Guppedantha Manasu February 11 Today Episode:ఈరోజు ఎపిసోడ్ లో రిషి వచ్చేసరికి మళ్ళీ కడుపునొప్పి వచ్చినట్టుగా టైప్ చేసి పడుకుంటాడు మహేంద్ర. ఎలా ఉంది కడుపు నొప్పి తగ్గిందా అని రిషి అడిగితే ముందు నీ సంగతి చెప్పు వెళ్లిన పని అయిందా? పండా,కాయ అని అడుగుతాడు మహేంద్ర. నేను టెండర్ వేయటానికి వెళ్ళానా అలా అడుగుతున్నారు వెళ్ళాము కిట్స్ పంచాము వచ్చేసాము అంతే అంటాడు రిషి.

మహేంద్ర ని ఇరికించేసిన ధరణి..

కడుపు నొప్పి ఎలా ఉంది అని రిషి అడిగితే ఇప్పుడు మేటరు నా కడుపు నొప్పి కాదు మీ ప్రయాణం బాగా అయిందా దారిలో ఏమైనా తిన్నారా అంటూ అడుగుతాడు మహేంద్ర. డాడీ ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు అంటూ జగతిని అడుగుతాడు రిషి. అప్పుడే గదిలోకి వచ్చిన ధరణిని కషాయం ఇచ్చావా వదిన అని అడుగుతాడు రిషి. ఇచ్చాను కానీ ఆయన తాగలేదు అంటూ ఇరికించేస్తుంది ధరణి. తాగకపోతే కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది అంటూ బలవంతంగా తాగించేస్తాడు రిషి.

తాగలేక ఇబ్బంది పడుతూ ఇందులో ఏం కలిపావు అని ధరణిని అడుగుతాడు మహేంద్ర. ఏం కలపాలో అన్ని బాగా తెలుసు గాని మీరు తాగండి అంటే బలవంతంగా తాగించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఏంటండీ మీ పుత్రరత్నం అడిగిందానికి ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పడు, తనకి ఆ వసుధారే కరెక్ట్ అంటాడు మహేంద్ర.నా కొడుకు బంగారం అని జగతి అంటే అవును ఆ బంగారానికి వసుధారే మెరుగుపెట్టాలి అంటాడు మహేంద్ర.

వసుకి ఫోన్ చేసిన రిషి..

వసు,రిషియే తన భర్త అని కచ్చితంగా నమ్ముతుంది కానీ రిషికి వసు మెడలో వేరెవరో తాళి కట్టారు అన్న విషయం ముళ్ళు లాగా గుచ్చుకుంటుంది అంటుంది జగతి. రిషి కి నిజం ఎలా తెలుస్తుంది అని మహేంద్ర అడిగితే వాళ్ల ప్రేమే వాళ్ళని గెలిపిస్తుంది, రిషి నిజం తెలుసుకొని రోజు తొందరలోనే రావాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం అంటుంది జగతి.

మరోవైపు ఆలోచనలో ఉన్న రిషి నేను అన్న మాటలకి తను ఫీల్ అయిందా అయినా తను వీలైనంతగా నేను ఏమీ మాట్లాడలేదు కదా అనుకుంటూ ఆమెకి ఫోన్ చేసి మళ్లీ కట్ చేసేస్తాడు. రిషి సార్ ఏంటి కొత్తగా మిస్డ్ కాల్ ఇస్తున్నారు అంటే కాల్ చేస్తే చెయ్యి లేకపోతే మానేయమని అతని ఉద్దేశ్యము నేను కూడా మిస్డ్ కాల్ ఇస్తాను అంటూ వసు కూడా మిస్డ్ కాల్ ఇస్తుంది. తను కూడా మిస్డ్ కాల్ ఇస్తుందా ఇలా చేయడం తప్పు కదా చేసేదంతా చేస్తుంది మళ్లీ నా మీద అలుగుతుంది.

వసుని నిలదీసిన రిషి..

