Guppedantha Manasu March 14 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో ఎవరూ కనబడకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది దేవయాని. ఫణీంద్ర ని కూడా టెన్షన్ పెడుతుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు దేవయాని అని అంటే ఏ రెస్టారెంట్ కి వెళ్లి ఉంటారులే వచ్చేస్తారు లే అంటాడు ఫణీంద్ర. చెప్పి వెళ్లాలి కదా నా పెత్తనము,పెద్దరికం సాగకుండా పోతుంది అంటుంది దేవయాని.
ఇలా చేయడం అన్యాయం అంటున్న ఫణీంద్ర..
పెత్తనం అనేది ఐస్ క్రీమ్ లాంటిది ఫ్రిజ్లో ఉన్నంతసేపే గట్టిగా ఉంటుంది బయటికి తీస్తే కరిగిపోతుంది అంటాడు ఫణీంద్ర. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రిషితో సహా అందరూ వస్తారు. ఏంటి ఈ అవతారాలు, ఇలాంటి ఐడియాలు ఎవరిస్తారు నాకు తెలుసు అంటుంది దేవయాని. వసు ఆమెకి హ్యాపీ హోలీ చెప్తుంది. ఆమె మీద చిరాకు పడుతుంది దేవయాని.
రిషి కూడా ఆమెకి హ్యాపీ హోలీ చెప్తాడు. మేం హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పటంతో ఏం చేయాలో తెలియక నువ్వు హ్యాపీయేనా, నాకు నీ సంతోషమే కావాలి అంటుంది. మహేంద్ర కూడా ఫణీంద్ర దంపతులకు హ్యాపీ హోలీ చెప్తాడు. అన్యాయం మమ్మల్ని కూడా పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా అంటాడు ఫణీంద్ర. ఎక్కడో బస్తీ వాళ్ళతో ఆడి వస్తే మీరు సంబర పడుతున్నారా అంటూ భర్తని మందలిస్తుంది.
వసుకి థాంక్స్ చెప్తున్న రిషి..
పండగ ఎవరికైనా పండగే అంటాడు ఫణీంద్ర. సరే నాన్న నువ్వు వెళ్లి స్నానం చేసి రా చిన్నప్పటినుంచి నీ స్కిన్ కి కలర్స్ అవి పడవు చిన్నప్పటినుంచి పెంచాను కాబట్టి నాకు తెలుసు మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటుంది దేవయాని. రిషి వెళ్ళిపోయిన తర్వాత హోలీ పండగ సందర్భంగా స్వీట్స్ ఏమీ చేయలేదా అని వెటకారంగా అడుగుతుంది వసు.
దేవయాని ఏమీ మాట్లాడకపోవడంతో నేను వచ్చి చేస్తాలెండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళేసరికి అక్కడ రిషి ఉంటాడు రంగులు చెరిగిపోతాయి కానీ ఈ ఆనందం ఎప్పటికీ ఉండిపోతుంది అంటాడు రిషి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది థాంక్స్ అంటుంది వసు. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. డాడీ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ నాకు చాలా ఆనందాన్నిచ్చాయి అంటాడు రిషి.
క్రెడిట్ వసుకి కూడా వెళ్తుంది అంటున్న జగతి..
మీ ఆనందమే నా ఆనందం అంటుంది వసు. ఇదంతా వెనకనుంచి వింటుంది దేవయాని. మీ కలలో మెరుపు మీ పెదాల్లో చిరునవ్వు ఇవే నాకు గొప్ప సంతోషాన్నిచ్చాయి అంటుంది వసు. అంతలో దేవయానిని గమనిస్తారు రిషి వాళ్ళు. అది గమనించిన దేవయాని ఇలా వెళ్తున్నాను చీర తట్టుకుంది అంటుంది. నేను సరి చేస్తాను అని రిషి అంటే వద్దులే నాన్న అంటూ సరి చేసుకుంటుంది.
