Guppedantha Manasu March 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార నేను చెప్పింది ఒప్పుకోవటం లేదు, నువ్వు చేసిన ఆ ఒక్క పని వల్ల లైఫ్ లో నువ్వు నేను చాలా కోల్పోయాము ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలని మిస్ చేసుకున్నాము అనుకుంటాడు రిషి జీవితంలో అన్ని విలువైన జ్ఞాపకాలు ఉండవు కదా పరిస్థితులు నాతో ఒక పని చేయించాయి మీరు గొప్ప శిక్ష వేశారు నాకు అనుకుంటుంది వసు.

రిషి మనసు ప్రేమతో కరిగించమంటున్న జగతి..

నేను మీకు శిక్ష వేశాను అనుకుంటున్నావు కానీ నేను ఎంత బాధ పడుతున్నాను నీకు అర్థం కావట్లేదు అనుకుంటాడు రిషి. మీరు నా సొంతం అనుకున్నాను కానీ మీరు ఇంకేదో అంటున్నారు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటుంది వసు. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి మళ్లీ పొద్దున్నే చాటింగ్ యుద్ధం జరిగిందా, రిషి ఏమైనా అన్నాడా అని అడుగుతుంది.

ఆయన నన్ను తిడితే నేను బాధ పడతాను కానీ ఆయనే బాధపడుతున్నారు. ఆయన నాకు భార్య స్థానాన్ని ఇంకా ఇవ్వలేదు అంటుంది వసు. కొన్ని కొన్ని సార్లు ఇవ్వటం కన్నా పొందటమే కరెక్ట్. అర్థం చేసుకోవాలి కానీ బంగారం తనకి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పలేము. ఇప్పుడు తన మనసు మంచుకొండ లాగా గడ్డకట్టుకుపోయింది నువ్వే దాన్ని ప్రేమతో కరిగించాలి.

ఎండి గారి బాధని చూడలేకపోతున్నానంటున్న వసు..

మనిషి మనసు ఒక క్షేత్రం లాంటిది. వృక్షాలు ఉండిపోతాయి మళ్ళీ చిగురిస్తాయి మనిషి కూడా అలాంటిదే, కాకపోతే నువ్వు కృషి మనిషికి దగ్గరగా వెళ్ళాలి ఓపిగ్గా ఉండాలి అంటుంది జగతి. భార్య అని అందరిలోనూ చెప్పి నా గుండె బరువు దించారు కానీ ఆయన నాకు భర్త కాదు అంటున్నారు. నా బాధ కన్నా ఆయన బాధపడటమే నాకు చాలా బాధగా ఉంది అంటుంది వసు.

బంధం లోని గొప్పతనమే అది. నువ్వు కృషి మనిషికి దగ్గర అవ్వాలి. నా భార్యవి కాదు అని మొహం మీద చెప్తే కష్టమే కానీ ఇష్టం అన్ని కష్టాలని భరిస్తుంది అంటుంది జగతి. ఆయన కోసం నేను ఎంతైనా కష్టపడతాను కానీ ఆయన కష్టపడితే చూడలేకపోతున్నాను మా మధ్య దూరం తగ్గటానికి ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది వసు.

రిషి కి షాకిచ్చిన వసు,మహేంద్ర దంపతులు..

మరోవైపు కాలేజీకి బయలుదేరిన రిషి వసు లిఫ్ట్ అడుగుతుందేమో అని వెయిట్ చేస్తాడు. రిషి యే పిలవచ్చు కదా అని వసు వెయిట్ చేస్తూ ఉంటుంది. రిషి చాలా సేపు వెయిట్ చేస్తాడు కానీ వసు లిఫ్ట్ అడగదు. కాలేజ్ ఎండి ని నేను ఎందుకు వెయిట్ చేయాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు రిషి. కార్లో వెళ్తున్న రిషి తను నా పక్కన ఉంటే బాగుంటుంది లిఫ్ట్ అడిగి రావచ్చు కదా అనుకుంటాడు.

