Guppedantha Manasu: కొడుకుకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని, వాళ్ళ వదిన గారి కుట్రల నుంచి కొడుకుని కాపాడాలని తాపత్రయపడుతున్న తల్లిదండ్రుల కదే ఈ గుప్పెడంత మనసు. ఈవారం ఏం జరిగిందో చూద్దాం.
గదిలో బట్టలు మడత పెడుతున్న జగతి దగ్గరికి వచ్చి దేవయాని సంతోషంతో పండగ చేసుకుంటావు అనుకున్నాను ఇలా కూర్చున్నావేం అని అడుగుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుందని ఊహల్లో తేలిపోతున్నావేమో అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే రిషి నా కొడుకు నేను చెప్పినట్లే వింటాడు అంటుంది దేవయాని. వాడికి నేనంటే గౌరవం అదే నా ఆయుధం అని దేవయాని అంటే 100 ఆయుధాలు ఉన్న ఒక్కొక్కసారి గెలవలేం. అయినా ఇదే మాట రిషితో చెప్పొచ్చు కదా అంటుంది జగతి.
మాటలు గట్టిగానే వస్తున్నాయి, ఈ పెళ్లి జరుగుతుందని మంచి నమ్మకంతో ఉన్నట్లున్నావ్, ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరగదు అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడే వచ్చిన మహేంద్ర ఏం జరిగిందంటే జరిగింది అంతా చెప్తుంది. ఆవిడ కుట్ర నుంచి పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి అంటుంది జగతి. మరోవైపు రిషి అందరి ముందు అలా మాట్లాడాను నీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అంటే లేదు చాలా గర్వంగా ఉంది అంటుంది వసు. అర్ధరాత్రి ఫోన్ చూస్తున్న భార్యని ఈ టైంలో ఫోన్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని నిలదీస్తాడు ఫణీంద్ర.
అప్పుడు బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది దేవయాని. ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా తప్పించేయాలంటూ రాజీవ్ తో బేరం కుదుర్చుకుంటుంది. ఆ మాటల్ని మహేంద్ర దొంగ చాటుగా వింటాడు. పొద్దున్నే రెడీ అయ్యి వచ్చిన దేవయాని పదండి వసు వాళ్ళ ఊరు వెళ్దాము అంటే ఇప్పుడు వద్దు అంటుంది వసు. అంతా నీ ఇష్టమేనా మా పెద్దరికం ఏమి ఉండదా అంటుంది దేవయాని. నేను ఇంటి నుంచి వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు సడన్ గా ఇంటికి వెళ్లి పెళ్లి అది అంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అందుకే ముందు నేను వెళ్లి అక్కడ పరిస్థితులు చక్కబెట్టి మిమ్మల్ని పిలుస్తాను అంటుంది.
వసు చెప్తున్నా వినకుండా మేము వస్తాము మీ పెద్ద వాళ్లతో మాట్లాడుతాం అంటున్న దేవయానిని మందలిస్తాడు ఫణింద్ర. వసుధర చెప్పింది బానే ఉంది తను ఫోన్ చేశాకే వెళ్దాం అంటాడు ఫణీంద్ర .తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతుంది దేవయాని. ఆమె పరిస్థితిని చూసి నవ్వుకుంటారు జగతి దంపతులు. రిషి, వసుని కారెక్కించి అన్ని జాగ్రత్తలు చెప్తాడు. ధైర్యంగా వెళ్ళు అక్కడ ఏమైనా జరిగితే నేనున్నానని మర్చిపోకు అంటాడు. కారులో వెళ్తున్న వసు ముందు రోజు రాత్రి జరిగినది అంతా తలుచుకుంటుంది.
తన గదిలో ఉన్న వసు దగ్గరికి జగతి దంపతులు వచ్చి మీ ఊరు మేము రావడం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్ళు అంటారు. అదేంటి మేడం అందరిని కలిసే వెళ్దామని కదా అనుకున్నాం అంటుంది వసు. చెప్పిన మాట విను మీ నాన్న ఎలాంటి వాడో నాకు తెలుసు. చాలా సంవత్సరాలు తర్వాత ఇంటికి వెళ్తే నానా మాటలు అంటాడు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి అనుకుంటున్న దేవయాని అక్కయ్య ఈ అవకాశాన్ని వాడుకొని ఈ పెళ్లిని తప్పించడానికి ప్రయత్నిస్తుంది అంటూ దేవయాని ఎవరితో మాట్లాడిన సంగతి చెప్తారు జగతివాళ్ళు.
ముందు నువ్వు వెళ్లి అక్కడే పరిస్థితులని చెప్పబడిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము వస్తాము అని వసు కి నచ్చచెప్తారు. అదే విషయాన్ని కారులో గుర్తు చేసుకుని మేడం చెప్పింది నిజమే రిషి సార్ ఇంటికి వచ్చి ఆయన్ని నా తండ్రి ఏమైనా అంటే నేను భరించలేను ఏదైనా ఈ విషయాన్ని ముందు తండ్రితో ధైర్యంగా మాట్లాడాలి అనుకుంటుంది వసు. నన్ను ఒక్కదాన్నే ఎలా పంపించేశారు సార్ మీరు కూడా వస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది.
