Guppedantha Manasu February 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కాలేజీకి వచ్చిన రిషి, వసు కాలేజీకి వచ్చి ఉంటుందా చింత పెద్ద గొడవ అయిన తర్వాత కూడా తను వస్తుందా రాజీవ్ తాళి కట్టకపోతే మరి తన మెడలో తాళి కట్టింది ఎవరు అని ఆలోచనలో పడతాడు. అదే సమయంలో అక్కడికి వచ్చి మరోవైపు కూర్చుంటుంది వసు. కాలేజీకి వచ్చావా అని మెసేజ్ పెడతాడు రిషి. ఎందుకు అని వసు మెసేజ్ పెడుతుంది.

రిషి, వసులు ఎవరికి అర్థం కారంటున్న మహేంద్ర..

ఊరికే అడిగాను కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు రిషి. నాకేంటి నేను బానే ఉన్నాను అంటూ రిప్లై ఇస్తుంది వసు. జరిగిన గొడవకి డిస్టర్బ్ అవ్వలేదా అంటే ఎవరో గొడవ చేస్తే డిస్టర్బ్ అయిపోను అంటూ మెసేజ్ పెడుతుంది. ఎవరు తాళి కట్టారో ఎలా అడగాలో తెలియక సతమతమవుతూ ఏవేవో మెసేజ్ లు పెడతాడు రిషి. దానికి తగినట్లుగానే వంకర టింకరగా సమాధానాలు చెప్తుంది వసు.

నేను ఏం అడగాలనుకుంటున్నానో తనకి అర్థం కావట్లేదా అనుకుంటాడు రిషి. తను నా పెళ్లి గురించి అడగాలనుకుంటున్నట్టుగా ఉన్నారు అని మనసులో అనుకుంటుంది వసు. అంతలోనే అక్కడికి వచ్చిన జగతి దంపతులు వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి వీళ్లిద్దరూ ఎవరికీ అర్థం కారు అంటాడు మహేంద్ర. అలా అర్థమైతే వీళ్ళు రిషి, వసులు ఎందుకు అవుతారు అంటుంది జగతి. వీళ్ళని చూసిన వసు దగ్గరకొచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది.

జగతి ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న రిషి..

నాతో ఏమైనా మాట్లాడాలా అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది జగతి. లేదు మేడం గుడ్ మార్నింగ్ చెప్పడానికే వచ్చాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు. వసుతో తన తల్లిదండ్రులు నవ్వుతూ మాట్లాడడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు రిషి. వసు వెళ్లిన తరువాత నిన్న జరిగిన విషయం గురించి తను మీకు ఏమైనా చెప్పిందా అని రిషి అంటే ఏమి చెప్పలేదు అంటుంది జగతి.

తను ఏదో సమస్యతో బాధపడుతున్నట్లుగా ఉంది అని మహేంద్ర అంటే తన ప్రాబ్లం తనే సాల్వ్ చేసుకుంటుంది అంటాడు రిషి.రిషి ఆలోచనలో ఏదో తేడా కనిపిస్తుంది అని జగతి అనుకుంటే జగతీ ఆలోచనలో ఏదో తేడా కనిపిస్తుందని రిషి అనుకుంటాడు. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో జగతి పద అంటాడు మహేంద్ర. ఎక్కడికి పని రిషి అడిగితే మా ఫ్రెండ్ రమ్మంటున్నాడు తను ఎన్నారై నీకు తెలియదులే అంటాడు మహేంద్ర. సరే త్వరగా వచ్చేయండి అని వెళ్ళిపోతాడు రిషి.

అదిరిపోయే ప్లాన్ వేశానంటున్న మహేంద్ర..

ఎవరా ఎన్నారై ఫ్రెండ్ అని జగతి అడిగితే వచ్చింది ఫ్రెండ్ కాదు ఐడియా మనం అర్జెంటుగా మిషన్ ఎడ్యుకేషన్ మీద టూర్ ప్లాన్ చేయాలి అంటాడు మహేంద్ర. నీ ప్లాన్స్ వర్క్ అవుట్ అయినవి చాలా తక్కువ అంటూ ఆట పట్టిస్తుంది జగతి. మరోవైపు మినిస్ట్రీ గారి దగ్గరికి వెళ్లిన జగతి దంపతులకి తన స్కూల్ సపోర్ట్ ని ఇస్తూ మీరు నాకు కాన్సెప్ట్ చెప్పక్కర్లేదు నాకు మీ మీద నమ్మకం ఉంది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు అంటాడు. మంచి వాళ్ళందరూ ఒకే దగ్గర కలవటం అనేది చాలా మంచి విషయం అంటాడు మినిస్టర్.

రిషి లాంటి మంచి కొడుకు మీకు దొరకడం మీ అదృష్టం, అలాగే వసు లాంటి తెలివైన అమ్మాయి దీనికి తోడైంది. రిషి, వసుధార, జగతి కలిపి అద్భుతాలు చేస్తున్నారు మీరు మరిన్ని అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నాను మినిస్టర్. థాంక్యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జగతి దంపతులు. మరోవైపు మే ఐ కమిన్ అని అడిగిన రిషి ని మీరు అడిగిన రావాలా సార్ అని అడుగుతుంది వసు. ఇది నీ కాబిన్ కదా అంటాడు రిషి. తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలి అనుకొని మామూలుగా ఇలాంటి సమయాల్లో అటు ఇటు ప్రయాణాలు చేస్తారు కదా నువ్వు ఎక్కడికి వెళ్లలేదా అని అడుగుతాడు రిషి.

