Guppedantha Manasu March 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మూడు బండిల్స్ మిస్ అయ్యాయని కంగారుపడుతూ చెప్తుంది వసు. ఒక్క పేపరు మిస్సయినా మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటాడు రిషి. ఇంతలోనే తను పట్టుకున్న కీ కి సబ్బు అంటుకున్న విషయం గుర్తిస్తుంది జగతి. వసుకి కూడా చూపిస్తుంది. మీరన్నది నిజమే మేడం కీ కి సబ్బు ఉంది అంటుంది వసు. ఇది ఎవరి పనో నాకు తెలుసు అంటూ వసుని తీసుకొని బయలుదేరుతాడు రిషి.

దొంగతనానికి బయలుదేరిన రిషి, వసు..

మరోవైపు డ్రింక్ చేస్తున్న ధర్మరాజు డిబిఎస్టి కాలేజ్ పరువు నా చేతిలో ఉంది రేపు ఈ బండిల్స్ కనబడవు అప్పుడు మీడియా ముందు అల్లరి చేస్తాను అనుకుంటాడు. మరో కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి మీ పని అయిపోయింది మీరు మాట్లాడిన అమౌంట్ నా అకౌంట్ లో వేసేయండి అంటాడు. మరోవైపు ధర్మరాజు ఇంటికి కాస్త దూరంలో కారు ఆపి ధర్మరాజు కొట్టేసిన పేపర్ బండిల్స్ ని కొట్టేయడానికి వస్తారు రిషి, వసు.

జేబులో చేతులు పెట్టుకొని వెళ్తున్న రిషి ని మీరేమైనా కాలేజీకి వెళ్తున్నారా వెళ్ళేది దొంగతనానికి అంటూ తను తెచ్చిన వెపన్స్ అన్ని చూపిస్తుంది. పేర్లు పెట్టి పిలుచుకోకుండా కోడ్ భాష లో పిలుచుకుందాము మీరు మిస్టర్ ఆర్ నేను మిస్సెస్ వి అంటుంది వసు. యాటిట్యూడ్ పెరగడానికి చూయింగ్ గమ్ నమల మంటుంది. నువ్వు ఎక్కువగా గూడచారి సినిమాలు చూసేదానివా అంటాడు రిషి.

ధర్మరాజు చేసిన పనికి కంగారు పడ్డ వసు..

మీరు ఎలా చెప్పారు అంత కరెక్ట్ గా అంటుంది వసు. మెల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత తన హెయిర్ పిన్తో డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తుంది. ఎంతకీ రాకపోవటంతో, సినిమాల్లో ఇలా అనగానే అలా ఓపెన్ అయిపోతుంది సార్ కానీ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అంటూ బుంగమూతి పెడుతుంది. ఇది సినిమా కాదు రియల్ అంటాడు రిషి.

ఇంతలోనే మద్యం మత్తులో ఉన్న ధర్మరాజు వాష్ రూమ్ కోసం బయటకు వస్తాడు. అదే అదనుగా లోపలికి వచ్చేస్తారు రిషి వాళ్ళు. లోపలికి వచ్చిన ధర్మరాజు గడియ పెట్టడంతో బయటికి ఎలా వెళ్లడం అని కంగారుపడుతుంది వసు. వచ్చిన పని చూడు తర్వాత వెళ్లడం సంగతి ఆలోచిద్దాం అంటూ ఆ బండిల్స్ ఎక్కడ పెట్టాడో వెతుకుతూ ఉంటారు.

కాలేజ్ పరువు నా చేతిలో ఉందంటున్న ధర్మరాజు..

