Guppedantha Manasu: తనకి ఇష్టం లేని అమ్మాయి కోడలిగా ఇంటికి వస్తే తన పెత్తనం సాగదని ఆ పెళ్లిని ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఒక దేవయాని కథ ఈ సీరియల్. ఈవారం సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం.
ఈవారం సీరియల్ లో రిషి వసు ల మధ్య చిక్కుముడులు వచ్చాయి. అప్పుడు వర్షం ధైర్యంగా నిలబడగలిగింది కానీ రిషి నిలబడలేకపోయాడు. ఒక ఆడపిల్ల గట్టిగా నిలబడితే ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. వసు కూడా అదే చేసింది ధైర్యంగా నిలబడి తన ప్రేమని దక్కించుకుంది అంటుంది జగతి.
మీ ఆడవాళ్ళందరికీ నా జోహార్లు అంటూ తలవంచి నమస్కారం చేస్తాడు మహేంద్ర. ఎందుకో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది జగతి. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు రిషికి అమ్మ ప్రేమని అందివ్వలేకపోతున్నానని బాధపడ్డాను కానీ ఒంటరిగా వెళ్లిన నువ్వు నీ కొడుక్కి బంధాన్ని తీసుకొని వచ్చావు అంటాడు మహేంద్ర.
మరోవైపు జగతి దంపతుల వల్ల రిషి పాడైపోతున్నాడు, వాళ్ల స్వార్థం తప్పితే రిషి గురించి పట్టించుకోవడం లేదు అని ధరణితో చెప్తుంది దేవయాని. మీరు అనుకుంటున్నట్లు రిషి ఏమి బాధపడటం లేదు చాలా ఆనందంగా ఉన్నాడు అంటుంది ధరణి. నీకు నోరు ఎక్కువవుతుంది తగ్గించు నీ హద్దుల్లో ఉండు అంటూ వార్నింగ్ ఇస్తుంది దేవయాని.
మరోవైపు తన పాత జ్ఞాపకాన్ని వసు కి గిఫ్ట్ గా ఇస్తాడు రిషి. అది చూసిన వసు ఆశ్చర్య పోతుంది. దూరమైన బంధాలు ఎంత బాధ పెట్టిన దగ్గరైన క్షణాలు చాలా బాగుంటాయి అంటాడు రిషి. మనం దూరమైపోతామేమో అని చాలా భయం వేసింది కానీ నాకు తెలుసు మన ప్రేమ గెలుస్తుందని అంటుంది వసు. ఇంటికి బయలుదేరుతుంటే ఒక అమ్మాయి హెల్ప్ అడుగుతుంది.
నిజమేనేమో అనుకొని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తారు రిషి వాళ్ళు. కొంచెం మంచి నీళ్లు తాగి వెళ్ళండి అని ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేయడంతో లోపలికి వెళ్లిన రిషి వాళ్ళని బంధిస్తుంది ఆ అమ్మాయి. మరోవైపు రిషి వాళ్ళు రాకపోవటంతో ఇంకా ఎందుకు రాలేదు అని తోటి కోడల్ని అడుగుతుంది దేవయాని.
తెలియదు అని జగతి చెప్పడంతో కొడుకు మీద అస్సలు బాధ్యత లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి వాళ్ళని గదిలో బంధించిన ఆ అమ్మాయి కృషి వాళ్ళ దగ్గర నుంచి ఫోనులు, కార్ కీస్ లాక్కుంటుంది. ఇలా ఎవరు చేశారు నాకు తెలుసు వదిలేసి తప్పు చేసాము అయినా కృతజ్ఞత లేకుండా వక్రబుద్ధి చూపిస్తున్నారు అంటాడు రిషి.
ఇదంతా మరో విద్యాసంస్థకు చెందిన సౌజన్య రావు చేసిన పని. వాళ్లని కొట్టకండి తిట్టకండి మీడియా వాళ్ళని పిలవండి చాలు మిగతాదంతా వాళ్ళ చూసుకుంటారు అనటంతో అక్కడ ఉన్న రౌడీలు మీడియా వాళ్ళని పిలుస్తారు. అంతలోనే రిషి వాళ్లు కిటికీ ద్వారా బయటికి తప్పించుకుంటారు.
