Guppedantha Manasu January 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తల్లికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతుంది వసు. నేను చాలా బాగున్నాను నాన్న నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు అంటుంది సుమిత్ర. సుమిత్ర దగ్గరనుంచి ఫోన్ తీసుకున్న చక్రపాణి అమ్మ గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు నువ్వు రిషి సార్ కలిసావా జరిగిందంతా చెప్పావా అంటాడు.
కూతురితో తన కోరిక చెప్పిన చక్రపాణి..
నువ్వు చెప్పింది విని తను అర్థం చేసుకున్నాడా తన మనసు నాకు బాగా తెలుసు తను మహారాజు అంటాడు చక్రపాణి. టాపిక్ మార్చేసిన వసు,రాజీవ్ బావతో జాగ్రత్త అంటుంది. వాడు మొహం చెల్లక ఎటో పారిపోయాడు, ఈసారి కనిపించని నా సంగతి ఏంటో చూపిస్తాను అని ఆవేశపడతాడు చక్రపాణి. నువ్వు ఆవేశపడకు దుష్టులకు దూరంగా ఉండాలి అంటుంది వసు. మనవడి మొహం చూసి ఆలోచిస్తున్నాను లేకపోతే వాడిని వదిలే వాడిని కాదు, నిన్ను నీ జీవితాన్ని పాడు చేయాలని చూశాను ఎన్నాళ్లు వాడి మాయలో పడిపోయాను అంటూ బాధపడతాడు చక్రపాణి.
అయిందేదో అయిపోయింది మీరు అమ్మ జాగ్రత్త అంటుంది వసు. అమ్మ మాకు ఇక్కడ ఉండాలని లేదు ఇన్నాళ్లు నీకు దూరంగా ఉన్నాం, ఇకమీదట నీతోనే ఉండాలని ఉంది అంటాడు చక్రపాణి. మిమ్మల్ని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేస్తాను అంటుంది వసు. సరే నువ్వు టెన్షన్ పెట్టుకోకుండా టైంకి భోంచేయు మనకి అంత మంచే జరుగుతుంది అని జాగ్రత్త చెప్పి పెట్టేస్తాడు చక్రపాణి. మనకి అంతా మంచే జరుగుతుందని, అందరినీ కలిసి ఉందామని భార్యతో చెప్పి ఎగ్జైట్ అవుతాడు చక్రపాణి.
వసుని అనుమానిస్తున్న రిషి..
మరోవైపు వసుని తలుచుకొని బాధపడతాడు రిషి. ఇలా చేసావేంటి వసు నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇప్పుడు నువ్వే ప్రశ్నగా మిగిలిపోయావు అనుకుంటాడు. వసు నేను కొన్న పువ్వులు ఎందుకు తీసుకుంది ఒకరికి భార్య గా ఉన్న మనిషి అలా తీసుకోవడం తప్పు కదా అనుకుంటాడు రిషి. నన్ను నేను కాపాడుకోవడానికి మా వాళ్ళని కాపాడటానికి నేను ఏమైనా తప్పు చేశానా అనుకుంటుంది వసు. దీని గురించి వివరించే అవకాశం రిషి సార్ నాకు ఎప్పుడు ఇస్తారు.
రిషి సర్కి నిజంగానే నామీద కోపం ఉంటే వెళ్లిన వ్యక్తి మళ్లీ ఎందుకు వచ్చారు, వెనక్కి వచ్చారు అంటే నా మీద ప్రేమ ఉన్నట్లే కదా అనుకుంటూ రిషికి మాట్లాడాలి అంటూ మెసేజ్ పెడుతుంది. మెసేజ్ చూస్తాడు కానీ రిప్లై ఇవ్వడు. మా ఇద్దరి మధ్య చాలా దూరం అనిపిస్తుంది మా ఇద్దరి మధ్య దూరం నువ్వే తగ్గించాలి అంటూ చందమామతో చెప్తుంది వసు. అసలు పశు కిందికి ఇలా ప్రవర్తించిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అనుకుంటాడు రిషి. నువ్వు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నలాగే మిగిలిపోతావా అనుకుంటాడు.
ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో వసు..
