Guppedantha Manasu: అనుకోని కారణాల వలన ప్రేమికురాలికి దూరమై మదన పడుతున్న కొడుకు నిజం తెలుసుకోవాలని, అతని భవిష్యత్తు బాగుండాలని తపన పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ గుప్పెడంత మనసు.

కాలేజీకి వచ్చిన రిషి,వసు ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కాలేజీకి వస్తుందా, తన మెడలో రాజీవ్ కాకపోతే మరి ఎవరు తాళికట్టు ఉంటారు అని ఆలోచనలో పడతాడు. కాలేజీకి వచ్చావా జరిగిన గొడవకి డిస్టర్బ్ అవ్వలేదా అని మెసేజ్ పెడతాడు. ఎవరో డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవ్వను అని రిప్లై ఇస్తుంది వసు. వాళ్ళిద్దర్నీ అలా చూసిన జగతి దంపతులు ఆశ్చర్యపోతారు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ అర్థం కారు అని మహేంద్ర అంటే అలా అర్థమైతే వాళ్ళు రిషి, వసు లు ఎందుకు అవుతారు అంటుంది జగతి.

మరోవైపు జగతి, వసు తో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి రిషి ఆశ్చర్యపోతాడు. తను మీకు ఏమైనా చెప్పిందా అంటే ఏమి చెప్పలేదు అంటుంది జగతి. వీళ్ళిద్దరిని కలపటానికి నేను ఒక ప్లాన్ వేసాను అని మహేంద్ర అంటే నీ ప్లాన్స్ మాక్సిమం వర్క్ అవ్వవు అంటూ ఆట పట్టిస్తుంది జగతి. మినిస్టర్ దగ్గరికి వెళ్లి తన ప్రపోజల్ చెప్తారు జగతి దంపతులు. మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు నీ మీద నాకు నమ్మకం ఉంది అంటాడు మినిస్టర్. వసు మెడలో తాళి ఎవరు కట్టారో తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటాడు రిషి.

అది అర్థం చేసుకున్న వసు తన నోటితో నిజం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంటూ ఉంటుంది. మరోవైపు రాజీవ్ అనవసరంగా పట్టుబడిపోయాడు వాడే ఉంటే వాడిని అడ్డం పెట్టుకొని వసుని ఒక ఆట ఆడించేదాన్ని అనుకుంటుంది దేవయాని. ఇదేమీ పట్టించుకోని ధరణి స్వీట్ చేశాను తినండి అంటూ దేవయాని దగ్గరికి వస్తుంది. నువ్వు నన్ను హింసించడానికి పుట్టావు అంటూ కసురుకుంటుంది దేవయాని. మరోవైపు మహేంద్రవాళ్లు దేవయానికి ఫోన్ చేసి మేము బయటకు వెళ్తున్నాము వివరాలు అట్నుంచి వచ్చాక చెప్తాము అని ఫోన్ పెట్టేస్తారు.

ఎక్కడికి వెళ్తున్నారు చెప్పటం లేదు దీనిలో ఏమైనా మట్ల బాగుందా అంటూ ఆలోచనలో పడుతుంది దేవయాని. రిషి, వసు మెడలో తాళి ఎవరు కట్టారో తెలుసుకోవాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూ ఉంటాయి. మరోవైపు చక్రపాణి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ భార్యకి ఫోన్ చేసి చెప్తాడు. అంతలోనే జగతి దంపతులు రావడం చూసి ముందు షాక్ అయ్యి తర్వాత సంతోషపడతాడు. మీరు ఎందుకు వచ్చారు నేను ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదా అంటే మర్యాదగా అడుగుతాడు. కాసేపు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్న తర్వాత మేము ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము మీరు సహకరిస్తే చాలు అంటుంది జగతి.

వాళ్ళిద్దరూ పొడిపొడిగా మాట్లాడుకుంటున్నారు అందుకే టూర్ ప్లాన్ చేసి వాళ్ళిద్దర్నీ మాత్రమే తూర్పు పంపే లాగా ప్లాన్ చేస్తున్నాను వివరాలన్నీ తర్వాత చెప్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు జగతి దంపతులు. రాకరాక మా ఇంటికి వచ్చారు ఏమైనా తిని వెళ్ళండి అంటే మర్యాద చేసే రోజులు ముందు ఉన్నాయి అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతారు జగతి దంపతులు. దారిలో ఉన్న వసుని తను కారులో ఎక్కించుకొని ఆమె రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు కూడా ఆమె భర్త ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ విఫలమవుతాడు.

మరోవైపు ఎడ్యుకేషన్ టూర్ గురించి అక్కడ పిల్లలకి ఇవ్వాల్సిన కిట్స్ గురించి చెప్తారు జగతి దంపతులు. దాని గురించి నన్ను అడగడం దేనికి వెళ్లండి అంటాడు రిషి. వెళ్ళేది మేం కాదు మీరే అంటూ మనసులో అనుకుంటారు జగతి దంపతులు. మరోవైపు బస్సు దగ్గరికి వచ్చిన చక్రపాణి మీ ఇద్దరూ మళ్లీ దగ్గరవుతారు అనిపిస్తుంది అంటూ చాలా ఆనందపడతాడు కానీ జగతి వాళ్ళు వచ్చిన విషయం చెప్పడు. వాళ్ల ఇద్దరు బాధని చందమామతో చెప్పుకుంటారు రిషి, వసు. మరోవైపు కరెక్ట్ గా బయలుదేరే సమయానికి రిషికి కడుపునొప్పి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాడు.

