Guppedantha Manasu: తన బావ నుంచి తన కాబోయే అత్తింటి వారిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ల చేత అపార్థానికి గురై తన జీవితాన్ని చేజార్చుకుంటున్న ఒక స్త్రీ కథ ఈ గుప్పెడంత మనసు.
వసు చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నావల్లే మీరు బాధపడ్డారు అంటూ రిషి కోసం ఏడుస్తుంది. మరోవైపు రిషి కూడా నువ్వు నన్ను మోసం చేశావంటే నమ్మలేకపోతున్నాను ఇలా ఎందుకు చేసావు అంటూ వసుని మర్చిపోలేక బాధపడుతూ ఉంటాడు. మరోవైపు చక్రపాణి మనం వసు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ వసుని బ్యాక్ పక్కన ఉన్న కవర్ తెమ్మంటాడు.
అది ఏంటి నాన్న అని వసు అడిగితే నువ్వు బాగా చదువుకొని జీవితంలో గెలిచావు ఇప్పుడు ప్రేమలో కూడా గెలువు, ఇది రిషి సార్ దగ్గరికి వెళ్ళటానికి బస్సు టికెట్ పెళ్లి నీ ప్రేమను గెలిపించుకో అంటాడు. ఆ మాటలకి ఎంతో సంతోషిస్తుంది వసు. మరోవైపు కాలేజీ స్టాఫ్ కి దేవయాని చేత చివర్లో పెట్టిస్తాడు రిషి. అయిపోయిందాని గురించి ఇప్పుడు ఎందుకు అని జగతి అంటే మరో అమ్మాయికి ఇలా జరగకూడదు అందుకే అంటాడు రిషి. ఈ రిషి తనకి తెలియకుండానే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటుంది దేవయాని.
మరోవైపు సూట్ కేస్తో కిందకి దిగిన రిషి ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఎక్కడికి ప్రయాణం అని అడిగితే నాకే తెలీదు మళ్లీ కొత్తగా పుట్టి తిరిగి వస్తాను అంటాడు. ఎప్పుడు వస్తావు అని మహేంద్ర అడిగితే తెలీదు వస్తాను రానో కూడా తెలియదు అని చెప్పి ఇంట్లో వాళ్లకి షాక్ ఇస్తాడు. నిన్ను వెళ్ళవద్దని హక్కు నాకు లేదు కానీ ఇదే విషయాన్ని కాలేజీలో చెప్పి వెళ్ళు లేకపోతే వాళ్ళు మరోరకంగా అర్థం చేసుకుంటారు అంటుంది జగతి. జగతిని సపోర్ట్ చేస్తాడు ఫణీంద్ర. కాలేజీకి వచ్చిన రిషి కాలేజీలో వసుతో గడిపిన క్షణాలని గుర్తుతెచ్చుకుంటాడు.
బాధపడే జ్ఞాపకాలని గుర్తు చేసుకోవద్దు అంటుంది జగతి. మీ శిష్యురాలు కనిపిస్తే ఒక విషయం చెప్పండి నాకు మోసపోవడం అలవాటే, అయినా చిన్నప్పుడు మీరు నన్ను వదిలేసి వెళ్లిపోయారు దానికి కారణం ఇప్పటివరకు తెలీదు అలాగే వసు వెళ్ళిపోయింది దానికి కూడా కారణం తెలీదు అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీటింగ్ ఏర్పాటు చేసి కొత్త ఎండీ గా జగతిని నియమించి తండ్రిని జగతి చేతిలో పెట్టి అట్నుంచి అటే ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతాడు. గేటు దాటుతుండగా, అప్పుడే కాలేజీలోకి అడుగుపెడుతున్న వసుని చూస్తాడు.
ఆమె కూడా రిషి ని చూసి పిలుస్తుంది కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు రిషి. వసు నేరుగా జగతి కలుస్తుంది. వాళ్లు వసు మీద కేకలు వేస్తారు. ఎందుకొచ్చావు అంటే మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ ని ఆ జాబ్ కి ఛార్జి తీసుకోవడానికి వచ్చాను అంటుంది వసు. కాలేజీ కొత్త ఎండి జగతి అని తెలుసుకొని నివ్వరపోతుంది. పాత ఎండి గారు ఎక్కడికి వెళ్లారు అంటే తెలీదు తెలిసిన చెప్పము, అసలు ముందు నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావో చెప్పు అని అడుగుతారు మహేంద్ర దంపతులు.
అసలు విషయం రిషికే ముందు చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్లకి ఏమీ చెప్పదు వసు. మరోవైపు రిషి కోసం కంగారుగా ఇంటికి వచ్చిన వసుని నానా మాటలు అని ఇంట్లోంచి గెంటేస్తుంది జగతి. మరోవైపు పుష్ప వసుకి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. తను వసుకి పెళ్లి అయిందని అనుకుంటుంది. ఫ్యామిలీ అంతటినీ తీసుకొని రావాలి నాకు ఇల్లు చూడు అంటుంది వసు. మరోవైపు ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్న రిషి కి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఫోన్ వస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వసు , రిషి ఎప్పుడు కలుసుకునే అమ్మవారి చెట్టు దగ్గరికి వస్తాడు.