ఫోన్ చేస్తే తీయరు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు, మీరు ఎక్కడ ఉన్నారు అర్థం కావట్లేదు అనుకుంటుంది వసు. నేను ఎక్కడ ఉన్నాను నాకే అర్థం కావట్లేదు అనుకుంటాడు రిషి. సీన్ కట్ చేస్తే రిషి సార్ ఎక్కడికి వెళ్లి ఉంటారు అంటూ వాళ్ళు కాలేజీలో ఎప్పుడు కూర్చునే ప్లేస్ కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మీతో గడిపిన ప్రతిక్షణం నాకు ఒక జ్ఞాపకం గానే మిగిలింది. మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు.
మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్లారు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా అనుకుంటూ రిషికి ఫోన్ చేస్తుంది వసు. ఆ ఫోన్ రిసీవ్ లిఫ్ట్ చేయకపోవడంతో జగతికి మేడమ్ కి ఫోన్ చేద్దామా ఆవిడ కూడా నా మీద కోపంతో ఉన్నారు ఆవిడ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఒకసారి కాల్ చేసి చూద్దాం అనుకొని ఆవిడకి కూడా కాల్ చేస్తుంది. కానీ జగతి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు మహేంద్ర కి ఫోన్ చేస్తే తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు.
వసుకి మెరుపులా వచ్చిన ఆలోచన..
మీరు లేని వసుధార ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్లారు ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటుంది. మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి అనుకుంటూ ధరణి మేడమ్ కి ఫోన్ చేస్తే తెలుస్తుంది అనుకొని తనకి ఫోన్ చేస్తుంది వసు. తనకి ఫోన్ చేసి రిషి సార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అడిగితే నిన్ను చాలా ప్రశ్నలు అడగాలని ఉంది కానీ నేను మాట్లాడలేను అంటుంది ధరణి. నా సంగతి తర్వాత రిషి సర్ వచ్చారా అని అడుగుతుంది వసు.
తను రాలేదు ఎక్కడికి వెళ్లడో కూడా తెలియదు ఇంతకీ నువ్వు ఎందుకు అలా చేశావు అంటుంది ధరణి. సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేసి నేను మొదటిసారి రిషి సార్ ని గెస్ట్ హౌస్ లో కలిశాను ఆయన అక్కడే ఉండి ఉంటారు అని అక్కడికి బయలుదేరుతుంది వసు. మరోవైపు ఎంత వద్దన్నా వసు ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాను అంటూ ఫ్రెస్టేట్ అవుతుంటాడు రిషి. బయటికి వెళ్ళటం కోసం డోర్ ఓపెన్ చేయబోతే అదే సమయంలో లోపలికి రావటం కోసం వసు డోర్ ఓపెన్ చేస్తుంది.
ముదిరిపోయిన వసు,రిషిల వాగ్వాదం..
బ్యాలెన్స్ తప్పి రిషి మీద పడిపోతుంది వసు. తను మెడలో తాళిబొట్టును చూసి ఇరిటేట్ అవుతాడు రిషి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని రిషి ని అడిగితే నేను అదే అడుగుతున్నాను ఇది కాలేజీ గెస్ట్ హౌస్ ఇక్కడ నీకేం పని అంటాడు. నేను కూడా కాలేజీ ఎంప్లాయ్ని అంటుంది వసు. ఇంటికి వెళ్లొచ్చు కదా అని రిషి ని అంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నన్ను వేధించొద్దు అంటాడు. మీరు నాకు మాట్లాడడానికి టైం ఇవ్వటం లేదు నేను మీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అంటుంది వసు.
మాట్లాడడానికి ఏమీ లేదు అంటాడు రిషి. నేను మీతో చాలా చెప్పాలి అంటే నాకు తెలుసుకోవటానికి ఏమీ లేదు ఇకనుంచి వెళ్ళిపో అంటాడు రిషి. ఈరోజు వెళ్ళిపోతాను ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నాకు ఎప్పటికైనా టైం ఇవ్వాలి అంటే అంటుంది వసు. నన్ను ఒంటరిగా వదిలెయ్ అంటే ఒంటరిగా ఉండడం ఎందుకు మీ ఇంటికి వెళ్ళండి అంటుంది వసు. నాది అంటూ ఏమీ లేదు నాది అనే భావన మర్చిపోతున్నాను అంటాడు రిషి.
