Guppedantha Manasu March 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు ఇదే రూమ్ లో గెస్ట్ గా ఉండేదాన్ని ఇప్పుడు కుటుంబ సభ్యురాలు లాగా అడుగు పెట్టాను చాలా ఆనందంగా ఉంది అనుకుంటుంది వసు. అందులోని అక్కడికి వచ్చిన ధరణి అనుకోకుండానే ఈ రూమ్ ని సర్ది పెట్టాను అంటుంది. నాకోసమే అయి ఉంటుంది అని వసు అనటంతో ఇద్దరూ హత్తుకుంటారు. పెద్ద అత్తయ్య గారు నీ మీద కోపంగా ఉన్నారు.

వసుని హెచ్చరిస్తున్న ధరణి..

నువ్వు ఈ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరిస్తుంది ధరణి. నేను ఒక్క రిషి సార్ దగ్గర మాత్రమే జాగ్రత్తగా ఉంటాను మిగిలిన వాళ్ళ దగ్గర పెద్దగా భయపడవలసిన పని లేదు. నా లోకం నా జీవితం నా ప్రపంచం అంతా రిషి సరే. రిషి సర్ కి భార్యగా,తన మనిషి గా జీవితాంతం ఉండిపోతే చాలు ఇంకేమీ అక్కర్లేదు అంటుంది వసు.

మరోవైపు లేటుగా లేచిన వసు మెసేజ్ చేయకపోవడంతో ఫీలై ఉంటుందేమో అనుకుంటాడు. గది బయటికి వచ్చి చూసేసరికి కిందన పూజ చేస్తూ కనిపిస్తుంది వసు. ఇదేంటి అలా తలుచుకునేసరికి ఇలా కనిపిస్తుంది తను ఇక్కడికెందుకు వస్తుంది. నా ఊహ, ఊహల్లో కూడా తను ఇబ్బంది పెడుతుందా, అక్కడున్న పొగరుకి ఫోన్ చేద్దాము ఏం కారాలు మిరియాలు నూరుతుందో అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తాడు.

అయోమయంలో రిషి..

కిందనున్న వసు ఫోన్ లిఫ్ట్ చేయడంతో వెంటనే ఫోన్ చేసి తను ఎక్కడికి వచ్చిందా వచ్చి నన్ను కలవకపోవడం ఏంటి అనుకుంటూ కిందికి దిగుతాడు. కింద పూజ చేసుకుంటున్న వసుని చూసి తను ఏంటి ఇంత పొద్దున్నే వచ్చింది అని అయోమయంలో పడతాడు. అదే విషయాన్ని వసుని అడుగుతాడు. ఇక్కడే ఉందామని వచ్చాను అంటుంది వసు. అదేంటి నువ్వు ఇక్కడ ఉండడం అంటాడు రిషి.

సరిగ్గా నేను ఇదే ప్రశ్న అడిగాను తను ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నావా చాలా సేపు అయింది అంటుంది దేవయాని. వాళ్ల నాన్న స్వయంగా వచ్చి లగేజ్ తో దింపేసి వెళ్ళాడు. ఇదేంటి అని వసుధారని అడిగితే తాళిబొట్టు చూపించి హక్కు అధికారం అంటుంది. ఇదంతా పదిమందిలో నువ్వు తన భార్య అన్నావు కదా అందుకే ఇదే అవకాశం అనుకొని పెట్టే బేడాతో సహా వచ్చేసింది.

జగతి దంపతుల మీద చాడీలు చెబుతున్న దేవయాని..

దీనికి మహేంద్ర, జగతి కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటుంది దేవయాని. కం టు మై రూమ్ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మేడం రిషి సార్ నన్ను తన రూమ్ కి రమ్మంటున్నారు ఒంటరిగా రమ్మంటున్నారు వెళ్లి మాట్లాడేసి వస్తాను అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది వసు. కాఫీతో వచ్చిన పశువుని చూసి నిన్ను తెమ్మన్నానా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ కోప్పడతాడు రిషి.

చెప్పా పెట్టుకుండా లగేజ్ తో ఇంటికి రావడం ఏంటి, ఏం జరుగుతుంది అంటాడు రిషి. సాంప్రదాయం సర్ మీరు లోకానికి ఒక నిజం చెప్పారు దాన్ని నిజం చేయడానికి నేను వచ్చాను అంటుంది వసు. నిజమేంటో నీకు నాకు తెలుసు లోకం కోసం నటించడం ఎందుకు అంటాడు రిషి. కానీ మీరు చెప్పిందే లోకం నమ్ముతుంది కదా అంటుంది వసు. అయినా ఏ పని చెప్పి చేయడం తెలియదా.

ఏ విషయము చెప్పవా అంటూ కోప్పడుతున్న రిషి..

