Guppedantha Manasu February 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఉద్యోగం నుంచి తీసేయొద్దు అంటూ బ్రతిమాలుతారు ఆ లెక్చరర్స్ ఇద్దరు. నేనేమీ చేయలేను ఇది రిషి సార్ తీసుకున్న నిర్ణయం ఉంటుంది జగతి. అది కాదు మేడం మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే రిషి సర్ వినేశారు అంటుంది ఒక లెక్చరర్. ఇప్పటికీ మీలో పశ్చాతాపం లేదు, రిషి సార్ వినకపోతే మీరు ఇంకా కంటిన్యూ చేసేవారు అన్నమాట అంటూ వాళ్ళని కోప్పడి మీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేసేస్తాను అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది జగతి.

దేవయాని హెల్ప్ కోసం వెళ్ళిన లెక్చరర్స్..

ఏం చేద్దాం మేడం రిషి సార్ ఇంత పని చేస్తారని అనుకోలేదు వసుధార కాళ్లు పట్టుకుందామా అంటుంది ఒక లెక్చరర్. పోయి పోయి ఆమె కాళ్లు పట్టుకోవడం అంటే ఇక అంతే అంటుంది మరొక లెక్చరర్. అయితే మనం దేవయాని మేడం కాళ్లు పట్టుకుందాము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆవిడే హెల్ప్ చేయగలరు అనుకుంటూ ఆవిడ దగ్గరికి బయలుదేరుతారు లెక్చరర్స్ ఇద్దరూ. మరోవైపు దేవయానికి ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది ధరణి ఏంటి ఈ మధ్య నా మీద ప్రేమ పొంగి పొర్లుతుంది అని దేవయాని అంటే మీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ ఉంది అయినా మీరు ఈ మధ్య తిండి మీద బాగా శ్రద్ధ తగ్గించేశారు అంటుంది ధరణి.

నువ్వు నా మీద బాగానే శ్రద్ధ పడుతున్నావు కదా అంటూ మనసు బాగోలేనప్పుడు ఏమి తిన్నావు ఒంటికి పట్టదు ఇప్పుడు నాకు అదే జరుగుతుంది అంటుంది దేవయాని. ఏమైంది అని ధరణి అడిగితే సవాలక్ష సమస్యలు ఇంట్లో తాండవం చేస్తుంటే మళ్ళీ ఏమైంది అని అడుగుతావేంటి అంటుంది అంతలోనే ఆ లెక్చరర్స్ ఇద్దరు వస్తారు. ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చారు అని అడిగితే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆమె కాళ్ళ మీద పడిపోయి మీరే మమ్మల్ని రక్షించాలి అంటారు.

అదిరిపోయే సలహా ఇచ్చిన దేవయాని..

ధరణిని అక్కడ నుంచి పంపించేసి ఎందుకు అలా భయంతో ఒణికి పోతున్నారు ఏం చేశారంటే అంటుంది దేవయాని. ఆ వసుధార వల్ల మా ఉద్యోగాలు పోయాయి అంటూ జరిగిందంతా చెప్తారు వాళ్ళు ఇద్దరు. ఇదంతా విన్నాధావి అని ఒక పని చేయండి అంటుంది. మా ఉద్యోగాలు మాకు వస్తాయంటే ఏ పనైనా చేస్తామంటారు వాళ్ళిద్దరూ. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పండి. దానివల్ల మాకేంటి ఉపయోగం అని వాళ్ళిద్దరూ అంటే చెప్పేది పూర్తిగా వినండి అంటూ రిషి సార్ చాలా గొప్పవారు వసుధార వల్లే మాకు అన్యాయం జరిగింది అని చెప్పండి అంటుంది.

కాలేజీలో ప్రెస్ మీట్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదా అంటారు ఆ లెక్చరర్స్. నేను మీ వెనుక ఉండగా మీకు భయం దేనికి అని దేవయాని హామీ ఇస్తుంది. మీరు మా వెనక ఉంటే కొండంత ధైర్యం అంటారు వాళ్ళు. మీరు వెళ్లి ప్రెస్ మీట్ ఏర్పాట్లు చూడండి నేను మిగతా కధ నేను నడిపిస్తాను. పసుధారకి మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేయంత సీన్ పెరిగిందా అంటుంది దేవయాని. అవును మేడమ్ ఈమధ్య తను చాలా ఎక్కువ చేస్తుంది.

