Guppedantha Manasu March 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పెద్దమ్మకి నేను చెప్తాను మనం ఈ పూజ చేయటం లేదు పీటల మీద డాడ్, మేడం కూర్చుంటారు అంటాడు రిషి. రిషి ఆలోచన నుంచి బయటికి వచ్చేసరికి వ్రతం పూర్తవుతుంది. అన్ని విషయాల్లో నీకు నాకు సపోర్టుగా ఉండే రిషి సార్ కి ఒక్క తాళి విషయంలో మాత్రం ఆయన బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నారు.

రిషితో మాట్లాడనంటున్న దేవయాని..

ఆ బాధ పోయేలాగా చూడు స్వామి అంటూ దండం పెట్టుకుంటుంది వసు. కొన్ని విషయాల్లోని అడిగి చేసే వసుధార తాళి విషయంలో తొందరపడింది ఈ దూరం ఎన్నాళ్లో అనుకుంటాడు రిషి. రిషి వసూల మధ్య దూరం తగ్గించమని మహేంద్ర దంపతులు కోరుకుంటారు. పూజ పూర్తవడంతో ధరణి అందరికీ ప్రసాదాన్ని పంచుతుంది.

దేవయాని తీసుకోవడానికి ఇష్టపడదు. ధరణి చేతి నుంచి ప్రసాదాన్ని తీసుకొని రిషి దేవయానికి ప్రసాదాన్ని ఇవ్వడానికి వెళ్తాడు. నా ప్లాన్ అంతా తలకిందులు చేశావు అనుకుంటుంది దేవయాని. మిమ్మల్ని బాధ పెట్టానని తెలుసు అంటాడు రిషి. బాధ తెలిసి కూడా ఇలా చేస్తావ్ అనుకోలేదు మీ ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయాలని నాకు ఉండేది.

పెద్దమ్మకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి..

కోరిక తీరకుండా చేశావు నీతో మాట్లాడను అంటుంది దేవయాని. నాకు బాధగానే ఉంది కానీ నన్ను ఆడకుండా చెప్పకుండా ఇలాంటి పనులు చేయకండి అంటూ పెద్దమ్మ చేతిలో ప్రసాదాన్ని పెడతాడు రిషి. తర్వాత సీన్లో బస్సు గదికి వెళ్లి ఇంకా పడుకోలేదా, జరిగింది తలుచుకుంటే నాకే ఎలాగో ఉంది ఇంకా నీకు ఎలా నిద్ర పడుతుంది అంటుంది దేవయాని.

ఏం మాట్లాడుతున్నారు అంటుంది వసు. తెలిసి ఎందుకు నటిస్తావు కృషి మనసులో నీ స్థానం ఏంటో ఇప్పటికైనా నీకు తెలిసింది కదా. నువ్వు లోకం దృష్టిలో మాత్రమే రిషికి భార్యవి. ఈ ఇంట్లో నువ్వు ఒక అతిధి మాత్రమే అర్థమైందా. తెలివైన దానిని అని నీకు గర్వం కదా, ఏమైంది నీ తెలివి అంటుంది దేవయాని. ఆ మాటలకి నవ్వుతూ మీరు ఏదేదో ఊహించుకొని తెగ సంబరపడిపోతున్నారు.

దేవయాని కౌంటర్ కి రీకౌంటు ఇస్తున్న వసు..

కానీ రిషి, వసుల బంధం ఎప్పటికీ ఈ చెక్కుచెదరదు అంటుంది వసు. ఏంటి నీ ధైర్యం అంటుంది దేవయాని.రిషి సార్ నా ధైర్యం, ఒకరు బాగుంటే సంతోషించాలి కానీ వాళ్ళ కన్నీటితో దాహం తీర్చుకోవాలి అనుకోవడం సరైన పద్ధతి కాదు. పీటల మీద కూర్చోలేదని నేను కుళ్లి,కుళ్లి ఏడుస్తానని మీరు ఊహించారు కదా నేను ఏడిస్తే నన్ను ఓదార్చాలని వచ్చారు కదా.

ఇక్కడ ఉన్నది వసుధార చిన్న చిన్న విషయాలకే బాధపడదు. ఏవో ఒకటి రెండు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ అది తొందరలోనే పోతాయి అంటుంది వసు. నువ్వేదో గాంభీర్యంతో మాట్లాడుతున్నావ్ కానీ ఎప్పటికైనా ఈ ఇంటి గడప దాటుతావు గుమ్మం బయటే నీ బ్రతుకు అంటుంది అంతా అత్యాశ పనికిరాదు, అందరి ముందు ఈ మెడలో తాళికి కారణం అని ఒప్పుకున్నారు.

దేవయానిని రెచ్చగొడుతున్న వసు..

