Guppedantha Manasu January 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు ఎందుకిలా చేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు అనుకుంటాడు రిషి. ఇంతలో ఒక నీడ తనని ఫాలో అవుతూ ఉంటుంది. వెనక్కి తిరగకుండానే వచ్చింది నువ్వని తెలుసు ముందుకు రా అంటాడు రిషి. నన్ను ఎందుకు వెంటాడుతున్నావు అని అడుగుతాడు. మీతో మాట్లాడాలి అంటుంది వసు.
రిషిని నీడలా వెంటాడుతున్న వసు..
ప్రతిసారి మాట్లాడాలి మాట్లాడాలి అంటావు ఏం మాట్లాడుతున్నావ్ నాతో అయినా నువ్వు ఏం చెప్పినా నేను వినను ఎందుకంటే నాకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికేసాయి అంటూ అక్కడి నుంచి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు. నేను నీ ప్రేమలో ఎందుకు పడ్డాను నేను నీకు జ్ఞాపకాలు మన మధ్య, కానీ ఇప్పుడు నువ్వు మరొకరి సొంతం నువ్వు ఎందుకు ఇలా చేసావో ఎందుకు పెళ్ళికి తొందరపడ్డావు, నువ్వు చెప్పిన మాటలు అన్ని నీటి మీద రాతలేనా అనుకుంటాడు రిషి.
మిమ్మల్ని నీడలా వెంటాడటం కాదు మీ మనసుకి నేనే నీడని అనుకుంటుంది వసు. వెళ్లి రిషి పక్కనే కూర్చుంటుంది. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోబోతున్న రిషిని ఆపి నేను చెప్పిన మాట వినండి, ఈరోజు నేను చెప్తాను మీరు విని తీరాలి అంటే నేను కొన్ని విషయాల్లో చాలా మొండి దాన్ని అంటుంది వసు. ఏమీ జరగనట్టు ఎప్పటిలా నార్మల్గా మాట్లాడుతున్నావు ఇది నీకు ఎలా సాధ్యం అనుకుంటాడు రిషి. ఒక్క రెండు నిమిషాలు నేను మాట్లాడుతాను వినండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వసు.
కూతురికి ధైర్యం చెబుతున్న చక్రపాణి..
ఈ టైంలో ఇలా మాట్లాడటం మంచిది కాదు గౌతమ్ ప్లాట్ పక్కనే నువ్వు వెళ్ళు అంటాడు రిషి. గౌతమ్ సర్ ఫ్లాట్ వైపు మీరు ఎందుకు వచ్చారు అంటుంది వసు. ఏమి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఇంటికి వచ్చిన వసు రిషి ఫోటో చూసుకుంటూ నేను చెప్పిన మాట వినటం లేదు అసలు నన్ను మాట్లాడనివ్వటం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఎన్నాళ్ళు నన్ను దూరం పెడతారు ఎన్నాళ్ళు మీరు బాధపడతారు అనుకుంటుంది.
అంతలోనే అటువైపుగా వచ్చిన చక్రపాణి ఇంకా పడుకోలేదేమ్మా, రిషి సార్ గుర్తొచ్చారా అని అడుగుతాడు. మన మనసుకి నచ్చిన వాళ్ళు ఒక్క మాట అన్నా మనకి బాధగా అనిపిస్తుంది కదా నాన్న అంటూ ఏడుస్తుంది వసు. ఏమ్మా రిషి సార్ ఏమైనా అన్నారా ఆయన కోపం లో ఒక మాట అన్నా పోర్చుకో ఆయన మనసు బంగారం అంటాడు చక్రపాణి. అబద్దాలు బంధం అనే పడవకి పడే చిల్లు లాంటివి నిర్లక్ష్యం చేస్తే జీవిత ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. రిషి సార్ తో జరిగిందంతా చెప్పు, నీవల్ల కాకపోతే చెప్పు నేను వెళ్లి వాళ్ళ కాళ్లు పట్టుకుంటాను అంటాడు చక్రపాణి.
