Guppedantha Manasu January 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఏదో పనిమీద వసు రూమ్ కి వచ్చిన జగతి దంపతులు అక్కడ దేవయానిని చూసి షాక్ అవుతారు. మీరేంటి ఎక్కడ అని అడిగితే చెల్లెలు వల్ల పనులు కావట్లేదు అందుకే వచ్చాను. వసు విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు. తను బాగా ముదిరిపోయింది ధైర్యం ఎక్కువైంది అంటుంది దేవయాని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటాడు మహేంద్ర.
నా స్టైల్లో వసుని డీల్ చేస్తాను అంటున్న దేవయాని..
తనని కంట్లో ముళ్ళు అనుకొని ఇసుతారంగా డీల్ చేశారు కానీ నేను కాలిలో ముల్లు అని నమ్మాను. దాన్ని మొరటుగానే తీయాలి నేను వసుధారని నా స్టైల్ లో ఎదుర్కొంటాను అంటుంది దేవయాని. ఇప్పటికే కాలేజీలో పరిస్థితిలేమీ బాగోలేదు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ రిషికి ఇబ్బందులు తీసుకొస్తారా అంటాడు మహేంద్ర. పిలవడు మనవాడైనా జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించక తప్పదు లేకపోతే వసుధార ముదిరిపోయినట్లుగా జ్వరం కూడా ముదిరిపోతుంది అంటుంది దేవయాని.
ఈ గోలంతా అవసరమా అని జగతి అంటే అవసరమే అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది మనం తనని ఎందుకు భరించాలి అంటుంది దేవయాని. తను మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా ఇక్కడ వర్క్ చేస్తుంది తనకి సపోర్ట్ ఇవ్వమని రిషి యే చెప్తున్నాడు కదా అంటుంది జగతి. రిషి మంచివాడు అందుకని మనం చూస్తూ ఊరుకుంటామా అంటుంది దేవయాని. అంతలోనే అక్కడికి వచ్చిన వసు వెల్కమ్ టు మై క్యాబిన్ అంటుంది. మై కాలేజ్ అంటుంది దేవయాని.
ఎవరైతే నాకేంటి అంటున్న వసుధార..
కాలేజీ మీరైతే వెళ్లి రిషి సార్ సీట్ లో కూర్చోండి నా సీట్లో ఎలా కూర్చుంటారు అని నిలదీస్తుంది వసు. నేను మీ జగతి,మహేంద్ర లాగా సాఫ్ట్ కాదు అని దేవయాని అంటే మీరు సాఫ్ట్ అయినా,హార్డ్ అయినా నాకేమీ ప్రాబ్లం లేదు అంటుంది వసు. మర్యాదగా ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపో అంటే తప్పకుండా వెళ్లిపోతాను అప్పట్లాగా మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్ పెట్టి ఓడించండి అంటూ రిషికి ఫోన్ చేస్తుంది వసు.
ఏం చేస్తున్నావు అని దేవయాని అడిగితే డిసిసరికి ఫోన్ చేసి ఓటింగ్ పెట్టమని చెప్తాను అంటుంది వసు. తన దగ్గర ఫోన్ లాక్కొని తన దూకుడు చూసావా అంటూ జగతికి చెప్తుంది. నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను మీరే కాస్త లేటుగా అర్థం చేసుకున్నారు. రిషి సార్ ఎక్కడ ఉన్నారు కాస్త అర్జెంటుగా కలవాలి అంటూ జగతిని అడుగుతుంది వసు. టెన్షన్ గా ఉన్న దేవయానితో మీరు కంగారు పడకండి, నేనేమీ ఆయనతో చెప్పను నన్ను పంపించాలి అనుకుంటే మీరే ఆయనతో చెప్పండి.
రిషి తలకి మర్దన చేసిన వసు..
నాకు కొంచెం పని ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు. మరోవైపు డల్ గా ఉన్న రిషి స్టాఫ్ బాయ్ ని పంపించమంటూ కాలేజీకి ఫోన్ చేస్తాడు. వసు గురించి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అంతలోనే అక్కడికి వచ్చిన వసుని స్టాఫ్ బాయ్ అనుకొని హెడ్డికి మసాజ్ చేయమని చెప్తాడు. తను మసాజ్ చేస్తుండగా గుర్తుపట్టిన రిషి కళ్ళు తెరిచి వసుని చూస్తాడు. కంగారుగా లేచి నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావు అని అడుగుతాడు. మీకోసమే అని వసు అంటే, ఇక్కడ ఏమి మీటింగు జరగడం లేదు కదా అంటాడు రిషి.