రిషి మీద పెత్తనం చేస్తున్న వసు..

మీరు మళ్లీ మాట వెనక తీసుకోరు కదా ప్రెస్ మీట్ లో మేము ఇలాగే కోపం వస్తుంది కదా అని లెక్చరర్స్ అంటే ఆ విషయాన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అంటూ వాళ్ళని పంపించేస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటుంది దేవయాని. ఈ మాటలన్నీ ధరణి దొంగచాటుగా వింటుంది. మరోవైపు రిషి సార్ టాబ్లెట్ వేసుకుని టైం అవుతుంది. కాలేజీలో ఉంటే నీరసపడిపోతారు అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్తుంది వసు. మళ్లీ వచ్చింది ఏంటి అనుకుంటూ లోపలికి పిలుస్తాడు రిషి.

మీరు జ్వరం వచ్చిన పేషెంట్ మిమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నాను కదా అని బస్సు అంటే ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తాను అన్నాను కదా అంటాడు రిషి.ప్రెస్ మీట్ అయ్యేసరికి బాగా లేట్ అవుతుంది బయలుదేరండి అంటుంది వసు. లంచ్ టైం కూడా అవుతుంది కదా అని రిషి అంటే లంచ్ ఇంట్లోనే తినండి హెవీగా తినొద్దు చారు అన్న మాత్రమే తినండి అంటూ ఆర్డర్ వేస్తుంది. ఏంటి నా మీద పెత్తనం చేస్తున్నావు అని రిషి అంటే ప్రేమ అని కూడా అనుకోవచ్చు అంటుంది.

రిషిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వసు..

నువ్వు నాకు బాస్ లాగా ప్రవర్తిస్తున్నావు అంటే మీరు ఏమైనా అనుకోండి కానీ నాకు మీ ఆరోగ్యమే ముఖ్యం అంటూ లాప్టాప్ కార్ కీస్ ఇచ్చి ఇవన్నీ అందులో పెట్టండి డ్రైవర్ని రమ్మనండి సర్ తీసుకొని వెళ్తారు అంటుంది. రిషి అక్కడినుంచి కదలకపోవడంతో మీరు లేవండి మీరు లేవకపోతే నేను ప్రెస్ మీట్ కి కూడా వెళ్ళను అంటుంది వసు. ఇదేం బ్లాక్మెయిల్ అంటాడు రిషి. మీరు ఏమైనా అనుకోండి కానీ ముందు లేవండి ఇది ఆర్డరో, అధికారమో కాదు బాధ్యత అంటుంది వసు.

ఆమెకి థాంక్స్ చెప్తాడు రిషి. నా మీద కోపం తగ్గిందా పూర్తిగా పోయిందా అనుకుంటుంది వసు. నేను వెళ్తాను కానీ నీ పని నువ్వు చూసుకో అంటూ ఆమెని పంపించేస్తాడు రిషి. తను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు నువ్వు మెడలో తాళి వేసుకొని నన్ను ఒక విచిత్రమైన పరిస్థితుల్లోకి నెట్టేసావు. నువ్వు చేసిన పని నన్ను ఎప్పుడు ముని లాగా గుచ్చుతుంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ప్రెస్ మీట్ గురించి వివరాలు కనుకుంటున్న మహేంద్ర..

మరోవైపు ప్రెస్ మీట్ కి సంబంధించిన పనులు ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నావా అంటూ జగతిని అడుగుతాడు మహేంద్ర. పసిధార్ మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ వసుధారగారు ఉన్నారు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మంచిది పక్క వాళ్ళ పనుల్లో రైలు పెట్టడం పద్ధతి కాదు అంటుంది జగతి. మరోవైపు రిషి కనిపించడంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు మహేంద్ర. ఎందుకు అలా అడుగుతావు తనకి పనులు ఏవో ఉంటాయి కదా అంటుంది జగతి.