అయినా బయలుదేరి పోతుంటే మీరు ఎక్కడికి వెళ్తారు నేను వెళ్తాను లెండి అంటూ జగతికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు జగతి వాళ్ళు రాకపోవడంతో వాళ్ల కోసం వెయిట్ చేస్తున్న వసు జగతి వాళ్ళకి ఫోన్ చేస్తుంది కానీ వాళ్ళు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయరు. మరోవైపు కారులో వెళ్తున్న రిషి ఇప్పుడు నేను వసు తో ప్రయాణం చేయాలా ఒకప్పుడు అయితే ఆనందంగా ఉండేది కానీ ఇప్పుడు బాధగా అనిపిస్తుంది ఈ ప్రయాణంలోనైనా తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు రిషి. జగతి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రిషికి ఫోన్ చేస్తుంది వసు.

అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన రిషి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. టైం అవుతుంది జగతి మేడం వాళ్ళు రాలేదు అందుకే ఫోన్ చేశాను అని రిప్లై ఇస్తుంది వసు. అసలు విషయం చెప్పి వాళ్ళు టూర్ కి రారు మనమే వెళ్ళాలి అంటాడు రిషి. సరే అంటూ రిషి కార్లో కూర్చుంటుంది వసు. కోపంగా ఉన్న రిషి మొహాన్ని చూసి కాస్త నవ్వొచ్చు కదా అంటుంది. నా మొహం నా ఇష్టం అయినా ఏడిపించే వాళ్ళు ఏడిపిస్టునే ఉన్నారు అంటాడు రిషి. నిజాన్ని ఎన్నాళ్ళు దాస్తావు అని ఇన్ డైరెక్ట్ గా అడిగితే ఎన్నాళ్ళు దాగితే అన్నాడు దాగుతుంది అయినా నిజం తెలుసుకోలేను అని మీకు అనిపిస్తుందా అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది వసు.

మనం ఎన్నిసార్లు కలిసి ప్రయాణం చేశాను కదా ఒకసారి కూడా అతను ఫోన్ చేయలేదు ఏంటి అంటే సమయపాలన ఎప్పుడు పడితే అప్పుడు చేయరు అని చెప్తుంది వసు. కాఫీ తాగుతున్న వాసుని తాగనీయకుండా కారుని కుదుపులకి గురి చేస్తాడు. మీరు కావాలనే చేస్తున్నారు సార్ అని వసు అంటే రోడ్డు గుంతలుగా ఉంది నేనేం చేసేది అంటాడు. కారు తీసి పక్కకి ఆపితే ఇద్దరూ కలిపి కాఫీ తాగుతారు. వసు,రిషిని ఎండి గారు అంటే మాటిమాటికీ అలా పిలవకు అంటాడు రిషి. గవర్నమెంట్ స్కూల్లో కిట్స్ పంచి బాగా చదువుకోవాలని ఉన్నత విద్యకు అవసరమైన అన్ని సదుపాయాలు డీబీఎస్డీ కాలేజీ అందిస్తుందని అక్కడ పిల్లలకి చెప్తారు రిషి వాళ్ళు.

అందరూ స్వార్థంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో మా పిల్లల కోసం నిస్వార్ధంగా ఆలోచిస్తున్నారు అంటూ ఆ వ్యక్తి వాళ్ళిద్దర్నీ భోజనానికి పిలుస్తాడు. తర్వాత వస్తాము అంటే వినిపించుకోడు ఆ వ్యక్తి. మరోవైపు వాళ్ళింటికి భోజనానికి వెళ్తే అక్కడ రాగి ముద్ద వడ్డిస్తారు. అది ఎలా తినాలో విడమరిచి చెప్తుంది వసు. ఇప్పుడు నువ్వు దాని కోసం నాకు క్లాస్ పీకొద్దు అంటూ చిరాకు పడతాడు రిషి. వాళ్ళిద్దర్నీ భార్యాభర్తలు అనుకొని చిలకా గోరింక లాగా ఉన్నారు అంటుంది ఆ ఇంటావిడ. వసు రిషి ని సార్,సార్ అని పిలుస్తుంటే అలా పిలుస్తున్నారు ఏంటి మేమైతే పెనిమిటి, ఏమయ్యో ఇలా పిలుస్తాము అంటుంది.

