Guppedantha Manasu January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తన పాడైపోయిన కారుని పక్కన పడేసి తండ్రికి ఈ కారు నాకు మళ్ళీ కనిపించకూడదు ఈ నెలలో ఇది రెండోసారి ట్రబుల్ ఇచ్చింది అంటూ క్యాబ్ బుక్ కోసం ట్రై చేస్తాడు రాజ్. అంతలోనే అటువైపుగా వచ్చిన రిషి రాజ్ ని పలకరించి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ వి ఏంటి రోడ్లు సర్వే చేస్తున్నావా అంటాడు రిషి. లిఫ్ట్ కావాలి రిషి అంటాడు రాజ్.
అనుకోకుండా రిషి కారెక్కిన వసు..
మీ కార్ కి ఏమైంది అని అడిగితే నిమిషం ముందు వరకు నాది ఇప్పుడు నాది కాదు, పర్ఫెక్ట్ గా లేనిది ఏది నాది కాదు అంటాడు రాజ్. అందరూ పర్ఫెక్ట్ గా ఉంటే నా లైఫ్ కూడా బాగుండేది అనుకుంటాడు రిషి. ఇలా పర్ఫెక్ట్ పర్సన్ కావాలనే ఇంకా నీకు బ్రహ్మముడి పడలేదేమో అంటాడు రిషి. నాకు బ్రహ్మముడి పడాలంటే ఆ బ్రహ్మ దిగి రావాలి అంటాడు రాజ్. అంతలో అటువైపుగా వచ్చిన వసుని చూసి రిషి ని కారాపమంటాడు రాజ్. నీ కాలేజీకి కదా కమాన్ గెటిన్ అంటూ ఇన్వైట్ చేస్తాడు రాజ్.
రిషిని చూసి మొహమాటపడుతున్న వసు తో ఇది నా కారు కాదు మీ రిషి సార్ ది పర్వాలేదు వచ్చి ఎక్కువ అంటాడు. మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకో లైఫ్ లో ఎవరిని నమ్మొద్దు అంటాడు రిషి. నచ్చిన వాళ్ళు అందరికీ దొరకరు రాజ్ సార్ అంటుంది వసు. దొరికిన వాళ్ళు మోసం చేసి తప్పుకుంటారు అంటాడు రిషి. నేను మాత్రం నాకు పర్ఫెక్ట్ గా బెటర్ ఆఫ్ అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటాను అంటాడు రాజ్. ఇక ఆ టాపిక్ వదిలేయ్ అంటూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పగ్గాలు త్వరలోనే నీ చేతికి వస్తున్నాయన్నమాట అంటాడు రిషి.
కొడుకు కోసం బాధపడుతున్న జగతి దంపతులు..
అవును రేపు జనవరి 24 కి 100 ఇయర్స్ అవుతుంది మా కంపెనీ స్టార్ట్ చేసి. ఆ రోజే సాంప్రదాయ బద్ధంగా వినాయకుడికి పూజ చేసి నాకు బాధ్యతలు అప్ప చెప్తున్నాడు మా తాతయ్య ఆరోజు తప్పకుండా మీ ఇద్దరూ తప్పకుండా రావాలి అంటాడు రాజ్. మరోవైపు రిషిని తలుచుకుని బాధపడుతుంటాడు మహేంద్ర. అవన్నీ ఇప్పుడెందుకు తలుచుకోవడం అదంతా ముగిసిపోయిన అధ్యాయం. వసు ఎన్ని కబుర్లు చెప్పింది.తనని అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరూ ఆలోచనలు ఒకటే అయ్యాయి కానీ జీవితంలో మాత్రం ఒకటి కాలేకపోయారు అంటుంది జగతి.
ఆలోచిస్తున్న మనకే ఇలా ఉంటే రిషి మనసు ఇంకా ఎలా ఉండాలి అంటాడు మహేంద్ర. ఆ బాధ వర్ణనాతీతం తను చాలా సెన్సిటివ్ ఉంటుంది జగతి. అయిందేదో అయిపోయింది తన దారిన తను బ్రతికితే అయిపోయేది. మళ్లీ కాలేజీకి వచ్చి రిషి తో మాట్లాడుతూ తనని బాధ పెట్టడం తప్ప ఇంకేముంది అంటుంది జగతి. తను ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది అంటాడు మహేంద్ర. చెప్పడానికి ఏముంది చేసిన తప్పుని సమర్థించుకుంటుందేమో అంటుంది జగతి. అంతా తెలివైన అమ్మాయి ఇలా చేయటం ఏంటి ఎన్ని కలలు కన్నాను. గురుదక్షిణ గా రిషి ని నీకు ఇస్తానంది అంటాడు మహేంద్ర.