అయినా నాకు చెప్పకుండా రావడం ఏంటి తిన్నావా పడుకున్నావా అంటూ వంద మెసేజ్లు పెడతావు కదా ఇది మాత్రం చెప్పడానికి ఏమైంది అంటూ నిలదీస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని వచ్చావు అని రిషి అంటే మీ ఇష్టం సార్ అంటుంది వసు. నీ ఇష్టానికి నువ్వు వచ్చి నా ఇష్టం అంటావేంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా నాకైతే అర్థం కావట్లేదు.

మెడలో తాళి వేసుకొని ఇబ్బంది పడతావు అందరూ ప్రశ్నిస్తారు. నేను మిమ్మల్ని ఊహించుకొని తాళి వేసుకున్నాను అని చెప్తావు అలాగే చెప్పా కదా అందరి ముందు ఇరుక్కున్నావు. నేనేదో నిన్ను కాపాడుటానికి అలా చెప్పాను అనుకో అంతమాత్రాన నువ్వు బట్టలు సర్దుకొని వచ్చేటమేనా, ఇంట్లో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి కదా వాళ్ళందరూ నేనే నిన్ను రమ్మన్నారని అనుకుంటారు అంటాడు రిషి.

వసుని ఇంట్లోంచి పొమ్మన్న రిషి..

వసు ఏదో చెప్తుండగా ఇంకేమీ మాట్లాడకు వెళ్ళిపో అంటాడు రిషి. నేనేమీ నాకు తప్పు చేశానా అంటుంది వసు. ప్రతిసారి తప్పు మీద తప్పుచేసి మళ్ళీ తప్పు చేశానా అని అడుగుతున్నావు. నేను ఆలోచించుకోవాలి నా మైండ్ పనిచేయట్లేదు అంటూ తనని రూమ్ నుంచి బయటికి వెళ్లిపోమంటాడు రిషి. తర్వాత జగతి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుంది మేడం తను వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారంట కదా ఏమీ మాట్లాడలేదా.

అంటే మీరు ఆమె చేసిన పనిని సమర్థిస్తున్నారా అంటూ నిలదీస్తాడు రిషి. అక్కడ ఏం మాట్లాడాలో అప్పుడు అర్థం కాలేదు, అయినా పదిమంది ముందు నేను ఒక నిజం చెప్పాను, అది నిజం అంటూ నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటుంది జగతి.ఒప్పుకున్నంత మాత్రాన నిజమైపోతుందా అంటాడు రిషి. ఒక విషయం ఒక దగ్గర నిజము మరొక దగ్గర అబద్ధము ఎలా అవుతుంది.

హద్దు మీరి మాట్లాడలేను అంటున్న జగతి..

నిజానికి మీ ఇద్దరూ ఆలోచనలు ఒక్కటే. ఈ విషయంలో ఇంతకుమించి పరిధి దాటి మాట్లాడలేను అంటుంది జగతి. ఇంతలో వసు ఫోన్ చేయడంతో ఇంట్లోనే ఉంటూ ఫోన్ చేయడమేంటి అంత అర్జెంటు పని ఏంటో మాట్లాడండి అంటాడు రిషి. ఫోన్ లిఫ్ట్ చేసిన జగతి తో ఎక్కడ ఉన్నారు మేడం అని అడుగుతుంది వసు.రిషి తో మాట్లాడుతున్నాను అంటుంది జగతి.

మీతో మిషన్ ఎడ్యుకేషన్ గురించి అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి రండి అంటుంది వసు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది జగతి. అవును మేడమ్ త్వరగా రండి ఓకే అంటూ ఫోన్ పెట్టింది జగతి. అదే విషయాన్ని రిషితో చెప్పబోతే అర్థమైంది మేడం ఇంట్లో మీటింగ్లు పెడుతుంది మీరు వెళ్ళండి అని వెటకారంగా అంటాడు రిషి.

వసుని అప్రిషియేట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్..

నన్ను కూడా పిలవడానికి వస్తుందేమో పిలిస్తేనే వెళ్తాను అనుకుంటాడు రిషి. మరోవైపు హాల్లో అందరూ కూర్చుంటారు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇంట్లో మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటాడు ఫణీంద్ర. మాట్లాడుకోవడానికి ఇల్లు, ఆఫీసు అనేది ముఖ్యం కాదు. చాలామంది కారులో వెళ్తూనే చాలా నిర్ణయాలు తీసుకుంటారు.

అది గొప్ప కోసం కాదు టైం సేవ్ చేయటం కోసం మాత్రమే అంటుంది వసు. అంతలోనే అక్కడికి జగతి రావటంతో మిషన్ ఎడ్యుకేషన్ గురించి చాలా సేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. మన కాలేజీలో పొదుపు సంఘం పెడదాము రూపాయి వడ్డీ కింద డబ్బులు అప్పిద్దాము, అది ఒక విద్యార్థి చదువుకి ఉపయోగపడుతుంది కదా అంటుంది వసు.

