Guppedantha Manasu March 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను చెప్పండి సార్ దాని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతుంది వసు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఇవన్నీ మర్చిపోయి మనం పాత రోజుల్లో ఉన్నట్లుగా ఉండాలి అనిపిస్తుంది. ఆ రిలేషన్ ఆ బాండింగ్ అందులో ఉండే ఒక స్వచ్ఛత ఇప్పుడు కోరుకుంటున్నాను ఇవ్వగలవా అంటాడు రిషి.
ఒక ఒప్పందానికి వచ్చిన రిషి, వసు..
మనం ఒక ఒప్పందం చేసుకుందాము.. మీరు కోరుకుంటున్నట్లుగా పాత పరిచయం పాత రోజులు రావాలంటే మన రిలేషన్ మళ్లీ కొత్తగా మొదలవ్వాలి. నేను మొదటిసారి ఈ కాలేజీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఉండేవారు అలా ఉండండి నేను కూడా అలాగే ఉంటాను. ఇద్దరం ఒకరికొకరం కొత్తగా పరిచయం అవుదాం అంటుంది వసు.
ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోమంటావా, గుర్తుకి రాకుండా ఎలా ఉంటుంది అంటాడు రిషి. గుర్తుకి రావచ్చు సార్ కానీ మైండ్ లోంచి వెంటనే తీసేయండి అంటుంది వసు. ఇది సాధ్య పడుతుందా అని రిషి అంటే మనం సాధ్యం చేద్దాము. మన బంధానికి మనం వేసుకున్న సరికొత్త దారి. ఈసారి మన ప్రయాణంలో తప్పటడుగులు ఉండకూడదు అంటుంది.
న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్న రిషి ధారలు..
కొత్త వసుధార, కొత్త రిషి సర్ రేపే మనం కొత్తగా మీట్ అవుదాం అంటుంది వసు. రాత్రి 12 గంటలకి మన జర్నీ స్టార్ట్ చేద్దాం అంటుంది. కానీ చూసేవాళ్ళు ఊరుకుంటారా అంటాడు రిషి. ఎవరికి చెప్పొద్దు ఇది మనం ఎవరికోసమో తీసుకున్న నిర్ణయం కాదు అంటుంది వసుధార. కొత్తదనం సాధారణంగా ఆసక్తి కలిగిస్తుంది మన విషయంలో అలాగే జరగాలని ఆశిద్దాం.
లెట్ స్టార్ట్ అవర్ న్యూ జర్నీ అంటూ షేర్ అండ్ ఇస్తాడు రిషి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది వసు. మరోవైపు డిబిఎస్టి కాలేజీ పరువు ప్రతిష్టలు కాపాడాడు నాన్నగారి పరువు ప్రతిష్టలకి కళంకం రాకుండా చేశాడు అని రిషి ని మెచ్చుకుంటాడు ఫణీంద్ర. ఇక ఎవ్వరు మన వైపు వేలెత్తి చూపించరు అంటుంది జగతి.
రిషి ని మెచ్చుకుంటున్న ఫణీంద్ర, దేవయాని..
అంతలోనే రిషి, వసు రావడంతో నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ మెచ్చుకుంటుంది దేవయాని. నిన్ను అందరూ పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది అంటుంది దేవయాని. ఈ పొగడ్తలు చెందాల్సింది నాకు కాదు వసుధారకి. పెద్దమ్మ.. తన సహకారమే లేకపోతే ఇప్పుడు మన కాలేజీ కి చెరగని మచ్చ పడేది అంటూ వసుకి థాంక్స్ చెప్తాడు రిషి.
నాదేమీ లేదు సర్ క్రెడిట్ గోస్ టు జగతి మేడం అంటుంది వసు. అందరికి అందరూ ఒకటే క్రెడిట్ ఎవరూ తీసుకోరు అని నవ్వుతాడు ఫణీంద్ర. మరోవైపు మన పాత జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది 12 దాటితే నేను పాత రిషి ని అవుతాను. నేను వసుధారని కలిసిన సమయం అస్సలు తనని గుర్తించని సమయం కానీ తర్వాత తనే నా ప్రాణం అయింది.
టైం ట్రావెల్ కి సిద్ధమవుతున్న రిషి, వసు..
ఇప్పుడు టైం ట్రావెల్ లో వెనక్కి వెళ్లి మళ్లీ జర్నీ స్టార్ట్ చేస్తే ఆ ప్రేమ ఉంటుందా అనుకుంటాడు రిషి. అప్పటి సవాళ్లను అలాగే ఎదుర్కోవాలా, కొత్త బంధాలు తిరస్కరించాలా. కన్నీటి బరువులు మళ్లీ భుజానికి ఎత్తుకోవాలా అసలు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచనలో పడతాడు రిషి. అదే సమయంలో ఈ టైమ్ ట్రావెల్ ఆలోచన బాగుంది.
ఎప్పుడు అనుకోలేదు ఆయన మాటకి కట్టుబడే రోజు వస్తుందని. ప్రపంచంలో ఎంతమంది ఉండగా మీ లైఫ్ లోకి నేనే ఎందుకు వచ్చాను అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరే నా లైఫ్ అయ్యారు. నన్ను నేను కాపాడుకోవడం కోసం అనుమతి లేకుండా మిమ్మల్ని భర్తగా స్వీకరించాను అదే మన మధ్యన దూరాన్ని పెంచుతుంది. దూరాన్ని తొలగించాలని ఎటువంటి పొరపాచాలు లేని ప్రేమను పొందాలని.గతానికి వెళ్తున్నాం అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి అనుకుంటుంది వసు.
Guppedantha Manasu March 28 Today Episode టైం ట్రావెల్ కి నిబంధనలు పెట్టుకున్న రిషి వసు..
సరిగ్గా పన్నెండు అయ్యేసరికి ఇద్దరూ కలుస్తారు. మనం అనుకున్నట్లుగా చేయగలమా గతంలోకి వెళ్లాలంటే ఆందోళనగా ఉంది అంటాడు రిషి. నాక్కూడా అలాగే ఉంది అంటుంది వసు. కఠినమైన పరిస్థితులని మళ్లీ పునరావృతం చేయడానికి సిద్ధపడుతున్నాము. ఇందులో మనం కచ్చితంగా నెగ్గాలి అంటాడు రిషి. తప్పకుండా నెగ్గుతాము.
రిషి ధార ఇద్దరు కాదు ఒక్కరే అంటుంది వసు. అలా చేయాలంటే మనం కొన్ని మాట్లాడుకోవాలి కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. గతంలో జరిగిన విషయాలని అనుసరించాలి అంటే మనం ప్రస్తుతాన్ని పక్కన పెట్టాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:00 వరకు అప్పటి వసు అప్పటి రిషి. మిగతా టైం అంతా ప్రస్తుతం లో ఉన్న వసు, రిషి. కాలేజీలో ఎవరి పని వాళ్లు చూసుకుందాము. ఒప్పందం గురించి ఎప్పుడూ ఎవరితోనో చెప్పకూడదు అంటాడు రిషి. వీటిని అనుసరించి రిషిదారగా అవుదాము అంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటారు ఇద్దరు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.