Guppedantha Manasu March 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో హాల్లోనే పడుకున్న వసు లేచి చూసేసరికి ఎదురుగా దేవయాని కనిపిస్తుంది. లేచి నించుంటుంది వసు. ఏంటి హాల్లో పడుకున్నావ్ నీ స్థానం ఎక్కడో కరెక్ట్ గానే తెలుసుకున్నట్టున్నావు అంటుంది దేవయాని. హాల్లో పడుకోవడం ఏంటి అంటుంది జగతి. కాలేజీ వర్క్ చేస్తూ రిషి సార్ నా గదిలో పడుకున్నారు డిస్టర్బ్ చేయకూడదని నేను ఇక్కడ పడుకున్నాను అంటుంది వసు.
దేవయానికి తల తిరిగిపోయే సమాధానం ఇచ్చిన వసు..
ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు అంటుంది దేవయాని. మీరు ఏదో సాధించారని నేను ఏదో కష్టాల్లో ఉన్నానని అనుకోకండి.. నాకు దక్కాల్సినవన్నీ దక్కుతాయి అంటుంది వసు. నీ స్పీడ్ కి నేను స్పీడ్ బ్రేకర్ లాంటిదాన్ని అంటుంది దేవయాని. రిషి సర్ కు నాకు మధ్యలో ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు.
ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది వసు. వసుధారకి కాన్ఫిడెన్స్ పెరిగినట్లుగా ఉంది అంటుంది దేవయాని. తను నా కోడలు మీ కోడల్లాగా మాట్లాడిన ప్రతి దానికి తల ఊపుదు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది జగతి. ఇద్దరు సంగతి తేలుస్తాను అనుకుంటుంది దేవయాని. మరోవైపు స్పాట్ వేల్యూషన్ ఇంఛార్జ్ ధర్మరాజు డిబిఎస్టి కాలేజీకి విజిటింగ్ కి వస్తాడు.
ధర్మరాజుని రిషికి పరిచయం చేసిన మహేంద్ర..
వేరే కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి మాకు స్పాట్ వాల్యూయేషన్ అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళ పనితనం చూస్తాను. ఎక్కడైనా తప్పుకి దొరికితే వెంటనే పట్టుకుంటాను అప్పుడు చూద్దాం మీ కాలేజీ సంగతి అంటూ కాలేజీలోకి అడుగుపెడతాడు ధర్మరాజు. కాలేజీలో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. మహేంద్ర ధర్మరాజును రిసీవ్ చేసుకుంటాడు.
మీ కాలేజీ పనితీరును పర్యవేక్షించడానికి నన్ను నియమించారు అని చెప్తాడు ధర్మరాజు. మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాము అంటాడు మహేంద్ర. తర్వాత మహేంద్ర ధర్మరాజుని రిషికి పరిచయం చేస్తాడు. మీరు నాకు తెలుసు మిషన్ ఎడ్యుకేషన్ గురించి చాలా విన్నాను అని రిషితో అంటాడు ధర్మరాజు. స్పాట్ వాల్యుయేషన్ పర్యవేక్షిస్తూ దీనిని ఎలా ఆన్ సక్సెస్ ఫుల్ చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటాడు ధర్మరాజు.
లాకర్ కీస్ దొంగతనంగా ప్రింట్ తీసిన ధర్మరాజు..
మరోవైపు క్యాబిన్లో కూర్చుని కాఫీ తాగుతున్న ధర్మరాజు దగ్గరికి వస్తాడు మహేంద్ర. పేపర్స్ లాక్ చేయబోయే రూమ్ కీస్ టేబుల్ మీద పెడతాడు మహేంద్ర. అది గమనిస్తాడు ధర్మరాజు. జగతి పిలవడంతో మహేంద్ర బయటికి వెళ్తాడు. అదే అదనుగా తాళాల ప్రింట్ సబ్బు మీద తీసుకొని కామ్ గా అక్కడి నుంచి బయటికి వెళ్లాలనుకుంటాడు ధర్మరాజు. ఏంటి సర్ హాఫ్ ఎన్ అవర్ లో వాల్యూషన్ అయిపోతుంది.
పేపర్స్ అన్ని రూమ్ లో పెట్టి లాక్ చేద్దాం అన్నారు కదా అంటాడు మహేంద్ర. అరగంటలో వచ్చేస్తాను అనుకుంటూ బయటికి వస్తాడు ధర్మరాజు. ఈ అరగంటలోనే డూప్లికేట్ కీస్ చేయించుకుని అప్పుడు నా పని నేను చేస్తాను అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు ధర్మరాజు. వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ధర్మరాజు సమక్షంలోనే పేపర్స్ అన్ని రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు మహేంద్ర, జగతి వాళ్ళు.
జరిగింది చూసి కంగారుపడిన జగతి..
ఆ తరువాత వసుధార ఎక్కడ నాకు కనిపించలేదు అని జగతిని అడుగుతాడు మహేంద్ర నాకు తెలియదు అంటుంది జగతి. మరోవైపు రిషి వచ్చి మహేంద్ర వాళ్ళని బయలుదేరుదామా అని అడిగి వసు ఎక్కడ, కనిపించడం లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు అంటాడు. నేను చూసొస్తాను అంటూ బయలుదేరుతుంది జగతి. అందులోనే ధర్మరాజు డూప్లికేట్ కి తో రూమ్ లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు.
ఈ కాలేజీ పరువుమొత్తం పోవాలి అనుకుంటూ లోపలికి వెళ్లి ఆన్సర్ షీట్స్ కొన్ని తన బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న వరకు ఎవరూ దాని గురించి పట్టించుకోరు రేపు పొద్దున్న వచ్చి రచ్చ రచ్చ చేస్తాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ధర్మరాజు. వసుని వెతుక్కుంటూ వచ్చిన జగతికి లాక్ ఓపెన్ చేసి ఉండడం చూసి షాక్ అవుతుంది.
Guppedantha Manasu March 24 Today Episodeఎవరు చేసిన పనో నాకు తెలుసంటున్న రిషి..
జగతి పిలుపుకి అక్కడికి వచ్చిన వసు కూడా అది చూసి షాక్ అవుతుంది. వెంటనే రిషి వాళ్లకి కాల్ చేసి రమ్మంటుంది. జరిగింది తెలుసుకొని రూమ్లో చెక్ చేస్తారు. అక్కడ కొన్ని పేపర్ బండిల్స్ మిస్ అవ్వడం గమనిస్తారు అందరూ. ఒక్క పేపర్ మిస్సయిన మన కాలేజీకి బ్యాడ్ నేమ్ అంటాడు రిషి. అదే సమయంలో తన చేతిలో ఉన్న తాళాలకి సబ్బు అంటుకొని ఉండడం గమనిస్తుంది జగతి.
అదే విషయాన్ని వసు కి చెప్పటంతో వసు ఆ తాళాలని వాసన చూస్తుంది. అవును మేడం ఈ తాళానికి సబ్బు అంటుకుంది అంటుంది వసు. ఇది ఎవరి పనో నాకు తెలుసు అంటూ పసుధారని తీసుకొని బయలుదేరుతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.