పద్ధతులు మాట్లాడుతున్న వసు..

ఆలోచన వాళ్ళకి నచ్చటంతో చప్పట్లు కొడతారు. అంతలోనే అక్కడికి వచ్చిన రిషి ఏమైంది అని అడగటంతో వసు మంచి ఐడియా చెప్పింది అంటాడు మహేంద్ర. నన్ను ఎందుకు పిలవలేదు అంటాడు రిషి. ప్రతి చిన్నదానికి ఎండి గారిని పిలవలేం కదా, మొత్తం అంతా పేపర్ మీద రాసి అప్రూవల్ కోసం ఎండి గారి దగ్గరికి పంపించాలి. ఇది పద్ధతి కదా మేడం అంటుంది వసు.

వసు నన్ను ఇరికించేస్తుంది అనుకుంటూ బయటకు మాత్రం అవును అంటుంది జగతి. మరి ఈ కాలేజీలో ప్రతి మీటింగ్ కి నన్ను పిలుస్తారు అంటాడు రిషి. రిషి అనేది కూడా నిజమే కదా అంటూ తడబడుతూ చెప్తాడు మహేంద్ర. అక్కడంటే అందరూ ఉంటారు బోర్డు మెంబర్స్ లెక్చరర్స్ అందరు ఉంటారు అంతమంది టైం మళ్లీ మళ్లీ తీసుకోలేము కదా, అక్కడ ఎండి గారు ఉంటే డెసిషన్ కూడా వెంటనే తీసుకోవచ్చు అదొక రకం పద్ధతి అంటుంది వసు.

టాపిక్ డైవర్ట్ చేస్తున్న మహేంద్ర..

వర్క్ మాది ఫైనల్ డెసిషన్ మీది ఇది మేము మీకు ఇచ్చే గౌరవం అంటుంది వసు. బాగా చెప్పావు వసు పైగా రిషికి కాలేజీ విషయాలు ఇంట్లో మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు అంటాడు ఫణీంద్ర. నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది వసు. చేసినవన్నీ ఒక్కోవటం అందరికీ సాధ్యం కాదు అంటాడు రిషి. వీళ్ళిద్దరూ మళ్లీ వేరే టాపిక్ లోకి వెళ్తున్నారు టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటున్నాడు మహేంద్ర.

ఒక మంచి ఐడియా ఇచ్చింది అని మహేంద్ర అంటే అది రాసి నాకు పంపించండి అది మంచి ఐడియాను కాదు నేను డిసైడ్ చేస్తాను. ఇదొక ప్రోటోకాల్, ఇదొక పద్ధతి అంటూ వసువైపు వెటకారంగా చూస్తాడు రిషి. మీరు కంటిన్యూ చేయండి అద్భుతమైన ఐడియాలు చర్చించండి అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. ఫణీంద్ర కూడా పని ఉందంటూ వెళ్ళిపోతాడు. ఇంకేంటి విశేషాలు అని అడుగుతాడు మహేంద్ర.

Guppedantha Manasu March 11 Today Episode మంచి జరగాలని కోరుకుంటున్న జగతి దంపతులు..

మన మీటింగ్ అయిపోయింది ఇదే పాయింట్ గురించి మీరు కూడా ఆలోచించండి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు. అందుకు ఇరిటేట్ అయిన మహేంద్ర ఏంటి వీళ్లిద్దరూ మారరా అంటాడు. వాళ్ళిద్దరికీ ఒకరు ఉంటే ఒకరికి విపరీతమైన గౌరవం అంటుంది జగతి. ఇదేమి గౌరవం ఒకరితో ఒకరు వాదించుకునే ఉంటారు నాకు అర్థం కావట్లేదు బాబోయ్ అంటూ తల పట్టుకుంటాడు మహేంద్ర.

ఇద్దరూ తెలివైన వాళ్ళు ఇద్దరూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్నవాళ్లు అదే వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఉంటుంది వసు. ఆత్మగౌరవం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది, అయినా వాళ్ళిద్దరి మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుంది అంటావు అంటాడు మహేంద్ర. వాళ్ల పంతలు పట్టింపులే వాళ్లకి సమస్య వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళే తగ్గించుకుంటారు.

త్వరలోనే ఇద్దరు ఎప్పట్లా కలిసిపోవాలని ఆశిద్దాం, పైగా ఒక ఇంట్లోనే ఉంటారు కాబట్టి అపార్థములు త్వరగానే తొలగిపోతాయి అంటుంది జగతి. శుభం అంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.