Guppedantha Manasu February 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఏంటి మహేంద్ర ఇది మళ్లీ ఇది ఒక టాపిక్ తో రిషి ని చిత్రవధ చేసేలాగా ఉన్నారు. మనం రిషి బాధని చూడలేని ఏదైనా చేయాలి అంటుంది జగతి. ఏం చేయడము ఏంటి వెళ్లి తనని నిలదీద్దాం అంటాడు మహేంద్ర. తెలుగు నిజం చెప్తుందని అనుకుంటున్నావా చెప్పేదే అయితే ఎప్పుడో చెప్పేది పెళ్లి చేసుకొని అటే వెళ్ళటం మానేసి మళ్లీ కాలేజీకి వచ్చి అందర్నీ ఇబ్బంది పడుతుంది. వసు ఇంతలా మారిపోతుందని నేను అనుకోలేదు అంటుంది జగతి.

నిజం తెలుసుకుని షాకైన మహేంద్ర దంపతులు..

ఆరోజు వసు వాళ్ళ నాన్న ఈ విషయం చెప్పటానికే మన ఇంటికి వచ్చి ఉంటాడేమో అంటాడు మహేంద్ర. కరెక్టే మనం తనని కలిస్తే అసలు విషయం బయటపడుతుంది అని చక్రపాణిని కలవడానికి వెళ్తారు జగతీ దంపతులు. అసలు ఏం జరిగింది అని చక్రపాణిని నిలదీస్తే కూతురు తన మీద ఒట్టేసుకున్న విషయం గుర్తొచ్చి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు చక్రపాణి. కాలేజీలో రాజీవ్ వచ్చి గొడవ చేసిన సంగతి అంతా చెప్తుంది జగతి.

ఆ మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే మరి ఎవరు కట్టి ఉంటారు అని అడిగితే అప్పుడే వచ్చిన వసు నేను చెప్తాను అంటూ జరిగిందంతా చెప్తుంది వసు. రాజీవ్ భయపెడితే నువ్వు ఏం చేశావు అంటుంది జగతి. మెడ నుంచి తాళి తీసి ఇది మీరు రిషి సార్ తోని పంపించారు కదా అంటుంది. అది ఎవరిచ్చారు అన్నది ముఖ్యం కాదు ఎవరు కట్టారు అన్నది ముఖ్యం అంటుంది జగతి. ఇంకెవరు కడతారు రిషి సర్ కట్టారు అంటే ఇద్దరు షాక్ అయిపోతారు.

రిషికి నిజం చెప్పమంటున్న జగతి..

అవును మేడం, అప్పుడున్న పరిస్థితుల్లో నేను భయపడలేదు నన్ను నేను రక్షించుకోవాలి అనుకున్నాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చి ఈ తాళి నా మెడలో నా ఇష్టప్రకారమే నా చేతులతో నేనే నా మెడలో వేసుకున్నాను. రిషి సార్ నా మెడలో వేసినట్లుగా భావించాను. ఆయనే నా మెడలో వేసినట్లుగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రాజీవ్ బావ నుంచి తప్పించుకోవటానికి నాకు అదే సరైన మార్గమని తోచింది.

తర్వాత దురదృష్టవశాత్తు అమ్మకి, నాన్నకి అలాగా జరిగింది వాళ్లు హాస్పిటల్ కి వెళ్తే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళవలసి వచ్చింది అంటూ ఏడుస్తుంది. ఆ తరువాత చాలా వేగంగా పరిస్థితులు అందరి అభిప్రాయాలు మారిపోయాయి. పోలీస్ స్టేషన్లో అందరి ముందు నా పరిస్థితిని చెప్పుకోలేకపోయాను అంటూ బాధపడుతుంది. ఇప్పటికైనా రిషికి నిజం చెప్తే అయిపోతుంది కదా అంటుంది జగతి.

సమస్యని పెద్దది చేసుకుంటున్నావంటున్న మహేంద్ర..

