చాలా సంతోషంగా ఉంది అంటాడు రాజీవ్. హాస్పిటల్ కి వెళ్దాం పద అని రాజీవ్ అంటే నువ్వు అక్కర్లేదు నేను వెళ్తాను అని ఆటోలో వెళ్ళిపోతుంది వసు.
కొడుకుని ఓదార్చుతున్న జగతి..
సరే ఆటో లో కాకపోతే ఆటో వెనుక వస్తాను అంటూ ఆటోని ఫాలో అవుతాడు రాజీవ్. చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చిన రిషి అక్కడ వసుతో గడిపిన జ్ఞాపకాలని తలచుకుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన జగతి అన్ని జ్ఞాపకాలు అందమైనవి కావు, కొన్ని మనల్ని బాధపెట్టేవి కూడా ఉంటాయి. మనసుకి బాధపెట్టే జ్ఞాపకాలని ఎందుకు తలచుకుంటావు, ఈ జ్ఞాపకాల వలయం నుండి నువ్వు త్వరగా బయటపడాలి అంటుంది జగతి.
ఇందులో నా తప్పేముంది మీ శిష్యురాలు ఇలా ఎందుకు చేసింది, మనస్ఫూర్తిగా ప్రేమించాను తనని నన్ను ఏం అర్థం చేసుకుంది? కనీసం మీకైనా అర్థమైందా, నా పసి మనసుని అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు, మీరు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలీదు మీరు కూడా చెప్పలేదు. ఆ ప్రశ్నకి బదులు ఇవ్వని మీరు ఈ ప్రశ్నకి బదిలిస్తారని అనుకోవడం లేదు అంటాడు రిషి.
నాకు మోసపోవడం అలవాటే అంటున్న రిషి..
మీకు మీ శిష్యురాలు కనిపిస్తే ఒకటి చెప్పండి ఈ రిషింద్ర భూషణ్ కి మోసపోవడం అలవాటనే చెప్పండి, తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పండి. ఈ మాటలు జెంటిల్మెన్ చెప్పాడని గుర్తు చేయండి అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు హాస్పిటల్ లో ఉన్న తల్లి దగ్గరికి వస్తుంది వసు. తల్లిదండ్రులని చూసి ఏడుస్తుంది.
వాళ్ళ హెల్త్ కండిషన్ ని డాక్టర్ని అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ దాటేసారు తెలుసుకొని ఆనందపడుతుంది. స్పృహలో లేని తండ్రి దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న నా మీద అంత కోపం నువ్వు గర్వపడే పనిలే చేశాను కానీ, నువ్వు తలవంచుకొని పనులేవి చేయను అంటుంది వసు. అంతలోనే దాహం అంటున్న తల్లికి నీళ్లు పడితే ఆమె వసుని చూసి సంతోషపడుతుంది.
మనం ఏమి చేయలేమా అంటున్న జగతి..
తల్లి ఏదో అడగబోతుంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ముందు ప్రశాంతంగా పడుకో నేను ఇక్కడే ఉంటాను అంటూ ఆమెని పడుకోబెడుతుంది. మరోవైపు ఆలోచనలో ఉన్న జగతి దగ్గరికి వచ్చిన మహేంద్ర తో నా గుండె తరుక్కుపోతుంది, మనసు ముక్కలు చేసుకొని సైలెంట్ గా ఉంటున్నాడు రిషి మనం ఏమి చేయలేమా అంటుంది జగతి. మనం ఏం చేయగలం చెప్పు అంటాడు మహేంద్ర. వసు ఒక్కసారిగా ఎందుకు అలా రాక్షసంగా ప్రవర్తిస్తుంది.
రిషి,వసు లు ఒకరికొకరు బాగా తెలుసు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటో మనకి తెలిసినప్పుడు, వసు ఇలా ఎలా చేస్తుంది అంటూ ఏడుస్తుంది. రిషి బాధపడకూడదు అంటే ఇక మనం వసు కోసం ఆలోచించకూడదు. సహనానికి కూడా హద్దు ఉంటుంది కదా, కోపాలు తాపాలు ఉంటాయి కదా వసు అన్న మాటలు నాకు ఇప్పటికీ బాధగా ఉంది అంటాడు మహేంద్ర. వసు ఒక అద్భుతం అనుకున్నాను కానీ తను నాకు మంచి గురుదక్షిణ ఇచ్చింది అంటూ ఏడుస్తుంది జగతి.
గిల్టీ గా ఫీల్ అవుతున్న వసు..
మరోవైపు పేషెంట్లుగా ఉన్న తల్లిదండ్రులని చూసి నా వల్లే మీరు ఇలా అయిపోయారు కదా అంటూ ఏడుస్తుంది వసు. మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ మిమ్మల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అంటుంది వసు. మరి నన్ను ఎవరు చూసుకుంటారు అంటాడు అప్పుడే వచ్చిన రాజీవ్. మీ అమ్మానాన్నలని నువ్వే చూసుకుంటే నేనేం అవ్వాలి అంటే నీ ఫ్యామిలీ లిస్టు నుంచి నన్ను కొట్టేసావా, అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి అంటాడు రాజీవ్.
జైలుకు వెళ్తావ్ అంటుంది వసు. నేను జైలుకు వెళ్తే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ఈ లోకం దృష్టిలో నువ్వు నేను భార్యాభర్తలం అంటాడు రాజీవ్. నోరు అదుపులో పెట్టుకోమని వసు అంటే కానీ మనసు అదుపులో ఉండదు ఏం చేయమంటావ్ అంటాడు రాజీవ్. అనఫిషియల్ గా అందరూ దృష్టిలో మనం భార్యాభర్తలం ఇది పోలీస్ స్టేషన్ లో కూడా రికార్డు అయిపోయింది. ఇది వినడానికి ఎంతో బాగుంది కదా అంటాడు రాజీవ్.
Guppedantha Manasu January 12 Today Episode: నన్ను ఎవరూ ఏమి చేయలేరు అంటున్న రాజీవ్..
చేసిన పాపానికి తగిన శిక్ష పడుతుంది అంటుంది వసు. మావయ్య గారు దేవుడు నన్ను ఏమి అనరు అత్తయ్య గారు జరిగిన సంఘటనలకి మారిపోతుందని అనుకుంటున్నాను. పాపం నీకు రిషి సార్ పరిస్థితి నీళ్ళల్లో మునిగిపోయి కాగితం పడవ లాగా ఉంది అంటూ జాలి పడతాడు. ఇక తను నీకు దూరమైనట్టే అని రాజీవ్ అంటే పగటి కలలు నిజమవవు అంటుంది వసు. అన్ని తెలిసినా నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటాడు రాజీవ్.
అంతలోనే చక్రపాణి దంపతులు ఇద్దరు స్పృహలోకి వస్తారు. వసు ఆనందంగా నర్సిని పిలిచి డాక్టర్ని రమ్మంటుంది. నర్స్ ఆ విషయాన్ని కానిస్టేబుల్ కి చెప్తే కానిస్టేబుల్ ఎస్సై కి చెప్తాడు. సరే నేను వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అంటాడు ఎస్ఐ. మరోవైపు రిషికి మాత్రం పూర్తిగా వసు ఆలోచనల్లో మునిగిపోతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.