విషయం తెలుసుకోవాలని ఆరాటపడుతున్న రిషి..

ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతుంది వసు. విషయం అర్థం చేసుకున్న వసు టాపిక్ మార్చేసి నేను పొద్దున్న టిఫిన్ చేయలేదు ఆకలేస్తుంది అంటుంది. ఆ మాటకొస్తే నేను కూడా టిఫిన్ చేయలేదు, కొన్నాళ్లు లీవ్ తీసుకోకుండా నువ్వు ఎందుకు కాలేజీకి వచ్చావు అని రెట్టిస్తాడు రిషి. చపాతీలు తెచ్చాను సార్ నేనే చేశాను అంటూ సందర్భం లేకుండా మాట్లాడుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మీటింగ్స్ మళ్లీ ఎప్పుడు ఉంటాయి అని రిషి అడిగితే మీరే కాన్సెప్ట్ చెప్పాలి మీరు చెప్తే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను అంటుంది వసు.

మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు కానీ సూటిగా అడగలేరు అడిగితే మీకు ఇగో అడ్డొస్తుంది అని మనసులో అనుకుంటుంది వసు. ఇంకా రిషి ఏదో మాట్లాడబోతుంటే నాకు ఆకలేస్తుంది సర్ అంటుంది వసు. నువ్వు తిను నేను వెళ్తాను అని బయలుదేరి పోతుంటే మీరు తినకపోతే నేను తినను అంటుంది వసు. స్వీట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. లేదు సార్ ఫోన్లే చపాతీయే అని అంటే మామూలుగా ఇలాంటి సమయాల్లో చేస్తారు కదా అంటే అయిపోయే సార్ అంటుంది వసు.

రిషి పెద్ద ఈగోయిస్టు అంటున్న వసు..

మీరు పెద్ద ఇగోయిస్టు సార్ అడగాలనుకున్నది సూటిగా అడగొచ్చు కదా అని మనసులోనే అనుకుంటుంది. ఇద్దరూ కలిపి టిఫిన్ చేస్తూ ఉంటారు. మీతో జీవితకాలం కలిసి గడిపే క్షణాలు తొందరలోనే వస్తాయి అనుకుంటుంది వసు. మరొక చపాతి పెట్టబోతే వద్దు తినలేను అంటాడు రిషి. సరే అయితే ఇద్దరం సగం సగం షేర్ చేసుకుందాం అంటుంది వసు. లైఫ్ ని షేర్ చేసుకోలేకపోయాం అనుకుంటాడు రిషి.

మరోవైపు రాజీవ్ అనవసరంగా అక్కడికి వెళ్లి పట్టుబడిపోయాడు. వాడే ఉంటే వాడిని అడ్డం పెట్టుకొని వసుతో ఒక ఆట ఆడుకునే దాన్ని. ఇప్పుడు వసు కాలేజీలో ఉంది అంటే అయితే రిషితో ఉంటుంది లేకపోతే జగతి వాళ్ళతోనే ఉంటుంది. వీళ్లలో ఎవరితో ఎవరు కలిసి ఉన్నా నాకే ప్రాబ్లం అంటూ తల పట్టుకు కూర్చుంటుంది దేవయాని. అంతలోనే అక్కడికి వచ్చిన ధరణి మంచి స్వీట్ చేశాను దీని టేస్ట్ అదిరిపోయింది. మీరు టేస్ట్ చేస్తే ఆనందంతో నన్ను ఎత్తుకొని దగ్గర తిప్పుతారు అంటుంది.

Guppedantha Manasu February 6 Today Episode:అయోమయంలో దేవయాని..

నువ్వు నన్ను హింసించడానికి పుట్టావు బయటకు పో అంటుంది దేవయాని. ఎందుకు చిరాగ్గా ఉన్నారు మీకు కాఫీ తీసుకొచ్చిదా అంటుంది ధరణి. నేను ఏమీ తాగను కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది దేవయాని. నేను ఏమైనా సహాయం చేసేదా, ఎందుకిలా చిరాగ్గా ఉన్నారు అని ధరణి అడిగితే ఆ రిషి నా మాట వినట్లేదు జగతి చెప్పినట్లుగా వింటున్నాడు. ఆ రిషి వచ్చి కాలేజీలో కూర్చుంది ఇది నా ప్రాబ్లం దీనికి సొల్యూషన్ నీ దగ్గర ఉంటే చెప్పు సంతోషిస్తాను చెప్పకపోతే ఇంకా సంతోషిస్తాను అంటూ కోప్పడుతుంది దేవయాని.

మరోవైపు జగతి ఫోన్ చేసి నేను మహేంద్ర ఒక రెండు మూడు రోజులు ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాము అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు పిక్నికా,జాలి ట్రిప్పా అంటుంది దేవయాని. ఒకరకంగా అలాంటిదే అని జగతి అంటే ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటుంది దేవయాని. వివరాలు అట్నుంచి వచ్చాక చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది జగతి. వెళ్తున్నాను అని చెప్తుంది కానీ ఎక్కడికి అని చెప్పటం లేదు దీంట్లో ఏదైనా మతలబు ఉందా అని ఆలోచనలో పడుతుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 6, 2023 at 7:55 ఉద.