అతనితో మాట్లాడ్డానికి భయంగా ఉందన్న జగతి..
వద్దు అంటూ ఏడుస్తుంది వసు. నువ్వు ఏడవద్దు మన ఇద్దరం వాళ్ళ కోపాన్ని ఎలాగైనా తగ్గిద్దాం అంటూ కూతుర్ని ఓదారుస్తాడు చక్రపాణి. మరోవైపు వసుధార చేసిన గాయం నుంచి రిషి చేరుకోవటానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ చాలా త్వరగానే బయటపడ్డాడు అంటాడు మహేంద్ర. కొన్ని గాయాలకు కాలమే ముందుగా మారుతుంది. అందర్నీ వాళ్ళదిలీ వెళ్తాను అన్న రిషి వెనక్కి రావటం ఆశ్చర్యంగా ఉంది. కళ్ళు ఎదురుగా వసుధార కనిపిస్తుంటే ఆ గాయం మరింత బాధ కలిగిస్తుంది అంటుంది జగతి.
రిషి అందరినీ వదిలేసి వెళ్లకుండా ఉండడం అనేది మంచి పరిణామమే ఉంటుంది జగతి. వాళ్ళిద్దరూ ఎన్నెన్నో అనుకున్నారు, ఎన్నెన్నో ఎదుర్కొన్నారు. కానీ వసుధర అలా చేసేసరికి రిషి మళ్ళీ మొదటికి వచ్చేసాడు అంటూ బాధపడతాడు మహేంద్ర. రిషిని చూడాలన్నా తనతో మాట్లాడాలని నాకు భయమేస్తుంది అంటుంది జగతి. నన్ను కూడా దూరం పెడుతున్నాడు ఒకప్పుడు అన్ని విషయాలు నాకు చెప్పేవాడు అంటాడు మహేంద్ర.
నిద్రలో కూడా వదలని వసు..
తన విషయంలో మనం ఎక్కువ జోక్యం చేసుకోకపోవటమే మనం అతనికి చేసే హెల్ప్ అంటుంది జగతి. నిద్ర నుంచి తుళ్ళిపడి లేచిన రిషి నేను ఏదైతే మర్చిపోతే అనుకుంటున్నానో అదే కళ్ళ ముందుకదులుతోంది. ఇన్నాళ్ళ మన పరిచయాన్ని బోర్డు మీద అక్షరాల్లాగా చెరిపే లేకపోతున్నాను అనుకుంటాడు రిషి. అదే సమయంలో వసు కూడా రిషిని తలుచుకుంటూ ఉంటుంది. నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా మీరు వినేలాగా లేరు అనుకుంటూ రిషి కి ఫోన్ చేస్తుంది.
నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాను నాకు తోడుగా వస్తారా అని అడుగుతుంది. ఏమి సమాధానం చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు అనుకుంటుంది వసు. మరోవైపు క్యాబిన్లో కూర్చున్న వసూల్ దగ్గరికి వచ్చిన లెక్చరర్లు రమ్మన్నారు అంట కదా అని అడుగుతారు. మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి రెడీగా ఉండండి అంటుంది వసు. చదవటానికి ఏముంది లెండి అంటుంది ఒక లెక్చరర్.
లెక్చరర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసు..
అంతా తేలిగ్గా తీసుకోకండి మినిస్టర్ గారు టైము చాలా వాల్యుబుల్ ఆయన టైం కి మనం వాల్యూ ఇవ్వాలి అంటుంది. మనల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంది రిషి సర్ వెనక్కి వచ్చేసారు అంటే కారణం ఏమై ఉంటుందో అంటూ గుసగుసలాడుకుంటారు లెక్చరర్లు ఇద్దరు. ఏదైనా అడగాలనుకుంటే సూటిగా అడగండి ఒక పని మీద వచ్చారు ఆ పని మీద శ్రద్ధ చూపించడం లేదు. ఏంటి మీ ప్రాబ్లం అంటూ కేకలు వేస్తుంది వసు. అంటే వసు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది ఒక లెక్చరర్.