అదే సమయంలో డ్రింక్ మత్తులో ఉన్న ధర్మరాజు, రిషి సార్ అనేసరికి దొరికిపోయానేమో అనుకొని కంగారుపడతారు రిషి, వసు. కానీ అతను తాగిన మత్తులో ఉన్నాడని గుర్తిస్తారు అతని చేతిలో ఉన్న బండిల్స్ ని చూసి అదే మనకు కావలసినవి అనుకుంటారు. మరోవైపు తాగిన మత్తులో ఉన్న ధర్మరాజు బండిల్స్ చేత్తో పట్టుకొని నీ పరువు నా చేతిలో ఉంది మీ పరువు పోతే వేరే ఎవరికో లాభం అంట.

మీ కాలేజీ పేరు రేపు న్యూస్ పేపర్ లో వస్తుంది అని నవ్వుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. వాడు డ్రింక్ చేస్తున్నాడు సర్ అంటుంది వసు. నన్నేం చేయమంటావు వెళ్లి కంపెనీ ఇవ్వమంటావా అని అడుగుతాడు రిషి. అలా డ్రింక్ చేస్తున్న అంతసేపు మనం ఇక్కడే వెయిట్ చేయాలా అంటూ చిరాకు పడుతుంది. అంతవరకు మనం డ్రై ఫ్రూట్స్ తినడం బలం కోసం అంటూ తన బ్యాగ్ లో చేయి పెడుతుంది వసు.

రిషి వాళ్లని రూమ్ లో లాక్ చేసిన ధర్మరాజు..

నీకు దండం పెడతాను నువ్వు అలాంటి పనులు ఏమి చేయకు ఇలాంటి విషయాల్లో మాత్రం దూరంగా ఆలోచిస్తావు అంటాడు రిషి. థాంక్యూ మిస్టర్ ఆర్ అంటుంది వసు. అలా పిలవద్దన్నానా అంటూ కోప్పడతాడు రిషి. అంతలో ధర్మరాజు లేచి వాళ్ళు ఉన్న వైపు రావడం గమనించి పక్కనే ఉన్న రూమ్ లో దూరిపోతారు ఇద్దరు.

తాగిన మత్తులో ఉన్న ధర్మరాజు డోర్ ఓపెన్ చేసి ఉంది ఏంటి అనుకుంటూ ఆ డోర్ ని లాక్ చేసేస్తాడు. ఇరుక్కుపోయాం అనుకుంటూ ఇద్దరు కంగారు పడతారు. కంగారు పడుతున్న వసుతో ఇలాంటి వాటికి నీ దగ్గరే ఏమి ఐడియా లేవా మిస్సెస్ వి అంటాడు రిషి. ఊరుకోండి సార్ మళ్ళీ వాడు డోర్ తీసిన వరకు మనం ఇక్కడే ఉండాలా, ఇక్కడ ఇరుక్కుపోయాము ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటూ బిక్క మొఖం పెడుతుంది. అంత్యాక్షరి ఆడదాం అంటాడు రిషి.

Guppedantha Manasu March 25 Today Episode వసుని చూసి షాకైన ధర్మరాజు..

మీకు నవ్వులాటగా ఉందా అంటుంది వసు. సరే ఏం చేద్దాం నువ్వే చెప్పు అంటాడు రిషి. వాడు ఎప్పుడొచ్చి డోర్ తీస్తాడో అంటుంది వసు. ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి కనుక్కో అంటాడు రిషి. అడిగినదానికి సమాధానం చెప్పచ్చు కదా ఎందుకు చిరాకు పడటం అంటుంది వసు. చేసిన పనులు దాచిపెట్టినప్పుడు ఇది ఒక లెక్క అంటాడు రిషి.

ఇప్పుడు కూడా అదే టాపిక్ ఆ అంటూ చిరాకు పడుతుంది వసు. ఉండండి డోర్ ఓపెన్ అవుతుందేమో చూస్తాను వన్ టు డోర్ దగ్గరికి వెళ్తుంది వసు. ఇంతలో ధర్మరాజు డోర్ తీసుకొని లోపలికి వస్తాడు. వసుని చూసి షాక్ అవుతాడు ధర్మరాజు. వసు కూడా షాక్ లో ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 25, 2023 at 9:13 ఉద.