మాట్లాడడానికి ఏమీ లేదు అయినా ఇలా వచ్చి తలకి మర్దన చేయటం ఏమీ బాగోలేదు నేను ఆఫీస్ బాయ్ అని చెప్పాను అంటాడు రిషి. నేను చెప్పేది ఒకసారి వినండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వసు. నేను వెళ్లడానికి సిద్ధంగా లేను, గాయపడిన జంతువుకి తెలీదు తను ఎలాగా వేటాడబడిందో అంటాడు రిషి. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు అంటుంది వసు. ఎందుకంటే గొప్ప ఉదాహరణ నాకు దొరకలేదు దయచేసి వెళ్ళిపో అంటాడు రిషి. నేను వెళ్ళటానికి రాలేదు సర్ వెళ్ళను కూడా అంటుంది వసు.
ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి వసుని వెళ్ళిపోమన్న రిషి..
అసలు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎవరు చెప్పారు అంటే మనసుకి ఎవరు చెప్పక్కర్లేదు అంటుంది వసు. మనసు గురించి నువ్వు మాట్లాడకు అంటాడు రిషి. మీరు వద్దు అన్నా నేను చెప్పి తీరుతాను అని వసు అంటే వద్దన్న పనులు చేయటం నీకు అలవాటే కదా అంటే మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యత ఉంది కదా అంటుంది వసు. బాధ్యతను పదానికి ఈరోజు కొత్త అర్ధాలు వెతుక్కోవాలి ఏమో అంటాడు రిషి. నీతో పని చేయటం నాకు ఆనందంగా ఉంటుంది అని వసూల్ అంటే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా వెళ్ళిపో అంటాడు రిషి.
మీరే కదా నన్ను ప్రాజెక్ట్ హెడ్గా నియమించారు అంటే మినిస్టర్ గారు చెప్పారు అంటాడు రిషి. అప్పుడు మీరు ఓటింగ్ పదవి పెట్టి నన్ను ఎన్నుకున్నారు ఇప్పుడు కూడా ఓటింగ్ పెట్టి నన్ను ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి దించేయండి. నా మనసుకి ఏదో బాధ ఉంది కదా అని బాధ్యతని విస్మరించలేను అంటుంది వసు. ప్రాజెక్ట్ లో పనిచేయటం నాకు ఆనందంగానే ఉంటుంది. కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ ఆశయాల్లో కలిసి నడుద్దాం అంటుంది వసు. అందుకు నవ్వుతున్న రిషి ని ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది వసు.
మీటింగ్ లో మాట్లాడితే అందరూ వింటారు అంటున్న రిషి..
అహింస సిద్ధాంతం కోసం మాట్లాడే పిల్లి రోజుకి మూడు ఎలుకలని ఆహారంగా అడిగిందంట అలా ఉంది నువ్వు మాట్లాడేది అంటాడు రిషి. అర్థం కాలేదు అని వసు అంటే నాక్కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మీటింగులో మాట్లాడు అక్కడ నాతోపాటు చాలామంది వింటారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మీటింగ్లో వసు తన వెనుక రిషి రావటంతో అసహ్యంగా మాట్లాడుకుంటుంటారు లెక్చరర్లు.
వసుధార గారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా కొనసాగుతారు మన అందరం తనకి కోపరేట్ చేయాలి అంటాడు రిషి. పిలుపు కూడా మారింది ఏమైందో అనుకుంటారు లెక్చరర్లు. తను ఈ ప్రాజెక్టు హెడ్గా కొనసాగడం సంతోషం అంటాడు ఫణీంద్ర. వసు ఇలా చేస్తుందని అనుకోలేదు నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను అంటూ తనలో తనే బాధపడుతుంది జగతి. ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేయడానికి నాకు కొన్ని హెల్పింగ్ హాండ్స్ కావాలి అని అడిగితే జగతి మేడం హెల్ప్ తీసుకో అంటాడు ఫణీంద్ర.
తన హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడని జగతి..
నా కొడుకుని ఇంత కష్టపెట్టిన తనతో నేను ఎందుకు కలిసి వర్క్ చేస్తాను అనుకుంటుంది జగతి. అదే విషయాన్ని ఫణీంద్ర కి చెప్తుంది. ఎందుకు ఇలా తప్పించుకుంటున్నారు నా మీద కోపంతోనే కదా, విద్యా వికాస్ కాలేజ్ నుంచి కూడా మన అనుబంధం కొనసాగింది కదా, నా మాటలు వినకుండానే నన్ను దూరం పెడుతున్నారా అంటూ బాధపడుతుంది వసు. ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తారు అది మీ ఇష్టం మీకు నచ్చిన వాళ్ళ హెల్ప్ తీసుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి కానీ మినిస్టర్ గారు ఇచ్చిన టైం ప్రకారం పూర్తవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతున్న రిషి ని ఆపి ఆల్ ద బెస్ట్ చెప్పమంటుంది వసు.
