Guppedantha Manasu March 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అందరి ముందు ఆ వసుధారని నా భార్య అంటాడా అసలు అలా ఎలా అంటాడు అంటూ తన కోపాన్ని వెళ్ళగక్కుతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన రిషి, దేవయానిని పిలుస్తాడు. నాతో మాట్లాడకు నాకు చాలా కోపంగా ఉంది అంటుంది దేవయాని. మీ పెద్దమ్మ కి కోపం వచ్చింది ప్రసన్నం చేసుకో అంటాడు ఫణీంద్ర.

నన్ను దూరం పెట్టొద్దు అంటున్న రిషి..

నేను అలా మాట్లాడడం మీకు నచ్చకపోవచ్చు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి నేను అలా అనడానికి కారణాలు ఉన్నాయి కానీ కారణాలు ఇప్పుడు చెప్పలేను కావాలంటే జగతి మేడం అడగండి అంటాడు రిషి. నువ్వు అంత మందిలో అలా ఎలా అన్నావు నేను అక్కడ లేకపోతే నాకు అంత బాధనిపించదు, నిజంగా నువ్వు నా రిషివేనా అనిపించింది అంటుంది దేవాయాని. నేను ఎప్పటికీ మీ రిషినే నన్ను దూరం పెట్టొద్దు అంటాడు రిషి.

ఇంకా నా చేతిలోనే ఉన్నాడన్నమాట అనుకుంటూ నేను నీ మంచి కోసమే ఆలోచిస్తాను నా మాటలతో నిన్ను బాధపెట్టి ఉంటే సారీ అంటుంది దేవయాని. మీరు నాకు ఒకసారి చెప్పడం ఏంటి పెద్దమ్మ మీ గురించి నాకు తెలుసు అంటాడు రిషి. మొత్తానికి ఇద్దరు శాంతించారు అనుకుంటూ నవ్వుతూ చప్పట్లు కొడతాడు ఫణీంద్ర. మీరు ఊరుకోండి రిషి ఎప్పటికీ నా రిషియే అంటుంది దేవయాని. మరోవైపు రిషి అంత మాట అన్నాడా అంటుంది జగతి.

రిషి సార్ మాట మార్చేశారు అంటున్న వసు..

పదిమంది ముందు నేను తన భార్యని అని ఒప్పుకున్న రిషి సార్ 4 గోడల మధ్యలోనే మాటని మార్చేశారు. నన్ను తన భార్యగా ఒప్పుకోలేదు అంటుంది వసు. అలాంటప్పుడు స్టేజ్ మీద కూడా ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా, ప్రపంచానికే మేము భార్యాభర్తలమా ఎందుకు అంతలా శిక్షిస్తున్నారు అంటుంది వసు. ఆయన ప్రేమని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అంటుంది వసు. అందరిలోని ఒప్పుకున్న వ్యక్తి నిన్ను భార్యని కాదు అని ఎలా అంటాడు అలా అయితే తను రిషింద్ర భూషణ్ ఎందుకు అవుతాడు అంటుంది జగతి.

నాలుగు గోడల మధ్యలో చంపేశారు అంటున్న వసు..

మీరు రిషి సర్ ని వెనకేసుకొస్తున్నారు కదా అంటుంది వసు. సరే ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను అంటే పొద్దు మేడం నేను మీకు చాటింగ్ చెప్పినట్లుగా ఉంటుంది మా సమస్యని మేమే పరిష్కరించుకుంటాము అంటుంది వసు. ఇప్పుడే డిసీసర్ ని నేను వెనకేసుకొస్తున్నానన్నావు అప్పుడే మీ ఎండి గారిని ఏమీ అనొద్దు అంటున్నావు ఇదే ప్రేమంటే అంటుంది జగతి.

ఒక అడుగు ముందుకు వెళ్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది మా బంధం ఏంటో అర్థం కావట్లేదు అంటుంది వసు. ఎక్కువగా ఆలోచిస్తే ఏ సమస్య అవుతుంది ఎక్కువగా ఆలోచించకు అంటూ వెళ్ళిపోతుంది జగతి. రిషి అన్న మాటలు తలచుకుంటూ ఆలోచనలో పడుతుంది వసు. అక్కడ రిషి కూడా ఇదే ఆలోచనలో ఉంటాడు. నువ్వు చేసిన తప్పుని కొంతవరకు సరిదిద్దాను. ఒక్క సమాధానంతో అందరి నోర్లు మూయించాను అనుకుంటాడు రిషి. నలుగురిలో బ్రతికించి నాలుగు గోడల మధ్యలో చంపేశారు అనుకుంటుంది వసు.

నీ నిర్ణయాలే నిన్ను శిక్షిస్తున్నాయి అంటున్న రిషి..