మరోవైపు వసుకి గాజు పెంకు గుచ్చుకోవటంతో ఆమెని ఎత్తుకొని ఆటోలో ఇంటికి తీసుకువస్తాడు రిషి. మరోవైపు రిషి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అని నానా మాటలు అంటుంది దేవయాని. వాళ్లు ఏ పొజిషన్లో ఉన్నారో అర్థం చేసుకోకుండా ఎందుకలా మాట్లాడుతావు అంటూ మందలిస్తాడు ఫణీంద్ర. బాగా అర్ధరాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చిన రిషి వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది దేవయాని.
మా గురించి తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారు మా హక్కులు మీ పద్ధతులు మాకు బాగా తెలుసు అంటూ పెద్దమ్మని చివాట్లు పెడతాడు రిషి. జరిగినదంతా తండ్రికి పెదనాన్నకి చెప్తాడు. వాళ్ల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడో కూడా చెప్తాడు. మరోవైపు నేను వేసిన ప్లాన్ నుంచి తప్పించుకున్నామంటే నువ్వు చాలా సమర్ధుడివి అనుకుంటాడు సౌజన్యరావు.
మరోవైపు వసుని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని జగతితో చెప్తాడు రిషి. కానీ నా విషయంలో మాత్రం తప్పు చేశారు అది ఎప్పటికీ దిద్దుకోలేనిది అంటాడు. నువ్వు తల్లి ప్రేమను మాత్రమే కోల్పోయావు నేను అన్ని కోల్పోయాను అర్థం చేసుకో అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది జగతి.
మరోవైపు వసుధార లాంటి అమ్మాయి నీకు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని రిషితో చెప్తుంది ధరణి. మరోవైపు తాళి లేకుండా తిరుగుతున్నందుకు వసుని మందలిస్తుంది దేవయాని. నేను సమాజానికి భయపడను అంటూ ధైర్యంగా సమాధానం ఇస్తుంది వసు. వెళ్లిపోయిన తర్వాత నువ్వు పెద్దమ్మతో మాట్లాడటం విన్నాను చాలా ధైర్యంగా మాట్లాడావు అంటూ వసూని మెచ్చుకుంటాడు రిషి.
వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకోవటం చూసిన దేవయాని ఎలాగైనా వాళ్ళిద్దర్నీ విడగొట్టాలి అనుకుంటుంది. మరోవైపు దేవయాని అందరినీ పిలిచి రిషి, వసుల పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి జగతి వాళ్ళని వసు వాళ్ళ ఊరు వెళ్ళమంటుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటూ కంగారు పడుతుంది వసు.అయినా పర్వాలేదు సాంప్రదాయం ప్రకారం అలాగే జరగాలి అంటుంది దేవయాని.
అలాంటివేవీ పెట్టుకోవద్దు మీరు ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మంచి ముహూర్తం చూస్తే వసువల్ల తల్లిదండ్రులని రప్పించి ఇక్కడే మాట్లాడదాము అని చెప్పి పెద్దమ్మ నోరు మూయిస్తాడు రిషి.
మరోవైపు రిషి నీకు సపోర్ట్ గా ఉన్నాడు అందుకే పెద్ద అత్తయ్య ని కూడా ఎదిరించి మాట్లాడుతున్నాడు అంటుంది ధరణి.
Guppedantha Manasu సాగదీత మరీ ఎక్కువైంది, కథలో కొత్తదనం లేదంటూ బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..
మీ ఇద్దరూ ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అంటూ మనస్పూర్తిగా కోరుకుంటుంది. మరోవైపు టీ తీసుకువచ్చిన ధరణితో పెళ్లి సంబరాల్లో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోను నా సంగతి తెలుసు కదా అంటూ ధరణిని హెచ్చరిస్తుంది దేవయాని. ఏ ఆటంకము లేకుండా రిషి, వసు ల పెళ్లి జరుగుతుందా? దేవయాని మరేదైనా కుట్ర పన్నుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.