికి వస్తాడు. అమ్మ మీ నాన్న వచ్చారు ఇంకేమీ మాట్లాడొద్దు అంటుంది సుమిత్ర. ఇంటికి వచ్చిన చక్రపాణి తలుపు తీస్తావా అని అడుగుతాడు.
తీయను అని సుమిత్రా అంటే తీస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నేను చేతల మనిషిని, అందుకే ఈ విషం బాటిల్ నాతోనే తిప్పుకుంటున్నాను అంటాడు చక్రపాణి. భర్త తెచ్చిన పూలను చూసి ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది సుమిత్ర. రాజీవ్ కి వసుకి పెళ్లి చేస్తున్నాను అంటూ భార్యకి కూతురికి షాక్ ఇస్తాడు చక్రపాణి. నేను రిషి సార్ ని పెళ్లి చేసుకుంటాను అంటూ ఏడుస్తూ చెప్తుంది వసు. నేను చెప్పిందే జరగాలి లేదంటే ఈ విషయం తాగి చస్తాను అంటూ భార్యని బెదిరించి వెళ్ళిపోతాడు చక్రపాణి.
తండ్రిని బ్రతిమాలుతున్న వసు..
నాన్న ఇది అన్యాయం అమ్మ తలుపు తీయమ్మ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వసు. అంతలోనే జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లను చూసి కంగారు పడిపోతుంది వసు. నాన్న ఏం చేస్తున్నావ్, నువ్వైనా చెప్పమ్మా చూస్తూ ఊరుకుంటావెంటమ్మ నీకు బాధ్యత లేదా అంటుంది వసు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ తండ్రిని నిలదీస్తుంది వసు. ఏడుస్తూ కూర్చున్నా భార్యని ఇది పెళ్లి జరగబోయే ఇల్లు చావు ఇల్లు కాదు అలా విగ్రహాం లా కూర్చోపోతే వచ్చి సాయం చేయొచ్చు కదా అంటాడు చక్రపాణి.
కూతురికి ఇష్టం లేని పెళ్లి చేయటం అవసరమా, నీకు దండం పెడతాను ఇంకొకసారి ఆలోచించండి అంటుంది సుమిత్ర. సలహాలు ఇవ్వకు, ఈ చక్రపాణి పరువు ప్రతిష్టలు లేకపోతే చచ్చిపోతాడు, ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడాలంటే ఈ మిషన్ తాగి చచ్చిపోతాను అంటూ భార్యని బెదిరిస్తాడు చక్రపాణి. అమ్మ, నాన్న అలాగే అంటాడు నువ్వు ఏమీ భయపడొద్దు తలుపు తియ్యి అంటుంది వసు. నా సంగతి నీకు తెలుసు కదా పరువు కోసం చావనైనా చస్తాను అంటాడు చక్రపాణి.
నువ్వు వద్దన్నా మీ ఇంటికి వస్తానంటున్న రిషి..
అంతలోనే ఫోన్ వస్తుంది వసుకి, అమ్మ నీకు దండం పెడతాను ఆ ఫోన్ నాకు ఇవ్వమ్మా అంటుంది వసు. ఇచ్చావంటే చస్తాను అంటాడు చక్రపాణి. మళ్లీ వసు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చెయ్ అంటాడు చక్రపాణి. సుమిత్ర ఆ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెడుతుంది. ఫోన్ చేసిన రిషి ఏమైంది వసు నువ్వు ఫోన్ చేయవు, నేను చేస్తే ఎత్తవు. మీ బావ వచ్చి నీకు తనకి పెళ్లి అంటున్నాడు ఏంటి ఈ న్యూసెన్స్. నేను వస్తున్నాను మీ బావ ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతాడు.
Guppedantha Manasu December 31 Today Episode:
ఎవరికోసం ఎదురు చూడొద్దు, నువ్వు వద్దన్నా నేను మీ ఇంటికి వస్తాను నువ్వేమీ కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేసి వసు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రిషి. మాటలకి కంగారు పడతాడు చక్రపాణి. అంతలోనే పూజారిని తీసుకొని వస్తాడు రాజీవ్. అక్కడ పెళ్లి ఏర్పాట్లును చూసి మీరు ఒక్కరే ఇంత కష్టపడుతున్నారు మీ కాళ్లు నేను కడిగి తీర్థం తీసుకోవాలి అంటాడు రాజీవ్. మీరు నా కాళ్లు కడగడం ఏంటి అల్లుడు గారు నేనే మీకు కన్యాదానం చేస్తాను అంటాడు చక్రపాణి.
పెళ్లి అన్నారు ఇంట్లో ముగ్గురే ఉన్నారేంటి అంటారు పంతులుగారు. అనుకోకుండా జరుగుతున్న పెళ్లి గంటన్నరలో ముహూర్తం ఉంది అన్నారు కదా ఆ ముహూర్తానికి ఆ అమ్మాయికి,నాకు పెళ్లి. అక్కలేని విషయాలు మీరు పట్టించుకోకండి అంటాడు రాజీవ్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.