నాకు నిద్ర వస్తుంది మేడం మీరు వెళ్లి పడుకోండి అయినా మీకు నిద్ర పడుతుందో లేదో అంటూ వెటకారంగా మాట్లాడుతుంది వసు. దేవయాని వెళ్ళిపోతుంటే నా జెంటిల్మెన్ నా వాడే కదా ఆయన నా తోడు ఉండగా నాకేంటి భయం మీరు వెళ్లి పడుకోండి అంటూ రెచ్చగొట్టినట్లుగా మాట్లాడుతుంది. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది దేవయాని.

తర్వాత సీన్లో రిషి గది ముందు నుంచొని సర్ ఇంకా లేచినట్లు లేదు కాలేజీకి టైం అవుతుంది నేను లోపలికి వెళ్లి లేపటమా,వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది వసు. అంతలోనే అక్కడికి వచ్చిన జగతి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇది మీ అబ్బాయి గది అంటుంది వసు. నువ్వు లోపల అడుగుపెడితే అది మీ గది అవుతుంది అంటుంది జగతి. అది అంత ఈజీ కాదు అంటుంది వసు.

వసుని బలవంతంగా గదిలోకి నెట్టిన జగతి..

నువ్వు చేసిన పనులు కూడా అంతా ఈజీ కాదు అయినా అతని గదిలోకి అడుగుపెట్టే అధికారం నీకు ఉంది. ఇక్కడ నించుంటే ఇక్కడే ఉండిపోతావు లోపల అడుగుపెడితే రిషికి దగ్గర అవుతావు అంటుంది జగతి. నిద్ర లేచారో లేదో చూడటానికి వచ్చాను కానీ లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటుంది వసు. వెళ్ళాలి అని నిర్ణయించుకుంటేనే వెళ్తావు.

అక్కయ్య గారు రాకముందే వెళ్ళు అంటే బలవంతంగా ఆమెని గదిలోకి తోసేస్తుంది జగతి. అప్పటికి ఇంకా రిషి పడుకొనే ఉంటాడు. తనని అలాగే చూస్తూ కూర్చుంటుంది వసు. కళ్ళు తెరిచిన రిషి సడన్ గా వసుని చూసి నువ్వేంటి ఎక్కడ అని అడుగుతాడు. నిద్ర లేవలేదు టైం అయిపోతుంది అని అంటూ నసుకుతూ మాట్లాడుతుంది వసు. కింద పడిన దువ్వెనని తీయబోతుంటే వసు మెడలో తాళి బయటపడుతుంది.

ఒక్కసారిగా మూడి అయిపోయిన రిషి..

అది చూసిన రిషి మూడిగా అయిపోతాడు. వి ఆర్ అక్షరాలు పక్కపక్కనే అలాగే మనం ఎదురెదురుగానే ఉన్నా చాలా దూరంగా ఉన్నాం అంటూ నేను రెడీ అవుతాను అంటాడు రిషి. అర్థం చేసుకున్న వసు గదిలోంచి బయటికి వచ్చేస్తుంది. మరోవైపు కిచెన్ లోకి వెళ్తుంది వసు. అత్తయ్య గారు కాఫీ కావాలా అంటుంది ధరణి. వచ్చింది నేను మేడం అంటుంది వసు.

ఈ టైంలో అత్తయ్య గారే వస్తారు అంటుంది ధరణి. మీ ఇద్దరి బంధం గమ్మత్తుగా అనిపిస్తుంది అంటుంది వసు. కొన్నింటిని మార్చలేము, అలాగే పెద్ద తీయని కూడా మార్చలేము కొత్తలో బాధపడ్డాను కానీ తర్వాత అలవాటు పడ్డాను ఇంతకీ నువ్వెందుకు వచ్చావు ఏమైనా కావాలా అంటుంది ధరణి. ఏమీ వద్దు మేడం మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అంటుంది వసు.

Guppedantha Manasu March 17 Today Episode వరుసలతో పిలవమంటున్న ధరణి..

అంత ఖాళీ నీకు ఎక్కడ ఉంటుంది అయినా మేడం అని పిలుస్తారు ఎందుకు ఎంచక్కా పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య, అక్క ఇలా వరుసలు పెట్టి పిలవచ్చు కదా, అలాంటి పిలుపులో మ్యాజిక్ ఉంటుంది అందుకే అక్కయ్య అని పిలువు అంటుంది ధరణి. ఆరోజు తొందరలోనే వస్తుంది అప్పటి వరకు ఓపిక పట్టాలి అంటుంది వసు. రిషి నీకు భర్త కదా అప్పుడు నీకు అన్ని హక్కులు ఉంటాయి అంటుంది ధరణి.

మిమ్మల్ని అలా పిలవాలి అంటే రిషి సార్ అనుమతి కావాలి. ఆయన నాకు భర్తే కానీ నేను ఆయనకి భార్యను కాను అనుకుంటుంది వసు. మరో వైపు రెడీ అవుతున్న వసు తాళిని చూసుకొని బంధం బాధిస్తుందా బంధిస్తుందా లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నాను ఇలా అయింది అంటూ బాధపడుతుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.