ఇంతలోనే హారన్ సౌండ్ లు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో అంత ఎక్కువగా హారన్ సౌండ్ చేస్తున్నారు అని మిర్రర్ నుంచి చూస్తే ఒక బైక్ మీద మహేంద్ర దంపతులు మరొక స్కూటీ మీద వసు వచ్చి కార్ కి అడ్డగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్లని అలా చూసి ఒకసారి ఆశ్చర్యపోతాడు రిషి.రూట్ మార్చి కాలేజీకి వెళ్లిన మహేంద్ర లోపలికి వెళ్లకుండా బయటే ఆగుతాడు.

రిషికి భయపడుతున్న మహేంద్ర దంపతులు..

ఏమైంది అని జగతి అడిగితే ఇప్పుడు రిషి బోల్డన్ని ప్రశ్నలు వేస్తాడు వాటికి సమాధానం చెప్పే ధైర్యం నాకు లేదు అందుకని మనం రిషి కి కనిపించొద్దు అంటాడు మహేంద్ర. అంతలోనే అక్కడికి వచ్చిన వసు ఏంటి సార్ అలా రూట్ మార్చి వచ్చేసారు అయినా ఎందుకు బయట వెయిట్ చేస్తున్నారు అంటుంది. కొన్ని కారణాల దృష్ట్యా రాబోతున్న ప్రమాదాలని అరికట్టటానికి మేము కాలేజీకి లేటుగా వస్తాము అంటాడు మహేంద్ర.

ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని వసు అడిగితే కాఫీ తాగడానికి వెళ్తున్నాము అంటాడు మహేంద్ర. కాలేజీలో క్యాంటీన్ ఉంది కదా అంటుంది వసు. కాలేజీ క్యాంటిన్లో బోర్, మేము బయట తాగుతాము అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతారు జగతి దంపతులు. సార్ వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారు అనుకుంటూ లోపలికి వచ్చేస్తుంది వసు.

లిఫ్ట్ అడగడానికి అంత ఇబ్బందా అనుకుంటున్న రిషి..

కారులో వచ్చిన రిషి,వసుని చూసి టూవీలర్ మీద రావడం ఏంటి లిఫ్ట్ అడగటానికి తనకి అంత ఇబ్బందా అనుకుంటాడు. మహేంద్ర వాళ్ళ కోసం వెతుకుతాడు. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ని మహేంద్ర సర్ వాళ్ళు వచ్చేరా అని అడుగుతాడు వాళ్ళు రాలేదు అని చెప్పటంతో ఎక్కడైనా బాగుంటారా రానీ చెప్తాను అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఎండి గారు ఏంటి? ఏమీ క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అందరి ముందు అడిగితే బాగోదనేమో అనుకుంటుంది వసు. ఆఫీస్ రూమ్ కి వెళ్ళిన తర్వాత వసుని పిలిపిస్తాడు. ఆయన పిలిచారు అంటే కారు మానేసి బైక్లో వచ్చినందుకు కసుబుస్సుమంటారు అందుకే రమ్మంటున్నారు అనుకుంటుంది వసు. వసు ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉండగానే ఆమె దగ్గర నుంచి రిషి కి ఫోన్ వస్తుంది.

ఎండి గారి కన్నా ఏది ఇంపార్టెంట్ కాదంటున్న వసు..

ఫోన్ లిఫ్ట్ చేస్తే సర్ రమ్మన్నారు కదా ఎందుకు అని అడుగుతుంది వసు. రమ్మన్నాను కానీ ఫోన్ చేయమనలేదు అంటాడు రిషి. కొంచెం వర్క్ ఉంది సార్ అంటుంది వసు. వర్క్ లేనిది నాకేనా సరేలే నేనే వస్తాను అంటాడు రిషి. వసు కంగారుగా వద్దులేండి సార్ నేనే వస్తాను అంటుంది. అర్జెంట్ పని ఉందన్నావు అంటాడు రిషి. మా ఎండి గారి కంటే ఇంపార్టెంట్ ఏమీ కాదు, వస్తున్నాను ఎండి గారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది వసు.