లేదు మేడం ఈ నిజాన్ని రిషి సార్, తనంతట తానే తెలుసుకోవాలి అంటే సమస్యని పెద్దది చేసుకుంటున్నావు అంటాడు మహేంద్ర. రిషి సార్ మనసులో ఏదో దాగుంది, అది తనంతటతాన్ని తొలగించుకోవాలి అంటుంది వసు. నీ వల్ల కాకపోతే మమ్మల్ని చెప్పమంటావా అని తండ్రి అడిగితే వద్దు అంటుంది వసు. నాకు రిషి సర్కిల్ మధ్య మరొక వ్యక్తి సంప్రదింపులు వద్దు అంటుంది వసు. ఇలా ఎన్నాళ్లు అక్కడ రిషి ఇక్కడ నువ్వు బాధపడతారు అని అడిగితే, ఇది మా ప్రేమకు నేను పెట్టుకున్న పరీక్ష.

రిషి సార్ నన్ను అపార్థం చేసుకున్నారు అది ఆయనే తెలుసుకోవాలి. ఇకపై ప్రేమను రిషి సరే గెలిపించాలి గెలిపిస్తారు కూడా అంటుంది వసు. దానికి చాలా సమయం పడుతుంది అని జగతి అంటే పట్టనివ్వండి, గొంగళి పురుగు సీతాకోక చిలకగా రూపాంతరం చెందటానికి టైం పడుతుంది, బంగారాన్ని కూడా మెరుగులు దిద్దడం కోసం కొలిమిలో కాలుస్తారు. ఇప్పుడు నేను మా ప్రేమకు అగ్నిపరీక్ష పెట్టుకున్నాను ఇందులో రిషి సార్ నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది అంటుంది వసు.

వసుని అక్కున చేర్చుకున్న జగతి..

నా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇంత దూరం ఆలోచించలేకపోయాను అంటూ వసుని దగ్గరికి తీసుకుంటుంది జగతి. ఇది స్త్రీ తత్వానికి కి నా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. రిషి సార్ లేకపోతే నేను బ్రతకలేను అని ఎలాగా తెలుసుకున్నానో అలాగే రిషి సార్ కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటారు కూడా, ఈ వసుధార ఆఖరి శ్వాస వరకు రిషి సార్ ప్రేమ కోసమే జీవిస్తుందని తెలుసుకోవాలి. నా మెడలో వేరో ఎవరో కాలి కట్టారని ఎలాగా అనుకుంటారు.

ఇది ఆయనకుగా హాయినే తెలుసుకోవాలి మీరు ఎలాంటి ప్రయత్నం చెయ్యొద్దు, దూకుడుగా ఆలోచించి కృషి సర్కిల్ నిజం చెప్పొద్దు అంటూ జగతి తో ఒట్టు వేయించుకుంటుంది వసు. మరోవైపు కాలేజీలో జరిగిందని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాజీవ్ కాకుండా మరి ఎవరిని పెళ్లి చేసుకుంది, అంత దగ్గర వ్యక్తి మరెవరున్నారు, ఎందుకు వసు ఇలా చేసింది అనుకుంటాడు రిషి. అంతలోనే వచ్చిన జగతి దంపతులని నిజంగానే ఏమీ చెప్పలేదా అని అడుగుతాడు.

జగతిని కొంపముంచొద్దు అంటున్న మహేంద్ర..

నిజం చెప్పేస్తాను అని జగతి అంటే కొంప ముంచొద్దు అని చెప్పింది విన్నావు కదా అంటాడు మహేంద్ర. వసు మాటకన్నా రిషియే ముఖ్యము తన బాధని చూడలేకపోతున్నాను అంటుంది జగతి. తను చెప్పకపోతే మీరైనా అడగొచ్చు కదా అంటాడు రిషి. నేను ఎందుకు అడుగుతాను తను ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేమీ, వసుధర ఎవరు జస్ట్ ప్రాజెక్ట్ హెడ్ అంతే, కాలేజీ లెక్చరర్స్ ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకు ఎలా అవసరం లేదు ఇది కూడా అలాంటిదే, అయినా కాలేజీ విషయాలు పర్సనల్ విషయాలు వేరువేరు అని నువ్వే కదా అన్నావు అంటుంది జగతి.

