Guppedantha Manasu February 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో లైబ్రరీలో అనుకోకుండా వసు మెడలో ఉన్న తాళిలో తన రింగ్ చూస్తాడు రిషి. వసు కూడా అక్కడ అనుకోకుండా అతన్ని చూసి షాక్ అవుతుంది. రిషి, వసు దగ్గరికి వస్తే వసు అతన్ని పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోతుంది కానీ రిషి వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు. ఏంటి సార్ అని వసు అడిగితే ఆ వీఆర్ ఉంగరం అక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు రిషి.
కోపంగా వెళ్ళిపోయిన వసు..
ఈ ఉంగరం నా ఇష్టం లేకుండా నా మెడలోకి రాదు కదా అంటుంది వసు. ఇంకా ఏదో మాట్లాడే అంతలో లైబ్రరీయన్ వచ్చి మీరు ఎప్పటినుంచో అడుగుతున్న బుక్స్ వచ్చేసాయి అంటాడు. అదే అదనుగా వసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆటోలో వెళ్తున్న వసు రింగ్ చూసుకుంటూ ఇది నా ఇష్టప్రకారమే నా మెడలోకి వచ్చింది నా మెడలో ఎవరు కట్టారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ సరైన దిశలో ఆలోచించడం లేదు నేను నిజం చెప్పాలని పరోక్షంగా ఎంత ప్రయత్నించినా మీరు తెలుసుకోలేకపోతున్నారు.
మన మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోవాలని మీ కన్నా ఎక్కువగా నేను ప్రయత్నిస్తున్నాను కానీ మీరే అక్కర్లేని కోపంతో అడ్డుకట్ట వేస్తున్నారు. గదిలో కావలసిన వాళ్లు ఉన్నారు అంటే ఆ గదిలోకి వెళ్లారు అక్కడ అద్దంలో మీరే కదా ఉన్నారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నేను మిమ్మల్ని ఆట పట్టిస్తున్నానని అనుకున్నారా, అంతేకానీ వసుధారా ఇంకా మాట చెప్పింది ఎందుకు చెప్పిందో అని ఆలోచించడం లేదు.
రిషి మీద కోపంతో రగిలిపోతున్న వసు..
నా ప్రశ్నకి మీరే సమాధానం అని ఎప్పుడు తెలుసుకుంటారు. ఇంత స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కావట్లేదు నన్నేం చేయమంటారు. మిమ్మల్ని బాధ పెట్టే పని వసుధార ఎప్పుడు చేయదు, మిమ్మల్ని బాధ పెడుతుంది అని మీరు ఎందుకు అనుకున్నారు తను ఎప్పుడూ నన్ను బాధ పెట్టదు కదా అని మనసులో అనుకుని ఉండి ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు మీ అనుమానాలన్నీ వీడిపోయేవి. కానీ అలా చేయలేదు ఎందుకంటే మీరు రిసీంద్రభూషన్ కదా మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది ఒప్పుకోరు మీకు ఇగో ఎక్కువ, మీరు పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అనుకుంటారు ఇలా అయితే మీకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అనుకుంటుంది వసు.
ఇంతలోనే చక్రపాణి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే నాకు కొంచెం లేట్ అవుతుంది నాకోసం ఇబ్బంది పడకండి అంటుంది వసు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో వసు ఎప్పుడు మనశాంతిగా ఉంటుందో అనుకుంటాడు చక్రపాణి. అదే సమయంలో రిషి కూడా ఆలోచనలో పడతాడు. తను ఏం చేయాలనుకుంటుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటాడు. నా ఉంగరం తన మెడలో ఎందుకు ఉంది అంత అవసరం ఆమెకి ఏమి వచ్చింది, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కానీ ఏ ఒక్క దానికి ఆన్సర్ ఇవ్వదు నన్నే తెలుసుకోమంటూ పరీక్షలు పెడుతుంది.
తాడోపేడో తేల్చేయాలంటున్న రిషి..
అసలు తను ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అనుకుంటాడు. గదిలో కావలసిన వాళ్లు ఉన్నారు అంటూ నన్ను నాకే చూపిస్తుంది తన ఉద్దేశం ఏంటి కాలేజీ ఎండి గారు నాకు రెస్పెక్ట్ ఇస్తుందా నాకు అలాంటి రెస్పెక్ట్ అవసరం లేదు తను నాతో గేమ్స్ ఆడుతుంది అనుకుంటాడు రిషి. వసు తెలివైనది కావచ్చు యూనివర్సిటీ టాప్పర్ కావచ్చు కానీ నా లైఫ్ లోకి వచ్చి నా లైఫ్ నీ చిందర వందర చేసేసింది. నిజాలు చెప్పటానికి చాలా అవకాశాలు వచ్చాయి కానీ చెప్పలేదు.
