Guppedantha Manasu February 22 Today Episode:ఈరోజు ఎపిసోడ్ లో రిషి కొత్తగా కనిపిస్తున్నాడు, పాపం వసుతో ఆడుకుంటున్నట్లుగా ఉన్నాడు అంటుంది జగతి. ఏమీ పర్వాలేదులే ఎన్నాళ్లు ఇత్తను ఆడుకుంది కదా ఇప్పుడు వీడి వంతు అంటాడు మహేంద్ర. సడన్ గా మీటింగు పెట్టారు ఎండి గారు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంటూ తడబడుతుండగా లాప్టాప్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు రిషి.

వసుని అప్రిషియేట్ చేస్తున్న కాలేజీ స్టాఫ్..

తన మెసేజ్లు చూస్తూ అలాగే మీటింగ్ కంప్లీట్ చేస్తుంది వసు. అందరూ చప్పట్లు కొడతారు. వసుధర చాలా బాగా చెప్పావు అంటూ మహేంద్ర, ఫణీంద్ర వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. మొత్తానికి జగతి స్టూడెంట్ వి అనిపించుకున్నావు అంటాడు ఫణీంద్ర. రిషి కూడా వసు కి కంగ్రాట్స్ చెప్తాడు. ఎం హెచ్ అంటే ఏంటి అని మహేంద్ర అడిగితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అంటాడు రిషి. షార్ట్కట్లో ఎం.హెచ్ అంటారు అంటాడు రిషి.

థాంక్యూ ఎండి గారు ఐడియా ఇచ్చినందుకు ఇంతకీ ఎం హెచ్ అంటే ఏంటో తెలుసుకున్నారా అంటుంది వసు. ఇప్పుడే చెప్పాను కదా మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని ఏ కాదా అని వెటకారంగా అడుగుతాడు. నవ్వుకుంటూ అక్కడ నుంచి వసు వెళ్ళిపోతే ఎం.హెచ్ అంటే మై హార్ట్ ఐ నో అనుకుంటాడు రిషి. మరోవైపు వసు ని పిలిచి చాలా బాగా మాట్లాడావు, వినటానికి సింపుల్ గా ఉన్న అవి చాలా గొప్ప విషయాలు అంటూ అప్రిషియేట్ చేస్తుంది జగతి. ఇందులో నా గొప్పతనం ఏముంది మేడం అంతా మీ అబ్బాయి గొప్పతనం అంటుంది వసు.

ఇదంతా మీ అబ్బాయి గొప్పతనం అంటున్న వసు..

అదేంటి చెప్పింది నువ్వే కదా అంటే ఐడియా ఇచ్చింది మీ అబ్బాయి అంటుంది వసు. మా అబ్బాయా మీ ఇండియా అంటూ నవ్వుతుంది జగతి. ఏమో మేడం ఆయన్ని అంచనా వేయటం చాలా కష్టం ముందు సడన్గా ఈ మీటింగు ఏర్పాటు చేసి టెన్షన్ పెట్టేసారు అంటుంది వసు. ఇంతకీ ఎమ్ హెచ్ అంటే ఏంటి అని జగతి అంటే ఏదో చెప్పబోతుంది వసు. అంతలోనే రిషి సౌజ్ఞ చేయటంతో ఆగిపోతుంది. ఇదేదో వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ లాగా ఉంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి.

మరోవైపు కార్ కీ కనపడకపోవడంతో వెతుకుతూ ఉంటాడు రిషి. నెలకటానికి కారు దగ్గరికి వస్తే అక్కడ కార్ కీ పట్టుకొని కార్లో కూర్చుంటుంది వసు. రిషి ని చూసిన వసు రండి వెళదాము అంటుంది. ఎక్కడికి అయినా కారు తాళ్ల తీసుకొని కారులో కూర్చోడం ఏంటి అంటాడు రిషి. కారులో కూర్చోవాలి అంటే కారు కీ ఉండాలి కదా మీరు వచ్చేవరకు కారు మీద కూర్చుంటే బాగోదు కదా అంటుంది వసు. ముందు కారు దిగు అను రిషి అంటే కుదరదు మీరు మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంటూ డిమాండ్ చేస్తుంది వసు.

