Guppedantha Manasu : ఈగో లతో, సెల్ఫ్ రెస్పెక్ట్ లతో తప్పులు చేస్తూ, వాటిని సరిదిద్దుకోవటానికి మరిన్ని తప్పులు చేస్తూ, దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ మరింత దూరం అవుతున్న ఒక జంట కధ ఈ గుప్పెడంత మనసు. ఈవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
సార్ కి నా మీద అంతర్లీనంగా ప్రేమ ఉంది కానీ దాన్ని వ్యక్త పరచలేక ఇబ్బంది పడుతున్నారు అనుకుంటుంది వసు. రిషి కూడా నేను అన్న మాటలకి ఇతను బాధపడిందేమో, తను రావడం నాకు ఇష్టమే కానీ వచ్చిన సందర్భం కరెక్ట్ కాదు, అయినా వచ్చేముందు నాకు చెప్పాలి కదా అనుకుంటాడు రిషి. తెల్లారేసరికి జగతి, వసు కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు.
పలానా దగ్గరికి రండి అంటూ లొకేషన్ పంపిస్తుంది వసు. జగతి కూడా ధరణి తీసుకొని రండి అంటూ మెసేజ్ పెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ హోలీ ప్లాన్ చేస్తారు. అక్కడ హోలీని వసు రిషి బాగా ఎంజాయ్ చేస్తారు నీ ప్లాన్ వర్క్ అవుట్ అయింది అంటూ భార్యని మెచ్చుకుంటాడు మహేంద్ర. ధరణి ఆమె భర్త దగ్గర లేనందుకు బాధపడుతుంది.
మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ బయటికి చెప్పకుండా వెళ్ళిపోయారు నా పెద్దరికం తగ్గిపోతుంది అంటూ బాధ పడిపోతుంది దేవయాని. పెద్దరికం అన్ని చోట్ల పనికిరాదంటూ భార్యని మందలిస్తాడు ఫణీంద్ర. ఇంటికి వచ్చిన మహేంద్ర వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది దేవయాని. మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అన్యాయం అంటాడు ఫణీంద్ర.
ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను ఇదంతా నీ వల్లే అంటూ వసుకి థాంక్స్ చెప్తాడు రిషి. జగతి దంపతులు కూడా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంట్లో నేను తప్పితే అందరూ హ్యాపీగానే ఉన్నారు అని కుళ్ళుకుంటుంది దేవయాని. గదిలో ఉన్న రిషి దగ్గరికి వచ్చి సెలబ్రేషన్స్ కి నన్ను ఎందుకు పిలవలేదు వస్తే నేను కూడా మీ ఆనందాన్ని చూసేదాన్ని కదా అంటుంది దేవయాని.
కరెక్టే ఈ ఐడియా నాకెందుకు రాలేదు మనం తప్పు చేశాము ఈసారి ఈ సెలబ్రేషన్స్ జరిగిన పెద్దమ్మ నా పక్కన ఉండవలసిందే అంటూ ఆ బాధ్యతని వసుకి అప్పగిస్తాడు రిషి. మరోవైపు మనమందరమే హ్యాపీగానే ఉన్నాం కానీ ధరణి మేడమ్ ఒక్కరే అయిపోయారు వాళ్ళు హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది వసు. ఈమె అనవసరంగా శైలేంద్ర టాపిక్ తెచ్చింది అని తిట్టుకుంటుంది దేవయాని.
మరి రోజు ఉదయాన్నే ధరణి దగ్గరకు వెళ్లి అన్నయ్యని తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ ధరణికి ధైర్యం చెప్తాడు రిషి. మరోవైపు మహేంద్ర దంపతులు కూడా ధరణికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి బాధపడతారు నేను ఈ విషయం గురించి రిషిత మాట్లాడతాను అంటుంది జగతి. మరోవైపు దేవయాని సడన్గా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెడుతుంది.
కొత్తగా పెళ్లి అయిన దంపతులు ఇంట్లో పూజ చేస్తే మంచిది వీళ్ళకి ఆ ఈ బట్టలు ఇచ్చి రెడీ అవ్వమను అని జగతికి పురమాయిస్తుంది దేవయాని. ఈవిడ కావాలనే ఇదంతా చేస్తున్నారు అంటూ జరిగిన విషయాన్ని భర్తకి చెప్తుంది జగతి. ఇదంతా దేవయాని చేస్తుంది అని వసు కి చెప్పు రిషి అర్థం చేసుకుంటాడు అంటాడు మహేంద్ర. జగతి అలాగే చేస్తుంది.