నేను ఏదో అన్నాను అని అనుకుంటుంది కానీ నా మనసులో ఉన్న పెయిన్ తనకి అర్థం కావడం లేదు సరే నేనే ఫోన్ చేస్తాను పోయేదేముంది అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తాడు రిషి కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. ఆయనకి నామీద కోపం ఎక్కువ ఉంటే నాకు ఆయన మీద ప్రేమ ఎక్కువ నేను ఆయన మీద ఎక్కువగా మొండితనం చూపిస్తున్నానా, ఆయన చేసిన వరకూ ఆగటం ఎందుకు అంటూ వసు ఏ మళ్లీ ఫోన్ చేస్తుంది. మీరు మిస్డ్ కాల్ ఇస్తున్నారు ఏంటి అని వాసు అడిగితే సమాధానం గా నువ్వు కూడా మిస్డ్ కాల్ ఇచ్చావు కదా అంటాడు రిషి.

అయితే ఇప్పుడు ఏంటి నన్ను తిట్టడానికి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయాయా అంటుంది వసు. నిన్ను తిట్టడానికే ఫోన్ చేశాను అని నువ్వు ఫిక్స్ అయిపోయావా అంటాడు రిషి. మీ మాటల్ని మీరే గుర్తు చేసుకోండి నువ్వు తిన్నావా బాగున్నావా అని అడగడానికి అయితే ఫోన్ చేయలేదు కదా అంటుంది వసు. నేను తిట్టిన తిట్లు గురించే ఆలోచిస్తున్నావు కానీ దాని వెనుక ఉన్న బాధ గురించి ఆలోచించట్లేదు. నా జీవితంలోకి వచ్చి అందమైన జ్ఞాపకాలని మిగిల్చావు అవన్నీ అబద్ధం అని తేల్చేసావు అదేంటి అని అడిగితే చెప్పుకోండి చూద్దాం, తెలుసుకోండి చూద్దాం అంటావ్ ఏంటి జీవితం అంటే ఏమైనా పజిల్ అనుకుంటున్నావా అంటాడు రిషి.

నీతో నేనేం సరితూగుతాను అంటున్న రిషి..

నన్ను కూడా కాస్త మాట్లాడనివ్వండి అని వసు అంటే నీకు మాట్లాడ్డానికి ఛాన్స్ ఇస్తే ఏం మాట్లాడుతావో నాకు తెలుసు నీ అంత అందంగా మాట్లాడడం నాకు రాదు అంటాడు రిషి. నాకు బాగా బాధ్యత స్నేహము ఇలాంటివి మాత్రమే నాకు తెలుసు ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు అంటాడు. అంటే ఇవన్నీ నాకు తెలియదని ఉద్దేశం అని వసు అడిగితే అది నువ్వే ఆలోచించుకో నన్ను ఎందుకు అడగడం అని రిషి అంటాడు. నాకు పరీక్షలు పెడుతున్నారా అని వసు అడిగితే పరీక్షలు పెట్టడంలో నువ్వు టాపర్ వి యూత్ ఐకాన్ వి నీతో నేనేం సరితూగుతాను ఫోను ఆన్సర్ చేసినందుకు థాంక్స్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి.

ఈయనతో ఇదే బాధ నన్ను అసలు మాట్లాడనివ్వరు ఆయన నన్ను అన్ని మాటలు అన్నారు కదా ఆయనే నిజం తెలుసుకుంటారులే అయినా ఇప్పుడు నేను నిజం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఆయన లేరు అనుకుంటుంది వసు. మరోవైపు మహేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చిన దేవయాని నీ కడుపునొప్పి తగ్గిందా అని అడుగుతుంది. పర్వాలేదు అని మహేంద్ర కంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది దేవయాని.

జగతి దంపతులను నిలదీసిన దేవయాని..

అదేంటి అదేమైనా చెప్పి వస్తుందా అని మహేంద్ర అంటే నిజం కడుపునొప్పి అయితే చెప్పి రాదు కానీ అబద్ధం కడుపునొప్పి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది కదా మహేంద్ర, నాకు అంతా తెలుసు రిషి వసులు కలిసి టూర్ కి వెళ్లాలని మీరు నాటకం ఆడారు కదా అని దేవయాని అంటుంది. ఈ విషయం మీకు ఎలా తెలుసు కానీ జగతి అంటే మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అంటుంది దేవయాని. మీకు చాటుగా మాటలు వినటం ఇష్టమైన పని కదా అంటుంది జగతి.