రిషిని నిలదీసిన వసు..
రిషి ని ఒంటరిగా నాకు అందించింది కదా అంటూ బాధగా ఉంటుంది జగతి. మరోవైపు వసుని తలుచుకుంటూ బాధపడుతుంటాడు రిషి. రిషి వేరు ధార వేరు ఎవరి జీవితాలు వారివిగా చీల్చేసింది. నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు నా వైపు నుంచి నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఆ తాళి ఎందుకు కట్టించుకున్నావు అని అడిగితే నా ఇష్టప్రకారమే అని అంటున్నావు. అర్థం లేకుండా పోతున్న నా జీవితానికి ఒక అర్ధాన్ని చూపించావు అనుకున్నాను కానీ నేను అర్థం చేసుకున్నదంతా అబద్ధమని ఒక్క మాటలో నిరూపించావు అనుకుంటాడు రిషి.
అంతలోనే అక్కడికి వచ్చిన వసు ఇంటిని వదిలేసి ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుంది. నాకు చిన్నప్పటినుంచి అలవాటే చిన్నప్పుడు ఒకరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, సాక్షి మాట ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అద్భుతమైన సంఘటన నా జీవితంలో జరిగింది. బహుశా ఒంటరితనం నాకు శాపంగా మారిన వరమేమో అంటాడు రిషి. మోసపోవడం కూడా అలవాటైపోయింది అంటూ బాధపడతాడు. వసు మెడలో తాళిబొట్టు చూసి ఎమోషనల్ అవుతాడు.
వసు మాట వినిపించుకోని రిషి..
మనం మాట్లాడు కోవాలి సార్ అని వసు అంటే, కొన్ని మాటలు వాడడం సంస్కారం కాదు నువ్వు నేను అనుకోవడం ఓకే కానీ మనం అనుకోవడం కరెక్ట్ కాదు అంటాడు రిషి. నేనేంటో మీకు తెలుసు మీరు ఏంటో నాకు తెలుసు అంటుంది వసు. ఎవరేంటో తెలిసిపోయింది కానీ నేనేంటో నాకు తెలియటం లేదు పాత విషయాలన్నీ తవ్వొద్దు అంటాడు రిషి. మీరు నాకు పిల్లి ఇవ్వమని చెప్పారట కదా అందుకే మీకు థాంక్స్ చెబుదామని వచ్చాను అంటుంది వసు. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా నీకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత నాదే కదా అంటాడు రిషి.
ఎదురుగా ఉండి కూడా నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఇంటికి ఎందుకు వెళ్లట్లేదు అంటుంది వసు. నాకు పని ఉంది నేను వెళ్తాను అని రిషి అంటే మీరు ఎందుకిచ్చారు తెలియదు కానీ కరెక్ట్ టైం కి ఇల్లు ఇచ్చారు అంటుంది వసు. కొత్త కాపురం పెట్టడానికి సామాన్లు కొనడానికి వస్తున్నారెమో అనుకుంటూ వసు చెప్పిన మాట వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. బయటికి వస్తున్న వసుకి దేవయాని ఎదురవుతుంది. నాకు ఎవరి అడ్డు వచ్చిన అడ్డు తొలగించుకుని వెళ్లడమే నాకు అలవాటు ఉంటుంది దేవయాని.
అనుకోకుండా ఎదురుపడిన వసు, దేవయాని..
అడ్డు తొలగించుకుంటూ పోతే మీతో ఎవరు మిగలరు ఒంటరిగా మిగిలిపోతారు. మనమే తప్పుకుంటూ వెళ్తే మనమే బాగుంటాం అంటుంది వసు. తప్పుచేసి కూడా ఇంత ధైర్యంగా ఎలాగ మాట్లాడుతున్నావు మీకు ఇంత ధైర్యం ఎక్కడిది అంటే నా ధైర్యం రిషి సర్,మీకు ఇంతకు ముందే చెప్పాను కదా అంటుంది వసు. నీ మాటలు వింటుంటే అసహ్యంగా ఉంది చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడికి ఏ ప్లాన్ మీద వచ్చావు అంటుంది దమయంతి. మంచి పనులు చేయటానికి ప్లాన్లు అక్కర్లేదు అలాంటివన్నీ మీలాంటి వాళ్ళు చేస్తారు నా స్టైల్ అది కాదు అంటుంది వసు.