నలుగురిలోని చెప్పిన సమాధానం నచ్చింది కానీ నాలుగు గోడల మధ్యన చెప్పిన సమాధానం నిజమే కదా అనుకుంటాడు రిషి. ఒక చేత్తో చప్పట్లు కొట్టి ప్రయత్నం చేస్తున్నారు, నేను మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసమే అలా చేశాను మీరే నన్ను శిక్షిస్తే ఎలా, మనం అక్షరాలు కలిసినంత మాత్రాన మనసులు కలుస్తాయా అని ఈ అక్షరాలు నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. మెడలో తాళ్లు వేసుకొని దూరమయ్యావా దగ్గరయ్యావా అని నా మనసు నన్ను అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది అనుకుంటుంది వసు.

నిన్ను నేను కాదు నీ నిర్ణయాలే శిక్షిస్తున్నాయి అనుకుంటాడు రిషి. ఈ టైంలో అక్కడేం చేస్తున్నావు ఫోన్ మాట్లాడుతున్నావా, లోపలికి రా అని పిలుస్తాడు చక్రపాణి. జగతి ధరణికి కాఫీ కల్పిస్తుంది మీరు కాఫీ ఇస్తున్నారు ఏంటి అని అడిగితే నేను కాఫీ ఇస్తే తప్పేముంది ధరణి మనసులో ఏ కల్మషం లేకపోతే మనం చాలా సంతోషంగా ఉంటాము అంటుంది జగతి. అంతలోనే అక్కడికి వచ్చిన దేవయాని ఇద్దరూ అంత సంతోషంగా కనిపిస్తున్నారు ఏంటి అంటుంది. సంతోషంగా కనిపిస్తే సంతోషించాలి కదా అంటుంది జగతి.

ధరణితో సెల్ఫీ కావాలంటున్న దేవయాని..

కాఫీ కావాలా పని అడుగుతుంది ధరణి కాదు నీతో సెల్ఫీ కావాలి నీకు ఈ మధ్య తమాషాలు ఎక్కువయ్యాయి కిచెన్లోకి కాఫీ కోసం కాకపోతే మరి ఎందుకు వస్తాను అంటూ కోప్పడుతుంది దేవయాని. మరోవైపు జగతితో కొత్త కోడలు ఎప్పుడు గృహప్రవేశం చేస్తుంది అని వెటకారంగా అడుగుతుంది. జరిగే వాటిని జరగనివ్వాలి అంతే అంటుంది జగతి. ఏం జరుగుతుందని ఊహిస్తున్నావు అంటుంది దేవయాని. మీరు ఏం జరగకూడదని ఊహిస్తున్నారు అదే జరగాలని నేను ఊహిస్తున్నాను అంటుంది జగతి.

పంతులమ్మవి కదా బాగా మాట్లాడుతున్నావ్ అంటుంది దేవయాని. అందరి ముందు వసుధార నా పెళ్ళాం అన్నంత ఈజీ కాదు వసు ఈ ఇంట్లో అడుగు పెట్టడం, ఇంట్లో అడుగుపడుతుందో చూస్తాను అనుకుంటుంది దేవయాని. ఏం ఆలోచిస్తున్నారు అని జగతి అడిగితే ఆలోచిస్తేనే పనులవుతాయి మీకు లాగా ఏం జరిగితే అది జరగని అని వదిలేయలేను కదా అంటుంది దేవయాని. ఆల్ ద బెస్ట్ అని వెటకారంగా చెప్పి వెళ్ళిపోతుంది జగతి.

Guppedantha Manasu March 4 Today Episode అతి తెలివి ప్రదర్శిస్తున్న ధరణి..

వసు ఈ ఇంటికి కోడలుగా రావటం అంత తేలికా అని ధరణిని అడుగుతుంది దేవయాని. ఏం సమాధానం చెప్తే ఏం ప్రమాదం వస్తుందో అని మీరు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదు అత్తయ్య అని తప్పించుకుంటుంది. నువ్వు విన్నా వినకపోయినా ఒకటే అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు రిషి దగ్గరికి వచ్చిన జగతి వసు గురించి మాట్లాడొచ్చా అని అడుగుతుంది. ప్రతి మాట నా అనుమతితోనే మాట్లాడారా ఇంతకుముందు అంటాడు రిషి.

నీ అనుమతి తీసుకోకుండానే నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పేను నీ అనుమతి తీసుకోకుండానే తాళిబొట్టు నీతో పంపించాను.నిజానికి అందులో ఏముందో నీకు చెప్పలేదు నువ్వు చూడలేదు. నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసు ఆవేదనలో తనకి తోచింది చేసింది అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.