మీరు చేసింది పెద్ద ఘనకార్యం అనుకుంటున్నారా, అయినా ప్లాన్ వేసి మరి వాళ్ళిద్దర్నీ టూర్ కి పంపించడం ఏంటి అంటూ నిలదీస్తుంది దేవయాని. అవును నాకు దొంగ కడుపునొప్పి వచ్చింది నేను నాటకమే ఆడాను దానివల్ల మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంటి, ఇన్నాళ్లు మీరేమీ నాటకాలు ఆడ లేదా, మీరేం చేయలేదా కాలేజీలో గూడచారు లను పెట్టి ఏవేవో చేశారు వాటి ముందు మా నాటకాలు ఎంత హనుమంతుడు ముందు కుప్పిగంతుల్లాంటిది అంటాడు మహేంద్ర.

దేవయానికి రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన మహేంద్ర..

ఏంటి మహేంద్ర రివర్స్ అవుతున్నావా చాలా ఎక్కువ చేస్తున్నావు పెళ్లి అయిపోయిన వసు వెంట రిషి ని పంపించడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరిద్దరూ రిషి జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ విషయాన్ని చెప్తే ఏమవుతుందో తెలుసా అంటూ నిలదీస్తుంది దేవయాని. తొందరగా చెప్పండి మీరు ఎప్పుడు చెప్తారా అని మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఫోన్ చేసి చెప్తారా లేకపోతే వచ్చాక చెప్తారా అంటూ ఫోన్ తీస్తుంది జగతి. అయితే మీరు కడుపు నొప్పి గురించి మాత్రమే చెప్తారు మేము ఎన్నాళ్ళు కడుపులో పెట్టుకున్నవన్నీ బయటికి తీస్తాం అంటుంది జగతి.

ఇదేదో బాగుంది అంటూ ప్రేమ అనే ముసుగులో మీరు రిషిని ఎన్నోసార్లు తప్పుతో పట్టించారు అవన్నీ రిషికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అప్పుడు మీ స్థానం ఏ లెవెల్లో తగ్గుతుందో మీ ఊహ కూడా అందదు ఈ కడుపు నొప్పి నాటకం కడుపు తీపి కోసం ఆడేమో మరి ఎందుకు ఆడేమో మాకు తెలుసు. జరిగింది ఇక్కడే మరిచిపోతే మీకు మంచిది నాకు మంచిది అయినా కూడా చెప్తాను అని అనిపిస్తే చెప్పండి అది మీ ఇష్టం అంటూ బెదిరిస్తాడు మహేంద్ర. ఆ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.

Guppedantha Manasu February 11 Today Episodeకూతురు గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్న చక్రపాణి..

అక్కయ్య అన్నంత పని చేసినా చేస్తారు వసుని ఈ విషయం గురించి గట్టిగా అడగాల్సిందే అంటూ ఒక నిర్ణయానికి వస్తుంది జగతి. మరోవైపు రిషి మాటల గురించి ఆలోచిస్తూ పాలన్నీ కిందన వంపేస్తుంది వసు. అది గమనించిన చక్రపాణి ఏం చేస్తున్నావు అంటూ ఆ పాలు అన్ని తుడుస్తాడు. ఈ పరధ్యానం ఏంటి నీ ఆలోచనల గురించి నాకు తెలుసు మనసులో ఇంత భారాన్ని పెట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు. నిజం తెలుసుకోలేక రిషి సార్ బాధపడటం నిజం చెప్పలేక నువ్వు బాధపడడం ఇదంతా ఎన్నాళ్ళు.

ఇదంతా చూస్తూ ఈ నాన్న తట్టుకోలేకపోతున్నాడు నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమాలుతాడు. అసలు విషయం తెలిస్తే రిషి సార్ ఎలా ఫీలవుతారు అని భయంగా ఉంది అంటుంది వసు. అతను చాలా మంచోడు నీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఒక మాట చెబుతాను నిజాన్ని మనసులో మోయడం చాలా కష్టం. మీ ఇద్దరి మధ్య దూరం పెరగకముందే నిజాన్ని చెప్పేయి అంటూ సలహా ఇస్తాడు చక్రపాణి.

నిజం చెప్పేస్తాను నాన్న మీరన్నట్లు ఈ భారాన్ని మనసులో మోయలేకపోతున్నాను. నిజాన్ని డిసీసర్ తనంతట తాను తెలుసుకుంటే ఊరటగా ఉంటుంది అనుకున్నాను అందుకే ఇంతవరకు ఆగాను కానీ ఇక ఊరుకోలేను నిజం చెప్పేస్తాను అంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 11, 2023 at 8:52 ఉద.