వాడు నా కొడుకు తనని అడగడానికి కూడా సందేహించాలా అంటాడు మహేంద్ర. ఇంటికి వెళ్తున్నాను అని రిషి అంటే లంచ్ టైం లో ఇంటికి వెళ్లడం ఏంటి అంటాడు మహేంద్ర. కొన్ని తప్పవు డాడ్ ఆర్డర్స్ పాటించాలి అంటాడు రిషి. అందరమూ నువ్వు చెప్పినట్లు వింటాం కానీ నీకు ఆర్డర్స్ వేసేవాళ్ళు ఎవరు అంటాడు మహేంద్ర. జ్వరం కదా డాడ్ అందుకే ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు రిషి. అలాంటప్పుడు కాలేజీకి ఎందుకు వచ్చావు అంటాడు మహేంద్ర.

కొడుకుని ఓ ఆటాడుకుంటున్న మహేంద్ర..

రావాలనిపించింది వచ్చాను అంటాడు రిషి. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని మహేంద్ర అంటే ఆర్డర్ వచ్చింది వెళ్ళిపోతున్నాను అంటాడు రిషి. ఆర్డర్ ఎవరు వేశారు అంటే ఏం సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. నాకు ఏమీ అర్థం కాలేదు జగతి అని మహేంద్ర అంటే నాకు అర్థమైంది కాలేజీకి ఎందుకు వచ్చావు అంటూ వసు క్లాస్ తీసుకుని ఉంటుంది, బలవంతంగా ఇంటికి పంపిస్తున్నట్లుగా ఉంది అంటుంది జగతి. అంటే రిషికి ఆర్డర్ వేసింది వసుధార అన్నమాట అంటాడు మహేంద్ర.

కొన్ని అర్థం చేసుకోవాలి అన్ని పూస గుచ్చినట్లు తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు అంటుంది జగతి. వసు ఆర్డర్ వేయడం రిషి ఫాలో అవ్వడం సూపర్ గా ఉంది అంటూ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇద్దరూ. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఒక లెక్చరర్ అంటే మన పరిస్థితి మీడియా వాళ్లకి చెప్తే వాళ్లే మన తరఫున పోరాడుతారు అంటుంది మరొక లెక్చరర్. ఇదంతా అయ్యే పనైనా అని ఒక ఆవిడ అంటే ఎందుకు కాదు మన వెనుక దేవి అని మేడం ఉన్నారు ఆవిడ చెప్తే రిషి సార్ వింటారు.

రిపోర్టర్ కి ఫోన్ చేసిన లెక్చరర్స్..

పైగా కాలేజీ పరువు పోతుంది అని కచ్చితంగా మన మాట వింటారు అంటుంది ఒక లెక్చరర్. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు ప్రెస్ మీట్ అవుతుంది కదా అంటే అవును ఆ ప్రెస్ మీట్ తో పాటు మనం పిలిచిన రిపోర్టర్స్ కూడా వస్తారు, వాళ్ళు చేసిన అన్యాయం గురించి ప్రెస్ ముందు చెప్పాలి మనం ఎంత గట్టిగా మాట్లాడితే మనకి అంత న్యాయం జరుగుతుంది సరే అయితే రిపోర్టర్స్ కి ఫోన్ చేయండి అంటుంది మరొక లెక్చరర్. ప్రతి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి మీరే మాకు న్యాయం చేయండి దయచేసి మా కాలేజీకి రండి అంటుంది ఒక లెక్చరర్.

కాలేజీలో ఇంకొక మీటింగ్ కూడా ఉందని ఇన్విటేషన్ కు వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాము ఏమి టెన్షన్ పడకండి అంటాడు రిపోర్టర్. ఇదంతా అయిపోయిన తర్వాత దేవయాని మేడం ఎక్కడ ఉన్నారు అంటుంది బయలుదేరి చాలాసేపు అయింది అని చెప్పారు అంటుంది మరొక లెక్చరర్. మరోవైపు కార్లో వెళ్తున్న రిషి నేను కూడా ప్రెస్ మీట్ లో ఉండి ఉంటే బాగుండేది కానీ ఈ పాగరు నన్ను బలవంతంగా పంపించేసింది అనుకుంటాడు రిషి. మరోవైపు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో అంతా ప్రిపేర్ అయ్యావు కదా అని వసుని అడుగుతాడు మహేంద్ర.