నేను కోపంగా మాట్లాడితే మీరే నిజాలు తెలుసుకోండి అంటూ తెలివిగా మాట్లాడుతుంది ఇంక నాకు ఓపిక లేదు అటు ఇటు తేలు చేసుకుంటాను ఇంకా వేరే మార్గం లేదు అంటూ కోపంగా వసు ఇంటికి వెళ్తాడు రిషి. వసు ఇంటికి వచ్చిన రిషి తాడోపేడో తేల్చేయాలి అనుకుంటూ లోపలికి అడుగు పెడతాడు. అతన్ని చూసిన చక్రపాణి లోపలికి వచ్చి కూర్చోమంటాడు. వసూలు తెలవండి అని అంటే తను ఇంకా రాలేదు అంటాడు చక్రపాణి. ఇంకా ఎందుకు రాలేదు అని రిషి అడిగితే ఏమో సార్ తెలీదు అంటాడు చక్రపాణి.
చక్రపాణి కి బాధ్యత లేదంటున్న రిషి..
అదేంటి తను ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోరా మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ కేకలు వేస్తాడు రిషి. ఒకప్పుడు అడిగేవాడిని కానీ ఇప్పుడు అడగటం లేదు ఈ కాలం పిల్లల్ని అలా అడగలేము కదా అంటాడు చక్రపాణి. తను వచ్చేవరకు వెయిట్ చేస్తాను అని రిషి అంటే ఇక్కడ ఫ్యాన్ పనిచేయదు తన గదిలో కూర్చుందురు గాని రండి అంటాడు చక్రపాణి. గదిలోకి వచ్చిన రిషి ఇంతకుముందు వచ్చినప్పుడు వసుకి కావలసిన వాళ్లు అదే మీ అల్లుడుగారు ఉన్నారు అని చెప్పింది కానీ కనిపించడం లేదు ఏమి అంటాడు రిషి.
తను ఉంది అని చెప్పింది అంటే ఉన్నట్లే కదా సార్ అంటాడు చక్రపాణి. కానీ ఆరోజు ఎవరూ లేరు ఈరోజు ఎవరూ లేరు అంటాడు రిషి. తను అబద్ధం చెప్పదు ఉన్నారు అంటే ఉన్నట్లే కదా సార్ అంటాడు చక్రపాణి. ఆ మాటలకి తల పట్టుకుంటాడు రిషి. కొంచెం కాఫీ తెమ్మంటారా అని చక్రపాణి అడిగితే వద్దు అంటాడు రిషి. మీరు తాగకపోతే వసు ఒప్పుకోదు అంటూ కాఫీ తేడానికి వెళ్తాడు. అద్దంలో తనని తాను చూసుకొని చక్రపాణి మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు రిషి. అంతలో ఫ్యాన్ గాలికి వి ఆర్ అక్షరాలు రాసుకున్న కాగితాలన్నీ ఎగిరి పడతాయి.ఐ లవ్ యు ఎండి గారు ఇట్లు మీ పొగరు కానీ వాటి మీద రాసి ఉంటుంది.
Guppedantha Manasu February 16 Today Episodeమా మధ్యలోకి ఎవరూ రావద్దు అంటున్న రిషి..
అప్పుడు మళ్లీ తిరిగి తనని తాను అద్దంలో చూసుకొని ఏదో అర్థమైనట్లుగా నన్ను బాధ పెట్టి, నువ్వు బాధపడుతున్నావా ఎందుకిలా చేస్తున్నావు అంటూ పేపర్స్ అన్ని జాగ్రత్త చేస్తాడు. బయటికి వచ్చేస్తున్న రిషికి కాఫీ ఇస్తాడు చక్రపాణి. నాకు వద్దు నేను వెళ్తాను అంటాడు రిషి. వసుకి ఏమైనా చెప్పమంటారా అని అడిగితే మా ఇద్దరి మధ్య ఎవరు రావద్దు ఆ సమస్యని మేమే పరిష్కరించుకుంటాము అంటాడు రిషి.తను ఎక్కడ ఉందో అని చక్రపాణి అంటే తను ఎక్కడ ఉందో నాకు తెలుసు అంటూ చక్రపాణి కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.