Guppedantha Manasu February 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తన గదిలో ఉన్న తల్లిదండ్రులని చూసి మీరిద్దరూ నా గదిలో ఉన్నారు అంటే ఏదో పెద్ద పని ఉండి ఉంటుంది ఏంటో చెప్పండి అంటాడు రిషి. వసుధారని నువ్వు అవాయిడ్ చేస్తున్నట్లు దూరం పెట్టినట్లుగా అనిపిస్తుంది అంటాడు మహేంద్ర. మనకి అనిపించినవన్నీ నిజాలు కావాలని లేదు కదా అంటాడు రిషి. మీకు ఏమనిపించింది మీరు కూడా మనుషుల్ని మనస్తత్వాల్ని బాగా అంచనా వేస్తారు కదా మీ శిష్యురాలాగా అంటూ తల్లిని నిలదీస్తాడు రిషి.

నా ఎమోషన్స్ తో ఆడుకున్నారంటున్న రిషి..

మహేంద్ర ది నాది ఒకటే అభిప్రాయం అంటుంది జగతి. ఇప్పటికే దూరాలు పెరిగిపోయాయి తన్ని ఎలా దూరంగా పెట్టడం మంచిది కాదు కదా అంటాడు మహేంద్ర తను చేసిన పని నాకు నచ్చలేదు. నచ్చలేదు అనే పదం కన్నా చాలా ఇబ్బంది పడ్డాను నలిగిపోయాను అనటం కరెక్ట్. నా ఎమోషన్స్ తో మీరు ముగ్గురు ఆడుకున్నారు అంటాడు రిషి. అనవసరంగా మమ్మల్ని కలపకు మా పాత్ర పరిమితం అంటాడు మహేంద్ర.

మీరు తనకోసం ఆలోచించారు కానీ కొడుక్కి నిజం చెప్పాలని అనిపించలేదు అంటాడు రిషి. నిజాన్ని నీ అంతటా నువ్వుగా తెలుసుకోవాలని వసు అనుకుంది. లైఫ్ లో నిజాన్ని తెలుసుకోవడం కన్నా మనల్ని మనం తెలుసుకోవటమే గొప్ప విషయం అంటాడు మహేంద్ర. కాలికి ముళ్ళు తీయాలంటే కాలికి గాయం చేసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అంటాడు రిషి. పరిస్థితుల ప్రభావం అనుకొని తనని క్షమించవచ్చు కదా అంటాడు మహేంద్ర.

మీరు అనుకున్నది జరగదు అంటున్న రిషి..

వసుధారని నేను క్షమించలేకపోతున్నాను అలాగని వదులుకో లేకపోతున్నాను మీరు అనుకున్నది జరగదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మనం అనుకున్నది జరగదు అంటాడేంటి అని అనుమానంగా అడుగుతాడు మహేంద్ర. వసుని దూరం చేసుకోను అని దాని అర్థం. రిషి సూటిగా మాట్లాడుతున్నాడు అంటుంది జగతి. ఈ కోపం ఎన్నాళ్ళు ఉంటుందో అంటూ దిగులు పడుతూ బయటకు వచ్చేసరికి దేవయని ని చూసి షాక్ అవుతారు మహేంద్ర దంపతులు.

మీరు అంతా చాటుగా విన్నారు కదా రిషి మాటల్లో ఏదో మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది కదా అంటూ వెటకారంగా మాట్లాడుతాడు మహేంద్ర. నిలబడి కాళ్లు నొప్పి పెడతాయి పదండి వెళ్దాం అంటూ తోటికోడలతో వెటకారంగా మాట్లాడుతుంది జగతి. నేనేమీ వినలేదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. ఒకరి గురించిన ఆలోచనలో మరొకరు ఉంటారు రిషి, వసులు. ఇలా అనుకున్నాను లేదో అలాగా మెసేజ్ చేసింది అంటూ నిద్రపోతూ గురక పెడుతున్నాను అంటూ రిప్లై ఇస్తాడు రిషి.

మర్యాదగా డిస్టర్బ్ చేస్తున్న వసు..

డిస్టర్బ్ చేస్తున్నాను అంటూ రిప్లై ఇస్తుంది వసు. డిస్టర్బ్ చేస్తూనే డిస్టర్బ్ చేస్తున్నానా అని అడుగుతున్నావా అంటాడు రిషి. మర్యాద కోసం అడుగుతారు కదా సార్ అంటుంది వసు. చాలా మర్యాదగా డిస్టర్బ్ చేస్తావు నీ తెలివితేటలు ఇలాగా పెరిగిపోవటానికి నీ డైట్ కారణం నీ డైట్ ఏంటి అని అడుగుతాడు రిషి. కాస్త తలనొప్పిగా ఉంది మార్నింగ్ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. మరోవైపు పడుకున్న రిషి ని చూసి ఇంతసేపు ఎప్పుడు పడుకోడు అని లేపటానికి వెళ్తాడు మహేంద్ర.

రిషి కి జ్వరం రావడం గమనించి డాక్టర్ కి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. ఇంతలో వసు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తాను అన్నారు ఇంకా చేయలేదు అంటూ నిలదీస్తుంది. నేను మాట్లాడుతున్నాను రిషి కి జ్వరం వచ్చింది అని చెప్తాడు మహేంద్ర. అయ్యో అంటూ కంగారుగా బయలుదేరుతుంది వసు. మరోవైపు రిషి పక్కన కూర్చొని ఎడ్యుకేషన్ టూర్లని వాడిని ఒకటే తిప్పేశారు అందుకే జ్వరం వచ్చింది అంటూ జగతి దంపతుల్ని మందలిస్తుంది దేవయాని. దానికి దీనికి ఏంటి సంబంధం అంటుంది జగతి.