వసు,దేవయానిని అనుమానంగా చూస్తుంది. మరోవైపు జగతి కి థాంక్స్ చెప్తాడు మహేంద్ర. ఎందుకు అని జగతి అడిగితే రిషి, వసులు చాలా రోజుల తర్వాత ఆనందంగా గడిపారు, ఐడియా ఎవరిదైనా ఆనందం మనందరి దీని వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటాడు మహేంద్ర. అక్కయ్య ఏమైనా అంటుందనుకున్నాను కానీ రిషి ని చూసి బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వింది అనుకుంటుంది జగతి.
నేను తప్ప అందరూ హ్యాపీయే అనుకుంటున్న దేవయాని..
ఆ మాటలు దేవయాని వింటుంది. ఒక్కొక్కసారి ఈ పండగలు ఎందుకురా అనుకునేవాడిని కానీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమని పెంచే ప్రతి పండుగ మనకి అవసరమే అంటాడు మహేంద్ర. ఈ ఇంట్లో నేను తప్ప అందరూ హ్యాపీగానే ఉన్నారు అనుకుంటుంది దేవయాని. మరోవైపు రిషి వసూ ఇద్దరు టీ తాగుతూ ఉంటారు హోలీ రంగులు ఇంకా పోలేదు సార్ అంటే ఉండనీ ఏం పోయింది అంటాడు రిషి.
అలా చేతులకి ఉంటే బాగోదు అంటూ అతని చేతిని కాటన్ తో క్లీన్ చేస్తుంది వసు. నీకు ఎందుకు ఇంత శ్రద్ధ అని రిషి అడిగితే ప్రేమ సార్ అంటుంది వసు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఒక్కటే అంటాడు రిషి. ఆ టాపిక్ తేవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వసు. చిన్నప్పుడు కలర్స్ ని కిరోసిన్ తో క్లీన్ చేసే వాళ్ళం అంటుంది వసు. అప్పటికే వాళ్ళ మాటలు వింటున్న దేవయాని,రిషి అంటూ లోపలికి వస్తుంది.
మనం తప్పు చేశామంటున్న రిషి..
వసు కలర్స్ ని క్లీన్ చేస్తుంది అంటాడు రిషి. అర్థమైంది లే అంటుంది దేవయాని. హోలీ సెలబ్రేషన్స్ లో నువ్వు అలా సంతోషపడితే నేను చూసేదాన్ని కదా, నన్నెందుకు వదిలేసారు. ఆ మురికివాడలో చేసుకునే బదులు ఇక్కడ చేసుకుంటే అందరం ఉండేవాళ్లం కదా అంటుంది దేవయాని. కరెక్టే కదా ఈ ఐడియా నాకెందుకు రాలేదు అంటాడు రిషి. సంతోషాలు సంబరాలు పండగలు అన్ని అందరూ కలిసి జరుపుకుంటేనే బాగుంటుంది అంటుంది దేవయాని.
అవును వసు మనం చాలా పెద్ద తప్పు చేసాము అంటాడు రిషి. నీ తప్పేమీ లేదు రిషి అంతా వసు వల్లే తనే నన్ను పిలవడం మర్చిపోయింది అయినా పర్వాలేదులే నాకు నీ ఆనందమే, నా ఆనందము అంటుంది దేవయాని. ఈవిడ నన్ను కావాలని ఇరికిస్తుంది అనుకుంటుంది వసు. చూసావా అసలు పెద్దమ్మది ఎంత పెద్ద మనసో, తనని వదిలేసి మనం పండగ చేసుకుంటే సంతోషపడుతుంది తప్పితే బాధపడడం లేదు అంటాడు రిషి.
నన్ను దూరం పెట్టొద్దు అంటున్న దేవయాని..
ఏ విషయంలోని నన్ను దూరం పెట్టొద్దు అని దేవయాని అంటే ఇంకొకసారి ఇలా జరగదు అంటూ ఈసారి ఈ సెలబ్రేషన్ జరిగిన నా పక్కన పెద్దమ్మ ఉండవలసిందే,ఆ బాధ్యత నీదే అంటాడు రిషి. అలాగే అంటూ బలవంతంగా నవ్వుతుంది వసు. వసు,జగతి లు కలిపి రిషి ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు వాళ్ళ ఆటలు సాగనివ్వును అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.