ప్రతి దానికి ఎండి గారు అంటూ నొక్కి పలకాల అని చికాకు పడతాడు రిషి. రిషి దగ్గరికి బయలుదేరుతున్న వసుకి జగతి కనిపిస్తుంది. ఇదేనా రావడం అంటుంది వసు. రిషి ఏమన్నాడు అంటుంది జగతి. ఏమంటారు గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయారు అప్పుడు ఏమి పని లేదు కానీ ఇప్పుడు క్యాబిన్ కి రమ్మంటున్నారు. ఇప్పుడు అంటారు అంటుంది వసు.

రూట్ ఎందుకు మార్చారంటూ జగతిని నిలదీసిన వసు..

ఏమంటారు అంటుంది జగతి. ఏంటి నువ్వు టు వీలర్ మీద రావటం ఏంటి అంటూ డాం డూమ్ అంటారు అంటుంది వసు. ఇంకేమీ అడగరు అనుకుంటున్నావా అంటుంది జగతి. ఇంకేముంటే అడగడానికి అడిగితే అడగనివ్వండి పైన అక్కడ ఉన్నది మా ఎండి గారు లేకపోతే మీ అబ్బాయిగారా అనేది అక్కడికి వెళ్లి చూస్తేనే కాని తెలియదు అంటుంది వసు. ఆ మాటలకి నవ్వుకుంటుంది జగతి.

మీరు దారిలో ఎందుకు రూట్ మార్చి వెళ్లిపోయారు అని జగతిని అడుగుతుంది వసు. రిషి కడిగే ప్రశ్నలని తప్పించుకోవటానికి మహేంద్ర స్పీడ్ గా వచ్చాడు ఇప్పుడు రిషి దగ్గరికి వెళ్తున్నావ్ కదా నీకే తెలుస్తుంది అంటుంది జగతి. ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటుంది వసు. నువ్వు తన మూడ్ ని కంట్రోల్ చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది జగతి.

Guppedantha Manasu March 18 Today Episode ఎండి గారి బాధ పోగొట్టటమే ముఖ్యం అంటున్న వసు..

ఈ మధ్య నా మీద నాకే నమ్మకం ఉండటం లేదు, మీరేమో నా మీద నమ్మకం ఉంది అంటున్నారు అంటుంది వసు. నీ ప్రేమే నమ్మకం ఉంటుంది. ఆ ప్రేమతోనే నువ్వు రిషిని మార్చుకోగలవు అంటుంది జగతి. నేను ఆయనని మార్చడం కాదు ఆయనే నన్ను మార్చారు నా ప్రతి విషయంలోనూ తోడున్నారు.ఆయన మనసులో ఉన్న బాధని పోగొట్టటమే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యం.

ఆ కోపం పోతే ఆయనే నన్ను నా లక్ష్యం వైపు నడిపిస్తారు అంటూ రిషి రూమ్ వైపు నడుస్తుంది వసు. మరోవైపు ఎవరికోసమో వెయిట్ చేస్తున్న దేవయానిని ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నారా అని అడుగుతుంది ధరణి. ఇవన్నీ నీకు అవసరమా, నీ పని నువ్వు చూసుకో అంటుంది దేవయాని. ఇంటికి ఎవరైనా వస్తే మర్యాదలు చేయడానికి నా ఏర్పాట్లలో నేను ఉండాలి కదా అంటుంది ధరణి.ఏమైనా ఉంటే నేను చెప్తాను, ఎవరొచ్చినా నువ్వు రావద్దు.

నేను పిలిస్తే వద్దువు గానివిలే అంటుంది దేవయాని. ధరణి ఆటో వెళ్లిపోగానే ఇటు పంతులుగారు వస్తారు. రేపు ఎల్లుండిలో మంచి ముహూర్తం ఉంది. మీరు ఏ నిర్ణయించుకుంటారో నాకు చెప్పండి అంటారు పంతులుగారు. ఏ విషయము నేను మీకు ఫోన్ చేసి చెప్తాను అనటంతో పంతులుగారు వెళ్ళిపోతారు. నా గురించి ఏమనుకుంటున్నారు దీంతో వసుధార సంగతి తేలిపోతుంది అనుకుంటుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.