Guppedantha Manasu May 11 Episode: వసు విషయంలో మనోడు ఎప్పుడో ఫిక్స్ అయ్యాడంటూ జగతి.. చేతిలో చెయ్యేసి రిషికి మాటిచ్చిన వసు!

Akashavani

Guppedantha Manasu May 11 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. వసును తన ఇంటి దగ్గర డ్రాప్ చేసిన రిషి తన మనసులో నువ్వు పక్కన ఉన్నప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. వసు కూడా రిషి పక్కన ఉన్నంత వరకు మనస్సు ఉత్సాహంగా ఉంటుంది అని అనుకుంటుంది. ఇక అక్కడ నుంచి రిషి ఇంటికి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో జగతి, మహేంద్రవర్మ రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇక మహేంద్రవర్మ సాక్షి గురించి మాట్లాడుతూ వుండగా జగతి ఆ విషయాన్ని అక్కడే ఆపివేస్తుంది. ఇదంతా దేవయాని అక్కయ్య చేసిన ప్లాన్ అని అనగా అప్పుడే దేవయాని తమ గదిలోకి వస్తుంది. ఇక వారితో రిషి గురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా రిషి, సాక్షిల పెళ్లి గురించి పట్టించుకోమని అనడంతో వెంటనే జగతి ఆ నిర్ణయం రిషికే వదిలి పెట్టాలి అని అంటుంది.

సాక్షి, రిషిల పెళ్లి చేస్తానంటున్న దేవయాని..

దేవయాని ఆ మాటకు కోపంతో రగిలిపోతూ మహేంద్ర వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతుంది. అంతేకాకుండా రిషి, సాక్షిల పెళ్లి జరిపిస్తాను అని వారికి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దాంతో జగతి, మహేంద్రవర్మ ఆలోచనలో పడతారు. ఇక రిషి తన గదిలో వసు తో గడిపిన క్షణాలను తల్చుకుంటూ ఉంటాడు. తనతో ఉన్నంతసేపు తనకు మరో లోకంలో ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతాడు.

రిషి లవ్ లెటర్ అని తెలుసుకున్న జగతి..

అంతేకాకుండా గతంలో తను వసు కు రాసిన లవ్ లెటర్ ను చూస్తూ చదువుతూ ఉంటాడు. అప్పుడే రిషికి ఫోన్ రావడంతో బయటికి వెళ్లి మాట్లాడుతాడు. ఇక అది గమనించిన మహేంద్రవర్మ జగతిని రిషి గదిలోకి తీసుకుని వచ్చి ఆ లవ్ లెటర్ ను చూపిస్తాడు. ఇక ఆ లవ్ లెటర్ రిషి ఎంత బాగా రాశాడో అని జగతి తో అంటాడు. దాంతో జగతి లవ్ లెటర్ విషయంలో జరిగిన సీన్ గుర్తుచేసుకొని ఇది రిషి వసుకు రాసిన లెటరా అని అనుకుంటుంది.

లవ్ లెటర్ తో సెల్ఫీ దిగిన మహేంద్రవర్మ..

దాంతో మహేంద్రవర్మ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ కనిపిస్తాడు. వసు విషయంలో మనోడు ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు మనమే ఇంకా తెలుసుకోలేదు అని అంటుంది జగతి. మహేంద్ర వర్మ ఆ లవ్ లెటర్ తో ఒక సెల్ఫీ దిగి జగతిని తీసుకొని తన గదిలోకి వెళ్తాడు. ఉదయాన్నే రిషితో కాలేజీ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా దేవయాని సైగల్ చేయటంతో సాక్షి టాపిక్ తీస్తాడు.

దాంతో రిషి సాక్షి విషయాన్ని తనతో చర్చించకూడదు అన్నట్లుగా చెప్పి అక్కడ్నుంచి వెళ్తాడు. ఇక కాలేజీలో రిషి క్యాబిన్ లో వసు ఫైల్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రిషి రావటంతో కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉండగా సాక్షి విషయాన్ని గమనించి రిషి వసును పక్కకు తీసుకెళ్తాడు.

Guppedantha Manasu May 11 Episode: వసును మాట ఇవ్వమన్న రిషి..

తరువాయి భాగంలో రిషి వసుతో తన అఇష్టాన్ని తన నుంచి దూరం చేయాలి అంటాడు. ఈ విషయంలో మాట ఇవ్వు అని వసు తో అంటాడు. ఇక వసు వెంటనే రిషి చేతిని పట్టుకొని మీ అయిష్టాన్ని దూరం చేస్తాను అని మాట ఇస్తుంది.

- Advertisement -