సార్ నన్ను భార్యగా ఒప్పుకున్నారు కానీ ఆయన నా భర్త కాదంటా ఇప్పుడు ఈ బట్టలు కట్టుకోరేమో అంటూ భయపడుతుంది వసు. అలా ఏమి కాదు పెద్దమ్మ కట్టుకోమని చెప్తే రిషి ఏమి అనడం అయినా మీ సమస్యని మీరే పరిష్కరించుకోండి అంటూ రిషి దగ్గరికి వసుని పంపిస్తుంది జగతి. పైన గొడవలు జరుగుతాయని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది దేవయాని.
కానీ సాంప్రదాయ బట్టలలో దిగుతున్న రిషి,వసులని చూసి షాక్ అవుతుంది. వచ్చి పీటల మీద కూర్చోమంటే మేము పూజ చేయము డాడ్ వాళ్ళు చేస్తారు అంటూ పూజ చేయటానికి నిరాకరిస్తాడు రిషి. అందుకు కోపగించుకుంటుంది. దేవయాని. ఇలాంటి పనులు ఎప్పుడు చెప్పకుండా చేయకండి అంటూ పెద్దమ్మని మందలిస్తాడు రిషి. మరోవైపు పీటల మీద కూర్చోలేదు అంటే తన మనసులో నీకు ఎంత స్థానం ఉందో ఆలోచించుకో అంటూ వసుని రెచ్చగొడుతుంది దేవయాని.
పూజలో కూర్చోలేనంత మాత్రాన నేనంటే ఇష్టం లేనట్లు కాదు పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఆయనతోనే తిరుగుతున్నాను అంటూ దేవయానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది వసు. మరోవైపు రిషి గదిలోనికి వెళ్ళటానికి ఆలోచిస్తున్న వసుని ఆలోచిస్తే ఇక్కడే ఉంటావు అడుగు ముందుకు వేస్తే లోపలికి వెళ్తావు అంటూ బలవంతంగా రిషి గదిలోకి నెడుతుంది జగతి.
సడన్గా నిద్రలేచేసరికి తన గదిలో ఉన్న వసూలు చూసి షాక్ అవుతాడు కానీ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్లీ ఇతను మెడలో ఉన్న తాళిని చూసి మూడి అయిపోతాడు. నీ మెడలో ఉన్న విఆర్ అక్షరాలు లాగే పక్క పక్కనే ఉంటాం కానీ చాలా దూరంగా ఉంటాం అంటూ బాధగా చెప్తాడు రిషి. మరోవైపు మేడం అంటూ పిలుస్తున్న వసుని మందలిస్తుంది ధరణి.
వరుసలతో పిలిస్తే బంధాలు బలపడతాయి అంటుంది. మరోవైపు కాలేజీకి వెళ్తున్న వసు తనని లిఫ్ట్ అడుగుతుందేమో అనుకుంటాడు రిషి. ఆయనే లిఫ్ట్ ఇస్తారు అని వెయిట్ చేస్తుంది వసు. కోపంతో ఆమెకి లిఫ్ట్ ఇవ్వకుండానే కాలేజీకి వెళ్లిపోతాడు రిషి. కారులో వెళ్తున్న రిషి కి బైక్ ల మీద వెళ్తూ మహేంద్ర దంపతులు, వసు షాక్ ఇస్తారు. తనకి ఏం లిఫ్ట్ అడగడానికి అంత ఇబ్బందా, టు వీలర్ మీద రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటాడు రిషి.
మరోవైపు బైక్ మీద ఎందుకు వచ్చారు అంటూ నానా ప్రశ్నలు అడుగుతాడు అంటూ భయపడి కాలేజీకి రాకుండా బయటికి వెళ్లిపోతారు మహేంద్ర దంపతులు. వసుని తన కాబిన్ కి రమ్మని కబురు పెడతాడు రిషి. రిషి రూమ్ కి వెళ్తుంటే మధ్యలో జగతి ఎదురవుతుంది. సార్ రమ్మన్నారు అక్కడికి వెళ్తున్నాను అని జగతితో చెప్తుంది వసు. ఏమన్నా పట్టించుకోవద్దు అంటుంది జగతి.నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ ఆయన బాధపడుతున్నారు నేను దాన్ని భరించలేకపోతున్నాను అంటుంది వసు.
Guppedantha Manasu కథని మరీ ఎక్కువ సాగదీస్తున్నారంటూ అసహనానికి గురవుతున్న ప్రేక్షకులు..
అదే బంధంలో ఉన్న గొప్పతనం, నువ్వు తన మూడ్ ని కంట్రోల్ చేయగలవు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది జగతి. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నారు ఆయన కోపం పోతే ఆయనే నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటూ రిషి రూమ్ వైపు వెళుతుంది వసు.మరోవైపు ధరణి పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం చూడమంటుంది. ఆ ముహూర్తాలు దేనికోసం? రిషి వసుని ఎందుకు తన కాబిన్ కి రమ్మన్నాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.