Guppedantha Manasu January 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో రిషి ఇప్పుడే ఫోన్ చేశాడు నీకేమీ భయం లేదు నేను వస్తున్నాను అని చెప్పాడు. పెళ్లికి ముందే వచ్చేస్తాడు ఏమో అని భయంగా ఉంది మీరే అమ్మాయికి నచ్చ చెప్పాలి అంటూ రాజీవ్ కి చెప్తాడు చక్రపాణి. మావయ్య గారు మీరు భయపడకండి వచ్చిన రిషి ని మీ వసుధారే వెళ్ళగొట్టేలాగా చేస్తాను కదా అంటాడు రాజీవ్. అదెలా అని చక్రపాణి అడిగితే ధర్మం మనం వైపు ఉంది.
చక్రపాణి కి ధైర్యం చెబుతున్న రాజీవ్..
పైగా మీ అల్లుడు తెలివైనవాడు ఏది మంచో ఏది చెడు మీ అమ్మాయికి మచ్చ చెప్తాను అంటాడు రాజీవ్. మనం రిషి ని వెళ్ళగొట్టాల్సిన పని లేదు. వాసు తెలివైన కదా చెప్పింది త్వరగా అర్థం చేసుకుంటుంది మీరేమీ టెన్షన్ పడకండి అంటూ చక్రపాణి కి ధైర్యం చెప్తాడు రాజీవ్. నాకు తాళం చెవి ఇవ్వండి నేను వెళ్లి వసుతో మాట్లాడుతాను అంటూ ఆమె ఉన్న గది వైపు వెళ్ళబోతాడు, అతన్ని ఆపి ఇది వసు కి మీ చేతుల మీదగా ఇచ్చి కట్టుకోమనండి అంటూ పెళ్లి చీర రాజీవ్ చేతికి ఇస్తాడు చక్రపాణి.
మిమ్మల్ని చూస్తే కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది, ఇంత మంచితనం ఏంటండీ, ఒక కూతుర్ని ఇచ్చారు అది ఏం దురదృష్టమో, తను చనిపోయిన కూడా మరో కూతురినిచ్చి పెళ్లి చేస్తున్నారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అంటూ చక్రపాణిని బుట్టలో వేస్తాడు రాజీవ్. అంత మాట అనొద్దు అంటూ ఎమోషనల్ అయిపోతాడు చక్రపాణి. నేను వెళ్లి వసుని ఒప్పించుకొని వస్తాను మీరు వెళ్లి పనులు చూడండి అంటూ చక్రపాణి కి చెప్పి తను వసు రూమ్ కి వస్తాడు.
వసుని బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజీవ్..
లోపలికి వచ్చిన రాజీవ్ ని బయటకు పొమ్మంటుంది వసు. కాసేపట్లో మన పెళ్లి జరగబోతుంది బావ అని పిలుపు మానేసి ఏమండీ అని పిలవడం నేర్చుకో అంటాడు రాజీవ్. నీ నోటి నుంచి ఆ పిలుపు వింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనిద్దరికీ శుభవార్త ఏంటంటే మీ అక్క కొడుకుని, అదే నా కొడుకుని అలారం ముద్దుగా పెంచుకుందాం నీ పెంపకంలో వాడు గొప్పవాడు అవుతాడు అంటూ ఏదేదో మాట్లాడుతాడు రాజీవ్. కోప్పడుతున్న వసుని ఆగమని చెప్పి నువ్వు రిషి తో కలిసి క్లోజ్ గా తీసుకున్న ఫోటోలు ఉన్నాయి నా దగ్గర అవి అన్ని న్యూస్ ఛానల్స్ కి ప్రెస్ వాళ్లకి పంచిపెట్టి వచ్చాను.
ఇక రెండో విషయం ఏమిటంటే నువ్వు కాదు కూడదు అంటే అల్లరి పెట్టావంటే ఈ ప్రెస్ వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మీ నాన్న పరువు గోవిందా, పరువే ప్రాణంగా బ్రతికిన మీ నాన్న ఉరేసుకొని చచ్చిపోతాడు, మీ నాన్న లేనప్పుడు అమ్మ మాత్రం ఎలా ఉంటుంది తను కూడా చచ్చిపోతుంది. వీళ్ళందరూ చనిపోతే నువ్వు ఎలా బతుకుతావు ఫస్ట్ టైం కదా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు రాజీవ్. నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను అంటుంది వసు.