మహేంద్ర కి అసలు విషయం చెప్పిన వసు..
మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా ఉంటే వసు. ఇంకేమీ చెప్పొద్దు దయచేసి వెళ్ళిపో అంటాడు రిషి. మీరు ఇలా వినరని నాకు తెలుసు సార్, ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు అంటూ ఎవరికో ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అని రిషి అడుగుతుండు గానే మహేంద్ర కి వాయిస్ మెసేజ్ పంపుతుంది. రిషి సార్ ఒంటరిగా ఇక్కడ ఉన్నారు, తన మూడేమీ బాగోలేదు మీరు వచ్చి తీసుకు వెళ్ళండి అని చెప్తుంది. నీకు బుద్ధుందా ఎందుకు మెసేజ్ పంపిస్తున్నావు,ఆ ఫోను ఇలా ఇవ్వు అంటాడు రిషి.
మెసేజ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అని వసు అంటే అసలు నువ్వు ఎవరు అలా చేయటానికి, ఇక్కడ నీకేం పని, మా డాడీ కి ఎందుకు చెప్పావు అంటూ కోప్పడతాడు రిషి. నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు. మీకు కోపం వచ్చిందని నాకు తెలుసు అందుకే చెప్పింది వినమంటున్నాను అంటుంది వసు. నువ్వు వెళ్తావా లేకపోతే నేను వెళ్ళిపోయేదా అంటాడు రిషి.
వసుని బయటికి పొమ్మన్న రిషి..
ఇంటికి వెళ్ళండి సార్ అని వసు అంటే నేను ఇంటికి వెళ్ళను నాకు నచ్చింది దగ్గరికి వెళ్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంటాడు రిషి. ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది వసు. వెంటనే డోర్ వేసేసిన రిషి చాలా బాధపడతాడు. బయటకు వచ్చిన బస్సుకి తండ్రి ఫోన్ చేసి మాధవి అక్కకి బాగోలేదంట మీ అమ్మని అటు పంపించి నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఎందుకో నీతోనే ఉండాలనిపిస్తుంది అంటాడు చక్రపాణి.
వసు ఏమీ మాట్లాడకపోవటంతో ఎందుకు ఏమి మాట్లాడటం లేదు నీకు ఏమైనా ఇబ్బంది అయితే వద్దు అంటాడు చక్రపాణి. అలాంటిదేమీ లేదు నాన్న మీరు వచ్చేయండి ఎక్కడికి రావాలో వివరాలు ఫోన్లో పంపిస్తాను అంటుంది వసు. రిషి కోపాన్ని తలుచుకుంటూ నేను మిమ్మల్ని కాదు మీ కోపాన్ని కూడా ప్రేమిస్తాను. మీకు ఏం జరిగిందో తెలియదు తెలిసినప్పుడు అన్ని కోపాలు పోతాయి నాకు తెలుసు అనుకుంటుంది వసు.
Guppedantha Manasu January 20 Today Episode: మహేంద్ర కి చివాట్లు పెడుతున్న దేవయాని..
సీన్ కట్ చేస్తే రిషి కాలేజీలో ఉన్నాడా, కాలేజీకి వెళ్ళను అన్నాడు కదా, కాలేజీకి ఎందుకు వెళ్లాడు అక్కడ వసుధార ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అంటుంది దేవయాని. రిషి బాధలో ఉన్నాడు అక్కడికి వసుధార వస్తే రిషి మరింత బాధపడతాడు. ఏం మాట్లాడవేం మహేంద్ర నీకు బాధ్యత లేదా,తను ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి కదా అంటుంది. రిషి ని ఈ పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయగలమా అంటాడు మహేంద్ర.
వసుకి అక్కర్లేని ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఇలా అయింది అంటుంది దేవయాని. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అని మహేంద్ర అంటే గుణపాఠం నేర్చుకోవాలి కదా అంటూ జగతిని మాట్లాడమంటుంది దేవయాని. నన్ను ఏం మాట్లాడమంటారు జరిగిందంతా మీకు తెలుసు కదా అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.