Guppedantha Manasu: మనసులలో అనురాగాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఈగోల వల్ల దగ్గర కాలేకపోతున్న ఇద్దరు వ్యక్తుల కథ ఈ గుప్పెడంత మనసు. ఇక ఈవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
రిషి ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్న జయచంద్ర రిషి, వసులని నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు. వాళ్లని గమనిస్తున్నారని తెలుసుకున్న రిషి, వసు క్లోజ్ గా ఉన్నట్లుగా నటిస్తారు. ఎందుకు భర్తని సార్ అని పిలుస్తున్నావు అని అడుగుతాడు జయచంద్ర.ఆయన పెళ్ళికి ముందు నుంచే తెలుసు అందుకే అలా పిలుస్తున్నాను అంటుంది వసు.
మరోవైపు తన దగ్గరికి వచ్చిన రిషి, వసుల కి మీరు ఎప్పుడు కలిసే ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోకండి అంటూ మంచి మాటలు చెప్తాడు జయచంద్ర. మరోవైపు రిషి, వసు దగ్గరికి వచ్చి నీకు నా మీద ఉన్న అభిమానానికి థాంక్స్ అంటాడు. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది వసు. పెళ్లి విషయంలో ఆయనకు ఏదో అనుమానం వచ్చినట్లుగా ఉంది అంటుంది వసు.
చెరో గదిలో పడుకుంటే ఆయనకి మరింత అనుమానం వస్తుందని టెర్రస్ మీదకి వెళ్లి పడుకుంటాడు రిషి. అతని దగ్గరికి వెళ్లి ఎవరిని మభ్య పెట్టాలని ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది వసు. అలాంటి ఉద్దేశం నాకు లేదు సమస్య పెద్దది కాకుండా ప్రయత్నం చేస్తున్నాను అంటాడు రిషి. పొద్దున్నే తన దగ్గరికి వచ్చిన వసుతో నీ మనసు ఎందుకొ అలజడిగా ఉంది మనసుని ప్రశాంతంగా ఉంచుకో అంటాడు జయచంద్ర.
కాసేపట్లో కాలేజీకి బయలుదేరుదాం ఫ్రెష్ అవ్వండి అని జయచంద్రకి చెప్పి బయలుదేరుతారు రిషి, వసు. మరోవైపు జయచంద్ర గారికి అన్నీ తెలుస్తాయట ఎవరు తప్పులు చేస్తే వాళ్ళని కాల్చేస్తారట అంటూ దేవయానిని భయపడుతుంది ధరణి. ఏంటి నన్నే అంటూ భయంగా అడుగుతుంది దేవయాని. కాదు పాపాల్ని అంటూ ట్విస్ట్ ఇస్తుంది ధరణి.
మరోవైపు కార్లో కాలేజీకి వెళుతుండగా పెళ్ళికి ముందు సార్ అని పిలిస్తే పర్వాలేదు కానీ ఇప్పుడు కూడా సార్ అని పిలవటం ఏమీ బాగోలేదు అంటాడు జయచంద్ర. మనం మళ్ళీ కలిసే నాటికి పిలుపులో మార్పు వస్తుంది అంటూ మాటిస్తాడు రిషి. మరోవైపు రిషి వసు గురించి పూర్తిగా చెప్పి వాళ్ళిద్దర్నీ ఎలాగైనా కలపాలని జయచంద్రని కోరుతుంది జగతి.
అలాగే అంటూ మాటిచ్చిన జయచంద్ర కాలేజీలోపెళ్లి టాపిక్ మీద డిబేట్ పెడతాడు. రిషి, వసు భిన్న అభిప్రాయాలని తెలియజేస్తారు. ఎవరిది కరెక్ట్ అభిప్రాయము అంటూ ఓటింగ్ పెడతాడు జయచంద్ర. రిషి, వసుకి వసు రిషికి ఓటు వేసుకుంటారు. మీ ఇద్దరికీ ఒకరుంటే ఒకరికి గౌరవం ఉంది కానీ చిన్నపాటి భేదం వల్ల అర్థం చేసుకోలేకపోయారు.
ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు ఎవరి తప్పు ఉండదు అంటాడు జయచంద్ర. రియలైజైన రిషి వసు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. అది చూసిన జగతి దంపతులు ఎమోషనల్ అవుతారు. మరోవైపు నేను తనకి ఓటేశాను అంటే తన అభిప్రాయాన్ని అంగీకరించినట్లే కదా మరి ఎందుకు ఆ దూరం. ఇక ఈ దూరానికి ముగింపు చెప్పాలి అనుకుంటున్నాడు రిషి.
వసు కూడా అదే ఆలోచనలో నిద్రలోకి జారుకుంటుంది. నిద్రలో వచ్చిన పీడకల మూలంగా మెడలో ఉన్న నల్లపూసలు తెగిపోతాయి కానీ వసు గమనించదు. వసుతో మాట్లాడటానికి వచ్చిన దేవయాని నల్లపూసలని చూసి కామ్ గా తీసుకొని వెళ్లి రిషి గదిలో పెట్టేస్తుంది. వసు కావాలనే ఆ విధంగా చేసింది అనుకొని అందరి ముందు అవమానించేలాగా మాట్లాడుతాడు.
కానీ రిషి గదిలో నుంచి దేవయాని రావటం గమనించిన ఫణీంద్ర ఇదంతా నువ్వే చేసావు కదా అంటూ నిలదీస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది దేవయాని. చిన్న విషయానికి అపార్థం చేసుకున్నారు అంటూ బాధపడుతుంది వసు. కాదు నువ్వు ఎక్కడ దూరమైపోతావో అని భయం అంటాడు రిషి. ఇప్పుడే వసు మెడలో నల్లపూసలు వెయ్యు అని మహేంద్ర అంటే కొంచెం టైం కావాలి అంటాడు రిషి.
Guppedantha Manasu కథలో కొత్తదనం లేదంటూ పెదవి విరుస్తున్న ప్రేక్షకులు..
మరోవైపు దేవయాని ఇదంతా కావాలని చేసింది అని జగతి దంపతులిద్దరూ ఆవిడని తిట్టుకుంటారు. మరోవైపు ఈసారి మన బంధం ముడిపడాలంటే సరియైన నిర్ణయం తీసుకుందాము అంటూ అందరి ముందు వసుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి షాక్ ఇస్తాడు రిషి. ఒక్క దేవయాని తప్ప అందరూ సంతోషిస్తారు. రిషి, వసుల పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుందా? పెళ్లి ఆపటానికి దేవయాని ఎలాంటి ఎత్తులు వేస్తుంది ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.