రిషి ని కాలేజీకి పిలిపించమన్న ఫణీంద్ర..

ఎందుకు అలా అడుగుతున్నావు తనకి పూర్తిగా ఈ విషయం మీద అవగాహన ఉంది అంటుంది జగతి. అంటే రిషి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాడు కదా అవి ఇవి కలిపి చెప్తే బాగుంటుంది అంటాడు మహేంద్ర. అవన్నీ తను చూసుకుంటుంది కానీ మీడియా పర్సన్స్ కి స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేసారా అంటాడు ఫణీంద్ర. అన్ని సరైంది చేసాము అని మహేంద్ర అంటాడు కనిపించట్లేదు ఏంటి అని ఫణీంద్ర అంటే తనకి ఒంట్లో బాగోలేదని ఇంటికి పంపించేసాను అంటుంది వసు. తనకి జ్వరం తగ్గింది కదా ప్రెస్ మీట్ పెట్టి కాలేజీ ఎండి లేకపోతే బాగోదు కదా రిషి కి కాల్ చేసి రమ్మను అని జగతికి చెప్తాడు ఫణీంద్ర.

జగతి ఫోన్ చేస్తుంది కానీ డ్రైవింగ్ లో ఉన్న రిషికి ఫోన్ కాల్ వినపడదు. మరోవైపు మనం కాల్ చేసిన రిపోర్టర్ ఇంకా రాలేదు ఏంటి అని ఆ లెక్చరర్స్ మాట్లాడుకోవడం వింటారు వసు,జగతి. కంగారు పడకండి మేడం మన కోసం కాకపోయినా కాలేజీలో జరిగే ఈవెంట్ కోసమైనా వాళ్ళు వస్తారు కదా అంటుంది మరొక లెక్చరర్. అంతలో రిపోర్టర్స్ రావడంతో రండి సార్ మేమే మీకు కాల్ చేసాము అంటూ జరిగిందంతా చెప్తారు లెక్చరర్స్ ఇద్దరు. మా విషయంలో మీరు గట్టిగా మాట్లాడాలి దెబ్బకి కాలేజీ యాజమాన్యం దిగి రావాలి మీరు గొడవ చేయండి మేము కూడా గొడవ చేస్తాము ఎంత దూరమైనా వెళ్తాము అంటుంది ఆ లెక్చరర్.

 

Guppedantha Manasu February 28 Today Episode లెక్చరర్లకి ఊహించని షాకిచ్చిన రిషి..

ఒక్క నిమిషం ఆగండి అంటూ మీ గురించి మీ బిహేవియర్ గురించి రిషి సార్ మాకు పంపించిన రిపోర్ట్స్ అంటూ ఆధారాలు చూపిస్తాడు ఆ రిపోర్టర్. దెబ్బకి ఇద్దరు లెక్చరర్లు షాక్ అయిపోతారు. మీరు ఇంతకుముందు ఎలాగా ప్రవర్తించారు ఎన్నిసార్లు తప్పుడు పనులు చేశారు ఎన్నిసార్లు క్షమించమంటూ లెటర్స్ రాశారు అవన్నీ ఇందులో ఉన్నాయి అంటాడు రిపోర్టర్. తప్పంతా మీ వైపు పెట్టుకొని రిషి సర్ది తప్పు అంటూ మాకు రిపోర్ట్ చేస్తారా ఈ విషయంలో మీకు మేము ఎలాంటి హెల్ప్ చేయలేం.

ఈ పేపర్సు మాతో పాటు మిగిలిన అందరి రిపోర్టర్స్ కి పంపించారట ఆయన ముందుగా పంపించబట్టి సరిపోయింది లేకపోతే మీ మాటలు నమ్మి నేను ఫైట్ చేస్తే నేను నవ్వుల పాలు అయిపోయేవాడిని అంటాడు ఆ రిపోర్టర్. తప్పుచేసి కవర్ చేయాలనుకోవడం మరొక తప్పు ఇంకెప్పుడు అలా చేయకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రిపోర్టర్స్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.