దేవయానిని ఇన్ డైరెక్టుగా తిడుతున్న వసు..

మిమ్మల్ని మీరు బాగా సమర్ధించుకుంటారు అంటుంది దేవయాని. అంతలోనే అక్కడికి వచ్చిన వసు డాక్టర్ వచ్చాడా హాస్పిటల్కి తీసుకువెళ్తారా అని అడుగుతుంది కంగారు పడకు ఇప్పుడే డాక్టర్ వచ్చాడు పరవాలేదు రెండు రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పారు అంటుంది జగతి. దేవయానిని పక్కకి తప్పుకోమని రిషి పక్కన కూర్చొని జ్వరం చాలా ఎక్కువగా ఉంది అంటూ కంగారు పడి తల మీద తడి పెడుతూ, ఇలా చేస్తే ఫీవర్ కంట్రోల్ లో అవుతుంది చెయ్యొచ్చు కదా మళ్లీ రిషి ని అలా చూసుకుని ఉన్న నన్ను ఇలా చూసుకున్నాను అని గొప్పగా చెప్తారు అంటూ దేవయానిని ఇన్డైరెక్ట్ గా తిడుతుంది వసు.

మీరు వెళ్ళండి నేను రిషి సార్ ని చూసుకుంటాను అని వసు అంటే నువ్వు చూసుకునేదేంటి అంటుంది దేవయాని. అవును నేనే చూసుకుంటాను మీరు కిందకి వెళ్లి ప్లాస్క్ లో వేడిపాలు పంపించండి అంటూ ఆర్డర్ వేస్తుంది. ఇక్కడే ఉంటే ఇంకెన్ని పనులు చెప్తుందో కర్మ అనుకుంటుంది దేవయాని. మీరేమీ కంగారు పడకండి మీ పొగరు మీ పక్కనే ఉంటుంది మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అంటూ స్పృహలో లేని రిషితో చెప్తుంది వసు.

దేవయానిని బ్లాక్ మెయిల్ చేస్తున్న జగతి..

మరోవైపు బయటకు వచ్చిన దేవయాని నీ కొడుకుని అలాగా పరాయి ఆడపిల్లకి అప్పజెప్పి రావడం ఏంటి అంటుంది దేవయాని. తనని పరాయిదాని లాగా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒకరు ఒకరు ఇష్టపడుతున్నారు రేపో,మాపో వాళ్ళకి మనం పెళ్లి చేయాలి అంటాడు మహేంద్ర. పెళ్లి మాట తర్వాత సాక్షికి రిషికి ఎంగేజ్మెంట్ అయింది అలాగని వాళ్ళని ఇలాగే పంపించాము అదృష్టమో దురదృష్టము ఆ సంబంధం తప్పిపోయింది. పెళ్లి చేసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు కానీ రేపు ఏదైనా జరగొచ్చు అలాంటప్పుడు ఆ పిల్లని గదిలో ఒక్కతిని వదలటం ఏంటి అంటే మహేంద్రని సమాధానం చెప్పమంటుంది దేవయాని.

వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుందాం అని మహేంద్ర అంటే మీరు అనుకోండి కానీ నేను అనుకోను ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను ఏదైనా చేయగలుగుతానని గుర్తుపెట్టుకోండి అంటుంది దేవయాని. ఇప్పటివరకు మీరు ఏం చేసినా మీ ముందు వాదించాం తప్పితే మీ గురించి రిషికి చెప్పలేదు. మళ్లీ మళ్లీ తనని డిస్టర్బ్ చేస్తే మీరు చిన్నప్పటినుంచి ఏం చేశారో రాజీవ్ కి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశారు కాలేజీ స్టాప్ తో ఏ ఏ ప్లాన్లు వేయించారో ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరిస్తుంది జగతి. మీకు బొత్తిగా నేనంటే భయం భక్తి లేకుండా పోయింది.

Guppedantha Manasu February 24 Today Episode వసుకి థాంక్స్ చెప్పిన రిషి..

నన్ను రిషి ని విడదీయాలని చూస్తున్నారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు స్పృహలోకి వచ్చిన రిషికి సపర్యలు చేస్తుంటుంది వసు. మెలకువ వచ్చిన రిషి కదలటం చూసి అతని టెంపరేచర్ చెక్ చేస్తుంది వసు. టెంపరేచర్ కొంచెం తగ్గింది అని వసు అంటే రాత్రంతా ఇక్కడే ఉన్నావా అంటాడు రిషి. మీకు హెల్త్ బాలేక పోతే నేను అక్కడ ఎలా ఉంటాను అంటుంది వసు. రిషి థాంక్స్ చెప్తే ఒక థాంక్స్ ఏనా అంటుంది వసు. ఏం కావాలో చెప్పు ఇస్తాను అంటాడు రిషి.

మీరు నాకు ఇవ్వటం ఏంటి మనిద్దరం ఒకటే కదా అంటుంది వసు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని రిషి అంటే మీరేమీ మాట్లాడక్కర్లేదు నా పక్కనే ఉండండి చాలు అంటుంది వసు. అప్పుడే అక్కడికి దేవయాని జగతి దంపతులు వచ్చి ఎలా ఉంది అని అడుగుతారు. టెంపరేచర్ తగ్గింది కాఫీ తాగితే నార్మల్ అవుతారు నేను కాఫీ తీసుకొస్తాను మీరు బ్రష్ చేయించండి అంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం