Guppedantha Manasu January 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను నష్ట జాతకరాన్ని మిమ్మల్ని బాధ పెట్టాను అని బాధపడుతుంది వసు. నువ్వు నన్ను బాధ పెట్టావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే నాకంటే ఎక్కువ నీకే బాధ ఎందుకంటే మనం ఇద్దరం కాదు ఒక్కరిమి. ఎండి అంటే ఎంత అందమైన కొత్త పేరు పెట్టారు అయినా చేతి మీద రాతలు అంటే నీటి మీద రాతలనే ఆరోజు తెలుసుకోలేకపోయాను అంటూ రిషి బాధపడతాడు.
ఒకరి కోసం మరొకరు బాధపడుతున్న రిషిదారలు..
నుదుటి రాతలు ఎలా ఉన్నాయో ఏంటో మనం ఏం చేయగలం, ఈ దూరం ఇంకెన్నాల్లో, మనం త్వరగా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను అనుకుంటుంది వసు. దూరం ఎంత భారమా, నేను భరించలేక పోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంటాడు రిషి. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు కూడా అదే ఆలోచనలో ఉంటాడు రిషి. ఇక నువ్వు నా జీవితంలోకి నా ఇంట్లోకి రావా అనుకుంటూ బాధపడతాడు.
అప్పుడే కాఫీ తీసుకొని వచ్చిన జగతి నువ్వు పంపించిన మెయిల్ చూశాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళుతున్న ఆమెకి దేవయాని ఎదురవుతుంది ఇద్దరు ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు. జగతితో ఏమీ మాట్లాడకుండా రిషి దగ్గరికి వస్తుంది దేవయాని. కాపీ ఇచ్చి కొడుకుని మంచి చేసుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది అనుకుంటుంది దేవయాని. ఏదో మాట్లాడాలన్న రిషి ఏంటది అని అడుగుతుంది దేవయాని.
దేవయానిని కన్ఫ్యూజన్లో పెట్టిన రిషి..
అవును పెద్దమ్మ ఇప్పుడు మన కాలేజీ ఫ్యాకల్టీ ఇంటికి వస్తారు. వాళ్లతో మీరు మాట్లాడాలి అని రిషి అంటే ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అని అడుగుతుంది దేవయాని. వచ్చేకే మీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు ఫ్యాకల్టీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అని అడుగుతారు. అప్పుడు దేవయాని మీరు లెక్చరర్లు పిల్లలకి పాఠాలు చెప్పాలి అంతేగాని నోటికి అది మాట్లాడకూడదు.
రిషి, వసుధార గురించి ఏదో తప్పుగా మాట్లాడారు అంట కదా, ఒక మాట అనే ముందు ఎదుటి వాళ్ళు ఎలా ఫీలవుతారు అని ఆలోచించాలి కదా, కాలేజీలో వర్క్ చేస్తున్నాము అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కదా అంతేగాని ఇలా బిహేవ్ చేస్తారా మా రిషి ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసేవారు అంటూ వాళ్లని తప్పనిసరి పరిస్థితుల్లో తిడుతుంది.
రిషి ని మనసులోనే తిట్టుకుంటున్న దేవయాని..
ఈవిడెంటి మనల్ని తిట్టమని చెప్పి ఇప్పుడు ఆవిడే మనల్ని తిడుతుంది అని ఒక ఆవిడ అంటే గొప్పోళ్ళు అందరూ అంతే ఏదేమైనా ఇప్పుడు మన టైం బ్యాడ్ అందుకే నోరు మూసుకోవాలి అంటుంది మరో లెక్చరర్. మా వల్ల పొరపాటయింది క్షమించండి అని క్షమాపణ అడుగుతారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళని పిలిపించి అడగడం వల్ల ఏంటి ప్రయోజనం మాటలు పడ్డ రిషి ఇక్కడ లేదు కదా అంటుంది జగతి. తను ఇక్కడ లేకపోయినా తను పడ్డ బాధ నాకు తెలుసు, నా బాధ నేను కూడా భరించాను.
ఇలాంటివి ఇంకొక స్టూడెంట్ కి జరగకూడదని వీళ్ళని పిలిపించాను ఈ కాలేజీలో ఏ ఆడపిల్ల వసదారులాగా మాటలు పడకూడదు అంటాడు రిషి. నేనే వీళ్ళని పురమాయించి మళ్లీ నేనే వీళ్ళని తిడుతుంటే వీళ్ళకి నా మీద నమ్మకం పోతుంది రిషికి తెలియకుండానే నా బరువు తీసేస్తున్నాడు అని మనసులో బాధపడుతుంది దేవయాని. ఈసారికి క్షమించండి అని లెక్చరర్స్ అంటే సరే ఇక మీరు వెళ్ళండి ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకండి అని వాళ్ళని పంపించేస్తుంది దేవయాని.
కూతురు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి అంటున్న చక్రపాణి..
