Guppedantha Manasu March 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో డల్ గా ఉన్న జగతి దగ్గరికి వచ్చిన మహేంద్ర ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. రిషి, వసుల మధ్యలో ఏదో జరుగుతుంది అంటే నువ్వు నమ్మలేదు కానీ నిజంగానే జరుగుతుంది అంటూ జరిగిందంతా చెబుతుంది జగతి. కానీ వాళ్ల మధ్య దూరం దూరంగానే మిగిలిపోయింది దాన్ని ఎవరు పరిష్కరిస్తారు, వాళ్లని దగ్గర చేసేది ఎవరు.

రిషి రుణం తీర్చుకోవాలనుకుంటున్న జగతి..

వాళ్లకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది జగతి. వాళ్ల జీవితాలు ఎటూ పోలేక స్తంభించిపోయాయి ఇలా అయితే వాళ్ళు ఏమైపోతారో అని భయమేస్తుంది అంటుంది. ఏమీ కాదు నువ్వేమీ భయపడకు అంటాడు మహేంద్ర. నువ్వు నాకు ధైర్యం చెప్పడం కాదు వాళ్లకు ఏదో ఒక దారి చూపించాలి అంటుంది జగతి. మనం చెప్తే వినే పొజిషన్లో ఉన్నారా వాళ్ళు అంటాడు మహేంద్ర.

అలా అని చూస్తూ ఊరుకోలేము కదా, రిషికి నేను తల్లి ప్రేమని ఇవ్వలేకపోయాను కానీ తను నా కోసం చాలా చేశాడు ఆ రుణం తీర్చుకునే అవకాశం అయినా నాకు రావాలి. వాళ్ళిద్దర్నీ ఒకటి చేస్తేనే అ రుణం తీర్చుకున్న దాన్ని అవుతాను అంటుంది జగతి. మరోవైపు తన మంచం మీద ఒక లెటర్ రాసి పెడుతుంది వసు. ఈరోజు భోజనంలో ఆనందం రుచి కూడా చూడాలి అని అందులో రాసి ఉంటుంది.

డిఫరెంట్ గా డిన్నర్ ప్లాన్ చేసిన రిషి..

అది చదివిన రిషి తను ఏం చేసినా నా ఆనందం కోసమే అనుకుంటాడు. మరోవైపు టెర్రస్ మీద భోజనాలు చేస్తుంటారు. నువ్వు కూడా వడ్డించుకో, నువ్వే కదా భోజనంలో ఆనందాన్ని కూడా కావాలన్నావు అంటూ వసు కి చెప్తాడు రిషి. కోరిక వసుది అయినా మేమందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము అంటాడు మహేంద్ర. అవును చిన్నప్పుడు ఎప్పుడో ఆరుబయట తిన్నాము.

అప్పుడు మాకు అమ్మమ్మ బోలెడు కథలు చెప్పేది మళ్లీ ఇన్నాళ్ళకి ఇలా తింటున్నాము మీ ఇద్దరికీ థాంక్స్ అంటాడు ఫణీంద్ర. ఇలా ఆరుబయట అందరితో కలిసి కూర్చొని తింటుంటే మనసుకి తృప్తిగా ఉంది అంటుంది జగతి. ఇందులో తృప్తి ఏముంది కింద డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నా కూడా ఇదే భోజనం గిన్నెలు పైకి కిందికి తిప్పటం శ్రమ ఉంటుంది దేవయాని.

ఇలా చేయాలంటే అదృష్టం ఉండాలంటున్న వసు..

ఇందులో శ్రమ ఏముంది ఇలా వెన్నెల్లో భోజనం చేయడానికి కూడా అదృష్టం ఉండాలి అంటుంది వసు. ఇలాంటివన్నీ మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తారు అంటుంది దేవయాని. ఈ ఆనందం ముందు కోట్లు కూడా దండుగే ఉంటుంది జగతి. భోజనం అయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకునే దగ్గర రిషి, వసు క్లోజ్ గా ఉండడాన్ని చూసి భరించలేక పోతుంది దేవయాని.

మరోవైపు కుటుంబ సభ్యులందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉండగా జయచంద్ర అనే వ్యక్తి సనాతన సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. రిషి ఈయన తో మన కాలేజీలో డిబెట్ ఏర్పాటు చేయమని మినిస్టర్ గారు చెప్పారు అని ఫణీంద్ర తో చెప్తాడు. మంచిదే ఇలాంటి వాళ్ళ ఉపన్యాసం మన స్టూడెంట్స్ కి చాలా అవసరం అంటాడు ఫణీంద్ర.