అంతలోనే అక్కడికి వచ్చిన దేవయానిని లోపలికి పిలుస్తుంది జగతి. ఏంటి రిషి ని మీరు మనశాంతిగా ఉండనివ్వరా అని అడుగుతుంది దేవయాని. మనశ్శాంతిగా ఉండు అని చెప్పడానికే వచ్చేను అంటూ వెటకారంగా చెప్తాడు మహేంద్ర. జరిగిన గోరం తెలిసింది నేను చాలా బాధపడ్డాను అంటుంది దేవయాని. బాధపడటం ఎందుకు మీకు ఎలాగూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అంటాడు మహేంద్ర. వసు మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే ఇంకెవరో కట్టి ఉంటారు కదా ఆ ఒకరు ఎవరై ఉంటారు అంటుంది దేవయాని.

జగతి ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన దేవయాని..

అది మనకు ఎలా తెలుస్తుంది పోనీ మీరు వెళ్లి అడగండి అంటూ వెటకారంగా అంటాడు మహేంద్ర. నేనెందుకు అడుగుతాను అయినా నిజం చెప్తున్నా నమ్మకం ఏంటి అంటుంది దేవయాని. అవునక్కయ్య మీరు అస్సలు తగ్గొద్దు, ఆ వసు ఎక్కడ మీరు ఎక్కడ మీ స్థాయి తగ్గి తనని ఏమీ అడగవద్దు.

అయినా తన రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏంటి,అనవసరంగా తన గురించి మాట్లాడి మీరేం తగ్గించుకోవద్దు అంటూ అధికారంగా మాట్లాడుతుంది జగతి.ఆ మాటలకి షాక్ అయిన దేవయాని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అంటుంది దేవయాని. ఎందుకంటే తనని తలచుకుంటేనే నాకు కడుపు మంటగా ఉంది అంటే మహేంద్రని వెళ్దాం పద అంటుంది జగతి. ఎక్కడికి పని మహేంద్ర అడిగితే కడుపులో మంటగా ఉంది కదా వెళ్లి మజ్జిగ తాగుతాను అంటుంది జగతి.

Guppedantha Manasu February 4 Today Episode దేవయానిని అనుమానిస్తున్న జగతి..

వెళ్ళిపోబోతు రిషి ని చూసి నన్ను క్షమించు వసు నా చేతిని కట్టేసింది అని అనుకుంటుంది జగతి. మరోవైపు వాళ్ళ గదిలో మాట్లాడుకుంటుటారు జగతి దంపతులు. వసు నిజాన్ని దాచిపెట్టి తప్పు చేసింది అంటుంది జగతి. రిషి ఇలాగ బాధపడవలసిందేనా అంటాడు మహేంద్ర. ఇంత జరిగినా కూడా రాజు వచ్చి గొడవ చేసి అడుగు అంటే దీని వెనక అక్కయ్య హస్తము ఉన్నట్లుంది అంటుంది జగతి. దీని గురించి ఇంకా వదిన గారు ఆలోచిస్తున్నారు అంటావా అంటాడు మహేంద్ర.

ఆవిడ సంగతి నీకు తెలియనిది ఏముంది ఆవిడ పెత్తనం కోసం రిషిని బాధ పెట్టైనా సరే మన మీద పై చేయి సాధించాలని చూస్తుంది. ఇప్పుడు మన ముందు రెండు సవాళ్లు ఉన్నాయి ఒకటి దేవయాని అక్కయ్య అని అదుపులో పెట్టాలి రెండు రిషి,వసు లను కలపాలి అంటుంది జగతి. మనం ఎలా కలుపుతాం వసు మాటలు విన్నావు కదా, మనం రిషి కి నిజాన్ని చెప్పలేం అంటాడు మహేంద్ర.

అలా అని మనం ఏమి చేయకుండా ఉండలేము కదా వసు మనసున్న మార్చాలి, లేకపోతే రిషి ,వసులు కలిసి ఉండేలాగా చూడాలి. అప్పుడే రిషికి నిజం తెలిసే అవకాశం ఉంటుంది అంటుందిజగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.