Guppedantha Manasu March 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తన గదిలోకి తీసుకు వెళ్లిన జగతితో నిన్నటి వరకు నీ మొహం లో ధైర్యం కనిపించేది ఇప్పుడు ఎందుకో టెన్షన్ కనిపిస్తుంది అంటుంది దేవయాని. అలాంటిదేమీ లేదు అంటుంది జగతి. అవునా అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పట్టుబట్టలు తీసుకొచ్చి ఇస్తుంది దేవయాని.
దేవయాని ప్లాన్ అర్థం చేసుకున్న జగతి..
నాకెందుకు అని జగతి అంటే నీకు కాదు ఇంట్లో కొత్తజంట ఉన్నారు కదా వాళ్ళని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయిద్దాము. నీకు ఎలాగూ సాంప్రదాయాలు పట్టవు, అందుకే నేను బాధ్యత తీసుకుంటున్నాను మీరిద్దరూ కలిపి ఆ కొత్తజంటకి ఈ బట్టలు ఇవ్వండి అంటుంది. నేను చెప్పిందాంట్లో తప్పేమైనా ఉంటే చెప్పు సరిదిద్దుకుంటాను అంటుంది దేవయాని.
రిషిని పీటల మీద కూర్చోమంటే కోపగించుకుంటాడు, రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య మనసు పెద్దలు తేవాలని అనుకుంటున్నారు అక్కయ్య అనుకుంటుంది జగతి. మేలుకో నీ కన్నే పొడుస్తున్నాను ఏం చేస్తావో చూస్తాను అనుకుంటుంది దేవయాని. నీ కొడుకు కోడలు సత్యనారాయణ వ్రతం చేయడం ఆనందమే కదా టైం అవుతుంది వెళ్లి వాళ్ళకి ఈ బట్టలు ఇవ్వు అని జగతిని కంగారు పెడుతుంది దేవయాని.
విషయాన్ని అన్న కి చెప్తానంటున్న మహేంద్ర..
జగతి నేరుగా భర్త దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. వదిన గారు తెలివిగా ఇరికించారు అంటాడు మహేంద్ర. అక్కయ్య కొత్తగా మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఇలాగా వ్రతాన్ని అడ్డుపెట్టుకుంటారని అనుకోలేదు అంటుంది జగతి. ఇలా చేయడం కుదరదు అని చెప్పేద్దాము, లేదంటే అన్నయ్యకి చెప్దాము అంటాడు మహేంద్ర.
ఈ విషయంలో మనం గొడవ చేయటం కరెక్ట్ కాదు. అడుగు ముందుకు వేస్తే విజయం అనుకుంటూ వసు రూమ్ కి వెళ్తారు మహేంద్ర దంపతులు. అక్కయ్య గారు ఇచ్చారు ఈ కొత్త బట్టలు నువ్వు రిషి కలిసి పీటల మీద కూర్చోవాలి అంటుంది జగతి. అదెలా సాధ్యం, రిషి సార్ ఏమనుకుంటున్నారో మీకు తెలుసు. ఏదో నవ్వుతున్నారు అంతేకానీ ఆ నవ్వులో తెలియని బాధ కనిపిస్తుంది అంటుంది వసు.
మీ సమస్యని మీరే పరిష్కరించుకోండి అంటున్న జగతి..
జరిగిన వాటిని తలుచుకుంటూ గడపడం తెలివైన వాళ్ళ లక్ష్యం కాదు, వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి అంటుంది జగతి. ఇప్పుడు ఈ బట్టలు తీసుకొని రిషి సార్ దగ్గరికి వెళ్తే మా మధ్య ఉన్న దూరం మరింత పెరుగుతుంది అంటుంది వసు. ఎందుకు అలా అనుకుంటున్నావు దేవయాని అక్కయ్య మీద గౌరవంతో ఒప్పుకుంటాడేమో అంటుంది జగతి.
సార్ ని ఒప్పించడం అంతా ఈజీ కాదు అంటుంది వసు. నువ్వు ఇంకేమీ ఆలోచించకు ధైర్యంగా వెళ్లి జరిగిందంతా రిషికి చెప్పు మీ సమస్యని మీరే పరిష్కరించుకోవాలి పండు బట్టలు ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోతారు జగతి దంపతులు. వసు నేరుగా రిషి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. మనిద్దరం భార్యాభర్తల్లాగా పీఠల మీద ఎలా కూర్చుంటాము నువ్వు చెప్పు.