వసుని అనేంత ధైర్యం వాళ్లకు లేదు వాళ్ళకి ధైర్యం ఇచ్చింది అని నాకు తెలుసు అనుకుంటుంది జగతి. మరోవైపు తల్లిదండ్రులకు భోజనం తినిపిస్తూ ఉంటుంది వసు. తను కూతుర్ని అన్న మాటలు తలుచుకొని ఏడుస్తుంటాడు చక్రపాణి. ఏంటి నాన్న ఇదంతా అంటే దేవుడు గొప్పోడు సంతోషానికైనా బాధకైనా కన్నీళ్లే ఇస్తాడు. అది బాధపడే వాళ్ళకి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అర్థం చేసుకోవడానికి నాకు ఇంత కాలం పట్టింది.
సుమిత్ర తన భవిష్యత్తు కోసం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని భార్యతో అంటే సుమిత్ర నిర్ణయం తీసుకోవాల్సింది ఆ దేవుడు అంటుంది. మీరేమీ బాధపడొద్దు అంటూ తల్లిదండ్రులు ఇద్దరికీ కొసరి కొసరి భోజనం తినిపిస్తుంది వసు. నీ బ్యాగ్ పక్కన ఒక కవర్ ఉంటుంది అది తీసుకొని రా అని చెప్తాడు చక్రపాణి. అది ఏంటి అని అడిగితే నువ్వు తీసుకురా చెప్తాను అంటాడు చక్రపాణి.
కూతురికి సర్ప్రైజ్ ఇచ్చిన చక్రపాణి..
ఆ కవర్ తెచ్చి తండ్రికి ఇస్తే ఈ కవర్లో టిక్కెట్ ఉంది నువ్వు బయలుదేరు అంటాడు చక్రపాణి. ఎక్కడికి అని అడిగితే నీకు వెలుగు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి. రిషి రూపంలో నీ భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడికే వెళ్ళు అని ఆమె చేతిలో ఆ టికెట్ పెడతాడు. మళ్లీ అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించు ఎందుకంటే క్షమించు అని అడగడానికి కూడా వీల్లేనన్ని తప్పులు చేశాను.
నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు మమ్మల్ని పిలిస్తే వస్తాను లేదు అంటే ఆ కబురు పంపించిన చాలు ఇక్కడ మేము సంతోషంగా, గర్వంగా నలుగురికి చెప్పుకుంటాము అంటాడు చక్రపాణి. నువ్వు ఎదుగుతానంటే నేను అడ్డు వచ్చాను అయినా ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్లి జీవితంలో గెలిచావు ఇప్పుడు నీ ప్రేమలో కూడా గెలువు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు చక్రపాణి. మరోవైపు సూట్ కేస్ తో ప్రయాణమైన రిషి ని చూసి కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు.
రిషిని అలా చూసి షాక్ అయిన కుటుంబ సభ్యులు..
సూట్కేస్ తో వచ్చేవేంటి రిషి అంటుంది దేవయాని. వెళ్తున్నాను పెద్దమ్మ అంటాడు రిషి. ఎక్కడికి నాన్న, అందర్నీ వదిలేసి వెళ్లడం కరెక్టేనా అంటుంది దేవయాని. ఏ బంధం ఎన్నాళ్ళు ఎవరో తెలుసు చెప్పండి కొన్నాళ్ళు నేను అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అంటాడు రిషి. ఏదో జరిగింది అంతమాత్రాన వెళ్లిపోవడమేంటి రిషి పారిపోతున్నావా అంటాడు మహేంద్ర. మనుషుల నుంచి పారిపోతాను కానీ నా మనసు నుంచి నేను ఎక్కడికి పారిపోతాను అంటాడు రిషి.
ఎవరో మోసం చేశారని అని దేవయాని అంటుండగానే ఎవరో మోసం చేశారని నేను పారిపోవట్లేదు, నాకు నేనే నచ్చటం లేదు, నేను చాలా నిస్తేజంగా ఉన్నాను ఈ నన్ను నేనే శిల్పం లాగా చెక్కుకోవాలి అంటాడు రిషి. కాలేజీని ఎవరు చూసుకుంటారు అని ఫణీంద్ర అడిగితే జగతి మేడం చూసుకుంటారు అని చెప్పి షాక్ ఇస్తాడు రిషి. ఈ విషయం గురించి మేడమ్ కి ఆల్రెడీ మెయిల్ చేశాను అని రిషి అంటాడు.
Guppedantha Manasu January 16 Today Episode: షాకింగ్ డెసిషన్ తీసుకున్న రిషి..
మెయిల్ చేస్తే సరిపోతుందా మినిస్టర్ గారు ఒప్పుకోవద్దా అంటుంది దేవయాని.ఆయనకి కూడా మెయిల్ పెట్టాను ఆయన కూడా ఓకే అన్నారు అంటాడు రిషి. నువ్వు వెళ్లడం అవసరమా అని బాధగా మహేంద్ర అడిగితే చాలా అవసరం అంటాడు రిషి. నాలుగు రోజులు ఉంటే అదే సర్దుకుంటుంది అని వాళ్ళ పెదనాన్న అంటే లేదు పెదనాన్న నా గుండె బరువుని నేను మోయలేకపోతున్నాను, నన్ను నేనే కొత్తగా చూసుకుంటున్నట్లుగా ఉంది.
నేను ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాను. మళ్లీ కొత్తగా పుట్టినట్టు తిరిగి వస్తాను అంటాడు రిషి.ఎప్పుడు వస్తావు అని మహేంద్ర అడిగితే ఏమో వస్తానో రానో కూడా నాకే తెలియదు అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.