అదే సమయంలో వసు కూడా అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటుంది. అనుకోకుండా ఇద్దరూ ఎదురవటంతో వసు తన పరిస్థితిని చెప్పటానికి ప్రయత్నించిన వినడానికి ఒప్పుకోడు రిషి. అప్పుడే రిషి, వసు ప్రాణాలను కూడా కాపాడి జాగ్రత్త చెప్పి పంపించేస్తాడు. దేవుడి దగ్గర ఎంతని పెట్టి నా పూలని తీసుకోవడం గమనించి తనకి పెళ్లి అయింది కదా మరి ఈ పూలని ఎందుకు తీసుకుంది అని ఆలోచనలో పడతాడు. మరోవైపు చక్రపాణి కూతురికి ఫోన్ చేసి మాకు నీతోనే ఉండాలని ఉంది ఇల్లు చూడు అని చెప్పాడు.
ఏర్పాటు చేస్తానంటుంది వసు. మరోవైపు రిషి సార్ కాలేజీ గెస్ట్ హౌస్ లోనే ఉండి ఉంటారు అని అక్కడికి వెళ్తుంది. అక్కడ వసుకి, రిషికి వాగ్వాదం జరుగుతుంది. రిషి సార్ కాలేజీ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు ఆయన ఎలా ఒంటరిగా వదిలేయడం ఏంటి అంటూ మహేంద్ర కి వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఎందుకు వాళ్లకి చెప్పావు అంటూ కోపంతో వసూల్ అక్కడి నుంచి పంపించేస్తాడు రిషి. విషయం తెలుసుకున్న దేవయాని మహేంద్ర దంపతులను నానా మాటలు అంటుంది.
నిజంగానే మహేంద్ర ని మీరు వదిలేశారు అందుకే తను మనకి బాధ్యత గుర్తుచేస్తుంది అంటుంది. తనకి మీరు అక్కర్లేని ప్రాధాన్యతని ఇచ్చారు అందుకే ఈరోజు నెత్తి మీద కూర్చుంది అంటూ జగతి వాళ్ళని ఆడిపోసుకుంటుంది. అదే సమయంలో రిషి జగతికి ఫోన్ చేసి కాలేజ్ దగ్గరికి రమ్మంటాడు. మహేంద్ర వాళ్లు వస్తాము అంటే వద్దు అని తను ఒక్కతే బయలుదేరుతుంది జగతి. కాలేజీలో కూర్చున్న రిషికి పుష్ప కనిపించి ఒక బ్యాగ్ ఇచ్చి వసుకి ఇమ్మంటుంది.
వాళ్ళ ఆయనని చూశావా అని పుష్ప ని అడిగితే చూడలేదు కానీ ఆయన చాలా లక్కీ కదా అంటుంది పుష్ప. తను వెళ్ళిపోయిన తర్వాత నేను అన్ లక్కియా అనుకుంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి కి మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా నన్ను వరుస వచ్చి కలిసింది తనకి ఏ కాంబినేషన్ ఇవ్వవలసిన బాధ్యత మన కాలేజీదే అంటూ గౌతమ్ రూమ్ కీస్ ఇచ్చి వసుకి ఇమ్మంటాడు. నీకు తనమీద కోపం లేదా అని అడిగితే ఎవరి కోపానికి ఎవరిని బాధ్యులు చేస్తాం అంటాడు. అతని మంచి మనసుని మనసులోనే మెచ్చుకుంటుంది జగతి.
కీస్ పట్టుకొని వెళ్లి వసుకి ఇచ్చి రిషి ఇచ్చాడు అని చెప్తుంది. అందుకు వసు చాలా ఆనందిస్తుంది తనకి నేనంటే చాలా శ్రద్ధ అంటే నీ స్థానంలో ఎవరు ఉన్నా రిషి అలాగే రియాక్ట్ అవుతాడు. నువ్వు ఇప్పటికే చాలా గొప్ప గొప్ప పనులు చేసావు ఇకపై కూడా గొప్ప పనులు చేయాలి అంటూ వెటకారంగా మాట్లాడి వసు చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి. మరోవైపు రాజీవ్ చక్రపాణి కి ఫోన్ చేసి వసుని తనకిచ్చి పెళ్లి చేయమంటాడు.
నువ్వు తప్పించుకొని మంచి పని చేశావు లేకపోతే నా చేతిలో చచ్చేవాడివి మళ్లీ నా కంటికి కనిపించొద్దు అంటూ అల్లుడికి గడ్డి పెడతాడు చక్రపాణి. ఎంతో మంచిగా ఉండే మా మామగారు ఇలా మారిపోయారు ఏంటి అయినా మా మామగారు బెదిరింపులకి అల్లుడు మారిపోతాడా అనుకుంటాడు రాజీవ్. మరోవైపు దేవయాని ఈ రిషి వసూలు మళ్లీ కలిసిపోతారేమో, అయినా ఈ రాజీవ్ ఏం చేస్తున్నాడు అంటూ రాజీవ్ కి ఫోన్ చేసి మర్యాద లేకుండా మాట్లాడుతుంది.
Guppedantha Manasu: సీరియల్ బాగున్నప్పటికీ మరీ ఎక్కువగా సాగదీస్తూ ఉండడంతో అసహనానికి గురవుతున్న ప్రేక్షకులు..
నన్ను రా అని పిలవకండి మర్యాదగా ఉండదు అంటాడు రాజీవ్. నీకు డబ్బులు ఇచ్చాను అవకాశాన్ని ఇచ్చాను అయినా ఉపయోగించుకోలేదు అలాంటి నిన్ను రా అనకుండా సన్మానించాలా అంటూ రాజీవ్ మీద నిప్పులు కక్కుతుంది. రిషి, వసులు మళ్లీ కలుస్తారా? వసు తను చేసిన పనికి సంజాయిషి ఇచ్చుకోగలుగుతుందా? జరిగిన విషయాన్ని జగతి దంపతులు తెలుసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.