అవన్నీ నా వ్యక్తిగత విషయాలు వాటికి మీకు సంబంధం లేదు. నాకు ఇక్కడ శాలరీ ఇస్తుంది మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వర్క్స్ చేయటానికి, అలాగే మీకు శాలరీ ఇస్తుంది పిల్లలకి పాటలు చెప్పటానికి అంటూ మీ మనసులో నా పెళ్ళికి సంబంధించిన ఆలోచనలు తీసేయండి, అలా చేయటం వల్ల మీ టైమే వేస్ట్ ఆ ఫైల్ చదివి మిషన్ ఎడ్యుకేషన్ మీద అవగాహన పెంచుకోండి అంటూ వాళ్ళిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వసుధార.
వసు వాళ్లకి లిఫ్ట్ ఇచ్చిన రిషి..
సీట్ కట్ చేస్తే వసు వాళ్ళు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్న కారు నడరోడ్డు మీద ఆగిపోతుంది.క్యాబ్ బుక్ చేసుకుందామా అని ఒక లెక్చరర్ అడిగితే జగతి మేడం, రిషి సర్ లేకుండా ఫస్ట్ టైం నేను మినిస్టర్ గారిని కలుస్తున్నాను లేటుగా వెళ్తే బాగోదేమో అంటుంది వసు. అంతలోనే అటువైపుగా వచ్చిన రిషి వీళ్ళని చూసి కారు ఆపుతాడు.మీరు ఇంకా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లలేదా అంటూ లెక్చరర్ ని అడుగుతాడు.
కారు ట్రబుల్ ఇచ్చింది అని చెప్తుంది లెక్చరర్. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు లేటుగా వెళ్తే బాగోదు నేను డ్రాప్ చేస్తాను రండి అంటూ వాళ్ళిద్దర్నీ తన కారులో ఎక్కించుకుంటాడు రిషి. సరైన సమయానికి వచ్చారు సర్ అనుకుంటుంది వసు. టైం అయిపోతుంది త్వరగా పదా అంటూ లెక్చరర్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వసు బ్యాక్ సీట్ లో కూర్చుంటుంది.నా పక్కన కూర్చో వలసింది నా వెనక సీట్లో కూర్చున్నావు. సీటే కాదు నీ మనసు కూడా మారిపోయింది.
Guppedantha Manasu January 26 Today Episode లెక్చరర్ ని తిట్టుకుంటున్న వసు..
ఫ్రెండ్షిప్ కి బ్యాక్ సీట్ కి మధ్య ఉన్న గ్యాప్ లో ఇంత బాధ ఉంటుందని నేను అనుకోలేదు అనుకుంటాడు రిషి. నేను ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను మీరు నా మనసులో ఉంటారు ఈ విషయం చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇవ్వటం లేదు అనుకుంటుంది వసు. ఈలోగా లెక్చరర్ వసుధర ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకుంది అని రిషితో చెప్తూ, మీవారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది.ఈ ఒక్క తాళి మెడలో వేసుకున్నందుకు ఎన్ని రకాలుగా సమాధానాలని దాటువేయాల్సి వస్తుందో అనుకుంటుంది.
నువ్వు ఒక కాల్ చేస్తే మన కాలేజీ వాళ్లందరినీ ఒక బస్సు వేసుకొని వచ్చేవాళ్ళం కదా అంటుంది లెక్చరర్. అసలే రిషి సార్ బాధలో ఉంటే ఈవిడ ఉంటే పెళ్లి గురించి మాట్లాడుతుంది అనుకుంటుంది వసు. ఈ టాపిక్కు ఇంకా వదిలేయండి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు రిషి సార్ కి చెప్పండి అంటుంది వసు. నాకు ఏమీ చెప్పక్కర్లేదు అన్ని గుర్తున్నాయి అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.