మనం ఇద్దరమే భార్యాభర్తలం కాదని చెప్పు అని రిషి అంటే మీరే చెప్పండి నాకేం బాధ అంటుంది వసు. వాళ్లు వెళ్లిపోతుంటే వచ్చే సంవత్సరం పాపతో రండి అని చెప్తాడు ఆ వ్యక్తి. కారులో సీరియస్ గా ఉన్న రిషి ని చూసి ఆ వ్యక్తి అన్నమాటలకి రి ఫిషర్ కి కోపంగా ఉన్నట్లుంది ఇప్పుడు మాట్లాడకుండా ఉండడమే మంచిది అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది వసు. ఎంత ప్రశాంతంగా ఎలా పడుకుంటుంది అని కుళ్ళుకున్న రిషి కారుని కావాలనే కుదుపులతో నడిపిస్తాడు. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అని వసు అంటే ఏమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను అంటూ తింగరిగా సమాధానం చెప్తాడు రిషి. నన్ను పొగరు అని పిలుస్తారు కానీ దీనికే చెప్పలేనంత పొగరు ఉంది కానీ ఒప్పుకోరు అనుకుంటుంది వసు.

ఇంతలో మినిస్టర్ ఫోన్ చేసి మీ టూర్ బాగా అయిందా అని ఎంక్వయిరీ చేసి తన్ని వచ్చి కలవమంటాడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే అతను ఎడ్యుకేషన్ టూర్ గురించి కనుక్కొని నీకు పెళ్లి అయిన విషయం నాకు లేటుగా తెలిసింది అంటూ చేరని ప్రజెంట్ చేస్తాడు. నా పెళ్ళికి వచ్చిన అపురూపమైన కానుక అంటుంది వసు. ఇంతకీ మీ వారు ఏం చేస్తూ ఉంటారు రిషి సార్ కి అతన్ని పరిచయం చేసావా అని అడుగుతాడు మినిస్టర్. వసు రిప్లై ఇస్తే తెలుసుకోవాలనుకుంటాడు రిషి కానీ అక్కడ కూడా తెలివిగా తప్పించుకుంటుంది వసు. నీ మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పు అంటూ రిషి నిలదీస్తే మీరు ప్రేమగా అడిగితే చెప్పేదాన్ని కానీ ఇలా అడిగితే అస్సలు చెప్పను అంటూ అతనికి కోపం తెప్పిస్తుంది వసు. టూర్ ముగించుకొని తండ్రి దగ్గరికి వస్తాడు రిషి. కడుపు నొప్పి ఎలా ఉంది అని అడిగితే అదంతా తర్వాత ముందు మీ ప్రయాణం ఎలా సాగింది వెళ్లిన పని పండ కాయ అని మహేంద్ర అడిగితే నేనేమైన టెండర్ వేయటానికి వెళ్ళానా, కిట్స్ పంచడానికి వెళ్ళాను వచ్చేసాను అని చెప్తాడు.

నేను అన్న మాటలకి వసు బాధపడుతుందేమో అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తాడు రిషి. మళ్లీ తిట్టడానికి ఫోన్ చేశారా అని వసు అడిగితే నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా అంటాడు రిషి. బాగున్నావా తిన్నావా అని అడగడానికి అయితే మాత్రం చేయలేదు కదా అని వసు అంటే నా లైఫ్ లోకి వచ్చావు, ఎన్నో జ్ఞాపకాలని ఇచ్చావు మళ్లీ అవన్నీ అబద్ధం అని తేల్చేసావు అదేంటి అని అడిగితే చెప్పుకోండి చూద్దాం, తెలుసుకోండి చూద్దాం అంటున్నావు జీవితం ఏమైనా పజిల్ అనుకుంటున్నావా అంటూ కేకలు వేస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను నిజం చెప్పిన నమ్మడు అని ఊరుకుంటుంది వసు.

మరోవైపు కడుపునొప్పి తగ్గిందా మళ్లీ ఎప్పుడు వస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. అదేమైనా చట్టం వచ్చినప్పుడు రావడానికి అని మహేంద్ర అంటే మీలాంటి వాళ్ళకి వస్తుంది నాకు విషయం అంత తెలుసు నేను దొంగ చాటుగా విన్నాను అని దేవయాని అంటే అవును నా ఇష్టం నటించాను ఏం చేస్తారు వెళ్లి చెప్తారా, చెప్పండి అప్పుడు నేను కూడా మీరు వేసిన వేషాలు, చేసిన రాజకీయాలు అన్ని రిషితో చెప్తాను అంటూ రివర్స్ అవుతాడు మహేంద్ర. అతని ప్రవర్తనకి షాక్ అయినా దేవయాని ఏం మాట్లాడాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆలోచనలో ఉన్న కూతురు దగ్గరికి వచ్చిన చక్రపాణి నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను రిషి సార్ కి వెళ్లి నిజం చెప్పేయమంటూ గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతాడు.

Guppedantha Manasuఈవారం సీరియల్ బాగుంది కానీ కథని త్వరగా ముందుకు తీసుకు వెళ్తే బాగున్ను అంటున్న ప్రేక్షకులు..

నిజం తెలియటం ఆలస్యమైన కొద్దీ మీ మధ్య దూరం పెరిగిపోతుంది అంటూ సలహా ఇస్తాడు. రిషి తనంతట తానుగా నిజం తెలుసుకుంటాడా? వసుయే స్వయంగా నిజాన్ని చెప్తుందా? వాళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారా ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.