మనం భార్యాభర్తలమా అని నిలదీస్తున్న రిషి..
మనం భార్యాభర్తలం అయ్యామా, ఈ ఆలోచన నిజంగా పెద్దమ్మదేనా అంటాడు రిషి. మీరు ఏమనుకుంటున్నారు ఇదంతా నేనే చేశానని అనుకుంటున్నారా అంటుంది వసు. ఇలా చేయటం కరెక్టేనా ఇందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటాడు రిషి. ఈ సమస్యకి పరిష్కారం మీరు చెప్తేనే బావుంటుంది అంటుంది వసు. నేను చెప్పాల్సింది చెప్పాను కానీ ఇలా చేయటం నీకు ఇష్టమేనా.
మనం ఇద్దరం భార్యాభర్తలమా, ఇలా చేయటానికి మనకి అర్హత ఉందా అంటూ నిలదీస్తాడు రిషి. మరోవైపు పూజ దగ్గర ఉన్న మహేంద్ర దంపతులు ఇంకా రిషి వాళ్ళు రాలేదు ఏం గొడవ పడుతున్నారు ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈరోజు రిషి మనసులో ఏముందో తెలిసిపోతుంది కచ్చితంగా గొడవపడతాడు నాకు కావాల్సింది ఇదే అనుకుంటుంది దేవయాని.
అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన వసు, రిషి..
ఇంతలో పంతులుగారు పీటల మీద కూర్చునే దంపతులని పిలవండి అంటారు. వాళ్లు ఇంకా రాలేదు అంటే లోపల గొడవ పడుతూ ఉండి ఉంటారు అనుకుంటూ రిషి వాళ్ళని తీసుకురమ్మని జగతికి పురమయిస్తుంది దేవయాని. అంతలోనే రిషి వాళ్ళు దేవయాని ఇచ్చిన బట్టలతో కిందికి దిగుతారు. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవయాని.
మహేంద్ర వాళ్ళు చాలా సంతోషిస్తారు. టైం అవుతుంది అని దేవయాని అంటే వద్దు పెద్దమ్మ డాడ్ వాళ్ళు కూర్చుంటారు అంటాడు రిషి. మీరు కొత్తజంట పూజ చేయవలసింది మీరు అంటుంది దేవయాని. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాము ఇప్పుడు వదిలేయండి అంటాడు రిషి. మనకి కావలసింది పూజ జరగటం ప్రస్తుతానికి వీళ్ళని చేయని తర్వాత వాళ్ళ చేత చేయిద్దాంలే అంటాడు ఫణీంద్ర.
Guppedantha Manasu March 16 Today Episode అయోమయ పరిస్థితిలో దేవయాని..
రిషి కూడా చెప్పడంతో చేసేది లేక పీటల మీద కూర్చుంటారు జగతి దంపతులు. వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంటే లోపల గొడవ ఏమీ జరగలేదా అనుకుంటుంది దేవయాని. పూజ ప్రారంభిస్తారు పంతులుగారు. రిషి గదిలో జరిగిన దాన్ని తలుచుకుంటాడు. ప్రేమకు రెండు కుటుంబాలు అవసరం లేదు కానీ పెళ్ళికి ఇరు కుటుంబాలు కావాలి అలాగే ప్రేమకి సంప్రదాయం అక్కర్లేదు, పెళ్లికి ఇవన్నీ కావాలి.
నువ్వు ఒక పరిస్థితుల్లో నీ మెడలో తాళి వేసుకున్నావు. నీ మీద మన ప్రేమ మీద ఉన్న గౌరవంతో నేను అంగీకరించాను అంటాడు రిషి. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు అంటుంది వసు. అనుకోవాలి, సమస్య నీది, నాది అనే పరిధి దాటి ఎక్కడికో వెళ్తుంది. ఎంతమందిని నమ్మిస్తాం. ఆఖరికి దేవుడు పూజలో కూడా ఇలా అంటే ఎలా అంటాడు రిషి.
పూజ చేయడం జరగదు అంటున్న రిషి..
నేను ఈ విషయాన్ని కోపంతో అని చెప్పటం లేదు, బాధతో మాత్రమే చెప్తున్నాను అంటాడు. ఈ బట్టలు దేవయాని మేడం వచ్చారు కదా అంటుంది వసు. నేను పెద్దమ్మతో చెప్తాను ఈ పూజ మనం చేయట్లేదు అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.