రిషి ని ఓ ఆట ఆడుకుంటున్న వసు..

కారు లిఫ్ట్ కావాలంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు అంతేకానీ ఇలాగా డిమాండ్ చేయరు రేపటి రోజున కారు సీట్ల కూర్చొని నువ్వే నాకు లిఫ్ట్ ఇస్తావేమో అయినా కారు కీస్ ఎప్పుడు కొట్టేసావు అంటాడు రిషి. కొట్టేయడమేంటి తీసుకున్నాను అనాలి. అయినా మన వస్తువులు మనం తెచ్చుకుంటే దాన్ని తీసుకోవడం అంటారు వేరే వాళ్ళకి వస్తువులయితే తీసుకోవడం అంటారు అంటుంది వసు. టైం అవుతుంది రెండు సార్ అని వసు అంటే ఏంటి దబాఇస్తున్నావు అని అడుగుతాడు రిషి. మీకేం పోయింది ఇంటికి వెళ్ళగానే కాఫీ అంటే కానీ నాకు అలా కాదు కదా అన్ని పనులు నేనే చేసుకోవాలి త్వరగా రండి సార్ అంటూ డిమాండ్ చేస్తుంది.

పొగరు అనుకుంటూ కార్లో కూర్చుంటాడు రిషి. మరోవైపు చక్రపాణి ఇంటికి వచ్చిన దేవయాని ముగ్గురు పిల్లల తండ్రికి కనీస మర్యాద ఉండాలి కదా అంటుంది దేవయాని. రాగానే కాఫీ కావాలా అని అడిగాను కదా అంటాడు చక్రపాణి నేను దాని గురించి మాట్లాడట్లేదు మీ అమ్మాయిని మా రిషి మీదికి చూసి గలపడం గురించి మాట్లాడుతున్నాను అంటుంది దేవయాని. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయిన చక్రపాణి ఏం మాట్లాడుతున్నారు, చక్రపాణి అంటే ఒకప్పుడు భగభగ మండుపోయే సూర్యుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటాడు.

చక్రపాణి దెబ్బకి షాక్ అయిన దేవయాని..

అయితే ఏంటి నేను డాడీ అని రిషి పెంచి పెద్ద చేసిన పెద్దమ్మని అంటుంది దేవయాని. ఆ గౌరవంతోనే ఇంతవరకు మీతో మర్యాదగా మాట్లాడాను నా భాష నా మాట తీరు మీకు తెలియదు అంటాడు చక్రపాణి. ఏంటి బెదిరిస్తున్నావా నీ కూతుర్ని ఋషికి దూరంగా పెట్టు కావాలంటే ఎంతోకొంత డబ్బు పారేస్తాను అంటుంది దేవయాని. నీకు కంటికి ఎలా కనిపిస్తున్నాను కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నావా, పౌరుషంలో నేను ఎవరికి తీసుకొని అంటాడు చక్రపాణి.

అమ్మాయిని ఎరవేస్తున్నారు నీకేంటి పౌరుషం అని అంటే నోరు మూసుకోండి నా గురించి నీకు పూర్తిగా తెలియదు ముందు ఇకనుంచి వెళ్లిపోండి అంటాడు చక్రపాణి. మర్యాదగా మాట్లాడు అని దేవయాని అంటే మర్యాద గురించి మీరు మాట్లాడకండి మా ఇంటికి వచ్చారు కాబట్టి ఆలోచిస్తున్నాను. పాత చక్రపాణిని నిద్ర లేపకండి, నా ముందే నా కూతుర్ని అమ్మేసి మాటలు అంటుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకొకసారి మీ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే ఈ చక్రపాణి విశ్వరూపం చూస్తావు అంటూ రెచ్చిపోతాడు.

కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చిన రిషి..

వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు అనుకుంటుంది దేవయాని. అంతలోనే అక్కడికి వచ్చిన రిషి మీరెందుకు ఇక్కడికి వచ్చారు టుడే ఏదో గొడవ చేసే ఉంటారు అనుకుంటూ దేవయాని ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రిషి. ఆవిడ ఎందుకు వచ్చారు అని తండ్రిని అడుగుతుంది వసు. వదిలేయమ్మా ఆవిడ ఒక ప్రశ్న అడిగితే నేను 4 సమాధానాలు చెప్పాను అంతే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చక్రపాణి. ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏం ప్లాన్ వేసిందో ఏంటో అనుకుంటుంది వసు.

కారులో కూర్చున్న దేవయాని నేను అక్కడికి వెళ్ళినప్పుడే రిషి కావాలా అనవసరంగా దొరికిపోయాను ఇప్పుడు ఏమంటాడో ఏంటో అంటూ కంగారు పడుతుంది. ఇంతలో వసు, రిషి కి థాంక్యూ అని మెసేజ్ పెడుతుంది ఎందుకు అని రిషి అడిగితే అన్నింటికీ సార్, కలిసినప్పుడు చెప్తాను అంటుంది. మరి అప్పుడే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు మెసేజ్ పెట్టావు అంటాడు రిషి. మీకు నా మీద ఎప్పుడు కోపం తగ్గుతుంది అంటే ఎవరి మీద ఎవరికీ కోపం వస్తే ఏంటి ప్రయోజనం నా కోపానికి విలువ ఎక్కడ ఉంది అంటూ మెసేజ్ పెడతాడు రిషి. ఇంత పుల్లవిరుపుగా మాట్లాడుతున్నారు సార్ ని డైవర్ట్ చేయాలి అనుకుంటూ ఇంకేంటి సంగతులు అని అడుగుతుంది.

Guppedantha Manasu February 22 Today Episodeవర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటున్న రిషి..

ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఆకాశం నిర్మలంగా ఉంది అంటూ పిచ్చి ఆన్సర్ పిచ్చి మెసేజ్లు మీద కాదు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అంటాడు రిషి. మూడు బాలేదనుకుంటాను అని బాయ్ అని మెసేజ్ పెడుతుంది వసు. అప్పుడే బాయ్ ఏంటి నేను మాట్లాడుతున్నాను కదా అని మెసేజ్ పెడతాడు రిషి. సరే చెప్పండి అని వసూలు అంటే అప్పుడు తన బాయ్ చెప్తాడు. తిక్క రేగిన వసు ఈయన ఎప్పుడు మారతారో, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో అనుకుంటుంది.

ఫోన్లో ఎవరు అని అని అడిగితే వసుధార అంటాడు రిషి. నువ్వు తన విషయంలో ఆలోచించవలసింది అంటుంది దేవయాని. నాకు తనకి మధ్య చాలా విషయాలు ఉంటాయి. అవి నేను చూసుకుంటాం కానీ మీరు ఇక్కడ వరకు వచ్చి తప్పు చేశారు. మరి ఎప్పుడు ఇలా చేయకండి నా సమస్యలు నేను చక్కబెట్టుకుంటాను నా వల్ల మీరు ఇబ్బంది పడటం ఇష్టం లేదు అయితే మెత్తగా బుద్ధి చెప్తాడు రిషి.

మరోవైపు అక్కయ్య ఎక్కడికి వెళ్లారు అంటూ ధరణిని అడుగుతుంది జగతి.తెలీదు అంటుంది ధరణి. వదిన గారు బయటికి వెళ్లారు అంటే ఎవరికో మూడినట్లే అంటాడు మహేంద్ర. అపశకునాలు మాట్లాడుతావెందుకు అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.