ఆమె వెళ్లిపోయిన తర్వాత నువ్వు పెద్దమ్మని ఎందుకు పిలవలేదు అని అడుగుతాడు రిషి. ఈసారి మాత్రం పిలవటం మర్చిపోకు అని వసుకి చెప్తాడు. తర్వాత సీన్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఫణీంద్ర ఏంటి సడన్గా హోలీ ప్లాన్ చేశారు అని అడుగుతాడు. నాకేమీ తెలియదు పెదనాన్న అంటే మహేంద్ర నీకు తెలుసా అని తమ్ముడి ని అడుగుతాడు.
మహేంద్ర మాటలకి బాధపడిన ధరణి..
నాక్కూడా తెలియదు అన్నయ్య తెలిస్తే మిమ్మల్ని వదిన గారిని తీసుకొని వెళ్లేవాడిని కదా అంటాడు మహేంద్ర. పోనీలెండి మేము రాకపోయినా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు కదా అంతే చాలు అంటాడు ఫణీంద్ర. వాళ్లని అలా చూసేసరికి కడుపు నిండిపోయింది అంటుంది దేవయాని. ఇది మాత్రం నిజం, మమ్మల్ని అలా చూడగానే వదిన గారి మొహంలో ఎంతో సంతోషం కనిపించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే హోలీలో రంగులన్నీ వదినగారు మొహం లోనే కనిపించాయి అంటాడు మహేంద్ర.మన మూడు జంటలు చూడ్డానికి భలేగా ఉన్నాయి కదా అన్నయ్య ఒక సెల్ఫీ తీసుకుందామా అంటాడు మహేంద్ర. అక్కడే ఉన్న ధరణి కొంచెం ఇబ్బంది పడుతుంది. అది గమనించిన వసు మరి ధరణి మేడం? అని అడుగుతుంది. మన గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ ధరణి మేడమ్ గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా.
Guppedantha Manasu March 14 Today Episode అదిరిపోయే ఐడియా ఇచ్చిన రిషి..
ధరణి మేడమ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉండి ఉంటే ఫ్యామిలీ ఫోటో చాలా బాగుండేది అంటుంది. ఇంతకీ ఆయన పేరేంటి అని అడుగుతుంది వసు. శైలేంద్ర భూషణ్ అని చెప్తుంది జగతి. అవన్నీ నీకు అవసరమా అంటుంది దేవయాని. అవసరం లేదు మేడం కానీ మీ అబ్బాయి మీ దగ్గర ఉండాలని మీకు కూడా అనిపిస్తుంది కదా అంటుంది వసు.
తను హద్దులు మీరుతుంది, పగ్గాలు వేయాల్సిందే అనుకుంటుంది దేవయాని. అన్నయ్యని పిలిపిద్దాం పెద్దమ్మ అంటాడు రిషి. జగతి దంపతులు కూడా అలాగే అంటారు. శైలేంద్ర రాడు, ఇప్పట్లో రాకపోవచ్చు తనకి అక్కడ ఏదో అగ్రిమెంట్ ఉన్నట్టు ఉంది అంటుంది దేవయాని. అన్నయ్యకి రావటం వీలుపడకపోతే వదిననే అక్కడికి పంపించవచ్చు కదా అంటాడు రిషి.గుడ్ ఐడియా అంటాడు మహేంద్ర.
అన్నంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళటానికి చాలా తతంగం ఉంటుంది అంటుంది దేవయాని. అదంతా ఒకప్పుడు మేడం ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ అంటుంది వసు. నాకు తెలుసు అత్తయ్య గారే కావాలని పంపించడానికి ఇష్టపడటం లేదు అనుకుంటుంది ధరణి. ధరణి వంటల్లో ఉప్పు కారాలు కాస్త తగ్గించు, చేసే పని మీద దృష్టి పెట్టు అంటూ ధరణిని మందలిస్తుంది దేవయాని. బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.