వసుకి నిజం చెప్పి షాక్ ఇచ్చిన రాజీవ్..
నాకు తెలుసు నీకు ధైర్యం ఎక్కువ అని అంటూ పిస్టోల్ తీసి చూపిస్తాడు. అవసరమైతే దీన్ని కూడా వాడతాను అంటాడు. నీ దగ్గర ఏ ఫోను రికార్డులు లేవు కదా అంటూ నిజం చెప్తాడు రాజీవ్. దీన్ని ఇప్పుడు చివరిసారిగా వాడానో తెలుసా అంటూ జగతి మేడంకి గురిపెట్టిన సంగతి చెప్తాడు.ఆ మాటలకి షాక్ అయిపోతుంది వసు. అప్పుడు కాస్తలో మిస్సయింది కానీ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాను అంటాడు రాజీవ్. ఏంటి బెదిరిస్తున్నావా కాల్చు అంటూ తన నుదుటి మీద పిస్తోల్ ని పెట్టుకుంటుంది వసు.
మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం రిషి లో ఉందని తెలుసు అందుకే నేను రిషి ని చంపేస్తాను అంటూ వసుని బెదిరిస్తాడు రాజీవ్. నువ్వు పెళ్లికి గోపకోకపోతే నిన్ను ఏమీ చేయను ఎందుకంటే నువ్వు నా ప్రాణం, నువ్వు కూడా భయపడవనుకో, అందుకే మొదటి బుల్లెట్ మీ రిసీజర్ కి రెండో బుల్లెట్ మీ జగతి మేడంకి, ముచ్చటగా మూడోది మీ మహేంద్ర సర్ కి గిఫ్ట్ గా ఇస్తాను. నేను మాట ఇచ్చి తప్పను మొదటి నుంచి నువ్వంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను.
పెళ్లయ్యాక అన్ని నిజాలు చెప్తానంటున్న రాజీవ్..
మాట తప్పానా తప్పలేదు కదా, మధ్యలో అలా జైలుకి వెళ్ళొచ్చాను అయినా కూడా మాట తప్పలేదు కదా, ఇన్నాళ్లకు మనం పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి నాకు సంబంధించిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ పెళ్లయ్యాక సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు హనీమూన్ కి వెళ్తున్నప్పుడు చెప్పేస్తానులే అంటాడు రాజీవ్. ఇప్పుడు రిషి లోపలికి వస్తే ఏమని చెప్తావ్ అంటాడు రాజీవ్.
బ్రతిమిలాడతావో, బెదిరిస్తావో అదంతా నాకు అనవసరం కానీ ఇక్కడ రచ్చ జరగకూడదు జరిగిందంటే నీ కళ్ళ ముందే నీ రిషి సార్ ని లేపిస్తాను అంటాడు. చూసిన పాపానికి మీ అమ్మానాన్న కూడా లేపేస్తాను. అందుకే రిషి సార్ ని సావధానంగా నువ్వే బయటికి పంపించాలి, లేకపోతే నేనే తనని పైకి పంపిస్తాను తర్వాత నీ ఇష్టం అంటూ పెళ్లి చేరని ఇచ్చి తొందరగా రెడీ అవ్వమంటాడు రాజీవ్. నీకు నాకు పెళ్లి అంటే ఏంటో గాల్లో తేలిపోతున్నట్టు ఉంది అంటూ మురిసిపోతాడు రాజీవ్.
Guppedantha Manasu January 3 Today Episode: తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతున్న వసు..
నేను బాగా చదువుకున్నాను అందగాడిని బాగా సంపాదిస్తున్నాను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మనిద్దరికీ అంటూ గన్ తన చేతిలోకి తీసుకొని ఇది వాడే అవకాశం రానివ్వని అనుకుంటున్నాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు రాజీవ్. ఓ మాటలకి చాలా భయపడిపోతుంది వసు. పెళ్లికూతురు లాగా ముస్తాబైన వసు,రాజీవ్ అన్న మాటలు తలుచుకొని ఏడుస్తుంది.
రిషి ఇచ్చిన ఉంగరాన్ని,జగతి మేడం ఇచ్చిన నల్లపూసల్ని చూసుకుంటూ బాధపడుతుంది.జగతి మేడం ముందు చూపుతోనే నాకు ఇది పంపించి ఉంటారు అనుకుంటే రిషి తన మెడలో నల్లపూసలు వేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.