నీ స్టైల్ ఏంటో అర్థం అవుతూనే ఉంది, రిషి నిన్ను మళ్ళీ రానిస్తాడని కాలేజీలో ఉండనిస్తాడని ఎలాగ అనుకున్నావు అంటుంది దేవయాని. రిషి సార్ మనసు నాకు బాగా తెలుసు అంటుంది వసు. తనని పెంచి పెద్ద చేసింది నేను నువ్వు నాకు చెప్తున్నావా అంటుంది దేవయాని. ఎదిగిన మొక్కని చూసి సంతోషించాలి అంతేగాని నేను పెంచాను నేను పెంచాను అంటూ విర్రవీగకూడదు. రిషి సార్ గురించి మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను ఆయనకి నా మనసు నీకు తెలుసు నాకు రిషి సార్ మనసు తెలుసు అంటుంది వసు. రిషి నిన్ను ఉండనిచ్చిన నేను ఉండనివ్వను అంటుంది దేవయాని.
కుట్రలు, కుతంత్రాలు శాశ్వతం కాదంటున్న దేవయాని..
నేను పునాది లాంటి దాన్ని మీరు నీటి తుప్పర్ లాంటివాళ్ళు మీ బెదిరింపులకు నేను భయపడను అంటుంది వసు. ఏదో ఒకసారి గెలిచానని విర్రవీగిపోవద్దు, రిషి నిన్ను పదేపదే నమ్ముతాడు అనుకోవద్దు నేను నమ్మను ఇవ్వను కుట్రలు కుతంత్రాలు ఎక్కువ రోజులు శాశ్వతం కాదు అంటుంది దేవయాని. నాది కూడా అదే మాట అంటూ తిప్పికొడుతుంది వసు. ముందు దారి తప్పుకో అని దేవయాని అంటే మీరే తప్పుకోండి అంటుంది వసు. నేను మూర్ఖులకి దారి ఇవ్వను అంటే నేను ఇస్తాను మీ పెద్దరికంకి విలువ ఇస్తాను అంటూ దారి ఇస్తుంది వసు.
నీ సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది దేవయాని. రిషి సార్ కి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మెసేజ్ పెట్టాలి అనుకుంటూ అతనికి మెసేజ్ పెడుతుంది వసు. ఆ మెసేజ్ చదివిన రిషి ఆ ప్రాజెక్టు కోసం వెళ్ళినప్పుడు ఎన్ని జ్ఞాపకాలు అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు రిషి. ప్రాజెక్టు విషయం గా ఎప్పుడు కలుద్దాము అని మెసేజ్ పెడుతుంది వసు. కలవడము జరిగింది విడిపోవడం కూడా జరిగింది ఇంకా ఇదంతా ఏంటి, ఆర్డర్ వేస్తున్నావా అనుకుంటాడు రిషి. నాకు ఎందుకు చెప్తున్నావు నేను ఎండి ని కాదు కదా అని రిప్లై ఇస్తాడు రిషి.
Guppedantha Manasu January 24 Today Episode: వసుని వెంటాడుతున్న రాజీవ్..
మీరు ఎండి కాకపోవడం ఏంటి మీరు ఎప్పుడు నాకు ఎం డి ఏ అంటూ రిషి కి ఫోన్ చేస్తుంది వసు. రిషి తన ఫోన్ స్విచాఫ్ చేసేస్తాడు. అంతలోనే అక్కడ ఉన్న రాజీవ్ వసుని పలకరిస్తాడు.అతన్ని అక్కడ చూసి షాక్ అవుతుంది వసు. నేనే నీ అభిమాన రాజీవ్ బావని. ఏంటి మెసేజ్ టైప్ చేస్తున్నావా? మీ మీ రిషి సర్ కేనా, ఏం ఎప్పుడు నాకు గుడ్ మార్నింగ్ అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టలేదు కదా సరేలే కానీ నీతో మాట్లాడాలి అంటాడు రాజీవ్. నాకు నీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోబోతున్న వసు చేయి పట్టుకొని ఆపుతాడు రాజీవ్.
మొగుడు పెళ్ళాలు అన్నాక 100 గొడవలు అవుతాయి అని రాజీవ్ అంటే ఇక్కడ నుంచి వెళ్లకపోతే బాగోదు నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటుంది వసు. ఎప్పటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నీకు పెళ్లి అయ్యిందని రిషికి చెప్పావు కదా ఇంకేముంది అంటాడు రాజీవ్. రిషి సార్ ని నానుంచి దూరం చేయటం ఎవరివల్లా కాదు అంటుంది వసు.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు అంటాడు రాజీవ్. మన బంధం అప్పుడే తెగిపోలేదు ఆవేశ పడొద్దు. వెళ్ళిపోతానులే కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను, చేయాల్సిన పని చేస్తాను అంటాడు రాజీవ్.అటువైపుగా వచ్చిన ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసు. టచ్ లో ఉంటాను అంటూ వసుకి బాయ్ చెప్తాడు రాజీవ్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.