ఆల్ ద బెస్ట్ వసుధార గారు అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. గారు పని సంభోదించినందుకు చాలా బాధపడుతుంది వసు. జగతిని నాతో కలిసి వర్క్ చేయరా అని అడుగుతుంది. నేను మీటింగ్లో అదే కదా చెప్పాను అంటుంది జగతి. ఎందుకు మేడం నన్ను దూరం పెడుతున్నారు అని వసు అడిగితే మీరు దూరంగా వెళ్లిపోయి నన్ను అంటారేంటి, వసుధార గారు నా కొడుకుని మోసం చేసి ఇంకా తన కళ్ళ ఎదురుగుండా అని తిరుగుతూ తనతో మాట్లాడుకుంటున్నారు అంతే కదా అంటూ కోపంగా మాట్లాడుతుంది జగతి. ఏం మాట్లాడినా విరిగిన రిషి మనసు అతుక్కుంటుందా, నన్ను మహేంద్ర ని ఎలాగ మాట్లాడావో మర్చిపోయావా? అని జగతి అంటే నేను అలాగా ఎందుకు మాట్లాడాను చెప్తాను అని వసు అంటే నీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఇంత మందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు.
రిషి ని ఫెయిల్ చేసావు అంటున్న జగతి..
పరీక్షలు కాదు జీవితం ఒకసారి ఫెయిల్ అయితే సప్లమెంటరీ ఉండడానికి. అయినా యూనివర్సిటీ టాపర్ మీరు మీకు ఇవన్నీ తెలియకుండా ఉండదు మీరు రిషి ని ఫెయిల్ చేశారు తన నమ్మకాన్ని, ప్రేమని ఫెయిల్ చేశారు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి. ఆ మాటలకి ఏడుస్తుంది వసు.మరోవైపు ఊరు నుంచి వచ్చిన తండ్రికి మంచి నీళ్లు ఇస్తే ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతుంది వసు.
బాగానే జరిగింది మీ అమ్మ కూడా రావాలని ఆశపడింది కానీ తప్పక అక్క దగ్గరికి వెళ్ళింది అయినా జరిగిందంతా రిషి సర్ వాళ్లకి చెప్పావా అని అడుగుతాడు చక్రపాణి. వీలు కాలేదు నాన్న అంటుంది వసు. ఇలాంటివి ఎంత తొందరగా చెప్తే అంత మంచిది లేకపోతే అపార్థం చేసుకుంటారు కదా అంటాడు చక్రపాణి. ఒక్క మాటతో వాళ్ళ మనసుని మార్చలేము కోపాన్ని కూడా తగ్గించలేము అంటుంది వసు. వసుధర ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడేరేంటి ఇలా జరిగిందేంటి అంటూ పిసి సార్ బాధపడతారేమో అంటూ గిల్టీగా ఫీల్ అవుతాడు.
గిల్టీ గా ఫీల్ అవుతున్న చక్రపాణి..
నేను కూడా నోటికి వచ్చినట్లుగా మాట్లాడాను వెళ్లి వాళ్ళని క్షమాపణ అడుగుతాను అంటాడు చక్రపాణి. వద్దు నాన్న నేను వెళ్లి మాట్లాడుతాను అంటుంది. నా తల్లి మంచి కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధమే అని చక్రపాణి అంటే నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉండిపో అంటూ తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తుంది వసు. నేను ఎక్కడికి వెళ్తానమ్మ నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళను. కానీ రిషి సార్ ని అన్నా మాటలు తలుచుకుంటే మనసు బరువుగా ఉంది నేను చేసిన తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.
జరిగిందాంట్లో వసు తప్పులేదు అంతా ఆ రాజీవ్ నిర్వాకమే అని నేను రిషి సార్ తో చెప్తాను అంటాడు చక్రపాణి. అంతా పని చేయొద్దు అవన్నీ నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అంటుంది వసు. నాకు ఎప్పుడు ఎప్పుడు రిషి సార్ ని చూడాలని ఉంది. మీ ఇద్దరూ పక్క పక్కన నించుంటే నేను కళ్ళారా చూసుకోవాలి అంతకన్నా తృప్తి నాకేం ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను.
Guppedantha Manasu January 25 Today Episode: నువ్వే నన్ను మార్చేసావు అంటున్న చక్రపాణి..
నీ పెళ్లయిన తర్వాత మనవళ్ళతో ఆడుకుంటూ మీ తాత పెద్ద కోపిష్టి అని వాళ్ళతో చెప్తాను అంటే అవన్నీ ఇప్పుడెందుకు ఇప్పుడు నువ్వు మారిపోయావు కదా అని వసు అంటే మంచితనం నాది కాదు నీది, నువ్వే మార్చేసావు అంటాడు చక్రపాణి. నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటాడు చక్రపాణి. అయ్యో మాటల్లో పడి ఆ సంగతి మర్చిపోయాను ఇప్పుడే భోజనం పట్టుకొస్తాను అంటుంది వసు.
నిజానికి పెద్దగా ఆకలి లేదు కానీ నీ చేతులతో భోజనం చేయాలని ఆరాటంగా ఉంది అంటాడు చక్రపాణి. ఇప్పుడే తీసుకు వస్తాను అని వసు లోపలికి వెళ్తుంది. నా కూతురు బంగారం అంటూ మురిసిపోతాడు చక్రపాణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.