Guppedantha Manasu March 15 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వంటగదిలోకి వస్తాడు రిషి. అక్కడ ధరణి కనిపించకపోవడంతో ఆమె కోసం వెతుకుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నీతో మాట్లాడాలి, అన్నయ్య టాపిక్ వచ్చింది కదా అంటాడు రిషి. టాపిక్ మాత్రమే వస్తుంది రిషి ఆయన రారు జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి పని అనుకుంటే కానీ ఏది జరగదు అంటుంది ధరణి.

ధరణికి హామీ ఇచ్చిన రిషి..

కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఒక్కొక్కసారి అలవోకగా జరిగిపోతాయి. అన్నయ్య రాకపోవడం మీరు వెయిట్ చేయటం చాలా గ్రేట్ అన్నయ్య త్వరలోనే వస్తాడు నేను చొరవ తీసుకుంటాను అంటాడు రిషి. కొన్నాళ్లు వస్తాడని ఎదురు చూశాను తర్వాత వస్తాడో రాడో అని అనుమాన పడ్డాను అంటుంది ధరణి.

అక్కడ అన్నయ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో నేను అన్నయ్యతో మాట్లాడుతాను అంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని అనుకోకుండా వాళ్ల మాటలు వింటుంది. మీ దేవయానికి బుద్ధి లేదు అనవసరంగా సైలేంద్ర టాపిక్ తీసుకు వచ్చింది అనుకుంటుంది. శైలేంద్ర ఎప్పుడు వస్తాడని నేను ఇప్పుడు అత్తయ్యని అడగలేదు అంటుంది ధరణి.

వసుని తిట్టుకుంటున్న దేవయాని..

ఇప్పుడు అడుగుతుందా ఏంటి తనకే ధైర్యం లేనంతవరకే అడిగి ఉండేది ఆయన ఆ వసు రావటమే పెద్ద తప్పు అనుకుంటే శైలేంద్ర టాపిక్ తీసుకువచ్చి మరో పెద్ద తప్పు చేసింది అనుకుంటుంది దేవయాని. ఇక మీరు ఈ విషయం మర్చిపోండి నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి నేరుగా వసు రూమ్ కి వెళ్తాడు రిషి. అక్కడ ఆమె లేకపోవడంతో డాబా మీదకి వెళ్తాడు. అక్కడ వసు తన తండ్రి తో మాట్లాడుతూ ఉంటుంది.

ఇక్కడ నేను బానే ఉన్నాను. నేను ఈ ఇంటి కోడల్నే కానీ కోడల్ని కాదు. కానీ చాలా సంతోషంగా ఉన్నాను హోలీ పండగ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటుంది వసు. అంతలోనే రిషి ని చూసి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మీ అమ్మానాన్నలకి బాగా కలరింగ్ ఇస్తున్నావు కదా అంటాడు రిషి. కలర్స్ పండుగ చేసుకున్నాం కదా అంటుంది వసు.

నీ తల్లిదండ్రులని మభ్యపెడుతున్నావంటున్న రిషి..

ప్రతి విషయము వాళ్ళకి చెప్పాలా అని రిషి అంటే వాళ్లే అడుగుతారు సార్. పుట్టిల్లు దాటి అత్తారింటికి వెళ్తే వాళ్లకి కూడా భయం ఉంటుంది కదా అంటుంది వసు. అందుకని మభ్యపెడుతున్నావా అంటాడు రిషి. మీరు నిజం చెప్పారు కదా ఇంకా ఎందుకు మభ్యపడతాను అయినా నన్ను వెతుకొని రావటం ఎందుకు కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది వసు.

నీకు ఇంకా అధికారం రాలేదు ఈ టైంలో నువ్వు నా గదిలోకి రాకూడదు అంటాడు రిషి. నేను మీ గదిలోకి రాకపోయినా నా మదిలో మీరే ఉంటారు సార్. మనం అనే పదం ఒకప్పుడు అందంగా వినిపించేది ఇప్పుడు అర్థం మారినట్లు కనిపిస్తుంది అంటుంది వసు. మారింది అర్థం కాదు మనం చేసే పనులు. మన ఇద్దరి మధ్య సన్నని గీత ఉంది అది నువ్వు గీసిందే అంటాడు రిషి.

దొంగ చాటుగా మాటలు వింటున్న దేవయాని..

అంతలోనే దేవయాని వీళ్లిద్దరూ కనిపించడం లేదు అనుకుంటూ వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళ మాటల్ని దొంగ చాటుగా ఉంటుంది. అందమైన కల హఠాత్తుగా మెలకువ వచ్చినట్లుగా అనిపిస్తుంది అంటాడు రిషి. మన బంధం కలకాలం ఉంటుంది సార్ కలగా కాదు అంటుంది వసు. నీ మాటలు నీ జ్ఞాపకాలు బాగుంటాయి, నువ్వు వచ్చాక నేను మళ్ళీ కొత్తగా పుట్టానేమో అనిపిస్తుంది.

నిజాన్ని, ప్రేమని కాదనలేకపోతున్నాను అంటాడు రిషి. మన మధ్య ఎంత ప్రేమ ఉందో అంత దూరం ఉంది నన్ను ఇదే భయపెడుతుంది అంటుంది వసు. నాకు కావలసింది ఇదే అనుకుంటుంది దేవయాని. మరోవైపు మనం ఎన్నాళ్ళు తప్పు చేసాము ఎంతసేపు రిషి వసూలు గురించే ఆలోచించేము కానీ ధరణి గురించి ఆలోచించలేదు అంటాడు మహేంద్ర.

రిషి తో నేను మాట్లాడుతాను అంటున్న జగతి..

నేను ఆలోచించాను కానీ సైలేంద్ర టాపిక్ వస్తే దేవయాని అక్కయ్య ధరణిని మరింత బాధ పెడుతుంది అందుకే నోరు విప్పలేకపోయాను అంటుంది జగతి. కానీ దీనికి ఒక పరిష్కారాన్ని మనం కూడా ఆలోచించాలి కదా, వదిన గారి దగ్గర భయంతో ధరణి ఏమీ మాట్లాడలేదు రిషి కూడా పెద్దగా పట్టించుకున్నట్టు లేడు, ఇకపై చొరవ తీసుకుంటాడని అనుకుంటున్నాను అంటాడు మహేంద్ర.

రిషి ఈ గురించి కొంచెం ఆలోచిస్తే శైలేంద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటుంది జగతి. ధరణి విషయంలో వదిన గారు మారరా అంటాడు మహేంద్ర. ఏం మాట్లాడుతున్నావ్ మహేంద్ర మనల్ని ఎలాగా ఇబ్బంది పెట్టిందో నీకు తెలుసు వసుధార వాళ్ళని ఎలా ఇబ్బంది పడుతుందో నీకు తెలుసు. ధరణిని కూడా కావాలని ఇబ్బంది పెడుతుంది. ఆవిడ మనసుని మార్చాలని ప్రయత్నించడం కన్నా శైలేంద్రని రప్పించడానికి ప్రయత్నం చేయడమే మంచిది.

సడన్ గా పూజ ఏర్పాటు చేసిన దేవయాని..

ఈ విషయం గురించి నేను రిషితో మాట్లాడుతాను అంటుంది జగతి. మరోవైపు దేవయాని అందరికీ కాఫీలు తీసుకొస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు నువ్వు కాఫీలు తేవడం ఏంటి అని అడుగుతాడు ఫణీంద్ర. ఏం నేను తేకూడదా, సరదాగా అందరికీ నా చేతులతో కాఫీ ఇవ్వాలి అనిపించింది అందుకే తెచ్చాను అంటూ అందరికీ కాఫీ ఇస్తుంది దేవయాని. కాఫీ సూపర్ గా ఉంది అని మెచ్చుకుంటాడు ఫణీంద్ర.

ఈరోజు మీరెవరు కాలేజీకి వెళ్లడం లేదు, ఈరోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అంటుంది దేవయాని. సడన్ గా ఈ వ్రతం ఏంటి అంటాడు మహేంద్ర. ఇంట్లో కొత్తజంట ఉన్నారు కదా సత్యనారాయణ వ్రతం చేయడం ఆచారం నీకు జగతికి ఎలాగూ ఇలాంటివి పట్టవు, అందుకే అన్ని నేనే సిద్ధం చేయించాను అంటుంది దేవయాని. కాలేజీలో చాలా పనులు ఉన్నాయి అని రిషి అంటాడు.

దేవయానిని అనుమానిస్తున్న మహేంద్ర..

అదేమీ కుదరదు ఈరోజు నేను చెప్పినట్లు చేయాల్సిందే అంటుంది దేవయాని. ఎవరికి చెప్పకుండా ఈ వ్రతం ఏంటి అంటాడు ఫణీంద్ర. మన ఇంటి వరకు మాత్రమే చేసుకుందాము కొందరు ముత్తైదువుల్ని మాత్రమే పిలుద్దాము అంటుంది దేవయాని. నువ్వేమీ కంగారు పడకు వ్రతానికి కావలసినవన్ని నేను తెప్పించాను అని జగతికి చెప్తుంది. మరోవైపు వాళ్ల గదిలోకి వచ్చిన జగతి దంపతులు సడన్గా ఈ వ్రతం ప్రారంభించడం ఏంటి అని అనుకుంటారు.

మంచిదే కదా అంటుంది జగతి. మంచిదే కానీ వదిన గారు చేస్తున్నారు అంటేనే అనుమానంగా ఉంది ఇందులో ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అంటాడు మహేంద్ర. ఆవిడ మాటలు చేతలు చూస్తే నాకు కూడా అనుమానంగానే ఉంది అంటుంది జగతి. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అంటాడు మహేంద్ర.

Guppedantha Manasu March 15 Today Episode స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న దేవయాని..

టాపిక్ తెచ్చింది నువ్వు, భయమేస్తుంది అన్నది నువ్వు, మళ్ళీ నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అంటావా అంటూ మందలిస్తుంది జగతి. మరోవైపు వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ధరణి,దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన జగతితో ఇల్లంతా ఎంత కళకళలాడుతుందో కదా, ఏదేమైనా ఇంట్లో ఒక పూజ గాని వ్రతం గాని జరిగితే ఆ కళే వేరు, మనసుకి హాయిగా ఉంది అంటుంది దేవయాని.

నువ్వు మహేంద్ర నన్ను గయ్యాలి లాగా చూస్తారు కానీ మీరు అనుకున్నంత గయ్యాళిని మాత్రం కాదు నేను అంటుంది. అక్కయ్య స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటుంది జగతి. ఇప్పుడు ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది మనిద్దరం కలిపి ఈ వ్రతాన్ని చేయిద్దాము అంటుంది దేవయాని. సరే కానీ ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అంటుంది జగతి.

చెప్పాలి కదా ఎంతైనా నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నా వెనకాతల రా అంటూ జగతిని తీసుకువెళ్తుంది దేవయాని. తరువాత ఏం జరిగిందో రేపుటి ఎపిసోడ్ లో చూద్దాం.