అక్కడ రిషి కూడా అలాగే అనుకుంటాడు. మరోవైపు గదిలో జగతి వాళ్ళు వసు గురించి మాట్లాడుకుంటారు. ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో నుంచి మంచి సపోర్టు వస్తుంది కానీ వసుకి ఆ అదృష్టం లేదు. ఆమె ప్రపంచాన్ని అంతా చేయిస్తుంది కానీ ఆ తండ్రిని జయించలేదు ఎందుకంటే అతను ఒక మూర్ఖుడు అంటూ వసు తండ్రి సంగతి అంతా భర్తకు చెప్తుంది జగతి. ఈ మాటలన్నీ చాటుగా విన్న రిషి అక్కడినుంచి వెళ్ళిపోబోతాడు. రిషి ని గమనించిన మహేంద్ర వాళ్ళు బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతారు.
నేను కూడా వసుతో పాటు వెళ్తాను నేను తన్ని వాళ్ళ ఇంటికి పంపించాను అనుకున్నాను కానీ సమస్యల వలయంలోకి పంపించానని అనుకోలేదు అంటాడు రిషి. రిషి ని ఆగమని జగతి చెప్తుంది. నన్ను వెళ్ళొద్దని చెప్పకండి నేను వసుధార ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటాడు రిషి. నిన్ను వెళ్ళొద్దని చెప్పడం లేదు ఆగు అని చెప్పి తన గదిలోకి వెళ్లి గిఫ్ట్ బాక్స్ తీసుకొని వచ్చి రిషి చేతిలో పెడుతుంది జగతి. దీనిని వసుకి ఇమ్మని, వసు పిలిచే వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది జగతి.
వెళ్తూ వెళ్తూ గుమ్మం తగిలి తూలిపోతాడు రిషి. ఏమవుతుందో అని కంగారు పడుతున్న మహేంద్రతో అపశకునం మాట్లాడొద్దు అంటుంది జగతి. కారులో బయలుదేరిన కలిసి దారిలో వసు ని కలుసుకుంటాడు. తన కారుని డ్రైవర్ కి ఇచ్చేసి వసు కారుని తనే డ్రైవ్ చేస్తాడు. రిషి ని చూసి చాలా ఆనంద పడిపోతుంది వసు. మరోవైపు రిషి వసు తో వెళ్ళాడని తెలుసుకున్న దేవయాని కోపంతో రగిలిపోతుంది.
రిషి కి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటుంది. వసుకి తోడుగా వెళ్తున్నాను వెనక్కి రావటం కుదరదు అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. రిషి ని వసు, జగతిలు పూర్తిగా మార్చేశారు వాళ్ళ అంతు చూడాలి అని కోపంగా అనుకుంటుంది దేవయాని.రిషి అలా మాట్లాడటంతో చాలా సంతోష పడిపోతుంది వసు. కారులో ఊరికి వెళ్తున్న రిషి వసూలు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తారు. అలసిపోయినా రిషి మంచినీళ్ల కోసం ఒక షాప్ దగ్గర దిగితే అక్కడ రిషి చేత గోలి సోడా తాగిస్తుంది వసు.
ముందు వద్దన్నా ఆ టేస్ట్ నచ్చి మరొకటి తాగుతాడు రిషి. అక్కడే తాటి తెగులు పళ్ళు ఉంటే ఆయన్ని కొనేసి పట్టుకొస్తుంది వసు. అవన్నీ నేను తినను నువ్వే తిను అంటాడు రిషి. అది ఎందుకు తినాలో అవి తింటే ఒంటికి ఎంత బలమో పెద్ద హిస్టరీ చెప్తుంది వసు. నేను తింటాను కానీ నువ్వు హిస్టరీ చెప్పడం మానే అంటూ ఆమెకి దండం పెట్టేస్తాడు రిషి. మరోవైపు కోపంతో రగిలిపోతున్న దేవయాని జగతి దగ్గరికి వెళుతుంది. రిషి వసూల్ తో వెళ్ళాడు అనే విషయాన్ని మీరు చెప్పలేదు తను చెప్పలేదు అంటూ జగతి మీద కేకలు వేస్తుంది.
రిషి ని వెనక్కి వచ్చేయమంటే రాలేదు అంటుంది దేవయాని. ఎందుకు రిషి ని వెనక్కి వచ్చేయమన్నారు తనకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు అని జగతి గట్టిగా మాట్లాడుతుంది. తను అక్కడికి వెళ్ళాడు అంటే అది తన ఇష్టం ఆపడానికి మనం ఎవరిమి అంటుంది జగతి. అది రిషి ఇష్టం కాదు నువ్వు బలవంతంగా వాడి మీద వసుని ఉసిగొల్పావు. వాడికి మంచి మంచి సంబంధాలు వచ్చేవి ఆ పేదింటి పిల్లని తీసుకొచ్చి వాడికి అండగట్టాలని చూస్తున్న వాడి భవిష్యత్తుని నువ్వే పాడు చేస్తున్నావ్ వాడంటే మీకు అస్సలు ప్రేమే లేదు అంటుంది దేవయాని.
ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన జగతి మీరు ఎన్నెన్నో పడతాను అంతేగాని రిషి మీద ప్రేమ లేదంటే ఊరుకోను. ఆ మాటకి వస్తే మీకు మాత్రం రిషి అంటే ప్రేమ ఉందా మీకు కావలసినంత పెత్తనం, అధికారం. మీ కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియనివా? మీ అధికారానికి నేను కాబట్టి తలొంచాను కానీ వసుకి నా అంత ఓపిక లేదు. తను రిషికి ఒక్క మాట మీ గురించి చెప్తే మీ పరిస్థితి ఏమిటో తెలుసా అంటూ గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అయితే ఎక్కడ మీ అధికారం పోతుంది అని మీ భయం అంటుంది.
మీరు నా వరకు నాకు ఎంత అన్యాయం చేసినా భరించాను కానీ నా కొడుకు జోలికి రావద్దు ఊరుకోను అంటూ హెచ్చరిస్తుంది. వస్తాను వచ్చి తీర్చండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగనివ్వను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది దేవయాని. వసు వాళ్ళ ఊర్లోకి ప్రవేశించాక కారుని మెల్లగా పోనివ్వమంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఊర్లోకి వస్తే త్వరగా ఇంటికి తీసుకెళ్లమంటావ్ అనుకుంటే ఇదేంటి స్లోగా తీసుకెళ్లమంటున్నవ్ అంటాడు రిషి.
స్స్లోగా వెళుతూ ఊర్లో అని చూసుకొని వెళ్దాం ఊర్లోకి వచ్చి చాలా రోజులు అయింది అంటూ తన ఊరి నేమ్ బోర్డు చూసి దాంతో ఒక సెల్ఫీ తీసుకొని ఆనందపడిపోతుంది వసు. దారిలో తన కాలేజీ చూపిస్తుంది. నాకు ఇక్కడే జగతి మేడం పరిచయం నా జీవితం మరో మలుపు తిరిగింది అంటే కారణం ఆవిడే అంటుంది వసు. ఆ మాటలకి ముభావంగా మారిపోతాడు రిషి. మీరు జగతి మేడం ని ఎప్పటికీ క్షమించలేరా అంటుంది వసు. క్షమించడానికి అది బాధ కాదు నా పెయిన్ అంటాడు రిషి. అయినప్పటికీ జగతి మేడం అంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే జగతి మేడం వల్లే డాడ్ సంతోషంగా ఉన్నారు.
నువ్వు కూడా మేడం వల్లే నా లైఫ్ లోకి వచ్చావు అంటూ జగతి ఇచ్చిన గిఫ్ట్ని వసు కి ఇస్తాడు. అంతలోనే తండ్రి ఫోన్ చేసి ఊరు చేరిపోయారా అని అడుగుతాడు. చేరిపోయాము వసు వాళ్ళ కాలేజీలోనే ఉన్నాం అంటాడు రిషి. సరే అని మరీ మరీ జాగ్రత్తలు చెప్తే నేనేమైనా యుద్ధానికి వెళుతున్నాను అన్ని సార్లు జాగ్రత్త చెప్తున్నారు అంటాడు. నువ్వు ఒకరకంగా ప్రేమ యుద్ధానికి వెళ్లావు అనుకుంటాడు మహేంద్ర. ఇంటికి దూరంగా కారు ఆపిస్తుంది వసు. ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అంటే వద్దు వాళ్లు మిమ్మల్ని ఏమైనా అంటే నేను భరించలేను. నేను వెళ్లి పరిస్థితులు చక్కబెట్టి మీకు ఫోన్ చేస్తాను అంటుంది వసు.
Guppedantha Manasu: ఈవారం ట్విస్ట్ అదిరినా,కధ స్లోగా ఉంది అంటున్న ప్రేక్షకులు..
నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అంటాడు రిషి. చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన వసు తల్లిని చూసి ఆనందంతో ఏడ్చేస్తుంది. ఆ తల్లి కూడా వసుని పట్టుకొని బాధపడుతుంది ఇన్నాళ్ళకి గుర్తు వచ్చాము అని ఏడుస్తుంది. వసుని చూసిన ఆమె తండ్రి మాత్రం కోపంతో రగిలిపోతాడు. తండ్రి కాళ్ళకి నమస్కరించి కాలేజీ టాపర్ అయిన విషయం చెప్తుంది వసు. మరి ఆ తండ్రి కూతుర్ని క్షమిస్తాడా? వాళ్ల ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తాడా? దేవయాని ఈ పెళ్లి జరగనిస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.