చేయాలనుకున్న పనిని మధ్యలోనే వదిలేసిన వసు..

మన స్టూడెంట్స్ లో చాలామంది ఈయనకి ఫాలోవర్స్ ఉన్నారు అలాంటిది డైరెక్ట్ గా ఈయన స్పీచ్ వింటే కచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు అంటుంది వసు. అలాగే చేద్దాము ఆయన వచ్చిన రోజు మీరు, వదిన గారు కూడా కాలేజీకి రావాలి అందరం కలిపి ఆయన్ని రిసీవ్ చేసుకుందాం అంటూ అన్న గారితో చెప్తాడు మహేంద్ర. తప్పకుండా అంటాడు ఫణీంద్ర.

మరోవైపు రిషి క్యాబిన్ కి వచ్చిన వసు అక్కడ రిషి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారు అనుకుంటుంది. అంతలోనే అక్కడ ఎండి అని రాసి ఉన్న హార్ట్ సింబల్ కనిపిస్తుంది. దాని వెనక తిప్పి నేను ఎప్పుడూ మీ పక్కనే ఉండాలి అనుకుంటూ ఎం.హెచ్ అని రాయాలి అనుకుంటుంది. ఇంతలోనే రిషి రావటం గమనించి ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేస్తుంది. రిషి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు.

ఆ పనిని పూర్తిచేసిన రిషి..

జయచంద్ర గారి ఉపన్యాసం గురించి నోటీస్ బోర్డ్ లో పెట్టమన్నారు కదా దాని మ్యాటర్ ఒకసారి చూడండి అంటుంది. ప్రిపేర్ చేసింది నువ్వు కదా అంతా బానే ఉంటుంది అలాగే నోటీసు బోర్డులో పెట్టేయ్ అంటాడు రిషి. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ హార్ట్ సింబల్ లో సకం సకం రాసి ఉండటం చూసి ఎం హెచ్ లెటర్ ని పూర్తిగా రాస్తాడు. అది గమనించిన వసు నాకు తెలుసు సార్ నేను ఏ పని మధ్యలో వదిలేసిన అది మీరు పూర్తి చేస్తారని.

యు అర్ ఏ జెంటిల్మెన్ అంటూ థాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు పనిలో ఉన్న జగతి దగ్గరికి వచ్చి ఈరోజే జయచంద్ర గారు మన కాలేజీకి వచ్చేది వారికి వెల్కమ్ చెప్పడం కోసం ఫ్లెక్సీలు రెడీ చేయించాం కదా అవి వచ్చాయి వాటిని ఎక్కడ కట్టించాలో ఒకసారి చూద్దాం రా అంటాడు మహీంద్ర. డయాస్ దగ్గర పెట్టిస్తే సరిపోతుంది అంటుంది జగతి.

Guppedantha Manasu March 31 Today Episode: ఎండీ గారు అలాంటి పనులు చేయకూడదంటున్న వసు..

అక్కడ బాగుండదు ఎంట్రన్స్ లో పెట్టిద్దాము అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రిషి చెప్తాడు. మరోవైపు ఫ్లెక్సీ కడుతున్న వసు కాలుజారి పడిపోబోతే రిషి వచ్చి పట్టుకుంటాడు. ఎవరినైనా పిలవచ్చు కదా అంటాడు. ఇప్పటివరకు అటెండర్ ఇక్కడే ఉన్నాడు అంటుంది వసు. కింద పడి తల పగిలితే ఏమి అయ్యేది అంటూ పదా ఇద్దరం కలిపి ఆ ఫ్లెక్సీ కట్టేద్దాం అంటాడు రిషి.

మీరు ఈ కాలేజీ ఎండీ సర్ మీరు అలా చేయకూడదు అంటుంది వసు. నువ్వే చెప్పావు కదా నువ్వు ఏ పని మధ్యలో వదిలేసిన అది పూర్తి చేస్తాను అని అందుకే అంటూ స్టూల్ ఎక్కి ఫ్లెక్సీ కట్టేస్తాడు రిషి. దిగేటప్పుడు తన చేయి పట్టుకోమని వసు అంటే అక్కర్లేదు అంటూ తానే స్టూలు దిగి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 31, 2023 at 4:48 సా.